కె.గీత కవిత్వం-నాలుగవ కవితా సంపుటి-“సెలయేటి దివిటీ” ఆవిష్కరణ-సిరివెన్నెల

డా కె.గీత నాలుగవ కవితా సంపుటి “సెలయేటి దివిటీ” ఈ- పుస్తకం ఆవిష్కరణ జూలై 16, 2017 న హైదరాబాద్ లోని వేదిక ప్రత్యేక సమావేశంలో అత్యంత నిరాడంబరంగా జరిగింది. గీతకు ఆత్మీయులు శ్రీమతి రమణ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కవయిత్రి గీత తన రచనా నేపథ్యాన్ని, అమెరికాలో ప్రస్థానాన్ని సభకు పరిచయం చేస్తూ –
తల్లి శ్రీమతి కె.వరలక్ష్మి కథా రచయిత్రి కావడం వల్ల చిన్నతనంలోనే సాహిత్య జిజ్ఞాస కలిగిందని,
కవయిత్రిగా ప్రస్థానాన్ని ప్ర్రారంభించినా అన్ని ప్రక్రియల్లోనూ తన రచనా వ్యాసంగం కొనసాగిందని అన్నారు. ఇంత వరకు ప్రచురితమైన కవితా సంపుటులు “ద్రవభాష”, “శీతసుమాలు”, “శతాబ్ది వెన్నెల”, ఇప్పటి “సెలయేటి దివిటీ ” వేటికవే ప్రత్యేక సందర్భాలని పేర్కొన్నారు.
అమెరికా వెళ్లిన కొత్తలో కాలిఫోర్నియా బే ఏరియాలో నెలకొని ఉన్న సాహితీ స్తబ్దతని గుర్తుచేసుకున్నారు.
దానిని ఛేదించడానికి తాను ప్రారంభించిన “వీక్షణం” నెలనెలా తనతో బాటూ అందరికీ స్ఫూర్తిదాయకం కావడం తనకు సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. తెలుగు రచయితలందరి కోసం నెలకొన్న ఏకైక సమగ్ర అంతర్జాల భాండాగారం “తెలుగు రచయిత” స్థాపన తనకు అత్యంత ఆనందదాయకమని తెలిపారు.
ఆవిష్కరణ కాగానే గీత “సెలయేటి దివిటీ” , “అబ్బాయి ఇరవయ్యో పుట్టిన రోజు” కవితా ఖండికలు చదివి వినిపించారు.
సెలయేటి దివిటీ –
నువ్విక్కడ లేవు
అయినా జ్ఞాపకాల
వెన్నెల దివిటీతో
దారి వెతుక్కుంటూ
ఇక్కడిక్కడే
తచ్చాడుతున్నాను
నీ క్షేత్రంలో మొలకెత్తిన
పంటల మధ్య తిరుగుతున్నాను
పళ్ల చెట్ల మధ్య
పరిగెడుతున్నాను
మోకాళ్ల వరకూ అంటిన
జ్ఞాపకాల మట్టి పరిమళం
సెలయేటి రొదై
గది గదినా
ప్రవహిస్తున్న నీ వాక్ప్రవాహాం
ఎటు మసిలినా
రెప రెపలాడుతూ
సీతాకోక చిలుకలు
నీ వంశ వృక్షాన వేళ్లాడుతూ-
గాలి లోంచి
మంత్రమేసినట్లు
మిణుగురు పిల్లలు
మిరుమిట్లు గొల్పుతూ-
నా చుట్టూ
ఉక్కిరి బిక్కిరిగా
పూల తీగెలై అల్లుకున్న నీ
దరహాసపు తెల్ల దనం
నా కోసమే
ఎదురు చూస్తూ
జీవన భారాన్ని
ఇన్నాళ్లూ మోసినట్లున్న
నీ ఫోటో కళ్ల గంభీరం
మనసు తలుపుల్ని
తెరవడం వరకే గానీ
మూయడమెరుగని
ప్రేమా పాశమేదో
రాత్రి చివర వేళ్లాడే
చందమామై
చుట్టూ ముసిరిన
మబ్బుల అవాంతరాల వెనక
దాక్కుంటూ
తొంగి చూస్తూ-
కనురెప్ప మూసినా
గతమయ్యి పోయే
వర్తమానం
కనురెప్పపాటులో
గోడల్లో ఇంకిపోయిన
గతాన్ని
కన్నారా వీక్షింపజేస్తూ
విహరింపజేస్తూ-
ఇక్కడ ఎక్కడ చూసినా నువ్వే-
నాలో దాక్కుని
నన్నే నిన్ను
చేసుకున్న నువ్వే-
——-

అబ్బాయి ఇరవయ్యో పుట్టిన రోజు-

నిన్నా మొన్నటి వరకు నా మెడను చుట్టుకున్న మేకపిల్ల చేతులేనా ఇవి?!
ఎముకలు గుచ్చుకునే నూత్న యువకుడెవడో
నా చిన్నారి బాబులో
పరకాయ ప్రవేశించినట్లున్నాడు
అన్నం తిననని అలిగి కూచున్న
బుంగ మూతి పెదాలేనా ఇవి?!
సరి కొత్త యువకుని చెదరని దరహాసపు
చిరుచక్కని చిక్కనైన మీసం ఎవరో దీక్షగా చెక్కినట్లున్నారు!
“అమ్మా!” బడికెళ్లనని మారాం చేసిన
పసిబాలుడేనా వీడు?!
అర్థ రాత్రి వరకూ ఎంట్రన్సు ప్రిపరేషన్ల
చదువు బల్ల నుంచి పక్కకు తొంగి చూడడు పాపం…
అనుక్షణం మాటల సెలయేరై ప్రవహించిన బుడతడేనా వీడు?!
గంటల కొద్దీ నిశ్శబ్దంగా
లాప్ టాప్ మీంచి దృష్టి కదల్చడీ యువకుడు
అమ్మ కోసం హాస్టలు గోడల్లో రాత్రీ పగలూ బెంగటిల్లిన
దు:ఖపూరిత నయనాలేనా ఇవి?!
నిర్లక్ష్యపు చూపులు అతికించి
ఎవరో ఈ చిన్నారిని కఠిన శిలగా మార్చినట్లున్నారు-
నిమిషం ఉన్నచోట లేకుండా
గెంతులేసే ఒకప్పటి ఇంటి జింక పిల్ల వీడేనా?!
ఎక్కడికెళ్తున్నాడో కూడా చెప్పకుండా
బర్రున బండేసుకు తిరిగే
అడవి దుప్పుల మందకు అధ్యక్షుడీ కుర్రాడు
అబ్బాయి పుట్టిన రోజు
వచ్చినపుడల్లా
తొలి కాన్పు వేదన కళ్లకు కడుతుంది
అప్పుడే కళ్లు విప్పిన
ఒక అద్భుత ప్రాణి మూసి ఆర్పే చిరు కనురెప్పలు మనసుకు తడతాయి
పురిటి మంచమ్మీదే ముంజేతిని జుముక్కున్న
చిన్ని కన్నయ్య నేర్పరితనం ప్రత్యక్షమవుతుంది
పసి పిల్లాణ్ణి గుండెల మీద వేసుకుని లాలించిన క్షణాలు
పాలిచ్చి ప్రాణంగా పెంచుకున్న అపురూప క్షణాలు
ఇక్కడెవరో యువకుడు నా ముందు నిలబడినా
ఎలా మాయమైపోతాయి?!
ఇరవై వసంతాల నిండు యౌవనుడు
ధీర గంభీర మేరు నగధరుడు
ప్రపంచమంతా గెలిచినట్లున్న మందహాసం
మర్యాదలూ, మన్ననలూ నేర్చిన పెద్దరికం
ఎన్నో కొత్త లక్షణాలు హఠాత్తుగా పోత పోసిన
ఈ యువకుడి నీడలో
నా చిన్నారి పసిపాపాయి
బోర్లా పడడం దగ్గర్నించీ
ప్రపంచం లో వేస్తున్న తొలి అడుగు వరకూ
ఒక్కో చిత్రమూ
జ్ఞాపకాల పాదముద్రలేస్తున్నాయి
—————–
ఈ ఆవిష్కరణలో సమావేశానికి ఆతిధ్యం వహించిన శ్రీ సి.బి రావు, అతిధులుగా విచ్చేసిన శ్రీమతి కె. వరలక్ష్మి, శ్రీమతి కన్నెగంటి అనసూయ పాల్గొన్నారు. ‘తెలుగు రచయిత’ అసోసియేట్ ఎడిటర్ శ్రీమతి స్వప్న ప్రథమ ప్రతిని అందుకున్నారు. ఈ సమావేశంలో వెనిగళ్ల వెంకట రత్నం, హిమరా రామం, ధనుంజయ, మారేమండ సీతారామయ్య, గున్న కృష్ణ మూర్తి, బాపిరాజు, అప్పారావు, సాయి లక్ష్మి, మోహిత, దీప్తి తదితర స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

సిరివెన్నెల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)