జ్ఞాపకం-23 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

‘‘ఎక్కడున్నాయి ఆత్మలు ? వాటి గురించి రాసిన గ్రంథాలేమైనా గ్రంథాయాల్లో భధ్రపరిచి వున్నారా? వుంటే ఎవరా రాసిన వైద్యులు ? మానసిక శాస్త్ర వేత్తలు ? లేక భూత వైద్యులు …’’ అంది వ్యంగ్యంగా వినీల.

‘‘దీని గురించి వాదించటం నాకు ఇష్టం లేదు వినీలా ! ఎందుకంటే ఈ మధ్యన బాగా చదువుకున్న వాళ్లు, ఉన్నత హోదాల్లో వున్న వాళ్లూ, హితబోధలు  చేస్తున్న వాళ్లు కూడా కొందరు తమ తల్లి దండ్రుల్ని బ్రతికి వుండగానే ప్రేమగా చూస్తున్నారు. వారి మరణానంతరం వేల  రూపాయు ఖర్చు చేసి విందు భోజనాలు పెడుతున్నారు. ఖరీదైన సమాధులు  కట్టిస్తున్నారు. వీళ్లలో ఇంత మార్పేంటి అని నేను ఆశ్చర్యపోతుంటే వాళ్లేమన్నారో తెలుసా ?’’ అంది.

‘‘ఏమన్నారు…?’’ అడిగింది వెంటనే వినీల.

‘‘జీవితకాలoలో  తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారిని సమాజం హర్షించదట. దేవుడు అంగీకరించడట. కఠినంగా శిక్షిస్తాడట. ఇహలోకంలో పరాభవంపాలు చేస్తాడట. పరలోకంలో నరక శిక్షకు గురిచేస్తాడట. అందుకే  బాల్యంలో తల్లి దండ్రులు  పిల్లల్ని   ఎంత ప్రేమగా పెంచుతారో ఆ పిల్లలు  పెద్దవాళ్లయిన తరువాత తమ తల్లిదండ్రుల్ని అంతే ప్రేమతో చూసుకోవాలట. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీ అత్తగారు ఉత్తమ మహిళ. ఆమె వాళ్ల అత్తగారిని, మామగారిని గొప్పగా చూసుకుంది. ఇప్పుడు కూడా వాళ్ల అత్త, మామకు జ్ఞాపకార్థంగా ఏదో చేయాలనే చూస్తోంది. నువ్వు దీన్ని ఆదర్శంగా తీసుకో ! పెద్దవాళ్ల పేరు నిలుపు.’’ అంది.

పెదవి విరిచింది వినీల. వినీల  విరిచిన పెదవి ఆమె చూపుల్ని దాటిపోలేదు.వినీల ఎలాంటిదో ఆమెకు బాగా తెలుసు. ఏదో కర్మకాలి హాస్పిటల్‌లో వుంది కాని శవాల  ముందు కూడా సెటైర్లు వెయ్యగలదు. ఇప్పటికే రోగుల  ముందు కూర్చుని విచారిస్తున్న బంధువుల్ని తన వికార తత్వంతో వ్యాఖ్యానాలు  చేస్తూనే వుంది. ఒక వైపు రాజారాంని చూస్తూ ముక్కు ఎర్ర బడేలా చీదుతూనే వుంది.

‘‘ఏముంది పిన్నీ పేరునిలపటానికి ? ఎవరు పేరుకు ఎవరు బాధ్యులు అందరిపేరు నిలపటానికే నేను పుట్టానా ? అందరి చేత మంచిదాన్ని అనిపించుకోవడమే నా వృత్తా ? నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నాకు నచ్చిన పని నేను చేస్తాను. అంతకు మించి నా వల్ల  కాదు. కానీ పొలంలో వుండే సమాధుల్ని మాత్రం వుంచటానికి లేదు. ఎలాగైనా వాటిని తొలగించే ఏర్పాటు చేయాలి. డబ్బులెలా వస్తాయి చెప్పు పిన్నీ ! ఆ డబ్బుల్లేకనేగా అన్యాయాలు , అక్రమాలు  చేస్తున్నారు. ఆ డబ్బు కోసమేగా మన వూళ్లో మనం చిట్టీలు  వేసిన వాళ్లు ఐ.పి. పెట్టి పత్తాలేకుండా పోయారు… అంత విలువైన డబ్బులను మా  మామగారు ఆ సమాధుల్లో పోస్తాననడమేంటి ?’’ అంది.అవాక్కయింది ఆమె. వదిన మాటలు  వింటున్న తిలక్‌ లో  ఏదో పైకి ప్రదర్శించలేని ఆనందం. తనకు వచ్చిన ఆలోచనే వదినకు కూడా రావడం మహదానందం. ఎన్నో విషయాల  దగ్గర తనకు వదినకు పడక పోయినా ఈ ఒక్క విషయం దగ్గర ఏకాభిప్రాయం కుదిరినట్లయింది.

అంతక్రితం బయటకి వెళ్లిన సంలేఖ మళ్లీలోపలికి రాలేదు. కారణం ఆ హస్పిటల్‌ ముందు గందరగోళ వాతావరణం ఏర్పడడమే. చెట్లకింద నిలబడి వున్న కొండాపురం వాళ్లు కొందరు ఆమె వూహించని విధంగా ఆమెతో వాదనకిదిగారు. ఆమె ఎంత చెప్పినా వినకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. విషయం అర్థంకాక అక్కడ వున్న రోగుల  తాలూకు మనుషులు  కూడా సంలేఖ చుట్టూ చేరారు. ఆమెకు ఒక్క క్షణం వూపిరాడనట్లయింది.

గాలి వీచినప్పుడు ఆ చెట్లకి వున్న ఎండుటాకులు  రాలి వాటి క్రింద నిలబడి వున్న మనుషుల  తల  మీద, భుజాల మీద పడుతున్నాయి. పక్షుల  రెట్టలు కూడా పడుతుంటే తుడిచేసుకుంటూ అక్కడే నిలబడ్డారు. వాళ్లంతా సంలేఖనే చూస్తున్నారు. ఏం మాట్లాడుతుందో విందామన్న ఆసక్తితో చూస్తున్నారు.

వాళ్లలో కొంతమందిని వుద్దేశించి ‘‘మా అన్నయ్య కోసం మీరు చందాలు  వేసుకోవడం ఏమిటి? ఇది నాకు నచ్చలేదు. మమ్మల్ని అవమానిస్తున్నారా?’’ అంది కోపంగా సంలేఖ. ఆమె మాటతీరు చాలా స్పష్టంగా వుంది. వేసుకున్న చుడీదార్‌ మామూలుగా వున్నా మనిషి మాత్రం చురుగ్గా, ఠీవిగా వుంది. మేలుజాతి పుష్పంలా కళకళలాడుతోంది.

‘‘మరేం చేయాలి? రెండు రోజులుగా ఇదే గవర్నమెంట్‌ హస్పిటల్‌లో వుంచారాయన్ని. వేరే ప్రయివేట్‌ హాస్పిటల్‌ తీసికెళ్లే ఏర్పాట్లేమీ చెయ్యలేదు. ఎలా కోలుకుంటాడు. అదేం అంటే ఆయన బాగానే మాట్లాడుతున్నాడు ఇంటికి తీసికెళ్లొచ్చని మీరు చూస్తున్నారు. అసలాయన కదిలితేగా ఇంటికి తీసికెళ్లటానికి.? పైకి కన్పించని దెబ్బతో పడి వున్నాడు.?’’ అన్నాడు వాళ్లలో ఓ యువకుడు.

‘‘డాక్టర్లు ఏదైనా వదినతోనే చెబుతారు. మా వదిన ఎలా చెబితే అలా చేద్దామని చూస్తున్నాం ! ఇప్పుడు డాక్టర్‌ గారు రాగానే అవసరమైతే వేరే హాస్పిటల్‌కి తీసికెళ్తాం ! మా నాన్నగారు కూడా వస్తున్నారు. దయచేసి మీరు మమ్మల్ని మరీ ఇంత దిగజార్చి చూడకండి!’’ అంది. ఆమె చేతులొక్కటే ఎత్తి దండం పెట్టలేదు. మాటల్లో అంతపనీ చేసింది.
‘‘ఆడమనిషి మీ వదిన ఏం చేస్తుంది? ఏం చెబుతుంది? కదిలిస్తే ఏడవడం తప్ప.’’ అన్నారెవరో దబాయిస్తూ.
‘‘ఆడా, మగా ఏంటండీ? మా అన్నయ్య జీతం డబ్బుండేది మా వదిన దగ్గరే ! మా అన్నయ్య విషయంలో ఆమె చెప్పినట్టే చేస్తాం ! మీ జోక్యం అనవసరం.’’ అంది కచ్చితంగా సంలేఖ. ఆమె కూడా దబాయింపుగానే మాట్లాడుతోంది.

(ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి
——————————————————————————————-

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)