ఎంక్వయిరీ(కథ)- డా.లక్ష్మి రాఘవ

ఆఫీసు బిల్డింగ్ నుండీ బయటకు రాగానే అప్రయత్నం గానే వెదికాయి కావ్య కళ్ళు..
దూరంగా కనిపించాడు అతను!
ఇంకొంచెం దగ్గరగావుంటే దగ్గరికి వెళ్లేదేమో కానీ ఇంతలో కాబ్ వచ్చింది.

కాబ్ లోకూర్చున్నాక మళ్ళీ అతని గురించి ఆలోచన వచ్చి పొద్దున్న కొలీగ్ రమ్యతో సంబాషణ గుర్తుకు వచ్చింది.
“ఒక వారం నుండీ ఒక అతనిని గమనిస్తున్నాను రమ్యా. నేను బయటకు వచ్చేసమయానికి ఉంటాడు”
“ఇక్కడే పని చేస్తున్నాడేమో..”
“లాస్ట్ వీక్ ఇంకో షిఫ్ట్ లో పని చేసాను..అప్పుడు కనిపించాడు..అప్పుడే నేను గమనించింది..ఇప్పుడునైట్షిఫ్ట్ మారితే మళ్ళీ నేను రోజూ చూస్తున్నాను అంటే అతను పని చెయ్యటం లేదు అనిపిస్తుంది. అంత రాత్రి పూట ఏమి పని ? పైగా కాషువల్ గా కనిపిస్తాడు.”

నీ అనుమానం అంతే…మన బిల్డింగ్ లో ఎవరైనా ఫ్రెండ్ కోసం వస్తాడేమో…”
“అలా అనుకున్నా కానీ నేను కాబ్ ఎక్కాక వెనక్కి తిరిగి చూస్తే వడి వడిగా వెళ్ళిపోతూ కనిపిస్తాడు..”
“ఇంత గమనించడం అయ్యాక..అతను నీకోసమే వస్తాడు అని అనుమానం వుంటే ఒక్కటే మార్గం వుంది కావ్యా..ఈ సారి దగ్గరకు పిలిచి చెప్పేయ్….వచ్చేది నీ కోసమే అయితే వెస్ట్ అనీ, నీకు ఎంగేజ్ మెంట్ అయ్యిందనీ ..కొద్దిరోజుల్లో పెళ్ళీ అనీ…అప్పుడు చెప్పుతో కొట్టినట్టు వుంటుంది “

‘నిజమే…నేను గమనించింది ఈ మధ్యనే కదా ఎన్ని రోజులనుండీ ఫాలో అవుతున్నాడో..ఒక సారి చెప్పేస్తా”
“పొరబాటున వివేక్ కు ఇలా అని చెప్పకు. ఎంత చదువుకున్నా కాబోయే భార్య కు ఎవరో లైన్ వేస్తున్నాడంటే భరించలేడు”
“వివేక్తో అంత చెప్పే చనువు రాలేదులే పెళ్లి కుదిరి నెలేగా అయ్యింది..”
“చూడు ఈ విషయం ఇంతటితో ఆగేలా నీవే చూసుకోవాలి…నన్ను రమ్మంటే నీతో బాటు బయటకు వస్తాను”
“వద్దులే రమ్యా..పిచ్చి వేషాలు ఏమీ లేవు ఊరికే చూస్తూ ఉంటాడు. కాకపొతే దూరంగా నించుoటాడు. నేనే కాబ్ ఎక్కే ముందు దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇస్తాను..”

రెండు రోజులుగా అతని దగ్గరగా వెళ్ళటానికి వీలు కాలేదు.

ఈ వారం నైట్ షిఫ్ట్ అయిపోతుంది. అడిగితే ఈ షిఫ్ట్ లోనే అడగాలి అంతరాత్రి అప్పుడు ఎందుకు వున్నావు?అని.
లేదా బాగా తిట్టాలి.. తనే సరిగా హ్యాండ్ల్ చెయ్యాలి అని నిర్ణయించుకుంది. రెండేళ్ళ గా ఉద్యోగం చేస్తూ ఆమాత్రం దైర్యం చెయ్యకపోతే ఎలా? అంతా అయ్యాక అమ్మకు చెప్పచ్చు అనుకుంటూ ఇల్లు చేరింది..

రెండు రోజులు వర్క్ ప్రెషర్ ఎక్కువగా వుండి ఓపిక లేక పోయింది. అయినాఅతను బయట వుండటం గమనించింది..
నైట్ షిఫ్ట్ అయిపోయిన రోజు రాత్రి లేటుగా బయటకు వస్తే దూరంగా బడ్డీ కొట్టు దగ్గర నిలబడివున్న అతనిని చూసి చేతితో సైగ చేసింది దగ్గరగా రమ్మని..అతను చూసి కూడా రాలేదు…క్యాబ్ వచ్చేంతలో తనే అక్కడికి వెళ్ళచ్చు అని గబ గబా అతని వైపు అడుగులు వేసింది..అతను అక్కడే నిలిచివున్నాడు.

వచ్చాక “ ఏ మిస్టర్, ఎందుకురోజూ నన్ను ఫాలో అవుతున్నావు? పోలీసు కంప్లయింట్ ఇస్తాను జాగ్రత్త!
ఆల్రెడీ మా ఆఫీసు సెక్యూరిటీ కి చెప్పాను వాళ్ళు గమనించారు నిన్ను…రెండు రోజు లు జైలు లో కూర్చుంటే తెలుస్తుంది..” గట్టిగా అంది కావ్య.

“మేడం..ప్లీజ్..పోలీసులకు చెప్పకండి..నేను అలాటి వాడను కాను…” బతిమాలుతూ అన్నాడు అతను చేతులు నులుపుకుంటూ…
“మరెందుకు ఇలా రోజూ అర్ధరాత్రి , అపరాత్రి ఇక్కడకు వస్తున్నావు?”
“కారణం వుంది మేడం …”
“చెప్పు లేకపోతె ..మాఆఫీసు సెక్యూరిటీ కూడా ఊరుకోరు..”

“ప్లీజ్ మేడం…నేను డ్యూటి చేస్తున్నాను..”
“ఏమీ..డ్యూటీనా?? ఆడవాళ్ళను ఫాలో చెయ్యడం డ్యూటీనా…నేనేం చెవిలో పువ్వు పెట్టుకోలా..”కోపంగా అంది కావ్య.

“మా డ్యూటీ ఫాలో కావడం మేడం. నేను ఒక డిటెక్టివ్ ఏజన్సీ లో కొత్తగా పనిలో చేరాను…”
“అయితే నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? మిమ్మల్ని ఎవరు చేయమన్నారు?”

“మేడం మీరు నా ఉద్యోగం కాపాడుతానంటే చెబుతాను. ఎక్కడా ఉద్యోగం దొరకక ఇందులో చేరాను ఇది ఫస్ట్ కేసు..”
“చెప్పు…ఎవరికీ చెప్పనులే”
“మేడం.. హైదరాబాదు నుండీ ఒకరు మిమ్మల్ని గమనించి రిపోర్ట్ చెయ్యమన్నారు ..”
“పేరు తెలిసినా చెప్పకూడదు మేడం..” నమస్కారం పెడుతూ అన్నాడు అతను.

నాకు ఇంకో మూడు నెలల్లో పెళ్లి…ఇప్పుడుఇలా ఎవరో నా గురించి ఎంక్వయిరీ చేస్తున్నారంటే ఎంత నగుబాటు? నేను తెలుసుకు తీరాలి….లేకపోతె పోలీసు కంప్లైంట్ ఇస్తాను…”

“ప్లీజ్ మేడం… .. పార్టీపేరు మావరకూ రాదు కానీ పొరబాటున విన్నాను. అది చెబుతాను నన్ను వదిలెయ్యండి ప్లీజ్…ప్లీజ్…”
“సరే చెప్పు…”

“మీ గురించి నెలరోజులు గమనించి రిపోర్ట్ చెయ్యాలి ..ఈవారం రిపోర్ట్ ఇస్తాము. ఆ పార్టీ పేరు వివేక్ ..”
నెత్తిన బాంబు పడ్డట్టయింది కావ్యకు….ఎక్కడ పడిపోతానో అనిపించి కింద కూర్చుంది.

క్యాబ్ వచ్చింది మేడం” అన్నాడతను.
మెల్లిగా నడిచి క్యాబ్ ఎక్కింది.

ఇందుకోసమేనాఏ షిఫ్ట్ లో వున్నావు అని ఫోనులో అడిగేవాడు…తను ఎక్కడ ఎవరితో తిరుగుతున్నానో అని అనుమానం తో వున్న వ్యక్తినాతను వివాహం చేసుకోబోయేది?? తల పగిలి పోతూన్న ఫీలింగ్…
మగవాడితో సమానంగా చదువూ ఉద్యోగం కావాలనుకునే ఈ కాలం లో ఇలాటి వ్యక్తులు ఉంటారా?? ఆలోచించలేక పోతూంది కావ్య.

ఇల్లు చేరగానే తలుపుతీసిన అమ్మ తో “అమ్మా రేపు తెల్లారగానే నీవు చెయ్యవలసినది వివేక్ తో నా పెళ్లి కాన్సల్ చెయ్యటం…నన్ను ఇప్పుడు ఏమీ అడగకు…రేపు మాట్లాడుతా..”అని తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది కావ్య.
****                 ****                ***

– డా.లక్ష్మి రాఘవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

3 Responses to ఎంక్వయిరీ(కథ)- డా.లక్ష్మి రాఘవ

  1. శారద కానాల says:

    నేటి యువతరం పోకడలకు అడ్డం పట్టినట్లుంది.

  2. Raghava rao says:

    కొత్త వాతావరణం కలిగిన కొత్త ఆఫీసులలో కూడా ఇవి జరుగుతాయన్నమాట. సాఫ్ట్ వెర్ పద్దతి లో ఎంక్వయిరీలు పే వారూ ఉంటారని తెలిపే కథ ! కొత్తగావుంది. రచయితకు అభినందనలు !

  3. Divya says:

    ఇలా kooda జరుగుతుందా anipinchindi . మంచి కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)