జ్ఞాపకం-24 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

‘‘మాకు తెలుసు మీరు ఆ ఉద్దేశ్యంతోనే వున్నారని. అందుకే మేం కల్పించుకోవసి వచ్చింది. వినీల  దగ్గర డబ్బుల్లేవు.’’ అంది వాళ్లలోంచి ఒక నడివయసు స్త్రీ ముందుకి వచ్చి. షాక్‌ తిన్నది సంలేఖ. వదిన దగ్గర డబ్బుల్లేవా ! ఇదేం మిస్టరీ ? అన్నయ్య జీతం డబ్బుల్లో వదిన పొరపాటున కూడా ఇంటి ఖర్చుకి, పొలం  ఖర్చుకి కనీసం వాళ్లిద్దరి తిండికి కూడా ఇవ్వదు. తనకి గాని, తిలక్‌ అన్నయ్యకి గాని ఒక్క రూపాయి ఇవ్వదు. అవన్నీ తండ్రే చూస్తుంటాడు. నిజానికి ఇప్పుడు హాస్పిటల్‌ ఖర్చుకూడా తండ్రి చూసేవాడు. కానీ, అకాల వర్షం వల్ల  పొలంలో మిర్చి దెబ్బతిని, పత్తి తడిసిపోయి పైకి చెప్పుకోలేక కుమిలి పోతున్నాడు. చాలామంది రైతు ఆత్మహత్యలు  కూడా చేసుకున్నారు. తండ్రి కూడా చేసుకోబోయాడు. తండ్రికి తనే ధైర్యం చెప్పింది. ‘ఇలాంటప్పుడే నాన్న తట్టుకుని నిబడాల్సింది. ఈ రోజు ఎప్పటికీ ఇలాగే వుండిపోదు. రేపటికి అది నిన్నయిపోతుంది. ఎటొచ్చీ ఇప్పుడే దానికి భయపడకుండా ఎదురు తిరిగి నిలబడాలి’ అని. ఒక్కసారి కాదు చాలా సార్లు దగ్గరకూర్చుని చెప్పింది. తన మాటలు  విని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
సంలేఖ తేరుకుని ఆ నడివయసు స్త్రీకి అర్థమయ్యేలా ‘‘చూడమ్మా ! మా అన్నయ్య గవర్నమెంట్‌ టీచర్‌. ఆయనకి హాస్పిటల్లో పెట్టే ఖర్చంతా తిరిగి వస్తుంది. దీన్ని ‘రీ ఇంబర్స్‌మెంట్‌’ అంటారు. అయనకి ఎవరూ ఏం పెట్టనవసరం లేదు. కాకపోతే ముందు మేము పెట్టుకోవాలి.’’ అంది.
‘‘ఆ స్కీమ్‌ తీసేశారని చెప్పింది వినీల . నువ్వేమో ఉందంటున్నావ్‌ ! అసలు  నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావో, ఏమో! మీ కుటుంబంలో అందరూ ఒక చోట కలిసి కూర్చుని మాట్లాడుకోరా ?’’ అన్నారెవరో. అవమానంగా అన్పించింది సంలేఖకు. తల  కొట్టేసినట్లైంది.
అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడే అవకాశాలు  ఎక్కువగా వున్న ఆ సందర్భాన్ని ఎలా తట్టుకోవాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. వాళ్ల వైపు కూల్‌గా చూసి ‘‘అలాగా ! నేను మా వదినతో మాట్లాడతాను. ఆమె దగ్గర వుండే డబ్బుతోనే అన్నయ్యకి వైద్యం చేపిస్తాం ! మీరు దీన్ని పెద్ద సీన్‌ చెయ్యకండి ! ప్లీజ్‌ ! ’’ అంది సంలేఖ.
‘‘చూడమ్మాయ్‌ ! నీకేం తెలిసినట్టులేదు. మీ వదిన దగ్గర ఇప్పుడు కట్టేసి కొట్టినా ఒక్క పైసా రాదు.’’
మళ్లీ షాక్‌ తిన్నది సంలేఖ.
‘‘మీ అన్నయ్య జీతం డబ్బుల్ని నెలా నెలా తెచ్చి మా కొండాపురంలోనే చిట్టీలు  కట్టింది. వాళ్లు ఈ మధ్యనే చెప్పకుండా ఐ.పి. పెట్టి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లింది కర్నాటకో, తమిళనాడో, మహారాష్ట్రనో అర్థంకాక అందరం ఒక ఏడ్పు ఏడ్చి మరచిపోయాం. ఇంకొక్క చిట్టీ వుంటే అది ఈ మధ్యనే పాడుకుని తెలిసిన వాళ్లకి వడ్డీకి ఇచ్చింది. అవి ఇప్పట్లో రావు. వాటి గురించి మరచిపోండి !’’ అంది
ఇంకో పెద్దావిడ సంలేఖ భుజంపై చేయివేసి ‘‘వున్న వాస్తవం ఇదీ అర్థం చేసుకో’’ అంది నెమ్మదిగా.షాక్‌లోంచి తేరుకుంది సంలేఖ. ఒక్కసారి వాళ్లవైపు చూసి ‘‘సరే ! నేను మా నాన్న గారితో మాట్లాడుతాను. మీ అందరి పెద్ద మనసుకి కృతజ్ఞతలు . మీ చందా ప్రయత్నం మానుకోండి ! అన్నయ్యను చూసి వెళ్లండి ! అంతే !’’ అంది.కానీ వాళ్లు ఒప్పుకోవడం లేదు. వాదిస్తున్నారు. ఆమెపై విరుచుకుపడుతున్నారు.
‘‘వినీల  మా వూరి అమ్మాయి మా బంధువు’ అంటూ ఆమెకేదో అన్యాయం జరుగుతున్నట్లు ఆవేశపడుతున్నారు. రాఘవరాయుడు కుటుంబం మొత్తం దుర్మార్గులైనట్లు అక్కడున్న వాళ్లకి తెలిసేలా అరుస్తున్నారు. వాళ్లంతా విస్తుపోయి వింటూ ‘‘ప్రపంచమంతా ఇలాగే వుంది. మానవ సంబంధాు మరీ దారుణంగా తయారవుతున్నాయి. ఎక్కడచూసినా అన్న లేడు. అక్క లేదు. కొడుకు లేడు. అది మనకి తెలిసిందే కాని ఇక్కడ ఆపదలో వున్న కన్న కొడుకుని తల్లిదండ్రులే పట్టించుకోవడం లేదు ఇంత కన్నా ఘోరం వుందా ?’’ అని అంటున్నారు.
మాట్లాడి మాట్లాడి అసిపోయింది సంలేఖ. ఇక వాళ్లతో మాట్లాడి గెలవలేక  చూస్తోంది. న్యూస్‌ కోసం వచ్చిన దిలీప్‌ జనం మధ్యలో నిలబడివున్న సంలేఖను దూరం నుండే చూశాడు. ‘ఏం జరిగింది? అక్కడంతా మా కొండాపురం వాళ్లే వున్నారే’ అని మనసులో అనుకుంటూ వేగంగా వాళ్లను చేరుకున్నాడు.సంలేఖకు దిలీప్‌ని చూడగానే ధైర్యం వచ్చింది. ‘‘దిలీప్‌ వీళ్లు చూడు ఎలా మాట్లాడుతున్నారో ! నాన్నను తిడుతున్నారు. అన్నయ్యను మా ఇంట్లో మనిషిలా మేం చూడనట్లే మాట్లాడుతున్నారు.’’ అంది. అతనికి దగ్గరగా వెళ్లి నిలబడిoది.
విషయం అర్థమైంది దిలీప్‌కి. ముందుగా మాట్లాడిన యువకుడు ఇంకా ఆవేశంగానే వున్నాడు. అతని భుజంపై చేయివేసి ‘‘మీరు దీన్ని పెద్దది చెయ్యకండి ! అసలే వాళ్ల బాధలో వాళ్లున్నారు.’’ అన్నాడు.

(ఇంకా ఉంది )

                                                                                                             – అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)