(పుస్తక సమీక్ష) మీతో నేను- మాలా కుమార్

               ఈ నెల ప్రయాణం హడావిడి , వచ్చాక జెట్ లాగ్ తో సమీక్ష రాయలేకపోయాను ,అని పి.యస్.యం లక్ష్మిగారి తో అంటే ఇప్పటి వరకు చాలా మందివి రాసారు కదా ఈ సారి వెరైటీ గా మీ పుస్తకాలనే పరిచయం చేయండి అన్నారు. ఏమో నా పుస్తకాల మీద నేను సమీక్ష రాసుకుంటే బాగుంటుందా అంటే ఎందుకు బాగుండదు అన్నారు . ఇప్పటి వరకు ఎవరైనా వాళ్ళ పుస్తకాలకు వాళ్ళే సమీక్ష రాసుకున్నారో లేదో కాని నా పుస్తకాలకి నేనే సమీక్ష రాసుకోవటం ఎలా ఉంటుందో చూద్దాం నాకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉన్నా వ్రాసే అలవాటు లేదు . 2008 లో బ్లాగ్ మొదలు పెట్టాక వ్రాస్తున్నాను. నేను వ్రాసినవన్నీ మూడు భాగాలు చేసి ఈబుక్స్ గా చేసింది మా కోడలు అను.

1. సాహితి

“ఎదో ఒక రాగం పిలిచిందీ మదిలో
నాలో విహరించే గతమంతా కదిలేలా
జ్ఞాపకాలే మైమరపు “
నాసాహితీలో ఏముందీ అంటేపొత్తూరి విజయలక్ష్మి గారన్నట్లు , నా ఇల్లు , నాతోట, మా ఏమండి , మా మనవలు మనవరాళ్ళ ముచ్చట్లు , నా చిన్నప్పటి ముచ్చట్లు ఇలా అంతా నాగోలే ఓ సగటు ఇల్లాలి మదిలోని మధురానుభూతులు. నా చిన్ని ప్రపంచం నా కుటుంబం లోని సరదా సంఘటనలు , గతం లోకి తిరిగి చూసుకుంటే మనసు ఆహ్లాద పరిచేవి , ఆనందించేవి రాసుకున్నాను ఈ సాహితి నా సొంతం. నా ఊహల ప్రతిరూపం. నా చిన్ని పొదరిల్లు .అలా నా “సాహితి “ బ్లాగ్ లో వ్రాసుకున్న సరదా పోస్ట్ లే ఈ సాహితి.

2. అనగనగాఒకకథ

ఏదైనా పుస్తకం చదవగానే దాని గురించి వ్రాసుకోవటం అలవాటు. అలా రాయటాన్ని సమీక్ష అంటారని చిన్నప్పుడు తెలీదు కుడా  అలా నాకు నచ్చిన పుస్తకాల గురించి , నా బ్లాగ్ , మాలిక, చిత్రమాలిక, విహంగ అంతర్జాల పత్రిక లలో వ్రాసిన సమీక్ష లే ఈ “అనగనగాఒక కథ “ . ఇందులో విహంగ మాసపత్రికలో వ్రాసినవే ఎక్కువగా ఉన్నాయి. 2012 నుంచి విహంగలో ప్రతినెల ఒక పుస్తకమును పరిచయము చేస్తున్నాను. ముందు ఈ తరం వారికి పాత పుస్తకాలను పరిచయము చేద్దామని మొదలు పెట్టాను.

              తరువాత ఫేస్ బుక్ లో చాలా మంది రచయిత్రులు పరిచయము కావటము , వారి పుస్తకావిష్కరణకు వెళ్లి నప్పుడు ఆ పుస్తకము తెచ్చుకోవటముతో అవి పరిచయము చేస్తున్నాను . ఆ తరువాత ఆ రచయితలను కూడా పరిచయము చేస్తున్నాను . కొన్ని నవలలు ,చిత్రాలు గా వచ్చినవి కూడా పరిచయము చేసాను . అనూహ్యముగా ఈ పుస్తకము చాలా ఆదరణ పొందింది . చాలా మంది మాకు తెలీని పుస్తకాలను , రచయతలను పరిచయము చేసారు అంటూ మెయిల్ ఇస్తున్నారు .

.నీ జతగా నేనుండాలి

నా బ్లాగ్ లో వ్రాసుకున్న పోస్ట్ లు చూసి నా స్నేహితులు ఇంత బాగా రాస్తున్నావు కదా కథలు కూడా వ్రాయి అని ప్రోత్సహించటము తో రెండు సంవత్సరాల క్రితము కథలు వ్రాయటము మొదలు పెట్టాను.ఇందులో మొత్తం పందొమ్మిదికథలున్నాయి.దాదాపుఅన్నికథలూ నేనూచూసిన, నాకు తెలిసిన , పేపర్ లో చదివిన సంఘటనల ఆధారముగా వ్రాసినవే.

మొదటి కథ “నీ జతగా నేనుండాలి “ , చిన్నప్పుడే పిల్లలకు మేనత్త మేనమామల పిల్లలతో జత కలపటము , ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఏదైనా కారణము వలన ఆ పెళ్లి జరగకపోతే దాని మీద ఆశ పెట్టుకున్న అమ్మాయి పరిస్తితి గురించి ఏమిటి అన్న విషయము గురించి మా స్నేహితులతో వచ్చిన చర్చ నుంచి ఈ కథ వ్రాసాను . ఇది నా మొదటి కథ. దీనికి రచన మాసపత్రిక లో “కథాపీఠం పురష్కారం “ వచ్చింది.

               “మట్టి లో మాణిక్యం” కథలో తల్లీ తండ్రి లేని , అనాకారియిన ఒక అమ్మాయి శాంభవి , మేనమామ ఇంట్లో ఇబ్బందులు పడుతూ , మేనత్త నిరాదరణకు కు గురి అవుతుంది. అప్పుడు సంఘసేవిక విమల సహాయముతో , తన గాన మాధుర్యము తో రాణిస్తుంది. ఇది కూడా నేచూసినదే .

             “ధీర” , “విధి విన్యాసాలు “ బంగ్లాదేశ్ వార్ అప్పుడు నేను చుసిన సంఘటనల నుంచి రాసినవి . ఎవరో ధీర ఆరాధన హిందీ సినిమా లా ఉంది అన్నారు . మిలిటరీ కుటుంబాలల్లో సామాన్యము గా జరిగేదే ఇది . ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో చాలా మంది అటువైపు వెళుతున్నారు కాని , ఎక్కువగా ఆర్మీ ఆఫీసర్ పిల్లలు 11 క్లాస్ ఐపోగానే యన్. డి. యే లో చేరేవారు . తండ్రి యుద్దములో మరణించాడు అని భయపడేవారు కాదు. ఆర్మీ లైఫ్ వేరుగానే ఉండేది . ఇలాంటివి ఎక్కువగా పంజాబ్ లో జరుగుతూనే ఉంటాయి .

                   “చాందిని “ , ఒక పత్రిక లో ఒకావిడ సైక్రియాటిస్ట్ ను , మా వారు ఇలా నీలి చిత్రాలు చూస్తున్నారు , లాప్ టాప్ మీద డిస్ప్లే లో ఉంటె మా పిల్లలు చూస్తుండగా చూసి కోపం చేసాను , ఆయనను చూడ వద్దంటే వినటం లేదు ఏమి చేయాలి అని అడిగింది చదివాను . మాలిక అంతర్జాల మాస పత్రిక లో “తండ్రి తనయ “ ల మధ్య ఉండే బంధం గురించి కథ రాయమంటే ఇది గుర్తొచ్చి రాసాను .

                సామాన్యము గా కొంత మంది ఆడవాళ్ళకు , పిల్లలు పెద్దవాళ్ళై వెళ్ళిపోయాక, బాధ్యతలన్నీ తీరాక ఒక లాంటి డిప్రెషన్ వస్తుంది . ఇది మిడిల్ ఏజ్ క్రైసిస్ కావచ్చు లేదా మెనోపాజ్ ప్రాబ్లం కావచ్చు . అప్పుడు కుటుంబ సబ్యులు వారికి ఎలా చేయూత నివ్వాలి అన్నదాని మీద రాసిన కథలు “ గుండెకి గుబులేందుకు “, “ఆత్మీయ బంధం “.

                       మాకు తెలిసిన అబ్బాయి పెళ్లి కి ఖర్చులు, ఆడంబరాలు వద్దు అని పట్టు బట్టి రిజిస్టర్ మారేజ్ చేసుకున్నాడు . మాలిక పత్రిక లో వివాహబంధం గురించి రాయమంటే ఈ సంఘటనను ఆధారము చేసుకొని వ్రాసియన కథ “ మనసు తెలిసిన చండురుడా “

                      “చూపులు కలవని శుభవేళ “ మా ఇంట్లో జరిగిన ఒక పెళ్లి లో అందరికి కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చింది . దాని మీద రాసిన సరదా కథ ఇది .
మిగిలినవన్నీ కొన్ని మాకు జరిగినవి , కొన్ని ఉహించి రాసిన సరదా కథలు .
ఇవన్ని వివిధ పత్రికలలో ప్రచురించబడ్డవి .

ఇవండీ నా మూడు పుస్తకాలు . ఇవన్నీ కింద ఇచ్చిన లింక్ లల్లో డౌన్ లోడ్ చేసుకొని చదవచ్చు.

https://telugu.pratilipi.com/kamala-paracha-maala-kumar

http://kinige.com/author/Mala+Kumar

https://sahiti-mala.blogspot.in/

వెల అంటారా , మీ వెలలేని అభిప్రాయాలే వెల. చదివి మీ అభిప్రాయం చెపుతారు అని ఆశిస్తున్నాను .

-మాలా కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

3 Responses to (పుస్తక సమీక్ష) మీతో నేను- మాలా కుమార్

 1. sobha says:

  చాలా
  బాగా వివరించారు
  చదువుతాను

 2. Sasikala Volety says:

  చాలా బాగుందండి మీ సమీక్ష. వివిధ వెబ్ మాగజైన్స్ లో, ఫేస్ బుక్ లో మీ రచనలు చాలా చదివి మీ అభిమానిని అయిపోయాను. మీ రచనలన్నీ ఈవిధంగా సంకలనం చెయ్యడం బాగుంది. అభినందనలు.

 3. G.S.Lakshmi says:

  ఎప్పుడో చదివేసానుగా.. అయినా మళ్ళీ చదువుతాను.. ఎందుకంటే మళ్ళీ చదివించేలాగే ఉంటాయి మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)