అవును మాటలే(కవిత ) – డా.విజయ్ కోగంటి

~
రంగురంగుల
ఆకులూ పళ్ళూ
కొండలూ లోయలూ
వాగులూ వంకలూ
ఉరుములూ మెరుపులూ
వడగళ్ళూ వర్షాలూ
జలపాతాలూ నదులూ
వెన్నెల్లూ తేనెపట్లూ
అన్నీ మన మాటలే

ఇవీ చూస్తాయి
వింటాయి
స్పృశించి రుచులనీ చెప్తాయి
కొన్నైతే ఆశ్చర్యంగా లోపలి వాసనలూ
పసిగట్టేస్తాయి

మరువాలూ దవనాలూ కొన్నైతే
మొగిలిరేకులు కొన్ని
కొంచెం వింతవాసనతో నవ్వే
బంతిపూలూ
కొంచెం ముల్లులా గుచ్చుకున్నా
మరిచిపోలేని విరిసే రోజాలూ కూడా
ఈ మన మాటలే

ఎన్నున్నా సరే
కొందరికి
రాయీ రప్పల్లా వుండేవీ
కొరికినమిలేవి
పీక్కుతినేవి
కాల్చుకుతినేవి
నెత్తుటి గాయాలు చేసేవీ
మాత్రమే ఇష్టం

ఎంతైనా అరుపులతో వేటతో
అనాగరికంగా
బతుకు మొదలెట్టిన వాళ్ళం గదా

మాటలేని
అమానుషమైన జంతువులే
నయమనిపిస్తూ
మనమూ మన మాటలూ

                                                     – డా.విజయ్ కోగంటి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

One Response to అవును మాటలే(కవిత ) – డా.విజయ్ కోగంటి

 1. దడాల వెంకటేశ్వర రావు says:

  నందన వనముగ
  ఈ లోకమునే సృష్టించిన
  ఓ వనమాలీ
  మరచితివో మానవజాతిని దయమాలీ

  భలే భలే అందాలు సృష్టించావు
  ఇలా మురిపించావు అదే ఆనందం
  అదే అనుబంధం
  ప్రభూ మాకేల ఈయవు?

  మాటలు రాని మృగాలు సైతం
  మంచిగ కలసి జీవించేను
  మాటలు నేర్చిన మా నరజాతి
  మారణహోమం సాగించేను
  మనిషే పెరిగీ మనసే తరిగీ
  మమతే మరచాడు మానవుడు
  నీవేల మార్చవు?

  చల్లగా సాగే సెలయేటివోలే
  మనసే నిర్మలమై వికసించాలి
  గుంపుగ ఎగిరే గువ్వలవోలే
  అందరు ఒక్కటై నివసించాలి
  స్వార్థం మానుకొని సమతే పెంచుకొని
  మంచిగ మానవుడే మాధవుడై
  మహిలోన నిలవాలి..

  –వీటూరి,ఘంటసాల,ఆదినారాయణరావు,భక్తతుకారాం 1973 (మీ కవిత ఈ పాటనిక్కడుండేటట్లు చేసింది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)