కలలు పండని జీవితం(కవిత)-పద్మావతి రాంభక్త

చిన్నప్పుడు చదువును గూర్చి
కన్న కలలను
నాన్న గోతాంలో కుక్కి
అటకెక్కించేసారు

వయసొచ్చాక కలల రాకుమారునితో
కట్టుకున్న ఆశాసౌధాన్ని
రాంగ్ పర్సన్ తో పెళ్లిచేసి
కూలగొట్టేసారు

మధ్య వయసులో
తీర్చుకుందామనుకున్న
మునుపు తీరని కోరికలను
ఆయనగారు కొండెక్కించేసారు

ఇక ఈ వృద్ధాప్యంలోనైనా
శాంతిగా విశ్రాంతిగా కనుమూయాలనుకుంటూ
కాంక్షలను కలబోసుకున్న వేళ
అంతా కలసి ఆశ్రమంలో చేర్చి
చేతులు దులిపేసుకున్నారు

                                                   – పద్మావతి రాంభక్త

కవితలుPermalink

3 Responses to కలలు పండని జీవితం(కవిత)-పద్మావతి రాంభక్త

 1. dvraoji says:

  చిన్నప్పుడు నాన్న, వయసొచ్చాక కన్నవారు, మధ్యవయస్సులో కట్టుకున్నోడు, వృద్ధాప్యంలో నా అనుకున్నవాళ్ళు తన కలలు పండని జీవితానికి కారకులు అనుకుంటారు

  ఈ దేశంలో ఎవరూ వేరొకరి మీద ఆధారపడే కలలు కనకూడదేమో అనిపిస్తుంది.
  తమ కలల్ని నిజం చేసుకోవడానికి తమవంతు కృషి ఎంత అన్నది కూడా చాలా అవసరం.

  కడలి అలలూ
  మనిషి కలలూ
  అలా వస్తూనే ఉంటాయి

  పడవను
  వడ్డుకు చేర్చేవే
  అసలైన అలలు

  మనిషిని
  గమ్యానికి చేర్చేవే
  నిజమైన కలలు

 2. దడాల వెంకటేశ్వరరావు says:

  తన కలలు పండలేదని తల్లిదండ్రులను, భర్తని చివరికి పిల్లలను తప్పుపట్టిన ఆమె తన పాత్రను ఎంతవరకు నిర్వర్తించిందో తెలియజేయలేదు.

 3. ద డాల వెంకటేశ్వరరావు says:

  చదువు ఆటకెక్కడానికి కారణం- నాన్నగారు
  ఆశాసౌధాలు కూలిపోవడానికి కారణం – తల్లిదండ్రులు
  తీరనికోర్కెలు కొండెక్కించిన వాడు-
  ఆశ్రమంలోపెట్టి చేతులు దులుపుకున్నవారు-పిల్లలు.
  అందరి మీద నిందలేసిన
  మరి నీవేమి చేసావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)