అమ్మ… ప్రేమ… అమ్మ ప్రేమ

– అభిలాష

అమ్మ అనే కమ్మని మాట లోనే వుంది అమృత ధార….

ప్రేమ పంచి పెంచి

లాలించి బుజ్జగించి

అభిమానాన్ని గోరు ముద్ద గా పెట్టే అమ్మకు

ఆ బ్రహ్మ కూడా దాసోహమేగా….

స్వార్ధం అంటే తెలియక గుప్పెడు గుండెలో

ఆకాశమంత ప్రేమను మాత్రమే దాచేది పంచేది అమ్మే కదా…

అమ్మ అని పిలిస్తే ఆప్యాయాన్ని అంతా ఆలంబనగా చేసిమనకి కొండంత అండగాతన గుండె పరిచి నడిపించి

కాపాడేది ఈ అమ్మ జన్మేగా….

మనకి కష్టమొస్తే తన కన్ను నీరు వర్షిస్తుందిఇది దేవునికైనా అసాధ్యమేగా…

మన కేరింత చూసి తన మనసు పులకించి విరబూస్తుంది

ఇది అమ్మ ప్రేమ లోని స్వచ్చతే కదా…

కర్ఖోటకుడిని సైతం కళ్ళల్లో పెట్టి చూసుకునే ఓర్పు అమ్మ ప్రేమేగా ….

గుండె మండేలా మాట్లాడినాగునపాలు దించినా

కిక్కురుమనక అనురాగం పంచేది అమ్మేగా…

కంట నీరు పెట్టించినా ఎంత వేదన మిగిల్చినా

మన కష్టంలో వేలు పట్టి వెన్ను తట్టి ఓదార్చేది అమ్మ

అనురాగమే కదా…

పాషాణ గుండెకి మమతని ధారబోసేది అమ్మే…

మన విజయానికి మనల్ని మించిసంబర పడి పండగ చేసుకునేది అమ్మ ప్రేమే…

తన పొత్తిళ్ళనే   మెత్తటి పాన్పు చేసి,

తన నును వెచ్చని ఒడిలో పొదువుకుని మనకి ప్రపంచాన్ని తెలియ చేసి,

తన గుండె చప్పుడుని జోల పాట గా మలచి,

వేలు పట్టి నడిపి, తన మాటలతో ముల్లోకాలను మనకు సాక్షాత్కరించి ,

ఆ జాబిల్లినే మన దోసిట్లో బొమ్మ గా మలచి…

లోకాన్ని తెలిపే తొలి గురువు గా…

మన జన్మకి తన ప్రాణాన్ని పణంగా పెట్టే

ఈ అమ్మ జన్మ ఇలలో ఒక అద్భుత వరం…
ఆడ జన్మకి గర్వ కారణం….

కవితలు, , Permalink

12 Responses to అమ్మ… ప్రేమ… అమ్మ ప్రేమ

 1. ప్రశాంత్ says:

  మీ కవితకు నా వందనాలు మీరు ఇలాగె మరెన్నో కవితలు రాయాలని కోరుకుంటున్నాను…….

 2. Aditya says:

  I love my mother

 3. awsome కవిత,marvellous కవిత
  suuuuuuuuuuuuuupppppppppppeeeeeeeeeeeerrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 4. Uma says:

  నైస్ పోయెమ్!

 5. ramana says:

  super kavitha

 6. pragnya sri says:

  మన అమ్మ ప్రమ అర్ధం చసుకుంట ఆమ మనసు సంతోషం తో నిండిపోతుంది

 7. sangeetham kiran says:

  అమ్మ ప్రేమ పంచుతుది ఆ అమ్మ లేనివాలకు అమ్మ విల్లువ తెల్లుస్తుది అమ్మ ముదువ్వుడి ఏది మచి ఏది చేడుచేపుతుది
  కానీ నాకు అమ్మ లేదు ఆడుకు అమ్మ ప్రేమ తెలియదు

 8. Hari Prasad says:

  “మీ హృదయంలో ఉన్నఅమ్మ ప్రేమ మాదుర్యాన్నిమీ కవిత రూపంలో మాకు పంచినందుకు మా ధన్యవాదాలు” …..

 9. J Balram says:

  నీకు పుటించింది ఒక బ్రంహ
  ఐతే
  నీకు జన్మనిచింది ఒక అమ్మ
  అందుకే అమ్మ ఋణం తీరలేనిది
  మారలేనిది.

 10. Ramu says:

  అద్భుతంగా చెప్పారు . ఇది అక్షర సత్యం ….అమ్మ గురించి ఏమి చేసినా అది తక్కువే …అమ్మ ప్రాణాన్ని లెక్క చేయక మనకు జన్మ ఇచ్చింది ….
  జీవితాంతం సేవ చేసినా అది తక్కువే ……

 11. ravi says:

  enta baga cheparu

 12. ved says:

  అమ్మతో బొమ్మలాట కాదని మొత్తానికి నిరూపించారు . అభినందనలు . – ved

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)