కల కాని నీవు(కవిత )-డా. విజయ్ కోగంటి

వచ్చి వెళ్లావని నేనూ
అసలు రాలేదని నీవూ

ఆ పచ్చని గరికచిత్రించుకున్న
అంతసుకుమారమైన నీపాద ముద్రలు
ఎన్నటికీ అబద్ధం చెప్పలేవు
కాదని వాదించనూలేవు

నేను మరచిన ఈ తోటలో తిరిగి వెళ్లిందెవరు
ఎండిన రెమ్మలనుతుంచిందీ
గుండె మొదళ్ళలో గట్టిబడినపొరలను కదిపి
కాసింత తీయని ఊపిరినీటిని పోసిందీ
కూడా నీవే కదూ

అలా నవ్వకు
నన్ను మళ్ళీ కవితలా పరిమళింపచేస్తోందీ
నీ గులాబీ చేతుల స్పర్శే

ఒక్కసారి
ఒకేఒక్క సారి చెప్పు
వచ్చింది నీవే నని

మళ్ళీ
నేను నీకై వేచివున్నపుడూ
నాతో నేనున్నపుడుకూడా వస్తావనీ….

                                                            -డా. విజయ్ కోగంటి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

One Response to కల కాని నీవు(కవిత )-డా. విజయ్ కోగంటి

Leave a Reply to దడాల వెంకటేశ్వరరావు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో