జ్ఞాపకం-25 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

ఆ యువకుడు దిలీప్‌ చేయిన తొలగించి ‘‘పెద్దది చెయ్యటానికి ఇదేమైన రాజకీయమా దిలీప్‌ అన్నా ! మేమేదో చూడలేక మాట్లాడుతున్నాం. చూసిపోవటానికి వచ్చిన వాళ్లం. నువ్వు కూడా మాలాగే వచ్చావ్‌ ! నువ్వు దీన్ని పేపర్లో రాయకు. ఒక వేళ రాస్తే డబ్బు కోసం వైద్యం చేయించని నీచులున్నారని అందరికి తెలిసేలా రాయి. ధైర్యంగా రాయి. అప్పుడు మేం నిన్ను చూసి గర్వపడతాం. అంతే కాని శవ రాజకీయాలు  చెయ్యొద్దు. ఇక్కడ జరుగుతున్నది అదే!’’ అన్నాడు. అతను బాగా ఉడికిపోతున్నాడు.

దిలీప్‌ వూపిరి తీసివదిలే లోపలే మళ్లీ అందుకున్నాడా యువకుడు ‘‘నువ్వే చూడన్నా ! ఎంత లేని వాళ్లయినా వీళ్లలాగా వుంటారా ? ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేర్పించుకోరా ? రాజారాం బావ పైకి అలా అన్పిస్తున్నాడు కాని లోపల  గట్టి దెబ్బలు  తగిలాయి.’’ అన్నాడు. జాలిగా చూసి. ఈ సారి అతనిలో ఆవేశం లేదు. దిలీప్‌కి ఏదో చెప్పుకోవాలన్న తపన వుంది.

ఒక్కసారి దిలీప్‌ అందరివైపు చూసి ‘‘మీ అభిమానం నాకు అర్థమవుతోంది. దానితో ఇతరుల్ని గాయపరచవద్దు. మీరంతా వెళ్లండి ! నేను మాట్లాడతాను. మీకే కాదు నాక్కూడా వినీల  అక్క అంటే అభిమానం వుంది. సరేనా !’’ అన్నాడు.

దిలీప్‌ ఏది మాట్లాడినా స్పష్టంగా, గట్టిగా మాట్లాడతాడు. ఆ ఊరి వాళ్లకు అతని మాటపట్ల గౌరవం వుంది. ఒక్కొక్కరే అక్కడనుండి తప్పుకుంటూపలచబడి పోతున్నారు. ‘దిలీప్‌ మాట్లాడతాడులే ! మనం వెళ్దాం పదండి !’ అని పైకే అనుకుంటూ వెళ్లిపోతున్నారు.

వార్త కోసం హాస్పిటల్‌కి వచ్చిన దిలీప్‌ మరోవార్త కోసం యింకో చోటుకి వెళ్ళవలసి వుంది. అక్కడి వాతావరణం చూస్తే వెళ్లానిపించలేదు. ఆగిపోయాడు. వేరే రిపోర్టర్‌కి ఆ న్యూన్‌ని కవర్‌ చెయ్యమని కాల్‌ చేసి చెప్పాడు.
తన చుట్టూ ముళ్లకంపలా చుట్టుకుని వున్న జనం దిలీప్‌ రాగానే వెళ్లిపోవటంతో కృతజ్ఞతగా చూసింది సంలేఖ.

‘‘నాకేం తోచటం లేదు దిలీప్‌ ! ఇన్నాళ్లూ వదిన దగ్గర డబ్బులు న్నాయనే అనుకుంటున్నాం. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయినా అన్నయ్య ఇన్నిరోజులు  కష్టపడి సంపాయించిన డబ్బంతా ఎలా వృధా అయిపోయిందో చూడు. దీన్నేమంటారు ? ప్రాప్తమంటారా ? ఆయన డబ్బు ఆయనకే ఉపయోగపడకుండా అయిందెందుకు ?’’ అంటూ తల  పట్టుకుంది.

‘‘నువ్వేం బాధపడకు ఆలోచిద్దాం !’’ అన్నాడు దిలీప్‌. దిలీప్‌ సంలేఖ మాట్లాడుకుంటూ ఒకరి పక్కన ఒకరు నిబడి వున్నారు.

అంతవరకు దూరంగా నిబడి సంలేఖ చుట్టూ వున్న జనాన్ని, ఆమె వాళ్లతో మాట్లాడుతున్న తీరును గమనిస్తున్న జయంత్‌కి సంలేఖ పక్కన దిలీప్‌ నిబడివున్న దృశ్యం విపరీతమైన నొప్పిని కలిగిస్తోంది. ఆ నొప్పి దిలీప్‌ వచ్చాకనే మొదలైంది. అలాంటి నొప్పి మొదటిసారిగా కలిగింది అతనిలో… ఆశ్చర్యపోతూ గుండెమీద చేయివేసి తడుముకున్నాడు. ఈ నొప్పే ఎప్పుడైనా మనిషిని దీర్ఘాలోచనలో పడేస్తుంది. ఉన్నత శిఖరాకి అదఃపాతాళానికి మధ్యలో నిలబడి వూగిసలాడేలా చేస్తుంది. అనుభూతించటం నేర్పుతుంది. ప్రేమ, బాధ, దుఃఖం అంటే ఎలా వుంటాయో చవి చూపిస్తుంది.

నిజానికి జయంత్‌ రాత్రే కాల్‌ చేసి దిలీప్‌తో చెప్పాడు. నేను రేపు హోటల్‌ ఖాళీ చేసి వెళ్తానని. కాని వెళ్లలేదు. అతనికెందుకో మళ్లీ ఒకసారి సంలేఖను చూడానిపించింది. దిలీప్‌తో ఆ విషయం చెప్పకుండా నేరుగా హాస్పిటల్‌కి వచ్చాడు. ఇక్కడ ఇలాంటి దృశ్యాన్ని చూస్తాననుకోలేదు. అతనికెందుకో  వచ్చినప్పటి నుండి షాక్‌ మీద షాక్ లు  తగులుతున్నాయి. నెమ్మదిగా కదిలి దిలీప్‌ సంలేఖ నిబడివున్న చోటుకి వెళ్లాడు జయంత్‌.

దిలీప్‌ జయంత్‌ని చూడగానే ఆశ్చర్యపోతూ ‘‘హైదరాబాద్‌ వెళ్తానని ఉదయం ఫోన్‌చేసి చెప్పావ్‌ ? ఇలా వస్తానని చెబితే నేనే హోటల్‌కి వచ్చేవాడినిగా !’ అన్నాడు.

(ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)