జ్ఞాపకం-28 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

సంలేఖను పిలిచి జయంత్‌ గురించి చెప్పి, ‘‘నువ్వెలా చెబితే అలా చెయ్యాలనుకుంటున్నామమ్మా !  పెళ్లి విషయంలో మా బలవంతం ఎప్పుడూ వుండదు. ఏది జరిగినా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది’’ అన్నారు. కుటుంబ సభ్యులంతా  అక్కడే వున్నారు.

సంలేఖ తండ్రి వైపు చూసి ‘‘నాన్నా ! నాకు కొంతకాలం  ఉద్యోగం చేసి మిమ్మల్ని చూసుకోవాలని వుంది. ఇప్పుడే పెళ్లి వద్దు’’ అంది.

వాళ్లు సంలేఖ మాటల్ని అర్థం చేసుకొని ‘మమ్మల్ని చూసుకోవటానికి అన్నయ్యలున్నారు కదమ్మా !’. అని అనలేక ‘‘ఆలోచించు సంలేఖా ! ఇలాంటి మంచి సంబంధాలు  మళ్లీ, మళ్లీ రావు. మా గురించి ఆలోచించకు. అదీకాక ఆడపిల్ల  ఉద్యోగం చేస్తూ తెచ్చిపెట్టింది తిని కూర్చోవాలంటే మావల్ల  అయ్యేపని కాదు. ముందు నీకు పెళ్లి చేసి పంపిస్తే చాలు . నువ్వు మాకు పంచభక్ష్య పరమాన్నాలు  పెట్టినంత భాగ్యం !’’ అన్నారు. ‘‘సరే! నాన్నా ! నేను ఆలోచించి చెబుతాను. అంతవరకు మీరు వాళ్లకి మాట ఇవ్వకండి ! ఇంకా మంచి సబంధాలు  వస్తాయేమో చూద్దాం !’’ అంది. సులోచనమ్మ కూతురికి నచ్చ చెప్పాని చూసింది. ప్రయోజనం లేదు.

ఎంత చెప్పినా వినని సంలేఖకు ఆ సంబంధంపై మనసు లేదని తెలిసిపోయింది. ఇంకేం మాట్లాడినా కూతురితో వాదించినట్లువుతుందని ఎవరిపాటికి వాళ్లు మౌనంగా వుండిపోయారు.

రాజారాం చెల్లెలి గురించి ఆలోచిస్తూ టీపాయ్‌ మీద వున్న పేపర్‌ అందుకోబోయాడు. శరీరంలో సరైన పట్టు లేనందువ్లనో ఏమో వెంటనే మంచం మీదనుండి కిందకి జారాడు.

అది చూసిన సులోచనమ్మకి గుండె జారి నట్లై ‘‘అయ్యో ! అయ్యో ! రాజారాం కిందపడిపోయాడు. త్వరగా రండి ! ఎక్కడున్నారు తిలక్‌ ! సంలేఖా ! వినీలా !’’ అని గట్టిగా కేకలేస్తూ కొడుకు దగ్గరకి పరిగెత్తింది. వెంటనే కిందకి వంగి చంటి పిల్లాడిని వాటేసుకున్నట్లే పట్టుకొని మంచం మీదకి చేర్చాలని చూసింది. ఆమె వల్ల  కావడం లేదు. ఎంత ప్రయత్నించినా చేతుల్లోంచి జారుతున్నాడు.

తిలక్‌ ఇంట్లో లేడు. సంలేఖ ఎవరో రచయిత రాసిన సీరియల్‌ని కట్‌ చేసి, బైండిరగ్‌ చేయించి భద్రపరచుకోవాలని పత్రికలు  ముందేసుకుని తన గదిలో కూర్చుని వుంది. తలుపు పెట్టి వుండడంతో తల్లి కేక ఆమెకు విన్పించలేదు.
వినీల  అత్తగారి గొంతు విని సుడిగాలిలా వచ్చింది. వెంటనే రాజారాం నడుం కింద చేయివేసి లేపి మంచంపై పడుకోబెట్టింది. కొడుకును ఆస్థితిలో చూడాల్సి వచ్చినందుకు ఏడుపు ఆపుకోలేక పవిట కొంగును నోటికి అడ్డుగా పెట్టుకొని వంటగదిలోకి వెళ్లింది సులోచనమ్మ.

వినీల  ఆయాసపడుతూ నిటారుగా నిలబడి, నడుంమీద చేతులుంచుకొని భర్త వైపు కోపంగా చూస్తూ ‘‘గట్టిగా ఒక్క నిమిషం కూర్చోలేరు. నిలబెట్టినా నిలబడలేరు. మీకు పేపరెందుకు ? పేపర్‌ చదివి, ప్రపంచాన్ని తెలుసుకుని ఏం చేయాలి ? ఒక వైపు ట్రాక్టర్‌ కిందపడి కాళ్లు చచ్చుబడిపోయాయి. ఇలా రోజుకోసారి మంచం మీద నుండి కిందపడి ఇంకా ఏం పోగొట్టుకోవాని ? లేపలేక చచ్చిపోతున్నా. ఈ రోజునుండి నేను లేపను. మీ తమ్ముడితో లేపించుకోండి ! ఊరి మీదపడి బలాదూర్‌గా తిరుగుతున్నాడు.’’ అంది.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)