సెల్ఫీ ( స్వీయఛాయాచిత్రము) -(కవిత ) – శ్రీమతి జి సందిత

సంబరాలు జరుగఁ సరదాలసమయాల
వింతవేడ్క జరుగు వేళలందు
చిత్రమైనవాని చిత్రాలుతీయగా
స్వీయచిత్రమదె విశేషమగును!

అట్టి చిత్రములను ఆత్మీయులకు పంప
మురిసిపోవగలరు ముద్డులొలుక!
అతి విచిత్రకరములద్భుతాలేవైన
స్వీయచిత్రమనగ చేర్చవచ్చు

చిట్టిపొట్టిశిశువు చిన్నారిచేష్టలన్
స్వీయచిత్రమనుచు చేర్చవచ్చు!
హాస్యచతురులైన హాయిగానవ్వించు
హాస్యఘటనలైన హాయినిచ్చు

కోరికోరి మిత్తికోఱల పడురీతి
ఉచ్చులందుపడుచు నుచ్చుకతలఁ
పడుచువారు నేడు పడుచుందు రాపదన్
జీవితాలు చెదరఁ చేతులార!

కం||
సులువుగ కబళించును వి
చ్చలవిడిగ నుసురుల స్వీయఛాయాచిత్రం
బులకై యువతీయువకులు
తలపడ నాపదలతోడ ధరఁమిత్తి వెసన్

కొండగుట్టలెక్కి కొనకొమ్మపైకెక్కి
నక్కికోతులనగ వెక్కిరించి
రైలుపెట్టెలెక్కి రైలుపట్టాలెక్కి
ప్రీతిపడుచు చావుకేతెగించి

రాత్రి కుక్కముందు”రాకాసిఅల”ముందు
అడ్దునిల్చి సెల్ఫినందుకొనును
అడవిపందిముందు అగ్నిగుండముముందు
అడ్దునిల్చి సెల్ఫినందుకొనును

మునిగియుండుమనసు ముందుసెల్ఫీయందు
ముంచుకొచ్చుముప్పు పొంచివెనుక
మోజుతీరులోపు ముగిసిపోవు బతుకు!
ముందువెనుకలరయఁ ముప్పుతొలగు

ముచ్చటపడవచ్చు ముందుజాగ్రతలెంచి
సాహసింపవచ్చు చావునెంచి
తల్లిదండ్రి ప్రియులు నిల్లాలుపిల్లలన్
వీడరాదు మృత్యుక్రీడలాడి!!

– శ్రీమతి జి సందిత 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)