నా మనస్సుతోనేను(కవిత ) – సందిత బెంగుళూరు

విషాహిలా
ఖస్సునలేస్తూ
విసిగిస్తున్నమనస్సును
అదుపులో పెట్టేందుకు
కలుగులగొట్టపుఘటపుతూట్లపై
వ్రేళ్ళాడిస్తూ
వ్రేలాడేస్తూ
ఊపిరితోపోరాడేస్తూన్న
పాములోడిలా బ్రతికేస్తూ

నాశంచేస్తున్నట్లుతెలిసినా
స్వఛ్ఛందంగాతప్పుకోలేక
ఒప్పుకోలేకచంపుకోలేక
విషమవిషవిషయోదధితోజత!!

మానం దానివ్యూహం!!
అనుమానం
సన్మానం
అభిమానం
అవమానం
కొలమానం
అను
అనుసదభియవకొలతలతో
కలతలుసృష్టించేసి
బతుకుల నతలాకుతలం చేసేస్తుంది!

కదలకుండా
నిలబడలేని పరిస్థితిలో
ఉసురులనొదిలేదాకా
ఊపిరితో
కలిపికట్టేసుకుని
ముడిపెట్టేసుకున్నమౌలికం!
దానితోనేను !
అదేనేను!
కాదనలేను!
అనగలిగితేనేనులేను!
అనగలిగే ఆ స్థితిని…
యోగిని కాకుండా అందుకోలేను!
అందుకో గలిగితే..
అప్పుడిక నేను లేనే లేను!!

                                                   –  శ్రీమతి జి సందిత  బెంగుళూరు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , Permalink

One Response to నా మనస్సుతోనేను(కవిత ) – సందిత బెంగుళూరు

 1. దడాల వెంకటేశ్వరరావు says:

  నేననుకునే
  నేనింకేమనగలను
  యోగినైపోయి
  కనుమరుగైపోతాను
  భవతభవభవతోభవతాతత్వతః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)