సాయిబాబా – వాస్తవాలవ్వాలనుకుంటున్న అవాస్తవాలు-వ్యాసం -విక్టర్ విజయ్ కుమార్

సాయిబాబ ఇప్పుడు అందరి మనిషయ్యాడు. కాంగ్రెస్ దగ్గర నుండి దళిత బహుజన సంస్థల దగ్గర నుండి పార్లమెంటరీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ‘ ఓన్ ‘ చేసుకుంటూ ముందుకొస్తున్నాయి. సర్వ సాధారణంగానే ప్రశ్నలు తలెత్తుతాయి ? నేను కాపోతే ఇంకొకరు ! ‘ అరే ఇంత దారుణంగా నేరారోపణ జరిగి , ఇంత అన్యాయంగా తీర్పు ఇచ్చినప్పుడు , కోర్టులు ఎంత కౄరమైనవి అయినా అంత పచ్చిగా ఎలా సాయిబాబకు శిక్ష వేయగలవు ? కేసు అంత వీక్ అయినప్పుడు కనీసం బెయిల్ కూడా దొరికించుకోలేని లాయర్లు లేరా ఈ దేశం లో, ఈ విప్లవ వాదుల్లో ?! ” అనిపించడం సహజం. ఉత్తిగా ఇవి బూర్జువా కోర్టులు, ఇది ఫ్యూడల్ రాజ్యం అని సర్ది చెప్పుకుంటే సరిపోతుందా ? అది విరసం లో పిడివాదానికి సరిపోతుంది. సాధారణ ప్రజలు కారణాలు ఖచ్చితంగా వెతుకుతారు. అది ఉన్న వ్యవస్థ నుండే , ఉన్న వ్యవస్థ లోపలే వెతుకుతారు.

ప్రకటన అప్రోచ్ – తీరు తెన్నులు : 

అసలు ఎవరికో ఒకరికి సమాధానం ఇవ్వడం కాకుండా – ఈ బాధ్యత మా మీద ఉంది అని క్లారిఫై చేసి ఉంటే హుందా తనం అక్కడ ఆగి ఉండేది. నేను చేసిన ఈ ఆరోపణ నిజానికి ఒక బహుజన రచయిత తన ఫేస్ బుక్కులో పెట్టిన పోస్టుకు రాసిన కామెంట్ !! ఇది నేను పని గట్టుకుని రాసిన ఆర్టికల్ కాదు. లేదా నా వాల్ మీద నేను రాసి ప్రాపగేట్ చేసిన సిద్ధాంతమూ కాదు. విరసం ఒక ఫేస్ బుక్ కామెంట్ కు ఇంత తీవ్రంగా , అసంబద్ధంగా రియాక్ట్ కావడం విరసం లో ఈ సాయిబాబ కేసు చుట్టూ జరుగుతున్న విషయం లో ఉన్న గిల్ట్ ఫీలింగ్ వలనా ? లేదా విరసం కు ఒక విధి విధానం లేకుండా రియాక్షనరీ గా ప్రకటనలు ఇస్తుందా ? ఏదేమైనా ఇంత వరకు విరసం నుండి ఒక్క సమాధానం కూడ పొందని రంగనాయకమ్మ మరి ఏదో అదృష్టం చేసుకుందో ఏమో మరి. (విచిత్రం ఏమంటే విరసం సంస్థ రంగనాయకమ్మను వ్యతిరేకిస్తుంది. ఆమె అభిమానులకు మాత్రం సభ్యత్వం ఇస్తుంది.ఎవరి అదృష్టం వాళ్ళది ! )

పోనీ అంత ప్రకటన ఇచ్చారు .మరి అది నేను పెట్టిన ఫేస్ బుక్కు కామెంట్ మీదనే అన్నది స్పష్టం . ఆ కామెంట్ ను యథాతథంగా రాస్తూ ప్రతిస్పందించడం కూడా స్పష్టం. అంతా రాస్తూ ” అతడు ఈ రాతలు ఎందుకు రాస్తున్నాడో ” ” అతనికి ఇది తెలుసు ” అని ఆ అతడెవడో ప్రస్తావించకుండా తమ అక్కసును వెళ్ళగక్కుతారు. సమాధానం రాస్తున్నాం ఈయనకు అని అనుకుంటే , ఆయన పేరు తీసుకుని రాయండి. లేదు జనరల్ గా రాస్తున్నాము అనుకుంటే , ఏ ప్రస్తావన లేకుండా రాయండి. అసలు ఎవరికీ సమాధానమో, ఎవరికో సంజాయిషీ కాదు గాని , మా బాధ్యత కాబట్టి రాస్తున్నాము అని అనుకుంటే అలానే రాయండి అంతేగాని పక్కింటి అమ్మలక్కలు మూతి ముడుచుకుని ఒకరినొకరు గాసిప్ మాట్లాడుతూ శాపనార్థాలు పెట్టినట్టుగా సమాధానం రాసే ఈ పద్ధతి ఏంది ?.’ అతడు ఇలా రాసాడు. అతడు అలా రాసాడు ‘ అని మళ్ళీ ఈ సిగ్గు పడ్డం ఎందుకు ? ఆ అతడెవరో చెప్తే పోద్దిగా ? కాని ఈ అమ్మలక్కల భాష ఏంది ? వీళ్ళలో వీళ్ళను విమర్శించే వాళ్ళు ఎవరూ ఉండరా ? అందరూ ‘ Yes boss లేనా ? ‘ అందుకే బయటోళ్ళు ఇలా విమర్శించాల్సి వస్తుంది.

మొత్తంగా , సందర్భం ఇది కాదు. సమాధానం రియాక్షనరీగా ఉండి ఉండరాదు. సమాధానం లో ప్రతి విమర్శ, విమర్శకుడిపై దాడి చేయాలనే టోన్ తప్ప , అసలు సాయిబాబ గురించి చేస్తున్న పోరాటం వేపు మనం ఎలా మొబిలైజ్ చేస్తున్నాము అనే ఒక ప్రధాన లక్స్యం వేపు కదుల్తున్నామా లేదా అనే అవగాహన లేకుండా రాసేసారు.

ఇదంతా ఒక ఎత్తు . విరసం ఈ ప్రకటన ఇవ్వడం లో ఎంత కంగారు పడిందంటే సమయ సందర్భం మరవడమే కాకుండా, అసలు నేను ఆంధ్ర జ్యోతిలో రాసిన ఆర్టికల్ లో ఉన్న వాస్తవాలను కూడా వక్రీకరించి ఎలాగైన సరే వీడి వ్యక్తిగా దుమ్ము దులపాలి అన్నట్టు ప్రకటన ఇచ్చింది తప్ప వేరే గొప్ప ఉద్దేశ్యం ఏమీ కనపట్టం లేదు. ఇది చూడండి.

వాస్తవాల వక్రీకరణ

నేను నా ఆర్టికల్ లో రాసిందేంటి ?

మరి విరసం దీన్ని ఎలా మార్చి తన వాదనను గట్టి పరుచుకోవాలని చూసింది ?

” సాయిబాబా జడ్జ్మెంట్ మొత్తం లో ఒక పాత్ర పేరు ఉచ్ఛారణ పదే పదే కనిపిస్తుంది.ఈ పాత్ర ముద్దాయిలందర్నీ ఒక కుట్రకు ఉసిగొల్పుతుంది అని నమ్ముతూ జడ్జ్ మెంట్ రాయబడింది. ఆ పాత్ర పేరు ” నర్మదక్క ” ఎవరు ఈ అక్క ? ఈమె బతికే ఉందా ? అన్న విషయాలు కోర్టు విచారించినట్టు ఎక్కడా కనిపంచదు. మన కామన్ సెన్స్ ను కూడా చాలెంజ్ చేసే ప్రశ్న ఏంటంటే – నర్మదక్క మీద ఇంత వరకు కేసు ఎందుకు పెట్టలేదు ? నర్మదక్క వర్షన్ ఈ కేసులో వినకుండా ఈ కేసు తీర్పు దాకా ఎలా వెళ్ళింది ?ఇలాంటి విచిత్రమైన పద్దతుల్లో ఈ సాయిబాబ కేసు విచారించబడ్డది. “

అంటే కోర్టు ఈ నర్మదక్క ను సంప్రదించకుండానే శిక్ష ఖాయం చేసింది అని కదా అర్థం ? ఇది తీర్పు ఇచ్చిన విధానం లో ఉన్న సీరియస్ ఫ్లా ను ఎత్తి చూపడం. ఇందులో తెలుగు భాష ఇంతకంటే వేరుగా ఇంటర్ప్రిట్ చేసే చాన్స్ ఉందా ?

ʹʹఈ తీర్పు మొత్తం ఒక నర్మదక్క చుట్టూ తిరుగుతుంది. కాని విచిత్రంగా నర్మదక్క ఈ కేసులో ముద్దాయి కాదు. ఆమెకు శిక్ష పడదు.ʹʹ

ఎక్కడ నేను నా జడ్జ్మెంట్ ఇచ్చాను – నర్మదక్కకు ఇక శిక్షపడదని ? పడదని ? నాకు ఆమెకు శిక్ష పడాలనే ఆకాంక్ష ఉందని ? ఎక్కడ నేను నర్మదక్కకు ఎలాగన్నా సరే శిక్ష పడాలి అని ? నర్మదక్కకు శిక్ష పడాలి కాని, సాయిబాబాకు శిక్ష పడకూడదు అనే లాజిక్ అనే నేను నా వ్యాస్యం లో ఎలా రాయగలుగుతాను ? ఎక్కడ రాసాను ?

ఆపై అది కంటిన్యూ చేస్తూ విరసం ఇలా రాస్తుంది.

” నర్మదక్క తల మీద వెల ఉందని ఈయనకు తెలియదా? గడ్చిరోలి ఉద్యమ బాధ్యురాలైన నర్మదక్క ద్వారా మావోయిస్టు జనరల్ సెక్రెటరీకి సాయిబాబా రాసిన లేఖ చిప్‌ పట్టుబడిందనేది ఆరోపణ. అందుకని, ఆ కేసు, ఆ తీర్పు ఆమె చుట్టు తిరిగింది.ఇది రాసినతనికి అది తెలుసు. తెలియని సామాన్యుల కోసం ఈ వక్రీకరణ. “

నాకు నర్మదక్క తల మీద వెల ఉంది అని తెలియడానికి నాకు మావోయిస్టు పార్టీ సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నట్టు ఇమేజిన్ చేసుకుంటున్నట్టు ఉంది. ఇంత ఘోరమైన ఆలోచనా విధానం కలిగిన విరసం ను చుట్టు తిప్పుకుంటున్న ఆ పార్టీ సమాచారం గాని, దాని పరిచయాలు గాని నాకు అక్కర్లేదు. నన్ను ఎప్పుడైతే మీ విరసం బ్రాహ్మణ మేధావి అవమానానికి గురి చేసాడో , ఆ క్షణం మీ సైద్ధంతిక ఆచరణ లో ఉండే డొల్ల తనం అర్థం అయ్యింది. నా దగ్గర ఎటువంటి ప్రివిలేజ్డ్ ఇన్ ఫర్మేషన్ లేదు. ఆంధ్ర జ్యోతి లో నా విశ్లేషణ అంతా అది పబ్లిక్ ఇన్ ఫర్మేషన్ డొమెయిన్ లో ఉన్నదే. ఆరోపణలు చేసే ఆత్రం లో అనవసరమైనవి ఊహించుకోవద్దు.

ఇక విషయానికొస్తే ఆ నర్మదక్క ఎవరో నాకు తెలీదు . నేను ఒరిజినల్ గా రాసిన వ్యాసం లో ” నర్మదక్క అలియాస్ లు ” ఎంతో మంది ఉంటారు. ఇందులో ఏ నర్మదక్క ? ఎవరిని విచారించారు ? అనే ఒక లీగల్ పాయింట్ గురించి మాట్లాడితే – ఏక్ దం నాకు నర్మదక్క విషయం గురించి తెలుసు అని రాస్తారేంటి వీళ్ళు ? అందునా – నర్మదక్క కు శిక్ష పడాలికాని ఇక పడదు అని నేను తీర్పు ఇచ్చినట్టు రాస్తారేంటి ? తెలుగు ఎలా చదవాలో తెలుగులో తర్జుమా చేయాలా ?! విమర్శకు సమధానం ఇవ్వడం వదిలేసి విమర్శకుడి పై దాడి చేయాలనే ఆత్రం మరీ దారుణంగా ప్రతిబింబిస్తుంది. అంతే కాదు నేను ” సాయిబాబ ఆక్సిజన్ సిలిండర్ లో ఆక్సిజన్ ఎంత ఉందో చూసుకోకుండా సముద్రం లో దూకేసాడు ” అని రాస్తే , విప్లవోద్యమం ఖాళీ సిలిండర్ అని నేనన్నట్టు ఇంటర్ప్రిట్ చేస్తూ రాసారు. ఆయన దూకింది సముద్రమంత పోరాటం లో. తాను ఎంత వరకు ఈదగలడో అంత వరకే ఈదకుండా ముందుకేళ్ళిపోయాడు అనే సింపుల్ మెటాఫర్ ను , వీళ్ళకు ఇష్టమొచ్చినట్టుగా ఇలా చిత్రిస్తారేంటి ?

విప్లవం లో కుట్ర కేసుల్లో ఉన్న వాళ్లందరూ ఇదే రీతిలో కష్టపడరు. కొందరు పబ్లిక్ గా రెడ్ హేండెడ్ గా ( చట్టం దృష్టిలో ) పట్టుబడినా , బయటకొచ్చి కవితలు రాసేసుకుని గడిపేస్తూ ఉంటారు. నేను వ్యక్తులను తీసుకోను ఇక్కడ. ఎప్పుడన్న చర్చకు దిగితే సిధ్ధమే. ఇది నా ఖచ్చితమైన ఆరోపణ. అలా ఎందుకు జరుగుతుంది అనేది – ఆ వ్యక్తికి సంబంధించిన ( ఆక్సిజన్ సిలిండర్ ) ప్రిపరేషన్ బట్టి ఉంటుంది…ఆ వ్యక్తికి ఉన్న సోషల్ కేపిటల్ బట్టి ఉంటుంది.

సాయిబాబాకు సోషల్ కేపిటల్ లేదు అని రాసాను. సాయిబాబకు సోషల్ కేపిటల్ ఉంది కాని పొలిటికల్ కేపిటల్ లేదు అని సమాధానం ఇచ్చారు ?! వీళ్ళకు సోషల్ కేపిటల్ లేదు అన్న విషయం అసలు అర్థమయ్యిందా ? నేను ఎక్స్ ప్లెయిన్ చేస్తా ఈ ‘సోషల్ కేపిటల్ ‘ ఎలా ఉంటుందొ . కాస్త ఈ వ్యాసం చివర్లో చూద్దాం ఇది. ఇక్కడ – పార్టీలో వ్యక్తులకు పొలిటికల్ కేపిటల్ సమానం గానే ఉండొచ్చు గాని. సోషల్ కేపిటల్ అందరికీ సమాధానంగా ఉండదు. అది విరసం అనే కాదు. అది GE Capital అయినా China Communist Party అయినా అంతే ! అయితే అందుకు భిన్నంగా – అందరికీ సమానంగా సోషల్ కేపిటల్ పంచగలిగిన విరసం కు నా అభినందనలు. ఇంతవరకు ప్రపంచం లో సృష్టించబడని సంస్థను సృష్టించారు ! డుర్ఖీం ను ఇంకాస్త చదవండి. చివర్లో నేనిచ్చే ఉదాహరణ గురించి ఆలోచించండి. అర్థమౌతుందిఏమో ఈ సోషల్ కేపిటల్ ఎలా పని చేస్తుందో!

సోషల్ కేపిటల్ – బ్రాహ్మణీయ ఎత్తుగడలు : 

ఇదంతా ఇలా ఉంటే నాకు ప్రతి సమాధానమంతా అయ్యాక , చివర్లో ప్రకటన ఇలా ముగుస్తుంది . ” మన” తక్షణ డిమాండ్స్ ఇవి అని. ఈ ” మన ” ఎవరు ? మావోయిస్టు పార్టీ సింపథైజర్సా ? లేదా విరసం వాళ్ళా ? లేదా సాయిబాబ సానుభూతిపరులా ? ఈ ” మనం ” అన్నది ఎవర్ని కలుపుకుని ? అంటే ఈ ” మన ” లో విక్టర్ విజయ్ కుమార్ ను వెలివేసి చూడాలి అన్న మాట. ఆ మన అనే ” గ్రూప్ ” లోకి రాడు విక్టర్ విజయ కుమార్ . ఆయన సాయిబాబాకు ఎంత సానుభూతి పరుడైనా సరే ! ఎందుకు ? విక్టర్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఏదో చికాకు పెడుతుంటారు అనే ఒక అంతర్లీనమైన జడ్జ్మెంట్. ఇది విప్లవోద్యమం లో ఉండే బ్రాహ్మణీయతకు వ్యతిరేకం కావచ్చు, లేదా సాయిబాబ కేసు గురించి ఖచ్చితమైన , మొండి పట్టుదలతో కూడిన విమర్శ అయినా అవ్వచ్చు. అంటే మమ్మల్ని ప్రశ్నించ దల్చుకున్న వాళ్ళు ‘ మా ‘ సాయిబాబా కోసం పోరాటం చేయొద్దు అని. ‘ మాకు చెందిన ‘ సాయిబాబా కోసం పోరాటం చేసే వాళ్ళు ‘ మాతో ‘ ఒక అంగీకారం కలిగి ఉండాలి అని. మరి అదేదో మీరొక్కరే చేయొచ్చుగా పోరాటం ? మధ్యలో ఈ ప్రజా సంఘాలతో వ్యక్తులతో, మిగతా ప్రొఫెసర్లతో ఎందుకు కూడిక ? ఏదేమైనా సాయిబాబ కోసం జరిగే పోరాటం లో మాత్రం విక్టర్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు మాత్రం ఉండ రాదు. ఎవరినైనా వెలివేయడానికి అస్పృష్యత అధారం అనుకుంటాం గాని. దాని అంతర్లీన సారాంశం ” అనంగీకారం ” ” అసమ్మతి “. ఇదే కదా – అంబేద్కర్ దాసులు దస్యుల గురించి అస్పృష్యత ఎలా పుట్టిందో రాస్తూ చేసిన విశ్లేషణ. “మన ” అనే విషయాన్ని ఎంత టేక్టికల్ గా ఆర్కిటెక్ట్ చేసారు వీళ్ళు ?! మహా విప్లవ వాదం ఇది మరి ! ఇలా ” మన” తక్షణ డిమాండ్ లు అంటూ రాస్తూ చివర్లో ఏం రాస్తారు ఊహించగలరా ? ఇదుగో ఇది – ” ఈరోజు (9 నవంబర్‌) హిందూలో కల్పన కన్నబిరాన్‌ రాసినట్లు ఈ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని న్యాయవాదులు న్యాయవ్యవస్థ స్పందించేలా ఏమీ చేయవచ్చునో ఆలోచించి స్పందించవచ్చు.” అంటే విరసం ఏలా చేయాలో సజెషన్స్ ఇవ్వదు. ఎవరో బయట ఉన్న కల్పన కన్నాబిరాన్ గారు చెప్పినట్టు నడుచుకుందాం అని అందరికి చూచాయగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. అంటే మీరు స్వంతంగా ఆలోచించడం ఏమీ లేదా ఇందులో ? అప్రస్తుతంగా కల్పన ఇలా చెప్పింది ఇలానే చేద్దాం అని రాయడం లో ఏం చెప్ప దల్చుకున్నారు ? ఆంధ్ర జ్యోతిలో విక్టర్ విజయ్ కుమార్ రాసిన వ్యాసం గురించి మీరు బుట్తలో పడొద్దు. అతను ” మన ” కాదు. కల్పన కన్నాబిరాన్ ” మన ” అని. నిజానికి కల్పనా కన్నాబిరాన్ అప్రోచ్ అసలు అహేతుకమైనది. సాయిబాబ అంగ వైకల్యం మీద కరుణించి బెయిల్ ఇవ్వాలని ప్రతిపాదిస్తూ రాసింది. అంటే సాయిబాబ ( చట్టం దృష్టిలో ) నేరాన్ని ఒప్పుకున్నట్టేగా ? ఈ ఐడియానా మిమ్మల్ని ఇంత ఇంప్రెస్ చేసింది ? ఇలాంటి అప్రోచ్ తో మీరు సాయిబాబ కొరకు పోరాటం చేయమని కల్పన కన్నబిరాన్ ను స్పూర్తిగా తీసుకోమని పిలుపునిస్తారా ? ఏమన్న వివేచన ఉందా ఇందులో ?!

సోషల్ కేపిటల్ అన్న విషయాన్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సందర్భం డిమాండ్ చేయకున్న కూడా, అంత అవసరం లేకున్న కూడా, ఆమే అప్రోచ్ పూర్తిగా కరెక్ట్ కాకపోయినా సరే – కల్పన కన్నబిరాన్ ను స్పూర్తిగా తీసుకోమని పిలుపునిచ్చారే …అది మీరు కల్పన కన్నాబెరాన్ కు అంటగడుతున్న సోషల్ కేపిటల్. అది ఆమెకు పేర్చి కూర్చి పెడుతున్న సోషల్ కేపిటల్. ఒక మనిషి చుట్టూ ఒక నెట్ వర్క్ ను ప్రోత్సాహించడం . ఆమెకు అవసరానికి మించి, తాహతుకు మించి ఆమెకో స్థాయి కల్పించాలనే ప్రయత్నం చేయడం. ఆమెకు ఒక గుడ్ విల్ సృష్టించి ఆమెకు అయాచితంగా ఆమెకో గుంపును నిర్మించడం. ఇది కల్పనా కన్నాబిరాన్ మీకు చెవులకింపుగా రాసినందుకు మీరు కూర్చుతున్న సోషల్ కేపిటల్. ఆమెకు అవసరం కు మించి, అసందర్భంగా గౌరవం కల్పించడం ముఖ్యంగా ఇంకో వ్యక్తి నీడను కనుమరుగు చేయడానికి చేసిన ఈ ప్రయత్నమే – మనిషికి సోషల్ కేపిటల్ ను సమకూరుస్తుంది. మీలో ఈ మధ్య కుట్ర కేసుల్లో ఇరుక్కున్న బ్రాహ్మణులకున్న సోషల్ కేపిటల్ సాయిబాబాకు లేదు. మీ విరసం లో ఉన్న బ్రాహ్మణులకుండే సోషల్ కేపిటల్ గొప్ప తనం ఏమంటే – వాళ్ళకు వైఎస్సార్ దగ్గర నుండీ ముప్పళ్ళ గణపతి దాక అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు సాయిబాబ విడుదలయ్యాక ఆయనతో అలా కాదు అని బలవంతంగా ప్రకటన ఇప్పించినా సరే ….ఇది పబ్లిక్ కు తెలిసిన వాస్తవం.

విరసం కు నేను చెప్పేదేమంటే – మొదటగా విమర్శకుడిని విమర్శించడం గొప్ప కాదు. నేను తప్పు అయిపోతే మీరు కరెక్ట్ అయిపోరు. నా విమర్శ తప్పా కాదా అని చూడకుండా అది విశ్లేషించకుండా నాకు లేని పోని లేబుల్ తగిలించే ప్రయత్నాలు మీ ఉద్యమాలకు ఖచ్చితంగా శ్రేయస్కరం కాదు. నా సంగతి వదిలేయండి. నేను అన్ని సౌకర్యాలు విలాసాలతో బతుకుతా. కంప్లీట్ కేపిటలిస్టుల దగ్గర పని చేసి నా ప్రొఫెషన్ ను నేను చూసుకుంటాను. నేను మీ గురించి మీరు గొప్పగా చెప్పుకునేంత చెప్పుకునేంత స్థాయిలో కనీసం ఒక్క వంతు కూడా త్యాగం చేయలేదు. చేయడానికి సిధ్ధంగా లేను కూడా. అంత మాత్రం చేత మిమ్మల్ని విమర్శించే చాత నాకు లేదు అని కాదు. నాకు ఆ వాయిస్ ఉండకూడదు అని కాదు. మిమ్మల్ని విమర్శించాలంటే – మిమ్మల్ని పక్కకు పిలిచి, చేతులు కట్టుకుని, మీ చెవిలో గుస గుసగా విమర్శించాలని కోరుకోవద్దు. మీరు నిజంగా గుండె మీద చేయి వేసుకుని ఖచ్చితంగా సాయిబాబ విషయం లో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అని అనుకుంటే – మొదట సాయిబాబ ఆందోళనను అడ్రెస్ చేయండి. అతనితో సింపతీ కలిగిన ప్రతి ఒక్కరి మనోభావాలను అడ్రస్ చేయండి. అంతే కాని విమర్శిస్తే , ఆ విమర్శించే వాడి శీలాన్ని చీల్చి చెండాడేస్తాం అంటే ఎవరికీ ఉపయోగం లేదు. అది విమర్శను హేండిల్ చేసే పద్దతి కూడా కాదు.

ముగింపు :

In summary మీకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలు

(1) సాయిబాబా కోసం జరుగుతున్న పోరాట తీరులో – మీపై వచ్చిన విమర్శలను కూడా మీరు main stream పోరాటం లో భాగం చేయదల్చుకున్నారా ? మీకు సాయిబాబా కోసం జరిగే పోరాటం లో మీ ఇగోలను పక్కన పెట్టి , మీరు కలిసి వచ్చిన ప్రతి ఒక్కరితో సంఘటన చేసుకుని రాజీ లేకుండా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? అయితే ఫేస్ బుక్కులో వచ్చిన కామెంట్ కు ఎందుకింత ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నారు ?

(2) మీరు ఇచ్చిన ఈ ప్రకటన సాయిబాబ కోసం జరుగుతున్న పోరాటం వేపు ప్రజల్ను మొబిలైజ్ చేసే విధంగా ఉందనుకుంటున్నారా ?

(3) సాయిబాబ కోసం జరుగుతున్న న్యాయ పోరాటం గురించి ఇంతవరకు మీరు ఎందుకు ప్రజలకు చెప్పలేదు ? చెప్పదల్చుకోలేదు ? ఇప్పుడు సందర్భం ఎలా వచ్చింది ?

(4) నేను ఆంధ్ర జ్యోతి లో నర్మదక్క ఎవరో తెలీకుండా ఆ కోర్టులు తీర్పు పూర్తి చేసారు అన్న లీగల్ పాయింట్ మాట్లాడితే , మొత్తం వాక్యాన్ని మార్చి ఎందుకు ప్రచురించారు ?

(5) మీ సంస్థలో ఉన్న నెట్వర్క్, విశ్వాసపాత్రత, reciprocity , విశ్వాసం చూరగొనే నియమాలు, నిర్మాణం, నిర్మాణ స్థాయిలో సభ్యుల సాంఘిక స్థాయి, బాహ్య ప్రపంచం తో సంబంధాలు, సంస్థాపరంగా సభ్యుల అస్తిత్వాలు, సభ్యుల మధ్య సాంఘిక సంబంధాలు, సంఘ ప్రామణికాలు, తదితర సోషల్ కేపిటల్ కు సంబంధించిన విషయాలు ఇంఫార్మల్ గ అయినా సరే అధ్యయనం చేసిన సందర్భం గాని, వ్యక్తులు గాని ఉన్నారా ? మీలో అందరికీ యూనిఫాం గా సోషల్ కేపిటల్ ఉన్నట్టు ప్రకటించారు. అది ఏ ప్రాతిపదిక మీదనో తెలియజేయగలరా ? అంత పర్ఫెక్ట్ సంస్థగా మీరు మలుచుకోగలిగితే దాని రహస్యం మీరు అర్థం చేసుకున్నారా ?
(6) మీరు సాయిబాబ కోసం జరుగుతున్న పోరాటం లో – ఎవరినెవరు కలుపుకోదల్చుకున్నారు ? మీ ఆచరణ విధానాలతో ఖచ్చితంగా ఏకీభావం కలిగే ఉండాలా ?

(7) మీరు ‘ కల్పన కన్నాబిరాన్ ‘ చెప్పినట్టుగా – అని ఉద్దేశ్యించి రాయడం ఎందుకు అవసరం అని భావిస్తున్నారు ? సాయిబాబకున్న ఆరోగ్య అంగ వైకల్య్మ దృష్ట్యా సాధారణ ప్రజానీకం ఎలాగూ మొబిలైజ్ అవుతున్నప్పుడు , ప్రత్యేకించి కల్పనా కన్నబిరాన్ కు మాత్రమే ఆ అర్గ్యుమెంట్ క్రెడిట్ ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు ?

(8) మీ ప్రకటన లో మీరు చివరగా సూచించిన ‘ మన ‘ లో ‘ విక్టర్ విజయ్ కుమార్ ‘ ( లాంటి ) వాళ్ళు ఎందుకు ఉండ కూడదు /

-విక్టర్ విజయ్ కుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , Permalink

One Response to సాయిబాబా – వాస్తవాలవ్వాలనుకుంటున్న అవాస్తవాలు-వ్యాసం -విక్టర్ విజయ్ కుమార్

  1. Wilson Sudhakar Thullimalli says:

    విక్టర్ విజయకుమార్ బాగా చదువుకున్నవాడు. ఉన్నత విద్యావంతుడు. సబ్జెక్ట్ క్షుణ్ణంగా తెలెస్తేనే మాట్లాడగలుగుతాడు. నాకు తెలిసి ఇప్ప్ట్లో అతనికి సామాధానం ఇవ్వగలవారు దరిదాపుల్లో లేరు.విక్టర్ సాయిబాబ పరిస్థితిని వివరిస్తూ విప్లవ సంఘాలు ఎలా నిద్రిస్తున్నాయో తెలియజేసింతర్వాతే జనంలో కదలిక మొదలయ్యింది. ఇందుకు ఉదాహరణ మన ఇండస్ మార్టిన్ పిలుపు. శాల్యూట్ టు విక్టర్ విజయ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)