సందుగ(కవిత )-దేవనపల్లి వీణా వాణి

తల్వాల నాడు పెట్టుకున్న
పెద్ద ముక్కు పోగు
మోటుగు న్నాయంటే తీసిన
సొక్కం కడియాలు…..!

రేగు ముల్లుకు చిక్కి
అంచు లేచిన చీరె
చుట్ట చుట్టి పెట్టిన
పూసవేర్ల సవరం…!!

బట్ట పేగుల కట్టిన
పాత నోటు
తొల్సూరు కాన్పుకు
మోలీసాబు ఇచ్చిన మొళ్తాడు తాయెత్తు…!!

రేకు పెట్టె లో
చిక్కబడ్డ సంస్కృతి
ఇరుకు పడక గదిలో
ఇమడ లేక చిన్నబోయింది…!!

ఒక జ్ఞాపకమై నానమ్మ
సందుగ
ఒక తరాన్ని తన తోటి
చితి మీదకి మోసుకెళ్ళింది….!!!

– దేవనపల్లి వీణా వాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to సందుగ(కవిత )-దేవనపల్లి వీణా వాణి

  1. దడాల వెంకటేశ్వరరావు says:

    ఒక తరాన్ని తనజ్ఞాపకాలతో తీసుకుపోయే సందుగ ప’సందుగ’ ఉంది

  2. D.Venkateswara Rao says:

    అయ్యా
    kaakinad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)