హత్య! (కథ) – గీతాంజలి

అక్కా నాకేదో అనుమానంగా ఉంది మంజీర గర్భవతి అని అడిగితే కాదని చెబుతున్నది నువ్వొకసారి గట్టిగా  కనుక్కో… కమల చెబుతుంటే శ్యామల దాన్ని కొట్టి  పడేసింది. అసొిందేమీ లేదు. అది ముందే లావు… ఈ మధ్య ఇంకా లావయ్యి పొట్ట అట్ల కన్పిస్తున్నది. అయినా కన్న తల్లిని నాకు చెప్పకుండెట్లుంటది అన్నది శ్యామల. అలా అన్నదే కానీ మనసులో ఏదో ఆందోళన మొదలయ్యింది. సంవత్సరం తర్వాత వచ్చింది మంజీర తన దగ్గరికి ఈ మధ్య ప్ రాకపోకలు తగ్గించేసింది. ఫోన్‌ కూడా దాదాపు మానేసింది చేయడం. తను చేస్తే మోగుతుంది కానీ ఎత్తదు లేదా స్విచ్ఛాప్‌ వస్తుంది.

అత్తగారు కాలం చేస్తే వచ్చింది. వెంట అల్లుడు కూడా వచ్చారు. మనమరాలు తొమ్మిదేళ్ళ కీర్తనని తీస్కుని… రాత్రి వెళ్ళిపోతారట. ఉండమన్నా ఉండడం లేదు. ఇద్దరూ ఎందుకో మూడీగా ఉన్నారు. నానమ్మ పోయిన దిగులేమో అనుకుంది తను.

”మంజీ… నెల తప్పినవా ఏంది చెప్పు?” అనడిగింది తను.
మంజీర ఖంగారు పడింది. ఈ లోపల అల్లుడు నగేష్‌ అందుకుని ”లేదత్తయ్యా – పనా పా మా అమ్మ చేసి పెడ్తుంటే తిని కూసుంటుంది మరి లావెక్కక ఇంకేమవుతుంది చెప్పండి? మా బస్సు టైం అవుతుంది వెళ్ళొస్తాం అత్తయ్యా. మంజీ… కీర్తన బయల్దేరండి అని భార్యాపిల్లల్ని తీస్కెళ్లిపోయాడు. అయ్యో దినాలు పూర్తయ్యే దాకన్నా ఉండనీయకపోతివి నగేష్‌ అని శ్యామల అంటూనే ఉంది.

ఆ రాత్రి నిద్ర పట్టలేదు శ్యామలకు. కూతురు మంజీర రూపమే కళ్ళముందు కదలాడసాగింది. సరిగ్గా తొమ్మిదేళ్ళయ్యింది మంజీరకి పెళ్ళై. ఉమ్మడి కుటుంబంలోకి రెండో కోడలుగా వెళ్ళింది. అప్పికే మంజీర యారాలు సంగీతకి ఐదేళ్ళ, రెండేళ్ళ కొడుకులున్నారు. పెళ్ళైన రెండేళ్ళ దాకా మంజీర గర్భం దాల్చలేదు. అప్పికీ మంజీర పైన విపరీతమైన ఒత్తిడి పిల్లలు కలగటం లేదని తమతో పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళకీ స్నేహితుల్లో, బంధువుల్లో పిల్లలైనారనీ నగేష్‌లో ఆందోళన పెరిగింది. ”మంజీర అత్తగారు కూడా తనకు ఆరోగ్యం బాగోలేదనీ, నగేష్‌కి కూడా పిల్లలు పుడితే చూడాలని ఉందనీ అనసాగింది. ఇక అప్ప్నించే మంజీరకు గైనిక్‌ చెకప్స్‌ మొదలైనవి. మంజీర కొద్దిగా లావుగా ఉండడం వలన ఈ సమస్య వస్తున్నదనీ ఆమె వాకింగ్‌ యోగా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనీ అండం సరిగా విడుదల అవడానికి హార్మోన్ల చికిత్స మొదలెట్టింది . యోగా చేసి లావు తగ్గింది. ఆర్నెల్లకీ కీర్తన కడుపున పడ్డది. నగేష్‌ సంతోషించినా మగ పిల్లడైతే బాగుండేది అన్నకిద్దరున్నరు అని అసంతృప్తిని వ్యక్తపరిచాడు. అంతితో ఆగలేదు ఈ సారి మగపిల్లాణ్ణి కనాలన్నాడు అదేదో మంజీర చేతిలో ఉన్నట్లు. అయ్యింది సిసేరియన్‌ ఆపరేషన్‌ కాబట్టి  ఇంకో రెండు సంవత్సరాలు పిల్లల్ని కనకూడదని డాక్టరు నగేష్‌కి ఖచ్చితంగా చెప్పబట్టి  ఆగాడు కానీ లేకపోతే మళ్ళీ వెంటనే  మరోసారి బిడ్డను కనడానికి సిద్ధమయ్యేవాడే నగేష్‌.

చూస్తుండగానే రెండేళ్ళు గడిచిపోయినాయి. మగపిల్లాడు పుట్టానికేమైనా ప్రత్యేక ఆహారం, చికిత్సా పద్ధతులున్నవారు  ఉంటే చెప్పండి. డాక్టర్‌ ఈసారి ఎట్లైనా మగపిల్లవాడే కావాలి అన్న నగేష్‌ మాటలకి డాక్టర్‌ కోపంతో విరుచుకుపడ్డది.

అలాంటి  పద్ధతులేవీ లేవు… అయినా ఆడపిల్ల పుట్టానికి మగవాళ్ళలోని ఎక్స్‌ ఎక్స్‌ క్రోమోసోములే కారణం. కానీ ఆడది కాదు… ఎవరు పుట్టినా  స్వీకరించాల్సిందే అని కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపింది. ఈసారి కూడా మంజీరకి హార్మోన్‌ చికిత్స మొదలయ్యింది. ఈ మందులు వాడుతుంటే వాంతులై వికారంగా ఉంటుంది. కళ్ళు తిరుగుతుంటాయి  డాక్టర్‌ అని కళ్ళ నీళ్ళతో చెప్తున్న మంజీరవైపు డాక్టర్‌ నిస్సహాయంగా చూస్తూ ఈసారి ఎవరు పుట్టినా  కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకొందువు మంజీరా అని చెప్పింది. ఏం కాదు తియ్యు… కొడుకు కోసం గా మాత్రం కష్టం పడలేవా అని నగేష్‌ గద్దించినట్లే అన్నాడు. మంజీర మళ్ళీ గర్భం దాల్చింది. నగేష్‌ సంతోషం పట్టలేకపోయాడు.

డాక్టర్‌ చెకప్‌లో మంజీరకు బీ.పీ. మొదలైందని బయటపడింది. బీపి మందులు రెగ్యులర్‌గా వాడు, ఏమన్నా అనారోగ్యంగా కాళ్ళ వాపు, కళ్ళు తిరగడం – ఫిట్సు రావడం లాంటి  లక్షణాలుంటే వెంటనే రామ్మా అని చెప్పింది.
మూడో నెలలోనే బీపీ 200 దాకా పెరిగిపోయి అబార్షన్‌ అయిపోయింది. బిడ్డ చాలా నీరసపడిపోయింది. రక్తం చాలా పోయింది. నగేష్‌ చాలా నిరుత్సాహపడ్డాడు. సంవత్సరం వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలనీ గర్భం ఇప్పుడుప్పుడే వద్దని చెప్పింది డాక్టర్‌. నగేష్‌ వినలేదు. ఆర్నెల్లు తిరగకుండానే మళ్ళీ నెల తప్పింది మంజీర. ఈ సారి కూడా హై బీపి వచ్చింది. మందులు వాడుతూనే ఉంది. ఒళ్ళంతా వాచిపోయి బెలూన్‌లా ఉబ్బిపోయింది. కాళ్ళు ముఖం ఉబ్బిపోయాయి. జాగ్రత్త ఈసారన్నా గర్భం నిలుపుకో నాకో వారసుణ్ణి కనివు అని హెచ్చరిస్తూనే ఉన్నాడు నగేష్‌. ఇంటిలో  ఒక పని మనిషి లేదు. మంజీరే చెయ్యాలి వాకిలి ఊడ్వడం దగ్గర్నించి బాసాన్లు తోమడం వరకూ పన్లన్నీ మంజీరే చెయ్యాలి. ఎక్కడన్నా నగేష్‌ పనిమనిషిని పెట్టు చేస్కోలేకపోతున్నదంటే ఎందుకత్తయ్య ఏం పని ఉంటుందని? ఆ ఇంత పని లేకపోతే ఒంటికి ఎక్సర్‌సైజ్‌  మెల్లగా చేస్కుంటుందిలే… అని కొట్టి  పడేసేవాడు.

ఎప్పుడన్నా తను వెళ్ళి చేస్తేనే బిడ్డకు రెస్టు. ఈసారి గర్భం మంజీరకు ప్రాణాంతకమైంది. ఐదవ నెలలో బిడ్డ కదలికలు ఆగిపోయినాయి. మంజీరకు తెలియలేదు. ఆరో నెలలో డాక్టరు దగ్గరకు వెళితే బీపీ 230 పెరిగిపోయింది. స్కానింగ్‌లో పిండం చనిపోయి ఇరవై రోజులైపోయిందని తెల్సింది. వెంటనే అబార్షన్‌ చేసేసి గర్భసంచి శుభ్రం చేసేసారు. లోపలంతా పిండం కుళ్ళిపోయింది. చావు నుంచి తప్పించుకున్నది మంజీర.. ఇక ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చాలా ప్రమాదకరం మరోసారి గర్భం వస్తే బతకదు. ఇక గర్భం దాల్చకూడదు. అమ్మాయికన్నా కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చేయించండి లేదా నువ్వన్నా వేసెక్టమీ చేయించుకోవాలి అని డాక్టర్‌ నగేష్‌కి ఖచ్చితంగా చెప్పింది. చక్కగా ఒకమ్మాయి ఉంది. మంచిగా పెంచుకుంటే సరిపోతుంది కదా… ఖచ్చితంగా ఆమె నీకు వారసుణ్ణి కనిచ్చి తీరాలా ఆమె దేహం ఏమన్నా యంత్రమా లేక ఆమె ఏమన్నా ప్రయోగశాలలోని జంతువా అని సీరియస్‌ అయ్యింది కూడా… ఈ ఐదేళ్ళలలో ఒక కాన్పు సిజేరియన్‌, హైబీపీతో రెండు అబార్షన్లతో మంజీర దేహం పచ్చి పుండైపోయింది. గర్భం అంటేనే భయపడి పోతున్నది. నావల్ల కాదిక అని చివరి అబార్షన్‌ అయినపుడు వెక్కి వెక్కి ఏడ్చింది బిడ్డ. ఇంటిలో  అందరూ సమావేశమై నగేష్‌కి ఇంక మంజీరతో వారసుణ్ణి కనే తతంగం ఆపించాలని ఖచ్చితంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు.

”మీరెవ్వరు చెప్పినా వాళ్ళు వినరు. అమ్మా నువ్వు అమనకు అంతా వాళ్ళిష్టం” అంది భయంగా మంజీర.
ఊర్కొంటే నీ ప్రాణాలకు ప్రమాదం కదా మందీ అంది తను.

”ఏమోనే ఏమనకుండ్రి వాళ్ళిష్టం” అంది మంజీర ఏడుస్తూ.

”పద నేను చేయిస్తా నీకు ట్యూబెక్టమీ వాళ్ళకు చెప్పకుంటే అయిపోతది” అంది కోపంగా లోపల భర్త సంతకం, అనుమతి తప్పని సరి అని తెల్సినా.

”అమ్మో ఇంకేమన్న ఉన్నదా అమ్మా ఒద్దు” అన్నది మంజీర భయంతోి.

మంజీర కొంచెం కోలుకున్నాక తను ఊరికి బయలుదేరి వచ్చేసింది. తర్వాత మంజీరని ఎన్నిసార్లు ఇంటికి పిల్చినా రాలేదు. ఏ సమాచారం లేదు. ఫోన్‌ చేసినా రింగవుతుంది కానీ ఎత్తరు లేదా అవుాఫ్‌ రీచ్‌ అనే వస్తుంది. అల్లుడికి చెస్తే ఏమో అత్తయ్యా బాత్రూంలో ఉందేమో, బయటకెళ్ళిందేమో మంజీర ఫోన్‌ సరిగా పని చెయ్యటం లేదని చెప్పేవాడు. తన ఇద్దరి కొడుకులు వాట్సప్‌లో పెట్టిన  మెసేజ్‌లకి బాగున్నా, అవును, లేదు, ఓకె లాంటి  ముక్తసరి ఎప్పుడన్నా నగేష్‌ దగ్గరుండి తన ఫోన్‌లో మాట్లాడించేవాడు అవును, కాదు లాంటి  ముక్తసరి సమాధానాలు చెప్పేది. ఏదో దాస్తుందని అనిపించేది. ”వాట్సప్‌లో అన్నలిద్దర్కి కూడా ఒక్క మాటలో సమాధానాలు ఏమిటే మంజీరా” అంటే ”గవి నేను పెడ్తలేనే మా ఆయనే పెడున్నడు నా ఫోన్‌ నా చేతిల ఉండది” అన్నది నిర్వేదంగా. పిల్లను తీస్కుని రామ్మా అంటే ”వీలు కాదే పని చాలా ఉండది మా అత్తకు బాగుండది” అనేది. మెల్లగా ఆ ఇంత మాట్లాడాడు బంధు పెట్టింది . నగేష్‌ బాగుంది, బాగలేదు సమాధానం చెప్పేవాడు. దాదాపు సంవత్సరం తర్వాత నానమ్మ చనిపోతే వచ్చింది. మనిషి భారంగా ఉంది కానీ ఎప్ప్లాగే పిల్ల బొద్దుగా ఉంటది కదా పైగా డ్రెస్సు వేస్తుంది. ఏమీ తెల్వలేదు. అప్ప్కి పెద్దమ్మ కూతురు కమల అననే అన్నది ” అదేదో దాస్తున్నది నువ్వు కనుక్కో”మని గుచ్చి గుచ్చి అడిగినా ఏం చెప్పలేదు. ఎంత సేపు నగేష్‌ కాపలా ఉండేవాడు. ఎక్కడా ఒంటరిగా దొరకనిచ్చేవాడు కాదు. మంజీర కూడా దొరికేద కాదు భయం భయంగా తిరిగింది ఈ మూడు రోజులు ఎప్పుడు పడుకునే ఉండేది.

”ఇంకా ఆగలేక అల్లుడ్నే అడిగింది ఏమయ్యా పిల్ల గర్భవతా” అని దానికి నగేష్‌ చెప్పిన సమాధానం తిని లావయ్యిందని.

మంజీర ఒక రోజు గబగబ ఎవ్వరూ చూడట్లేదనుకుని పర్సులోంచి ఏదో గోలీ మింగింది గూడ.
”ఏందమ్మా ఏందా గోళీ” అని అడిగితే నగేష్‌ పరుగున వచ్చి ”ఏం లేదత్తయ్యా పిల్లలు కాకుండా రోజూ గోలీ వేస్కుంటుంది” అన్నాడు ఖంగారుగా.

”అదేంది నగేష్‌ ఆ మందులతోని మంజీరకు పెయ్యి తిర్గుతుంది కదా ఎన్నేండ్లు వాడిపిస్తవు డాక్టరమ్మ చెప్పినట్లు దానికి పిల్లలు కాకుండా ఆపరేషను చేపియ్యు లేదా నువ్వున్న చేపించుకో” అన్నది కోపం.

”సరే అత్తయ్యా” అన్నాడు పక్క చూపులు చూస్తు. ”ఆఫీసులో అర్జంటు మీటింగ్  ఉందత్తయ్యా” అనుకుంటూ భార్యనీ పిల్లనీ హడావుడిగా తీస్కెళ్ళిపోయాడు. భర్త వెంట మూగ ఆవులా మౌనంగా వెళ్ళిపోయింది మంజీర. తల్లిని తలదిప్పి వెనక్కి చూస్తూ… బిడ్డ గ్నాపకాల్లోంచి బయికొచ్చే సరికి తెల్లగా తెల్లారింది. కోడి కూసింది.
రెన్నెల్లు గడ్సిపోయినాయి.

ఒక రోజు శ్యామల వాకట్లో  కూర్చుని జొన్నలు చెరుగుతుంది. ఆ దినం శెలవు కావటంతో పెద్ద కొడుకు హితేశ్‌ ఇంటిలోనే  ఉన్నాడు. హితేశ్‌ ఊరిలో పేరున్న పశువుల డాక్టర్‌. ఇంతట్ల పక్కింట్లున్న నర్సయ్య ఉరుక్కుంట వచ్చి ”డాక్టరు సాబు ఒకసారి జప్పున రాండ్రి మా లక్ష్మి నొప్పులు పడ్తున్నది రాత్రికెల్లి” అని ఆందోళనగా పిలిచాడు. వస్త పద అని హితేశ్‌ లేచి గ్లౌవ్స్‌ తీస్కుని బయలుదేరిండు. శ్యామల కూడా ఆశక్తిగా పక్కింకి బయలుదేరింది.

లక్ష్మి నర్సయ్య గేద కడుపుతో ఉన్నది నెలలు నిండినాయి బాధతో అరుస్తూ నొప్పులు పడ్తున్నది. హితేశ్‌ కుడి చెయ్యి లోపల్కి పోనిచ్చి” అరె….. కాల్లు కిందికున్నయ్‌… శానా సేపయ్యింది కదా నొప్పులొచ్చి ఏదో ఒక పానమే దక్కుతది చెప్పు చిన్న పానంకావాల పెద్ద పానమా” అని అడిగాడు.

నర్సయ్య ”అగో డాక్‌సాబ్‌ పశువైనా బిడ్డకంటే ఎక్కువ సాదినా. నాకు పెద్ద పానమే ముఖ్యం లక్ష్మిని బతికియ్యుండ్రి చిన్న పానం పోయినగని ఫర్వాలేదు” అన్నాడు గొంతు రుద్దమవుతుంటే.

”సరే మల్ల దవాఖానికి జల్ది దీస్కరాండ్రి నేను గూడ అచ్చేస్త” అన్నాడు. నర్సయ్య జప్పున లక్ష్మిని దవాఖానల చేర్చి పనిల పడ్డాడు. పదిహేను నిమిషాల్లో హితేశ్‌ గూడా దవాఖానకు చేరుకున్నాడు.

***                                 ***                           ***                                      ***

”ఏమయ్యిందిరా దుద్దెను చంపేశినవా” అంది శ్యామల ఇంటి కొచ్చిన కొడుకుతోి.
అవును… తల్లి పానం దక్కించాల్సిందే బిడ్డను చంపక తప్పలేదమ్మా అన్నాడు హితేశ్‌. ”అయ్యో పాపం” అన్నది శ్యామల.

ఇంతలో ఫోను మోగింది. చూస్తే మంజీర పేరున్నది. శ్యామల సంబరంగా ఫోనెత్తింది – ”మంజీ బాగున్నవా బిడ్డా” అనింది.

”అమ్మ… చాతనైతలేదే రావే అమ్మా” అంది మంజీర నీరసంగా.
శ్యామల ఆందోళనగా ”ఏమయింది మంజీరా” అన్నది..
అక్కడ్నించి నిశ్శబ్దం తప్ప ఏమీ ఎప్పుడు లేదు.

”మంజీరా చెప్పు బిడ్డా ఏమయ్యింది” శ్యామల మరింత ఆందోళనగా అర్చింది.
”అమ్మ కడుపుతో ఉన్ననే తొమ్మిదో నెలనే” అన్నది మంజీర.
శ్యామలకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ”ఏం మ్లాడుతున్నవు మంజీరా” అంది.

”వీళ్ళు వినలే అమ్మ… కొడుకు కావాల్నంట వీళ్ళకు. నాన్నమ్మ పోయినప్పుడు వచ్చిన కదా అప్పుడే నాకు ఆర్నెళ్లు అమ్మా” అంది మంజీర వెక్కిళ్ళు పడ్తూ….

”అయ్యో నువ్వు కనకూడదని చెప్పింది కదనే డాక్టరమ్మ” అంది శ్యామల.
”వీళ్ళు వింటరా అమ్మ… వీండ్లకు నా ప్రాణం కంటే వారసుడే ముఖ్యం” అంది మంజీర సన్నగా ఏడుస్తూనే…

”నన్ను ఏమీ చెప్పకుండ ఉండాలని బెదిరిచ్చిన్రు… ఫోన్‌ కూడా మ్లాడనీయలే. ఇంట్లకెల్లి బయటకు పోనియ్యలే” మంజీర చెప్తూ పోతున్నది.

   ****                                 ***                                  ***                                    ***

”ఆరో నెలల ఆయనకు తెల్సిన స్కానింగ్‌ సెంటర్ల రహస్యంగా స్కానింగ్‌ చేపించున్రు మగ పిల్లడని తెల్సింది. ఇగ అప్పడ్కెల్ల ఇంగింత రహస్యంగా ఉంచిన్రు ఈ విషయాన్ని ఎవరకు చెప్పద్దన్నరు’ అంది మంజీరా నీరసంగా.

”డాక్టర్‌ వద్దన్నదిగా నగేష్‌ మళ్ళీ ఏంటిది, వదినా మీకన్నా లక్ష్యం లేదా” శ్యామల కోపంగా అడిగింది అల్లుణ్ణి, వియ్యపురాలిని.

వియ్యపురాలు ”ఏ మేమొద్దన్నం ఒదినే ఇగో మీ బిడ్డనే మగపిల్లడు కావాలనుకున్నది. ఇంకా మేం మా చిన్న మనవడ్ని దత్కం తీస్కోమన్నం గూడ మేమేం చేస్తం” అన్నది.

”అవునత్తయ్య హైదర్‌గూడ ఛార్లెస్‌ హాస్పిటల్లో ఇలాంటి  కేసులు పదో కాన్పయిన గని తల్లి బిడ్డల్ని ఇద్దర్ని బత్కిస్తం అన్నంకనే కింటిన్యూ చేసినం” అన్నాడు తలదించుకును…

”మరి మన పాత రేఖ డాక్టరు లేదా” అన్నది శామల.
ఆమె అమెరికా పోయిందన్నాడు నగేష్‌…

ఆ రాత్రి ”అమ్మా నేనేం కాంననలేదే ఒద్దనే అన్న శాత కాదు ఇడ్సిపెట్టుండ్రి అన్న ఇనలేదే వీళ్ళు అన్ని అవద్దాలాడ్తున్నరు” అన్నది మంజీర తల్లి చెవుల్లో గుసగుసగా… ఆ చీకిలో కిటికీ లోంచి వెన్నెల గదిలోకొచ్చి మంజీర కళ్ళల్లోంచి ఏదో — రహస్యాన్ని మసక మసకగా చెప్పినట్లై గుండె ఝల్లుమంది శ్యామలకు. ఎప్ప్లాగే మళ్ళీ బీపీ వచ్చింది మంజీరకు… చాలా ఆయాసపడ్తుంది కూచోలేక, నిల్చోలేక అవస్త పడుతున్నది మధ్య మధ్యల ”అమ్మ భయమెత్తున్నదే ఈసారి బత్కుతనో లేదో అంటుంటే శ్యామలకు దుఃఖం ఆగటం లేదు.

నీకేమన్నా బుద్దుందా బావా ప్రెగ్నెన్సీ డేంజర్‌ అని చెప్పినంక గూడ ఇట్లెందుకు చేసావ్‌. నా చెల్లి ప్రాణాలకు ప్రమాదం అని తెల్సీ హితేష్‌ ఫోన్లో అరుస్తుంటే పట్టనట్టు ”ఆ బావా షి ఈస్‌ ఫైన్‌” అన్నాడు నగేష్‌.

నాలుగు లక్షలు తోటల్‌ పేకేజ్‌…. పిల్లాడు చాలా తక్కువ బరువున్నాడు 700 గ్రాములు మాత్రమే. ఉమ్మ నీరు తక్కువగా ఉంది. తల్లికి హై బీపీ ఉంది. ఒక నెల ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచాలి. అవసరమైతే ఛార్లెస్‌ హాస్పిటల్‌ బిడ్డను టర్మిన్‌ చేసి తల్లిని రక్షిస్తాం”… ఛార్లెస్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నది.

”వెరీ బేడ్‌ ఆబ్‌స్టిిక్‌ హిస్టరీ…. ఈమె అసలు చాలా రిస్కులో ఉంది” డాక్టరు చెబుతూ  నగేష్‌ని సంతకం పెట్టమంది.

”ఆలోచించుకుని వస్తాం” అని చెప్పి నగేష్‌ భార్యను తీస్కుని బయటకు వచ్చాడు.

”బిడ్డను చంపుతారట, మళ్ళా నాలుగు లక్షలంట” మోపెడ్‌ను విసురుగా స్టార్ట్‌ చేస్తూ ”ఎక్కు” అని గద్దించాడు మంజీరని.

మంజీర మూగ జీవిలాగా మోపెడ్‌ ఎక్కి కూసుంది.

”నేనిస్త గద నగేష్‌ పైసలు ఎట్లనో గట్ల మిగిలిన డబ్బులు సర్దుదాం”… శ్యామల అన్నది ”ఏం లాభం అత్తయ్యా బిడ్డను చంపాల్సి వస్తే చంపుతారంటు” నగేష్‌ కోపంగా అంటున్నాడు.

”వాళ్ళకు తెల్సు ఏం చెయ్యాలో చెయ్యద్దో పెద్ద డాక్టర్లు వాళ్ళు వాళ్ళని వాండ్ల పని చెయ్యనియ్యు” అన్నది శ్యామల.
నగేష్‌ మౌనంగా ఉండిపోయాడు.

”బిడ్డకు హై బీపీ ఉన్నది. ముందు 2 అబార్షన్లలో బత్కిందని తేలిగ్గా తీస్కోకు నగేష్‌” శ్యామల గొంతు దుఃఖంతో వణుకుతున్నది.

మంజీర నీరసంగా మంచంపైన ముడుచుకు పండుకుంది. తన గర్భంలో వేళ్ళూనుకున్న ఆ మగ శిశువు తన రక్తాన్నంతా వీల్చేస్తూ తనను శక్తి హీనురాలిగా మార్చేస్తున్నట్లు అన్పించింది మంజీరకు.

” వెరీ బాడ్‌ అబ్‌స్ట్రిక్ట్‌ హిస్టరీ అమ్మా – మంజీర గత గర్భాలకి సంబంధించిన వైద్య సమాచారం అస్సలు బాగోలేదు. అసలీమే ఇంత హై బీపితో ఎలా గర్భాల్ని మోసింది అర్థం కావట్లేదు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది మంజీర. నా మీద ఇంత ఆశతో వచ్చారు కాబ్టి తీస్కుంటున్నా… నాకూ భయంగానే ఉంది” నలభై ఏళ్ళ ప్రాక్టీసున్న సులోచన డాక్టర్‌ అంటుంటే శ్యామల గుండెలు గుభిల్లుమన్నాయి.

”మీరే ఎట్లైన చేసి తల్లి బిడ్డల్ని బత్కయ్యున్రి డాక్టర్‌” శ్యామల ఏడుస్తూ డాక్టర్‌ చేతులు పట్కుంది. ఉమ్మనీరు పెరిగే దాకా మంజీరకు గ్లూకోసులు ఎక్కించారు. లోపల బిడ్డ కూడా కొద్దిగా పెరిగింది. స్కానింగ్‌ తీసి వెంటనే సిసేరియన్‌ చెయ్యాలన్నారు.

***                                ***                                ***                                  ***
ఎనిమిదొందల కిలో గ్రాముల బరువున్న బాబుని పిల్లల హాస్పిటల్‌కు పంపించారు. నగేష్‌కి – మంజీర అత్తిం వాళ్ళ ఆనందానికి హద్దుల్లేవు. ”హమ్మయ్య వారసుడు పుట్టాడు ” అన్నది నగేష్‌ మేనత్త.

”మా పరువు నిలబ్టెట్టె  కొడుకుని కని” అన్నాడు నగేష్‌ పెదనాన్న.

మంజీర.. నిశ్చింతంగా మంచం మీద తెల్ల పావురంలాగా కూచుంది. ముఖమంతా ఒక ప్రశాంతతత… తేటదనం… అమ్మ ఆడపిల్ల పుడితే బాగుణ్ణే వీళ్ల తిక్క కుదిరేది” అంది.

”పుట్టేసిండు… నిన్ను రక్షించిండు లేకపోతే నిన్ను మల్ల కనమందురే వీండ్లు” అన్నది శ్యామల దీర్ఘమైన శ్వాస తీస్కుంటూ.

వారం రోజుల తర్వాత మంజీర డిశ్చార్జి అయ్యింది. బీపీ నార్మల్‌ కొచ్చింది. డాక్టరుతో పాటు అంతా హమ్మయ్య అనుకున్నారు. అయినా ”జాగ్రత్తగా ఉండాలే” అని చెప్పి మరీ డిశ్చార్జి చేసింది డాక్టరు.

మంజీర ఆ నట్ట నడి ఎండలో… వేసవి కాలం కాలుస్తుంటే మోపెడ్‌ మీద పిల్లల హాస్ప్‌ట లకు పోయి కొడుకుకి పాలతో పాటు తన గుండెల్లోని వెచ్చదనాన్ని గుండెల మీద పడుకొబెట్టుకొని ఇచ్చి వచ్చేది.

శ్యామల ఇరవై మెట్లు దిగీ ఎక్కుతున్న పచ్చి బాలింతైన తన కూతుర్ని చూస్తూ బాధ పడేది. ”కాబ్‌లో తీసుకుపో నగేష్‌” అంటే ”అదే అత్తయ్యా బుక్‌ చేసా” అని చెప్పి కిందికెళ్ళి మోపెడ్‌ మీద తీస్కెళ్ళేవాడు నగేష్‌. కాబ్‌కు డబ్బులౌతాయని.

***                                                 ****                                 ****                                  ***

డెలివరీ అయ్యి సరిగ్గా పదిహేనురోజులు మంజీర రోజూ హాస్పిల్‌కి వెళ్ళి కొడుకుని పాలిచ్చి తన వొళ్ళో కొద్దిసేపు పడుకొబెట్టుకొని తిరిగి వచ్చేది. అసలు మనిషా లేదా చిన్న కోతిపిల్లా అన్నట్లున్న కొడుకును చూసి భయపడిపోయింది మంజీరా.

ఆ రోజు ఉదయం కొడుకు దగ్గర్కి వెళ్దామని స్నానానికి బయలు దేరిన మంజీర బాత్‌రూంలో కళ్ళు తిరుగుతున్నాయని ఖంగారు నైీటీ  వేస్కుని బయటకొచ్చేసింది.

వీపు మధ్య భాగంలో నొప్పొస్తున్నదే అమ్మ అని శ్యామలతో అన్నది. మంచంపై కూర్చోపెట్టుకొని వీపు రుద్దుతూ బీపీ గోలీ వేస్కున్నావా మంజీ… అని ఆందోళనగా అడిగింది శ్యామల. వేస్కున్న అమ్మా అన్నది మంజీర. అంబులెన్స్‌ మాట్లాడు బాబు అని నగేష్‌ని అడిగింది శ్యామల. అప్పట్కి   నొప్పితో ఇంక ఇరవై నిముషాలు బాధపడ్తున్నది మంజీర తాత్సారం చేస్తున్న అల్లుడు పిసినారితనం తెలిసి శ్యామల తన చెల్లెలికి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ బుక్‌ చేయించింది. మంజీరకి గుండెనొప్పి వచ్చిందని అర్థం అయ్యింది శ్యామలకి.

ఈలోపల మంజీర ఒక్కసారి లేచి కూలబడిపోయి గిల గిల కొట్టుకుని కళ్ళు తేలేసింది. శ్యామల పిచ్చేక్కిన దానిలా మంజీర శ్వాస కోసం ముక్కు దగ్గర వేళ్ళు పెడ్తూ ”మంజీ… మంజీ కళ్ళు తెరువు” అని మంజీరని కుదప సాగింది. కానీ అప్పటికే మంజీర ప్రాణాలు పోయాయి.. ”మంజీ – నాక్కొంచెం టైమ్‌ ఇవ్వవే మంచి డాక్టర్‌ దగ్గర్కి తీస్కెళతా అంటూ నగేష్‌ మంజీర తలను ఒళ్ళో పెట్టుకొని కుదపసాగాడు. కానీ మంజీరకే ఈ భూమ్మీద ఉండే సమయం దాటి పోయింది. మంజీర నగేష్‌కి వారసుణ్ణిచ్చి సెప్టిక్‌ అబార్షన్లతో – సిసేరియన్లతో బీపీలతో పచ్చి పుండైన తన దేహాన్ని నగేష్‌కి వదిలి వెళ్ళిపోయింది. చనిపోయాక వారసత్వంగా తనను కాల్చే హక్కు కూడా భర్త నగేష్‌కి వదిలిపోయింది. శ్యామల దుఃఖావేశంతో కూలబడిపోయింది.

            ****                          ***                            ****                               ****

”ఒద్దు పోస్ట్‌ మార్టమ్‌ వద్దు నా బిడ్డని కోయద్దు” అని అరిచింది శ్యామల. అప్పటికే గంటయ్యింది మంజీర చనిపోయి కారణం తెలీదు కాబట్టి  అనుమానాస్పద మృతి కింద పోస్ట్‌మార్టమ్‌ చేయాల్సి ఉంటుంది అన్న డాక్టర్‌తో ”ఒద్దు మా కళ్ళెదుటే చనిపోయింది. నా బిడ్డను కోయకండి బతికున్నని రోజులు నరకం అనుభవించింది చావు తర్వాతైనే ప్రశాంతంగా ఉండనివ్వండి” అని దుఃఖించింది శ్యామల. మంజీర మృతదేహాన్ని కొరివితో కాలుస్తున్న నగేష్‌ ముఖంలో నెత్తుటి  చుక్కలేదు.

బిడ్డ తగలబడిపోతుంటే భరించలేని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ”నువ్వే చంపినవ్‌ నా బిడ్డని రాక్షసుడా” అని నగేష్‌ని శాపనార్థాలు పెడ్తున్నది… శ్యామల.

      ***                               ***                              ***                             ***

”అమ్మా…” అని భోరున ఏడ్చాడు హితేశ్‌ పెద్ద పానం ముఖ్యం అని తను సాదిన తల్లి గేదె లక్ష్మిని బతికించుకున్న నర్సయ్యలెంతో మంది కళ్ళ ముందు కదలాడుతుంటే…

”పోస్ట్‌మార్టం చేయించాల్సిందమ్మా… చెల్లి చావుకి కారణం తెల్సేది కదా…” అంటున్నాడు. ”వాడు నా చెల్లిని హత్య చేసిండే అమ్మా. వాణ్ణి వదల లాయర్‌తో మాట్లాడ్తా” అంటున్నాడు దుఃఖంతో కదిలిపోతూ…

    ****                                      ****                                ****                               ***
ఇటు తల్లిలేని నగేష్‌ కొడుకుకి ఆస్పత్రిలో మరో పచ్చి బాలింత తన చనుపాలిచ్చి బతికిస్తున్నది.

– గీతాంజలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

5 Responses to హత్య! (కథ) – గీతాంజలి

 1. says:

  Vamshame konasagali ante Aanadhasaralayam nundi ..thechi kudA penchukovachunu pillalni ..Ela Pathi ye Pratheksha Daivam anukuna entho Manchi Yuvathullu Ela Bali avthundru…..Vamsham Kosam

 2. రఘునాధ్ says:

  కొడుకు పున్నామ నరకం తప్పించే పరికరం కదా… వారసత్వం ఒక్క ఆస్థికే కాదు… పాడుబడ్డ కులగోత్రాల వంశ చరిత్రలకు కూడా ఉంది. కట్టుకున్న ఆలి ప్రాణంకన్నా… జేబులోని చిల్లర పైసలపై ప్రేమను పెంచుకునే హీనులు… చెదపట్టిన వంశ గౌరవాలకు వేలాడే గబ్బిలాలు.

 3. Praveen says:

  Inka ituvanti hatyalu jarugutunnayi Yee samajamlo. Yetuvanti hatyaku andaru bhadyule. Hospitals kuda dabbulaku kakkurthy Padutunnaru manvatvam viluvalu marichi. Manchi Katha. Konni spelling mistakes correct Cheyyali

 4. xx says:

  ఈ జనరేషన్ లో కూడా, చదువుకున్న ఫామిలీస్ లో కూడా, కొడుకు క్రేజ్ ఎంత ఉంటుందంటే, చాలా ఆశ్చర్యం వేస్తుంది.

 5. Chandra Naga Srinivasa Rao Desu says:

  “వీండ్లకు నా ప్రాణం కంటే వారసుడే ముఖ్యం”
  కొన్ని కుటుంబాలలోని ఆవేదన ఎంత చక్కగా చెప్పారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)