ఆ సముద్ర నిశబ్ద హోరులో
అలల తీగలపై అతడి జీవన పోరాటం..!!
కనుచూపు మేర ఆ నీటిలో
గమ్యం తెలియని అతడి ప్రయాణం
తీరానికి చేరుస్తుందా లేదా అన్నది
ఆ కాలమే నిర్ణయించాలి..!!
కానీ……
ఆ అల్లకల్లోలమైన సముద్ర ఒడిలో
కాలాన్ని మరచి తన కరములతో
మీనములుకై కడలి హృదయాన్ని
గాలంతో అన్వేషిస్తేనే తన కుటుంబ
కంజరములు గింజలతో నిండెను..!!
ఆ సోదరుడి బ్రతుకు నిత్య పోరాటమే
గెలిస్తే తీరం చేరుతాడు
ఓడితే ఆ అలల ఆకలికి
నైవేద్యం అవుతాడు..!!
ఓ నీటి మనిషీ రేవును చేరి నావను మరచేవంట.
నైస్ అండ్ simple