ఎక్కడున్నవ్….?(కవిత )- దేవనపల్లి వీణావాణి

ఉత్తరాల మీద
ఊహల ముద్రలేసి
మెరవాల్సిన లోకాన్ని సిద్ధం చేశాను

జతగా అల్లే మొగ్గల మాలై
తలపుల తలుపుకు
అతుక్కుపోయాను

పూచిన
నమ్మకాల దారికి
సుగంధం పూస్తావని

ఆప్తుడా…

ఎదురేగాను
నువ్వొస్తావని…..

కుంగిన నింగి మీద
నీ పేరు రాస్తూ ఎగురుతున్న
ఇనుప పక్షి…
దీపం లేని గుడినే
కదా మోసుకొచ్చింది..!

ఆగిపోయే ముందు ఆ
గుండె నాకెమన్నా చెప్పమన్నదో…

కళ్ల మీద నీటి పొర
ఏ రూపం దిద్ది ఆరిందో…

వీరుడా..

ఎప్పటికీ తెరవని
నేలమాళిగలో దూరి
ఎవరికి చెప్తున్నవ్
నీ ఊసులు …

అంతా దేశానికిచ్చి
మెళ్ళో కీర్తి బిళ్ళలు
కట్టావు……

ఒక్కసారి
చూడాలి…చెప్పు
మళ్ళీ ఏ లోకంలో
పుట్టావు…..?

    -దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , Permalink

3 Responses to ఎక్కడున్నవ్….?(కవిత )- దేవనపల్లి వీణావాణి

 1. దేవనపల్లి వీణా వాణి says:

  ధన్యవాదాలు సర్

 2. దడాల వెంకటేశ్వరరావు says:

  ఆప్తుడా వీరుడా
  చూడాలనిఉంది
  దేశానికి కీర్తి కిరీటాన్నిచ్చి
  దేహాన్ని దేశంలో విడచి
  ఏలోకపౌరుడివయ్యావు
  ఒక్కసారి చూడాలనివుంది
  ఎంత శ్రమైనాపడి నీమార్గంలోనే
  నేనూ నీ లోకానికి తరలి వస్తాను
  చెప్పు ఏలోకంలో మళ్ళీపుట్టావు

  • దేవనపల్లి వీణా వాణి says:

   ధన్యవాదాలు సర్