వెలితి (కవిత ) – దేవనపల్లి వీణావాణి

ఒద్దికగా పెంచి
పూతకొచ్చిన చెట్టుని
తోటమాలి దానం చేస్తాడు
వేడుకగా…

ఇక
ఏక్కాల్సిన గడపలు
మారాక
లెక్కల పుస్తకాలు వెలుస్తాయి
ఇక్కడా..అక్కడా..

ప్రవాహాలు మెళ్లిగా
సీజనల్ చెలిమలవుతున్నయి
అద్దీ అద్దని తడి
ఆల్బంకి పరిమితమవుతుంది

వాళ్లకి నీడ లేని
దీపశిఖం కావాలి
ఏదిఏమైనా…లేదంటే
నోళ్ళు ,నొసళ్ళు
ఒర్రె వంకర్లు ..

ఊయల కట్టామా
వంశానికి ఊడలమఱ్రివి
వెనక్కి చూద్దామన్నా
మెడ తిరగదు….

కన్నపేగు కూడా
వృత్తం దాటి రాదు…
మరో వృత్తానికి తోసి..
ఒక పుట్టుక
రెండు జన్మలు…

కనురెప్పల భాషకు
అలవాటు పడుతున్న
వేళ…
రాత్రి వారు నా జడలో
తురిమిన మల్లె దండ
నా చెవిలో ఓదార్పుగా
మెల్లిగా చెప్తుంది…

“నువ్వు నీదనుకున్న
పుట్టింటి జీవనది
ఏనాటికైనా ఇంకిపోతుంది…

నువ్వింకా
నమ్మని అత్తింటి ఆకాశం
నీకోసం కనీసం కన్నీళ్లనైనా
జల్లుతుంది….”

-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

5 Responses to వెలితి (కవిత ) – దేవనపల్లి వీణావాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో