జ్ఞాపకం-26 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

జయంత్‌ మాట్లాడేలోపలే దిలీప్‌ సంలేఖ వైపు చూసి ‘‘మనం వెంటనే మీ అన్నయ్యని ప్రైవేట్‌ హాస్పిటల్‌కి మారుద్దాం ! అక్కడ ఆయనకు మంచి వైద్య పరీక్షలు జరిపిస్తారు. మందులు  వాడతారు. అవసరమైతే ఆపరేషన్‌ కూడా చేస్తారు.’’ అన్నాడు.

కానీ ఆమెకు అన్నయ్యకు వచ్చే ‘రీ ఇంబర్స్‌మెంట్‌’ స్కీమ్‌ని తీసేశారని వదిన అందరితో అబద్దం చెప్పటం నచ్చటం లేదు. మనసంతా కలచివేసినట్లైంది. మాట్లాడలేక పోతోంది. ఆలోచిస్తోంది.

‘‘ఆలోచనకు ఇది సమయం కాదు. హాస్పిటల్లో ఇకముందు మీ అన్నయ్యకు అయ్యే ఖర్చంతా నేను పెట్టుకుంటాను. తర్వాత ఆయన దగ్గర తీసుకుంటాను.’’ అన్నాడు.

దిలీప్‌ చెప్పింది పద్దతిగానే అన్పించింది సంలేఖకు. అందుకే ఆమె పెదవి కొరుకుతూ సీరియస్‌గా ఆలోచిస్తుంటే ఆమెనే చూస్తున్నాడు జయంత్‌. ప్రస్తుతం ఆమె ప్రధాన సమస్య డబ్బు. ఈ సమస్య యింత ఘోరంగా వుంటుందా అని మనసులో అనుకుంటున్నాడు ఎందుకంటే డబ్బు వల్ల  వచ్చే సమస్యల్ని అతనెప్పుడూ ఎదుర్కొనలేదు. అతను పెరిగిన వాతావరణం అలాంటిది.

ఆమెకెందుకో జయంత్‌ అక్కడ వున్నాడన్న ధ్యాస కూడా కలగడం లేదు. అతని వైపు పొరపాటున కూడా చూడాలనిపించటం లేదు. ఒక విధమైన ఇబ్బందిగా అన్పిస్తోంది. అతనీ క్షణంలో హాస్పిటల్లో వుండకపోతేనే బావుండనిపిస్తోంది. ఎందుకో ఏమో కొంతమంది పట్ల కొన్ని అభిప్రాయాలు  అలా ఏర్పడిపోతాయి.

అప్పుడనగా వెళ్లిన సంలేఖ ఎంతకీ లోపలకి రాకపోవడంతో ఎక్కడికెళ్లింది అని అనుకుంటూ తిలక్‌ బయటకొచ్చాడు. జయంత్‌, దిలీప్‌, సంలేఖ ఓ చోట వుండడం చూసి ‘వీళ్లు మళ్లీ వచ్చారా అన్నయ్యను చూడడానికి ?’ అని మనసులో అనుకుంటూ వాళ్లను చేరుకున్నాడు.

అప్పుడే అటో దిగిన రాఘవరాయుడు, సులోచనమ్మ విచార వదనాలతో హాస్పిటల్లోకి నడుస్తూ చెట్లకింద నిలబడి మాట్లాడుకుంటున్న ఆ నలుగురిని చూసి హడావుడిగా వాళ్ల దగ్గరకి వెళ్లారు. అంతవరకు ఏం జరిగిందో, వాళ్లేం మాట్లాడుకున్నారో రాఘవరాయుడు సులోచనమ్మతో చెప్పాడు దిలీప్‌.

వెంటనే అంబులెన్స్‌ను మాట్లాడి రాజారాంని హైదరాబాద్‌లోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తీసికెళ్లారు. అక్కడి ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసి రాజారాంని అందులో చేర్పించారు. అతనికి శరవేగంగా వైద్యం అందుతోంది.

రాజారాం హైదరాబాదు వెళ్లాక జయంత్‌ కూడా హోటల్‌ రూం ఖాళీచేసి హైదరాబాద్‌ వెళ్లాడు. స్నానం చేసి, తిని, పడుకున్నాడే కాని జయంత్‌ మనసు ప్రశాంతంగా లేదు. తన బాధను ఇంట్లో వాళ్లతో పంచుకోలేకపోతున్నాడు. బోరున ఏడవాలనిపిస్తోంది. ఎంత ఏడ్చినా తన మనసు ఊరట చెందదేమో ! దానికి కారణం ఒకప్పుడు సంలేఖ విషయంలో తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం ! అప్పుడేం అన్పించలేదుగాని ఇప్పుడెందుకో ఆమె ప్రక్కన దిలీప్‌ నిలబడినా, ఇంకెవరు నిలబడినా తట్టుకోలేకపోతున్నాడు. తను మాత్రమే ఆమె పక్కన నిలబడాలని, ఆమె సమస్యల్ని తనొక్కడే పరిష్కారం చెయ్యాలని అతని మనసంతా ఒక విధమైన వింత భావన ఆవరిస్తోంది. అసలు తను ఆదిలాపురి వెళ్లింది ఆమె కథ చదివి అభినందిచాలని, కానీ అదేం జరగలేదు. ఇంకేదో జరుగుతోంది. మనసులో చిత్ర విచిత్రమైన మార్పు వస్తున్నాయి. ఇవన్నీ ఆదిలాపురికి వెళ్లకముందే అంతర్గతంగా తనలో వున్న భావనలా ? లేక అక్కడ వాళ్ల ఇంటి వాతావరణాన్ని చూశాక కలిగిన స్పృహనా అన్నది తెలియడం లేదు. ఏది ఏమైనా సంలేఖ తనకి కావాలనిస్తోంది. సంలేఖ కాకుండా తన జీవితంలోకి ఇంకే అమ్మాయి వచ్చినా తను ఆనందంగా వుండలేడు. లక్ష్యంలేని చదువు ఎంత వృధానో ఆనందంలేని జీవితం కూడా అంతే ! అందుకే తన మనసులోని మాటను తనకు స్నేహితుడైన దిలీప్‌తోనే ముందుగా చెప్పాలనుకున్నాడు. అతనైతేనే తనని త్వరగా అర్థం చేసుకుంటాడు. అదీకాక అతను సంలేఖ వాళ్ల కుటుంబానికి ఆత్మీయుడు కాబట్టి తను చెప్పగానే వెళ్లి మాట్లాడగలుగుతాడు. సమయస్పూర్తి కలిగిన అతని ద్వారానే ఈ మెసేజ్‌ని పంపాలి అని మనసులో గట్టిగా అనుకున్నాడు. ఈ నిర్ణయానికి వచ్చాకనే నిద్రపట్టింది జయంత్‌కి.

 హైదరాబాద్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్లో రాజారాంని అబ్జర్వేషన్లో పెట్టారు. రిపోర్ట్సు వచ్చాక ఆపరేషన్‌ చెయ్యాన్నారు. ఆపరేషన్‌ చేసే ముందు సెకెండ్‌ ఓపీనియన్‌ తీసుకుని రమ్మన్నారు. వెంటనే రాజారాం రిపోర్ట్స్‌ని తీసుకొని వేరే డాక్టర్‌ దగ్గరకి వెళ్లారు. ఆ డాక్టర్‌ రాజారాం రిపోర్స్టుని పరిశీలించి ఆపరేషన్‌ చెయ్యొచ్చన్నారు. కానీ గ్యారంటీ ఇవ్వలేమన్నారు.

(ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)