ఒంటరితనం (కవిత)-కనకదుర్గ

Kanaka Durga

నిశిరాత్రిలో కమ్మేసిన
చీకటిలా,
పచ్చని చెట్టు పై
రెక్కలు విరిగిన
ఏకాకి పక్షిలా,
గుంపులుగా పరిగెడుతున్న
మబ్బుల వెనక వేగంగా
వెళ్ళలేని
ఒంటి మేఘంలా,
చుక్కలన్నీ దట్టమయిన
మేఘాల్లోకి దూరిపోతే
మబ్బుతెరలో బెంగగా
వున్న ఒంటరి
చందమామలా,
ఒంటరితనం మనసుని
ఆవరించేసి ఉక్కిరిబిక్కిరి
చేస్తుంటే,
గుండెలోని ఆవేదన
కన్నీటిరూపంలో
ఉబికివస్తుండగా,
దూరంగా ఎక్కడో…
బాల్యపు గూటిలో
తోటి పక్షిపిల్లలతో
ఆనందంగా కిచకిచల
చప్పుడుతో పాటు,
వర్షం చినుకులతో
చిన్నారి పక్షులు
తడవకుండా
జంటపక్షులు
ఆర్తిగా, ప్రేమగా
రెక్కల్లో పొదువుకున్న
చిత్రం గుర్తొచ్చి,
మనసులో ముళ్ళు
గుచ్చుకుంటున్నట్టుగా
గిల గిల లాడుతుంటే,
వెనక ఎవరో పిల్చినట్టుగా
అనిపించి
తిరిగి చూస్తే,
నా నీడే నన్ను నిలదీసి
’నువ్వెవరసలు,
నీ గమ్యం ఏమిటో
నీకైనా తెలుసా?’
అని వెక్కిరిస్తున్నట్టుగా
అనిపించింది.

టెక్నాలజీల
వుచ్చులో బిగుసుకుపోయి
ప్రపంచవ్యాప్తంగా
డబ్బు, డాబుల మధ్య
కొట్టుమిట్టాడుతూ,
అన్ని వైపులా బంధాలు,
అనుబంధాలన్నీ
ప్రశ్నార్ధకంగా
మారిపోతుంటే,
మనసుని అతలాకుతలం
చేస్తున్న
ఒంటరితనంతో
దిగాలుగా
నిల్చుండిపోయాను!

-కనకదుర్గ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to ఒంటరితనం (కవిత)-కనకదుర్గ

  1. M Srinivasu says:

    చాలా బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)