రాజ్యమా..!..నువ్వెటువైపు?(కవిత )-భండారు విజయ

రాజ్యం ఇప్పుడు రంగుటద్దాల
పంజరంలో చిక్కిన సీతాకోకచిలుక
చిలుక ప్రాణమంతా పెట్టుబడీదారుల
ముంగిట మోకరిల్లి తలదించుకుంటోంది

ప్రపంచీకరణ జపంతో గోతులు తవ్వుతూ
అభివృద్ధి అంచున గంతులేస్తోంది
పాచిపోయిన మనుస్మృతులను రుద్దుతూ
కూకటివేళ్ళతో మానవత్వాన్ని పెకిలిస్తోంది

గుప్పెడుమంది బడా బాబుల కీలుబోమ్మై
స్విస్ బాంకులో దోపిడిని నిక్షిప్తం చేస్తూ
ఊపిరాడనివ్వని కుతంత్రాలతో రగిలిపోతోంది
మతోన్మాధం కుట్రారాజకీయాలతో ఊగిపోతోంది

వర్గాల పేరా మనుషుల్ని విడదీస్తూ
కులాల రంగులద్దుకొని గాండ్రిస్తోంది
అమానవీయ పైశాచిక దాడులు చేస్తూ
సాధుసంతుల మాటున జులుం విదిలిస్తోంది

ప్రజాస్వామ్య ప్రభుత్వాల మనుగడంతా
బాబాల నగ్న శరీరాంగాలను తాకుతూ
సన్యాసుల మురికి కాళ్ళను నాకుతూ
పాపప్రక్షాళన పేరుతో పరుగులు పెడుతోంది

ఊరు ఊరుకు ఒక మానసిక ఉన్మాది
పరిహార సాధువై అవతరిస్తున్నాడు
దూదిపింజం లాంటి మానవ బతుకులపై
మాయల పురాణాలు ప్రవచిస్తున్నారు

సంతు మహారాజులై జపమాలలు ధరించి
నిత్య ఉపాసనలు విరివిగా కుమ్మరిస్తూ
అమాయాకుల బలహీనతలను వంచిస్తూ
సొల్లు కబుర్లతో సిగ్గు లజ్జలు వదిలేస్తున్నారు

అరాచక,అక్రమ దౌర్జన్యాల డేరాలను స్థాపించి
గుట్టుగా నేర సామ్రాజ్యాలను ఏలుతున్నారు
పాలకుల అండతో పబ్లిగ్గా దోచుకుంటూ
లక్షల కోట్లకు పడగలెత్తి వెలిగి పోతున్నారు

పసిమొగ్గలను సైతం వదలకుండా
స్త్రీల మనోవిశ్వాసాలను ద్వంసం చేస్తున్నారు
సైకో అనాల్జిష్టులమని ప్రగల్భాలు పలుకుతూ
పైశాచిక లైంగికంగా ఉన్మాధంతో
మహిళల జీవితాలను విధ్వంసం చేస్తూ
కరాళనృత్యాలతో హత్యచేస్తున్నారు

దేవుడి దూతలమని చీకటిగుహల నీడన
కామ,క్రోధ, మద,మొహాల మండపాలక్రింద
అమాయక పురుష అంగాలను తెగనరుకుతున్నారు
కుళ్ళిపోయిన మానవ మృత కళేబరాల కుప్పలపై
సత్యసౌధలకు పునాదులేస్తూ రక్షణవలయాలు సృష్టించి
నిత్య తపోదనులై దైవాంశులుగా పిలవబడుతున్నారు

కీచకహేళలో తరిస్తున్న దొంగబాబాల నృత్యాలుగా
బరితెగించిన స్వాముల ఆశీర్వచనాలుగా
దేశ ప్రగతికిప్పుడు చెదరని ఆనవాళ్లుగా
వాళ్ళ మంత్రదండాలే ప్రజల ఉన్నతిగా
వారి మనోవాంఛఫలాలే నూతన భవిష్యత్తుగా
వెలిగిపోతోంది నవభారత లౌకిక రాజ్యాంగమై!

                                                                 -భండారు విజయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

One Response to రాజ్యమా..!..నువ్వెటువైపు?(కవిత )-భండారు విజయ

 1. దడాల వెంకటేశ్వరరావు says:

  రాజ్యమా నువ్వేటువైపు
  అంటే రాజ్యమెంచెబుతుంది
  రాజ్యాంగమా నీ భవిష్యత్తేమిటి అని అడిగితే
  రాజ్యాంగమేంచెబుతుంది
  దేశభవిష్యత్తును తీర్చిదిద్దడానికి
  మనమేమిచేసామని ఆలోచిద్దాం
  మనకృషిమనం చేసి చూపిద్దాం
  ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఏదో
  జరిగిందని వాపోయేకంటే
  మరొమారలా జరగకుండా
  ఉండేలా జాగ్రత్త పడదాం
  నవభారతరాజ్యాంగాన్ని గౌరవిద్దాం
  మనమే మన దేశ ‘బంగారు’ భవిష్యత్తును కాపాడుదాం
  రాజ్యమంతా ‘విజయ’ పతాకాల్ని
  ఎగరేద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)