ప్రకృతి విజృంభణ (కవిత)-కనక దుర్గ

 
 
                       -కనకదుర్గ-
 
 
స్వచ్చమైన నీరు, గాలి
కలుషితమై,
అటు పచ్చని వృక్ష సంపద,
ఇటు జంతు, జలసంపద
నశించి పోతుంటే,
సముద్రాలు కలుషితమై,
వేడి పెరిగిపోతూ,
ఆ వత్తిడి తట్టుకోలేక
ప్రకృతి విజృంభించింది
ప్రపంచంలో ఎన్నో చోట్ల
ఎప్పుడూ లేనంత భయంకరంగా
తుఫానులు,వరదలు,
కోరలు సాచి ఉధృతాతి
ఉధృతంగా
కనిపించిన ప్రతిదీ రౌద్రంగా
మింగేయాలని కొండచిలువలా
వస్తున్నతుఫాన్లు,
ఎంత ప్రగతిని సాధిస్తే ఏం లాభం,
చూడండి నా ప్రతాపం అంటూ,
కరతాళ నృత్యం చేస్తూ వాయు
దేవుడు వేగాతివేగంగా వీస్తూ,
వేళ్ళతో సహా వటవృక్షాలనే
పీకి వేస్తూ,
భారీ కట్టడాల మీదుగా పోతూ
చేయాల్సిన నష్టం చేసి,
ఒక వైపు దివి నుండి
నదులు ధారలు కట్టి భువిని
ముంచేయడానికి ప్రయత్నిస్తుంటే,
మరో ప్రక్క సముద్రపుటలలు
గగనానికెగురుతూ రోడ్లు, చెట్లు,
అనాధల్లా పడి వున్న వాహనాలని,
ఇళ్ళని మ్రింగేస్తూ సాగుతుంటే,
ఆకాశానికి చిల్లులు పడి
భారీగా కురిసే వర్షంలో
తన దారిలోకి వచ్చిన మానవులను,
పశు, పక్ష్యాదులను మృత్యువాత
పడేస్తూ బీభత్సం సృష్టిస్తూ,
భద్రతకోసం వెళ్ళిన చోటుకి
కూడా చెప్పాపెట్టకుండా
వెళ్ళి తన ప్రతాపాన్ని
చూపించింది!
 
అంతకు ముందే బాంబేలో
భారీ వర్షాలు,
బంగ్లాదేశ్లో, నేపాల్ లో వరదలు,
టెక్సాస్ లో హరికేన్ హార్వే
ఆకలిగొన్న రాక్షసుడిలా మీద
పడి ఉక్కిరి బిక్కిరి చేసింది,
పోర్టరికో, బర్బుడా, సెయింట్
మార్టిన్ లాంటి దీవులను
హరికేన్ అర్మా తాకినపుడు,
నీరు ఉరుకులు పరుగులతో,
గాలి హోరుమ్ంటూ,
సముద్రాలు, నదులు,
పద పదమంటూ,
ఒక్కటయి అన్నీ కల్సి
ఈ దీవులను ఒక్కసారిగా
మింగేయాలని
కంటికి ఏది కనిపించకుండా
భువి, దివి ఆగ్రహంతో
ఒక్కటయి అమాంతంగా
ముంచేయాలని కంకణం
కట్టుకుని వచ్చి పడ్డాయి,
కుదుట పడే అవకాశం
లేకుండానే హరికేన్
మరియా పోర్టరికోని మళ్ళీ
నిట్ట నిలువునా ముంచేసింది.
చిమ్మచీకట్లో, చుట్టూ నీరున్నా
దాహం తీరక,
ఆసుపత్రులు నీటిలో
మునిగితేలుతూ,
రోగాలతో అలమటిస్తున్న
పేషంట్ల ప్రాణాలు
 త్రిశంకు స్వర్గంలోలా
వేళ్ళాడుతున్నాయి,
 
కదం త్రొక్కుతూ, గంతులు
వేస్తూ,
కలకత్తా కాళీలా నాలుక
సాచి
గత శతాబ్దంలో ఎన్నడూ
రాని విధంగా,
భూకంపం వచ్చి
మెక్సికో, గౌటమాలాని
తుక్కు తుక్కు చేసేసింది,
దాన్నుండి కోలుకోకముందే
మళ్ళీ ఇంకోసారి భూకంపం
మెక్సికో సిటీని ముక్కలు,
ముక్కల్చేసింది,
ఇళ్ళు, బళ్ళు, ఆఫీసులు,
ఆసుపత్రులు కూలిపోయి,
దిక్కుతోచక రోడ్డుమీదున్నారు.
 
కాలిఫోర్నియాలో అగ్నిదేవుడు
అడవులను బుగ్గిపాలు చేసి ఆనంద
తాండవం చేస్తున్నాడు……
ప్రపంచం నలుమూలలా
ఈ ప్రకృతి వైపరిత్యాల వల్ల
ఎంతో నష్టం వాటిల్లుతున్నా,
ఈ ప్రకృతి
వైపరిత్యాలు సహజమే
అవే సర్దుకుంటాయి
భూమి వేడెక్కడం,
గ్లోబల్ వార్మింగ్
అంతా మిద్య అనుకుని,
పిల్లి కళ్ళు మూసుకుని పాలు
త్రాగుతున్నట్టు కళ్ళు
మూసుకుంటున్నారు.
 
కళ్ళు తెరవండహె…
ఇప్పటికైనా  తెరుచుకోకపోతే
బ్రహ్మప్రళయం తధ్యం!
ఇప్పటికే ప్రతి దాంట్లో
కాలుష్యం ప్రాకిపోయి ఎన్నో
నోరు తిరగని రోగాలతో ప్రాణాలు
గాలిలో కలిసిపోతున్నాయి,
లాభ నష్టాల పరుగుపందెంలో
ప్రకృతిపరంగా లభ్యమవ్వాల్సిన
ఆహారాన్ని,
కృత్రిమత్వంతో వ్యాపారం చేసి
లాభాల పై కూర్చుని,
మనుషుల్లో కుట్రలు,
కుతంత్రాలు,
మనసుల్లో కల్మషం,
హృదయాల్లో కాలుష్యాన్ని
ప్రక్ష్గాళనం చేసుకుని
ఈ ప్రకృతి వైపరిత్యాలను
ఒక హెచ్చరికలా తీసుకుని
కాలుష్య ప్రక్షాళనానికి
నాంది పలికి
ముందు తరాలకోసం
ఈ ప్రకృతి విజృంబణని
తగ్గించుకోవడానికి
నడుం కట్టాలి.
***************
UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)