పెద్దలమాటలే నా కందపద్యాల్లో- శ్రీమతి జి సందిత

సృష్టిన్ వ్యర్థంబుండదు
స్పష్టంబదికనమనుజవిసర్జితమలమౌ
నిష్టాశనంబుపందికి
పుష్టినిడున్ పందిమలముపొలములుపండన్

ఇతరులలోపములెంచుచు
సతతమువేధించరాదు సరిదిద్దనలెన్
హితరహితవచనంబులునను
చితములగున్ పుండ్లనెక్కుచేటీగలనన్

చిక్కికనంబడలేమికి
చక్కంగన్ పలుకరింప జాలరుచుట్టాల్
దక్కినపదవులు సంపద
పెక్కండ్రైవచ్చుచుంద్రుపెరుగుచు చుట్టాల్

సుందరమైకన్పడునా
నందంబుగనుండువేళ నవనీతలమే!
డెందమువెతలన్ నిండగ
చందురుడున్ గానరాడు చల్లగ గనగన్

ధనముల్ భవంతులాస్తుల
తనయులకుమిగిల్చనట్టి తండ్రియుఘనుడౌ!
కననధముడప్పులమిగి
ల్చిననరియౌతండ్రియుమిగిలింపనపయశాల్ !

సులభంబుగన్ లభించున
విలకలకాలంబునిలువవిలకలకాలం
బలరారునవిలభించవు
సులభంబుగ లోకమందు సూనృత మరయన్

మనమిడుములపడుదినములు
మనకున్ దగుమేలుసేయు మదినెఱిగించున్
మనబంధుమిత్రులందున
మనలన్ ప్రేమించువారి మర్మమువిప్పున్

యశమదిమనుజులజేరును
విశదమె తాబేలువోలె !వేగమెవెడలున్
శశకంబన సిరితానది
దశదిరిగిననిటులనటుల ధారుణి నరయన్

చిరుసరదాలను విడువకు
చిరునవ్వులనాపుకొనకు చిన్నతలపుతో
నరుదుగదొరుకును మనసుకు
నురుసులుతిరుణాలవంటి ఉల్లాసమిలన్

ఇత‌రులకొసంగె నట్టి ఘ
నతనాభగవంతుడేలనాకివ్వడనన్
ప్రతిజీవికినొకప్రతిభను
బ్రతుకన్ దగనిచ్చియుండు పరికింపధరన్

పలుమార్లుపరాజయములు
కలిగెననినిరాశనందగన్ పొరపాటౌ
శిలపగులునునిలిచినిలిచి
సులువుగకడసుత్తిదెబ్బ సోకన్ గెలుపై

ఒకడేమిచేయుననుకొన
కొకడనసాధ్యంబనియనుకొననది తప్పౌ
నొకటే కోటికి మూలము
ఒకడేనాయకుడుచరితనుద్యమమనగాన్

కడుచెడ్డవారలైనను
విడువకుబంధువులనెపుడు వేగిరపడుచున్
చెడురొచ్చునీటితోడను
వడిమంటలనార్పవచ్చు వనరుగ నెంచన్

నమ్మినవారికి ద్రోహము
నెమ్మదిగాచేయునట్టి నేస్తము కన్నన్
ద్రిమ్మరిదురాశపరుడటు
సొమ్ములకమ్ముడగువాడు చూడగమేలౌ!

మాటాడలేనిగోవులు
వాటంబుగపూజలందె వసుధన్ మనుజుల్
మాటల్ మానన్ మునులై
వాటంబుగపూజ్యులైరి వలదు వదరుటల్

విన”నీకర్థంకాదమ్మా”
యనిమాటలుమనకునేర్పినమ్మనని కనుం
గొననెటుకనుగొనెనర్థము
మనశైశవమందుమనలమనసు సులువుగాన్

ఇడుములుపడుచుండగనిను
విడనాడిరియాప్తులంచు వెతచెందకుమా
కడతేఱననుభవమ్ముల
గడియింపనొసగిరి సదవకాశంబిలలోన్

ధరణిన్ గౌరవమీయని
సిరులెంతగపెరిగియున్న చెత్తకు సమమౌ
సరిమనిషికిసాయపడగ
నిరుపేదమనస్సుపూజనీయము ఘనమౌ

ఒడుదుడుకులుండబతుకుల
చెడుతొలగున్ చేటతోడ చెఱిగినయటులన్
చెడుపాచిజేరు జలముల
పడియుండినకదలకుండ పడుచెడు పురుగుల్

ఉడకవువేడిమితగ్గిన
వడిమాడున్ మంటలెక్కు వైనన్ వంటల్
నడుపంగనాయకత్వము
కడుజాగ్రతతోడజనుల కదపంగవలెన్

మంచిమనుష్యులెటన్ క
న్పించరటంచున్ మరి విలపించకుమదిలో
నించుముమంచినినీలో
కాంచగనొకమంచివాడు కనబడు నిలలో !

– శ్రీమతి జి సందిత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

One Response to పెద్దలమాటలే నా కందపద్యాల్లో- శ్రీమతి జి సందిత

  1. దేవనపల్లి వీణా వాణి says:

    ఉడకవు పద్యంలో సందిత గారు నాయకత్వం యొక్క జన సంలగ్న పాత్రను సున్నితంగా హెచ్చరించారు… పద్యాలు చక్కని పదాలతో సాహితీ సౌరభాలను వెదజల్లుతున్నాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)