తెనుగామృతం(కవిత )- అఖిలాశ

కోటి శరత్చంద్రికల కాంతులలో

వెన్నెల పోగులుగా వర్షించుతుండగా

ద్రావిడ భాషను మధించగా

కస్తూరి పరిమళములు వెదజల్లుతూ

పుష్పించినదే నా తెలుగు తల్లి..!!

సరళ సుకుమారము

అయిన నా తెలుగువాణి

నుడికారపు సొంపులతో

పదాల వంపులతో

సాహితీ  రసికతతో

కిరణాక్షారాల ముత్యాలై

వెలుగులను నింపుకున్నది..!!

పాటైన పద్యమైన

గేయమైన కీర్తనమైన

నా తెలుగు భాష

సరిగమలతో సంగమించి

సంగీతానికి తానొక

కవచకుండలమని ప్రకటించుకున్నది

నా తెలుగు తల్లి నది ప్రవాహమై

వ్యావహారిక..,మాండలిక.., అన్యదేశ

పదాలను కలుపుకుంటూ..!!

ప్రపంచ లిపులను శాషించి

ద్వితీయ స్థానంలో నిలిచి

తెలుగు పతాకాన్ని రెపరెపలాడించుతున్నది..!!

అష్టా, శతా, సహస్రా అవదానలతో

సమస్యాపూర్ణలతో వెలుగొందుతున్న

నా తెలుగు తల్లికి అచ్చులు హల్లులే

మరకత మాణిఖ్యాలు పొదిగిన కిరిటమైతే

ఘన యతి ప్రాసలే సింహాసనమైతే

బ్రహ్మ లిపిని వీరతిలకంగా ధరించి

విశ్వభాషగా సింహాసనం అధిరోహిస్తున్నది..!!

– అఖిలాశ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

2 Responses to తెనుగామృతం(కవిత )- అఖిలాశ

 1. dvraoji says:

  ఆశ కు అంతుండాలి
  వ్రాత కు హద్దుండాలి
  ‘అఖిలాశ ‘పడి
  తడబడితే
  విహంగలో
  చోటుండదు

  దడాల వెంకటేశ్వరరావు

 2. ఆనంద్ తెన్నేటి says:

  ఈ కవిత చాలా దరిద్రంగా వుంది.. కృతకంగా వుంది.. ఇలాంటి కవిత్వం తెలుగు సాహిత్య గౌరవాన్ని దిగజారుస్తుంది… ఎడిటర్ గారూ కొంచెం పట్టించుకోని ప్రకటించండి… ప్రతి చెత్త ప్రచురిస్తే విహంగ విలువ తగ్గుతుంది.. నేను కొన్నాళ్లుగా విహంగ పరిక చదువుతున్నాను.. ఆ చనువుతో తెలుగు సాహిత్యం పట్ల అభిమానంతో చెబుతున్నాను