“నీరెండ దీపాలు”కవితా సంపుటి సమీక్ష-అడుసుమిల్లి మల్లికార్జున

“నీరెండ దీపాలు” కవితా సంపుటి
రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి

రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు బి. యస్సీ., ఎం ఏ (పొలిటికల్ సైన్స్), బి.పి.ఆర్. (బాచిలర్ అఫ్ పబ్లిక్ రిలేషన్స్) చదివారు. ఆంధ్ర ప్రదేశ్ మౌలిక సదుపాయాల ప్రభుత్వ రంగ సంస్థలో జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) గా పని చేస్తున్నారు. గత పాతిక సంవత్సరాలుగా సాహితీ సేద్యం చేస్తున్నారు. వీరి రచనలు వివిధ ప్రక్రియలలో ఉన్నాయి.
ఇప్పటి వరకూ వీరు మనోచిత్రం, వసంత కోకిల, కొత్తచూపు అనే మూడు కథా సంపుటాలు, ఊహల పందిరి ,అంతర్గానం అనే రెండు నవలలు, భావ వల్లరి అనే కాలమ్స్ సంకలనం, నిలువుటద్దం అనే కవితల సంపుటి వెలువరించారు.
ఆంధ్ర ప్రభ,ఈనాడు, సూర్య వంటి దినపత్రికలలో రాజకీయ వ్యంగ్య కాలమ్స్ రాశారు. ఇంకా, అనేక దిన, వార, పక్ష, మాస పత్రికలలో వ్యాసాలు రాసారు. ఈమె రాసిన అనేక కధలకు, కవితలకు బహుమతులు లభించాయి. ఈమె ఎన్నో సన్మానాలూ, సత్కారాలూ పొందారు. ప్రస్తుతం వీరి నవల ” ఎద లోపలి ఎద” సీరియల్ గా వారం, వారం ధారావాహికంగా ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితమవుతోంది.
ఈమె తన “నీరెండ దీపాలు” కవితా సంపుటిని జనవరి – 2017 బుక్ ఫెయిర్, విజయవాడ లో ఆవిష్కరించారు.
“నీరెండ దీపాలు” కవితా సంపుటి… సమీక్ష
ఈ “నీరెండ దీపాలు” కవితా సంపుటిలోని కవితల భాష సహజ లలితంగా ఉండి చదువరుల గుండెలను హత్తుకుంటుంది. మూస కవితా ధోరణికి భిన్నంగా ఈమె కవితా వస్తువుల్లో జీవితపు విభిన్న కోణాలు ఉండడం పాఠకుడికి తృప్తిని కలిగిస్తుంది.
సామాజిక, రాజకీయాల పరిస్థితుల పట్ల చక్కని, చిక్కని అవగాహనతో కవిత్వాన్ని సృజించడం ఈ రచయిత్రి ప్రత్యేకత.
“ఏ ఒక్కరో ! “కవిత ప్రతి కవి యొక్క అంతర్గానమే ! “పూల పతాకం” కవిత ఒక చిన్న భగవద్గీతే.
” ఏ ఒక్కరో, తటాకం తవ్వుదాం , సాధికారిణి, అంతర్వీక్షణం, తెలిసి తెలిసీ, బహుదూరపు బాటసారి, నీరెండ దీపాలు ” మొదలైన కవితలు అత్యుత్తమంగా ఉన్నాయి.
“సరిహద్దు, భయారణ్యం, కార్పొరేట్ పాలిటిక్స్, హత్యాచారం, మీడియా చింతన, ఆడపడుచులు” లాంటి కవితల్లో రచయిత్రి నిర్భీతి, భావుకత, వాస్తవికత కనబడతాయి. రాజకీయ, వైద్య, మీడియా రంగాల వాణిజ్య దృక్పధాన్ని సునిశితంగా ఎండగట్టారీ కవితల్లో.
“గుండె గదిలో, మల్లె మొగ్గల నవ్వు, ఆనాటి వేణుగానం, ఒక స్పర్శ కోసం, పరిమళ తీరం” లాంటి కవిత ల్లోని సున్నితత్వం, సౌకుమార్యం మన హృదయాలను లలితంగా తాకి కుదుపుతాయి.
“తెలిసి తెలిసీ” కవిత చదివి ఎంత మంది సిగ్గిల్లారో ! భుజాలు తడుముకున్నారో ! అర్జునుడి బాణం లాంటి ఉత్తమ కవిత ఇది. లోకం పోకడపై చర్నాకోలా ఈ కవిత. “ఆడపడుచులు”కవితలో ఆడవారిపై సరదా చెణుకుల చురకలు వేశారు.
“కలగా పులగం, మేలి ముసుగులు, అక్షరో థెరపీ, కర్తవ్యం, విశ్వ దర్శనం” కవితలు ఉత్తమంగా ఉన్నాయి.
“స్నేహ గీతిక “కవితలో స్నేహమాధురీ వేణువు లూదే కృష్ణుడివి అనేకంటే చెలికాడివి అంటే బావుండేది. కవిత్వం,స్నేహపు తటాకం తవ్వుదాం రమ్మంటూ, చదవడం ఒక మెడిటేషన్ అని చెబుతూ చివరికి మానవ సమూహానికి సంజీవని అక్షరోథెరపీ అని తేలుస్తారు రచయిత్రి.
సొంతూరిమీద వల్లమాలిన అభిమానం “ఒక స్పర్శ కోసం, ఓదార్పు జ్ఞాపకం “గా జాలువారాయి. రాష్ట్ర విభజన సందర్భాన్ని “సత్యమైన చూపు” , “ఇద్దరొక్కటిగా ” అనే సందేశ కవితల్లో స్పృశించారు. “సాధికారిణి “ కవితలో వర్కింగ్ విమెన్ ని అద్భుతంగా ఆవిష్కరించారు.

వయసుతో పాటు మానవులు విజ్ఞతతో ఎదుగుతూ పరిణతి పొంది ఆపై నీరెండ దీపాలుగా వెలగాలని ఈమె ఆకాంక్ష. నేస్తాలు, పుస్తకాలు, తోటలు, పాటలు నా ప్రపంచం అనగలిగిన ఈ రచయిత్రి కవిత్వారాధన, న్యాయంగా, రమ్యంగా అనిపిస్తుంది పాఠకులకి. తప్పక చదవాల్సిన కవితా సంకలనం ఇది. భాషాడంబరత లేకుండా , మానవ సహజ స్పందనలని కవిత్వంగా మలిచి అలవోకగా సృజించిన రచయిత్రికి అభినందనలు.

                                                                                               – అడుసుమిల్లి మల్లికార్జున

బాపట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)