పునరంకితం-(కవిత)

నిర్జీవంగా నిన్ను చూసి
ఇంకా ఎందుకు బ్రతికున్నాను
మనం గడిపిన మధుర క్షణాలు
మనోఫలకం పై చెక్కిన శిల్పాలై
ప్రతిరాత్రి శోకసంద్రంలో నెడుతుంటే
నిస్తేజమై రసహీనమై బ్రతుకునీడ్వలేక
నీ సన్నిధికి చేరాలనుకొన్న క్షణంలోనే
నీకిచ్చిన మాట ఆయువు పోసింది

నీకు మాట ఇవ్వడం అంటే
దేవునకు మాట ఇచ్చినట్లే

నీ మాటే మంత్రమై నా శ్వాస
జ్వలిస్తోంటే…….
ఆశాపాశాలతో నీ లక్ష్యాన్ని
నిలుపలేనన్న భయం
విచలితురాలిని చేస్తుంటే
త్యాగం స్వార్థం అనే త్రాసులో
జీవం లేని వస్తువునయ్యా

నీ బాట నిండా ముళ్లూ పర్వతాలే
నిప్పుల కొలిమే నీ రహదారి
నీ ఆదర్శాన్ని నెరవేర్చితే బ్రతుకున
శాశ్వతంగా తిమిరానికి పరుపు వేసినట్లే

అయినా సరే |
నీవు లేకున్నా…
ఉదాత్తమైన నీ జీవితం
నాకు స్పూర్తిదాయకం……
నీ గుర్తుగా మిగిలిపోతా
కాళ్ళ క్రింద పుడమి క్రుంగినా
మిన్ను మీద పడినా
నీ ఆశ కు ఆసరా ఇస్తా…..
మన తీపి గుర్తు ను
దేశానికి అంకితమిస్తా
శత్రువుల పై క్షిపణి గా చేస్తా
ధీరునిగా పెంచి నీకు శాంతి నిస్తా
ఏమైనా కానీ ఎంత నష్టమైనా జరగని
జాతికి అంకితమిస్తా
నీ బాటంటే మా గమనం
వెరువను…….
నేను వీరపత్నిని
వీరమాతను
ఇంకా అమర జవాను భార్యను………

                                       -సూర్యదేవర వేణుగోపాల్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)