బెల్లం ముక్క(కథ )- ఆదూరి హైమావతి

” నీమీద మీవాళ్ళకంతా ఇంకా ప్రేమ ప్రవహిస్తుందనే ఉంనుకుంటున్నావా!”

” నీకాసందేహ మెందుకూ!నేను పుట్టినపుడే’ మహాలక్ష్మి మనింట పుట్టిందని పొంగిపోయారు, ఇప్పటివరకూ అంతే నామీద ఏమాత్రం మావాళ్ళకు ప్రేమతగ్గలేదు, నీవేచుస్తావుగా అంతా ఎలా పరుగెట్టు కొస్తారో!” ధీమాగా అంటున్ననన్ను నవ్వుతూచూసి అంది రత్న.

” నీ భ్రమవదిలిస్తాను. పందెమా!”
” పందెం ఏదైనా నేను తయార్ ! “

“సరే నీవుగెలిస్తే ,మీవారికింకానీమీద ప్రేమనది పారుతుంటే నేను ఓడిపోయినట్లు, నీకోసం మీవారెవ్వరూ మూడు రోజుల్లోగా రాక పోతే నీవు ఓడిపోయినట్లు.అప్పుడు ఓడినవారు గెలిచినవారు ఏంచెప్తే అదిచేయాలి.సరా!” అంటూ పందేం కాసి బయటికి నడిచింది..

                 ****                                 ****                                    ***                         ****

మాది ఉమ్మడికుటుంబం. మా నాన్న అందరిలోకీ పెద్ద.ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళూ ముగ్గురు చెల్లెళ్ళూ. మాతాత, ఆయన తమ్ములూకూడా కలిసే ఉండేవారు. మాఇల్లు నాకు తెలిసేప్పటికి నిత్యం ఒక పెళ్ళి ఇల్లులా ఉండేది.ఇంట్లో వారితోపాటు,వారికి దగ్గరి బంధువుల తో నిత్యం పెళ్ళి కళే!. కనీసం 50 విస్తళ్ళురోజూ లేవాల్సిందే!
మా నాయన తమ్ముళ్ళకూ ,చెల్లెళ్ళకూ ,అందరికీ పెళ్ళిళ్ళూ చదువు లూ సంతర్పణలూ చేసి ఆతర్వాత, మా తాత, బామ్మ ఇల్లు నిర్వహించే ఓపిక లేదన్నాక,ఆయన పెళ్ళి చేసుకునే సరికి ఆయన కు వయస్సు 35 దాటాయిట.
మా అమ్మ బంగారుబొమ్మే,అందానికీ, గుణానికీనీ,బంగారానికి తావి అబ్బినట్లు రోజంతా నవ్వుతూ పనులు నిర్వహిస్తూ ఉండేది పెద్దకోడలు పాత్రలో.పెళ్ళైన ఏడాదికే నేను పుట్టానుట!

అంతా నన్నుచూసి’ తల్లిలా బంగార పుబొమ్మ , తండ్రిపో లిక లూనూ, అదృష్ట జాతకురాలు, మహాలక్ష్మి !మహాలక్ష్మి పుట్టిందిరా మనింట!’ అని ఒకే ఆనం దంట! అలా అందరిమధ్యా గౌరవంగా, ప్రేమ ప్రవాహంలో పెరిగాను.

నాతర్వాత మా అమ్మ పని లో గొంతులోతున పేరుకుపోడంతో ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేదిట.ఆరోగ్యం ,శక్తీ ఊడ్చిపెట్టుకు పోసా గాయి, మా ఆస్తి లాగా. అందుకే నేను ఒంటి కాయ సొంఠికొమ్మును మా అమ్మా నాన్నలకు, ఐతేనేం ! ఇంటినిండామనుషులే! మా నాన్నగారు పొలాలూ, తోటలూ చూసు కుంటూఉండే వారు.
ఆయన తమ్ముళ్ళూ, చెళ్ళెళ్ళూ కుటుంబాలతో ఇంట్లోనే ఉంటూ,వారి పిల్లలను పక్కపట్నంలో హాస్టల్ లో ఉంచి పెద్ద చదువులు చదివించే వారు.

నాన్నకష్టపడి ఉమ్మడి కుటుంబాన్ని ఎవ్వరికీ ఏలోటూ లేకుండా లాక్కొచ్చారు.

” ఒరే సూర్యా ! చిన్నాయనగారి మూడో కొడుకు వియ్యపింటివారు వచ్చారుట! కొత్తబట్టలుతెప్పించరా! ” అనే బామ్మ మాటలూ,

“అన్నయ్యా! మావాడికి హాస్టల్ ఫీజ్ కట్టాలి పదివేలుకావాలి” అనే చిన్నాయనల మాటలు,

” అత్తయ్యా! మా అమ్మాయికి శ్రావణ పట్టీ పంపాలి బావగారికి చెప్పండి” అనీ,

“ఒరే చిన్నాయనకు కాశీసమారాధన జరపాలని ఉందిట! ఆ ఏర్పాట్లేవో చూడూ –“

ఇలాంటి ఆఙ్ఞలతో మా నాన్నగారి సంపద,శక్తి ఖర్చై పోయాక అంతా ఒక్కో ళ్ళూ తమ బిడ్డల దగ్గర కని వెళ్ళి పోయారు, వాళ్ళవాటాలకు రావల్సిన భాగాలు క్యాష్ గాపంచు కుని.

చివరగా నేనూ మానాన్నగారూ, అమ్మా, పెద్దవారై వయసుడిగి మంచం పట్టిన బామ్మ ,తాత మిగిలి పోయాం, మాపొలమూ ఐదెకరాల కొచ్చింది, మాకు తలో ఎకరమన్నమాట.

కొబ్బరి, మామిడి, నిమ్మ తోటలన్నీమాయమైపోయాయి., మాబంధుజనంలా. నాకుమాత్రం మాబంధువులంటే పిచ్చిప్రేమ, ఎందు కంటే నేను వంటరిగా ఉండకుండా నాకు తోడుగా ఉన్నందుకు. .

 ” ఏయ్ ! ఏంటాలోచన? ముందీ మందు లేసుకో.జ్వరం తగ్గింది.. రేపు బహుశా డిస్ చార్జ్ చేయ వచ్చు.కానీ మనపందెం కోసం మరో రెండ్రోజులుండక తప్పదు.” అంది నవ్వుతూ రత్న, నోట్లో మందుపోసి, మగతగా నిద్ర పట్టసాగింది..

మాతాతా బామ్మగారూ స్వర్గస్తులు కాకముందే మాఅమ్మ తీవ్ర అనారోగ్యానికి గురై తనువు చాలించింది.
అది నాకూ నాన్నగారికి తగిలిన పెద్ద షాక్. మా బామ్మ తాతలకు సేవచేయను కాదు కదా , చూసి పోనుకూడా మాబాబాయిలు, అత్తలూ రాలేదు .ఏదోవంకలు చెప్పి తప్పించు కున్నారు.

మా అమ్మపోయినపుడు మాత్రం వచ్చి తమ బాధను దుఃఖం,ఎక్కిళ్ళ ,గొంతు, ద్వారా తెలిపి భోజనాలు చేసి, మమ్మల్ని ఓదార్చి వెళ్ళి పోయారు.నన్నుమాత్రం మాబంధువులంతా బాగా దగ్గరకు తీసి ఓదార్చారు.
ఆతార్వాత మా బామ్మాతాత గార్లూ కూడా తనువులు చాలించారు. బంధు జనం మొక్కుబడి గా వచ్చి మొక్కు తీర్చుకుని వెళ్ళారు. నేను యం.బి.ఏ.చదువుతుండగా నాన్న గుండెపోటుతో నన్ను వంటరిదాన్నిచేసి పోయారు. నాచదువు పూర్తై , నాకు పెద్ద ఉద్యోగం వచ్చిందనీ నెలకు లక్ష జీతమనీ , పెద్ద క్వార్ట్ ర్స్ కూడా ఇస్తారనీ మా బంధువులకు తెల్సి చిన్నాపెద్దా అందరూ ఒకటే ఫోన్లు, నన్ను చూడాలని ఉందనీ , నాన్న తమకు గతంలో ఎంతో సాయం చేశారని, ఆయన్ను మరచిపోలే మనీనూ.

అధిక శ్రమ వల్ల జ్వరాన పడ్డానని చెప్పగానే , చాలాబాధపడి పోయారు. హాస్పెటల్ కువచ్చి చూస్తా మన్నా రు. నీకు తోడుగా ఉంటాం దిగులుపడకు, నీవు వంటరివికావు, మేమంతా లేమూ? అంటూ ఓదార్చారు. నాకెంతో గర్వంగా ఉంది, మా అమ్మా,నాన్న,బామ్మా,తాతా లేనిలోటు నావాళ్ళందరి ద్వారా తీర్చుకోవాలనీ , వారికి ఏదైనా అవసరమైతే సాయం చేయాల్నీకూడా నిర్ణయించు కున్నాను.

“మీనాన్న రక్తం నీలో ప్రవహిస్తున్నదే తల్లీ! బంగారానివే!లక్ష్మి వేకాదు సాక్షాత్ సరస్వతీ మాతవి తల్లీ ! మళ్ళీ నీహయాంలో నీఇల్లు పూర్వంలా బంధు జనంతో కళకళ లాడాలమ్మా! అంతావచ్చి నీనీడలో ఉంటాం.” అంటూ అభినందన ఫోన్లు వెల్లువెత్తాయి.

నామనస్సు ఆనందంతో నిండి పోయింది..నామీద వాళ్ళకెంత ప్రేమో నాకుబాగా తెల్సు,’ నేను వంటరిని కాను నాకు వీళ్ళంతా ఉన్నారు’ అని సంతోషిం చాను. నాస్నేహితు రాలు రత్నడాక్టర్. నన్నుఆదరంగా ఆహ్వానించి తన హాస్పెటల్లో చికిత్స చేస్తున్నది.

                  ***                                ***                           ***                    ***                   ***

ఏంటే ! మహాలక్ష్మీ!! అంత దీర్ఘాలోచనలో ఉన్నావ్?మీవాళ్ళంతా వస్తు న్నామని ఫోన్ గానీ చేశారా ! వాళ్ళవసతి సౌకర్యాలకు ఎక్కడ ఏర్పాటు చేయాలో చెప్పు.”అంది రత్న.

“ఎకా ఎకిన రావాలంటే ఎంతకష్టం పాపం ? వస్తారు తప్పక చూస్తూండు నేనంటే వాళ్ళందరికీ మహాప్రేమ, ఇష్టం “గర్వంగా అన్నాను.

“అలాగే కానీ, నీవీ ఈరోజు బాగా విశ్రాంతి తీసుకుంటే రేపటికి అంతా ఓ.కే.అవుతుంది ,ఆఫోనిలా ఇచ్చి పడుకో.
నీకు డిస్ట్రబెన్స్ లేకుండా ఉంటుంది, నీ తరఫున నేను చెప్తాన్లే!” అంటూ నా మొబైల్ ఫోన్ పట్టుకెళ్ళింది. డాక్టర్ కదా!కాదనలేకపోయాను.

మూడు రోజులూ గడిచాయి, ఆరోజు డిస్చార్జైవెళ్ళిపోవాలి. రత్న వచ్చింది.”పదవే వెళ్దాం !”అంటూ.

“మరిమావాళ్ళంతా వచ్చి వెతుక్కుంటారేమోనే!”

“ఏంటే వెతుక్కోడం ? బెల్లం చుట్టూ మురిసే ఈగలు, చీమలూనూ. కాలాలిస్తే ఏఒక్కరికైనా ఫోన్ చేయి.వారు చెప్పే మాటలు వినుచాలు, నీవేమీ మాట్లాడకు.ఇదికండిషన్ ” అంటూనాపక్కనేకూర్చుంది.

తనే మా చిన్నాయనకు ఫోన్ చేసింది, “అమ్మా! మహాలక్ష్మీ! మీపిన్నికి వంట్లో బాగాలేదమ్మా! ఇంకోమారు వస్తాంలే.ముందు ఏదైనా ఉద్యోగంలో చేరు, మాఇంటికి మాత్రం రాకమ్మా! మాదసలే చిన్న ఇల్లు.” అనిఫోన్ పెట్టేశాడు.

రత్న మా పెదన్నాన కూతురికి ఫోన్ చేసింది.” మహాలక్ష్మీ! పేరుకే లక్ష్మివి కానీ నీకేం ఉద్యోగం రాలేదు టగా ! ఫైలయ్యావుటగా? అన్నీ అబధ్ధా లుచెప్పావా? సరేలేమ్మా! మా ఇంటికి మాత్రం రాకు. మాకే చాలదు ” అని పెట్టేసింది.

అలా ఒక్కోరూ ఫోన్ అందుకుని ‘ రాను తీరికలేదు ,మా ఇంటికిరాకు ‘ అని పెట్టేయటం .మొత్తం పదిమందికి చేసింది రత్న. అంతా అదేమాట. నాకు ఆశ్చర్యమేసింది.

“ఏంటేరత్నా! నమ్మలేకపోతున్నానే! అందరూ ఇలామాట్లాడుతున్నారేంటే? నేను ఓడిపోయానా?”

” ఓడి గెలిచావు .అందరి స్వభావాలూ తెల్సుకుని , మీనాన్నలా బెల్లమ్ముక్కవు కాకుండా అల్లం ముక్కగా బ్రతుకు పద. ముందుమా ఇంటికి వెళ్ళి ఆ తర్వాత నీ క్వార్టర్సుకు బయలేరు.మీవాళ్ళకు’ నీకు ఉద్యోగం రాలేదనీ, పరీక్ష తప్పావనీ,ఎవ్వరూ ఆదుకునే వారులేరనీ కొద్దిరోజులు ఉండేందుకు వసతి కల్పిస్తారా!’ అనీ అడిగాను నీతరఫున. అందుకే ఈ సమాధానాలు, తెలిసిందా?’ ప్రేమనది ప్రవహిస్తుందన్నావే! మనుషులమనసులు తెల్సుకోవే ముందు. చదువుకాదు ప్రపంచఙ్ఞానం ముఖ్యం లక్ష్మీ! మీ అమ్మానాన్నల్లా శక్తి, డబ్బు ధారపోయకు.”అనిచెప్పి తనకార్లో ఎక్కించుకెళ్ళిందిరత్న .

– ఆదూరి.హైమవతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.