తరుముతూ వస్తోంది (కవిత)-కుంచె చింతాలక్ష్మీనారాయణ

గాలిలో ధూళై
సలసల కాలే
కొలిమిలోని ఇనుపముక్కై
తరుముతూ వస్తోంది

గాయనికి పుండై
భగభగ మండే
నిప్పుతునకల అగ్గ్నిహోరై
తరుముతూ వస్తోంది

మౌనంలో ఆవేశమై
మలమల మాడే
ఆకలికేకల మెతుకు బువ్వకై
తరుముతూ వస్తోంది

వినాశనం విశ్వానికో శాపమై
రంగులు మార్చే ఊసరవెల్లై
సృష్టిమూలం తెలుసుకోకనే
తరుముతూ వస్తోంది

అతివృష్టై అనావృష్టై
విషసర్పమై కాలయముడై
కరువై చెరువు కుంటై
తుంపరై తుఫానై
వానై జడివానై సునామై
ఏడూర్లకొకూరై
“తరుముతూ వస్తోంది”
నీమూలఉసురులు తీసే
యమపాశమై!!

-కుంచె చింతాలక్ష్మీనారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)