గెట్ టు గెదర్ (కథ)-శ్రీమతి జి. సందిత

“హమ్మయ్య”అనుకుంటూ
బి.ఇ.యల్ .కళాక్షేత్ర ఫంక్షన్ హాలుకి చేరుకోగానే..
గెట్ టుగెదర్ గెట్ టుగెదర్ అంటూ గంటగంటకీ
ఫోన్ చేస్తూ పదే పదే గుర్తుచేసిన భాగ్య కనిపించింది.
“బావున్నావా”అంటూ అభిమానంగా ఆప్యాయతగా పలకరించింది నిర్మాల్య.
అంతే..

“అయ్యో ఆటోలోవచ్చినట్లున్నావ్ పాపం!
మైగాడ్ నేనైతే ఏసి ట్రబులిస్తే కార్లోకూడా కూర్చోలేను” అంటూ ఆపసోపాలు పడుతూ
నిర్మాల్య చేయి పట్టుకొని తిప్పుతూ…
తన కొత్తకారూ తనభర్తహోదా తన పిల్లలచదువులూ ఆస్తులూబంగళాలూ నగలూ చీరలూ …. అంటూ తన గురించి చెబుతూ తన గొప్ప తనాన్నంతా ఆమె కళ్ళముందు ప్రదర్శించింది భాగ్య.

“నీ బ్రతుకేవిటే ఇలా తయారైంది?”
అంటూనే ….
ఇక.. నిర్మాల్య జవాబుతో గాని వివరాలతో గాని తనకు పనిలేదన్నట్లు….
ఆమె చేతిని చటుక్కున వదిలేసి…ఆమె పిలుస్తున్నా పట్టించుకోకుండా….. మరో ఫ్రెండు వైపు పరుగులు తీసింది.

వచ్చినవారిలో ఒక్కరైనా చిన్ననాటి చిలిపి చేష్టలనుగాని తీపిజ్ఞాపకాలనుగాని..గుర్తుతెచ్చుకోలేదు.
కనీసం ….బాల్యస్మృతులకు ..అక్కడ తావేలేదు.

“కళ్యాణీ!
ఎవ్వరికీ ఫోన్ నెంబర్లూ విజిటింగ్ కార్డులూ ఇవ్వకు.
ఎల్ ఐ సీ పాలసీలు రియల్ ఎస్టేట్ వెంచర్లూ చందాలూ సాయాలూ అంటూ తరువాత నీ ఫ్రెండ్సంతా నన్ను విసిగిస్తే నేనుభరించలేను.

ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్లన్నీ అలాంటి దరిద్రుల
ప్రీ ప్లాన్డ్ పథకాలే!”
అంటూ అరుస్తున్న సంపత్ కుమార్ వెంట నిస్సహాయంగా నడుస్తోంది కళ్యాణి గిల్టీగా ఫీలవుతూ.

“హలో కళ్యాణి! “అంది నిర్మాల్య
తొణుకుతున్న కన్నీళ్ళతో ఎదురైన నేస్తాన్ని పలకరింకకుండా వుండలేక.

“హాయ్ నిర్మాల్యా “
అంటూ ప్రేమగా కౌగిలించుకుంది.
అవగాహన వాళ్ళని అంతకుమించి మాట్లాడుకో నివ్వలేదు.
“ఈయన మా ఆయన హిమాలయా ఫార్మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ “
అంటూ పరిచయం చేసింది.
“నమస్తే . నా పేరు నిర్మాల్య” అంటూ ముందుకునడిచిందామె.

ముప్పయ్యారు మంది ఫ్రెండ్స్ అంతా ఒక చోట కలవటంతో ….
అందరి కుతూహలం తీరింది. అంతే…. అది మాత్రమే నిజం.
***** *** ****
జయంతి నుంచి ఫోన్ ….
“చూడవే నిర్మాల్యా! వెధవ గెట్టుగెదర్ !
ఆ సరోజ నన్ను ఆఫీస్ లో పేరుపెట్టి పిలిచింది.
అదేనా సంస్కారమంటే ?
నేను ప్రభుత్వజిల్లా ఖజానాధికారిణిని ..అది సెకండ్ గ్రేడ్ టీచర్ . అది నా ఆఫీస్ కి వచ్చి ఏకవచనంతో పిలిచింది.
స్నేహం చనువు వుండాలి. అది ఇళ్ళవద్దమాత్రమే!…బయట అయితే.. మనంమాత్రమే వున్నప్పుడు మాత్రమే!.
విధుల్లోవున్నప్పుడు వీధుల్లో వున్నప్పుడు ఎవరి స్థాయి వారిదే! అదినీకు ఫోన్ చేస్తే !దానికి బాగా అర్థమయ్యేట్లచెప్పు!”
అంటూ గబగబాచెప్పేసి ఫోన్ పెట్టేసింది జయంతి.

నిర్మాల్యను చూస్తూనే ..
“నమస్తేమేడమ్ “
అంటూ నవ్వింది వనజ.
“ఊఁ అంది” నీరసంగా
” మీ హైస్కూలు క్లాస్ మేట్స్ తో గెట్ టుగెదర్ లో కలిశారు కదా ! కార్యక్రమం ఎలా జరిగింది నిర్మాల్యా!?”
ఆత్రంగా అడిగింది వనజ కుతూహలంగా.

“పని చూసుకో !నన్ను పేరుపెట్టి పిలవకే …
అని ఎన్నోసార్లు చెప్పానునీకు!
ఏడోక్లాసుకూడా చదవకపోయినప్పటికి నీకు ఇంతపెద్ద వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో రికార్డ్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇప్పించాను .. ఆరోక్లాసులో నా క్లాస్ మేట్ వన్న అభిమానంతో……మరిచావా?

నేను గ్రాడ్యుయేట్ ని !ఈ హాస్పిటల్ లో అకౌంటట్ని.
మరో సారి నన్ను పేరుతో పిలిస్తే నీ భరతం పడతాను
జాగ్రత్త”
ఖస్సుమంది నిర్మాల్య.

“మూడురోజులనుంచి డ్యూటీకి రాలేదు.జీతం కట్ చేయిస్తానంతే!”మళ్ళీ అంది తనే.

“ప్లీజ్ మేడమ్ సారీమేడమ్ దయచేసి అంతపని చేయొద్దుమేడమ్ “

“అదంతా తర్వాత చూద్దాం ముందు కొత్తగా బాంబేనుంచివచ్చిన డాక్టర్ గారున్నారు …వెళ్ళి మేడమ్ గారితో కలిసి మాట్లాడు.కొత్త ఫైల్ ఓపన్ చెయ్ ” ఆర్డర్ వేసింది నిర్మాల్య.

పరుగెత్తుతున్నట్లు అటువైపు నడిచింది వనజ.

“నమస్తే మేడమ్ “
“ఊఁ”
“నా పేరు వనజ. ఇక్కడ రికార్డు కీపర్ ని”
“అయితే ఏంటి?”
“మీ పేరు తెలుసుకోవచ్చా?”

కుడిచేత్తో పేషెంట్ కళ్ళల్లోకి టార్చ్ వేస్తూ.. ఎడమచేతి చూపుడువ్రేలుతో టేబుల్ పైనున్న
నేమ్ బోర్డును చూపింది చిరాగ్గా.

“డాక్టర్ చొక్కరాజు సునీత యం.యస్.”
గట్టిగా చదివింది వనజ.
“మనసులో చదువుకోవాలి .కోర్టు జవానులాగా అంత గట్టిగా అరుస్తావేంటి? కొంచెమైనా కామన్ సెన్స్ లేదా?”
తలతిప్పి వనజవైపుచూస్తూ విసుగ్గా అంది డాక్టర్ సునీత .

“సారీ మేడమ్ “
అంటున్న వనజ వైపు వింతగా పరీక్ష గా చూస్తూ
“ఆ కళ్ళల్లో నీళ్ళేంటి ?నేనిప్పుడేమన్నానని అంతగా ఏడ్పు”
అంటూ నొసలుచిట్లించి మరీ అంది డాక్టర్ సునీత.

“పొరపాటైపోయింది మేడమ్”
అనుకుంటూ బయటకు పరుగెత్తింది వనజ.

అంతలోనే….
డాక్టరమ్మ రూంలో బజ్జర్ మ్రోగడంతో లోపలికి పరుగెత్తింది ఆయా.

“వనజమ్మ గురించే బొంబాయ్ డాక్టరమ్మ వివరాలు అడిగారు. ఏం పొరపాటు చేసిందో ఏమో ? “
అనుకుంటూ బయటికి వచ్చింది ఆయా అనసూయమ్మ.
“చెప్పావా?” అడిగాడు వార్డు బోయ్ ఆనంద్

“ఈ ఊరే మాకు తెలిసిన అమ్మాయే ..పాపం
మంచిదే …..అని చెప్పినాను. తర్వాత వనజమ్మ అదృష్టం డాక్టరమ్మ దయ”
నిట్టూర్చింది ఆయా జాలిపడుతూ.
** ** *** **
మధ్యాహ్నం సమయం ఒంటిగంట దాటింది
పేషంట్లంతా వెళ్ళిపోయారు.

“నిన్న ఏం జరిగిందమ్మా వనజా? నాకైతే ఏదో భయంగా వుంది.
నిన్నుకొత్తడాక్టర్ సునీతా మేడమ్ పిలుస్తోంది”
అంటూ ఆయా చెప్పడంతో
డాక్టర్ గారి రూంలో అడుగుపెట్టింది వనజ భయంభయంగా.

“స్టాఫ్ నంతా నారూంలోకి రమ్మన్నాను కదా పంపించు. “
అంటూ ఇంటర్ కమ్ లో మాట్లాడుతోంది .

“నీ వలన నిన్న రాత్రంతా నేను నిద్ర పోలేదు.
ఉదయం నుంచి ఇప్పటివరకూ పేషంట్లను కూడా
మనశ్శాంతిగా చూడలేక పోయాను.
శ్యాంసుందర్ మీ అన్నయ్యకదూ ! ఏం చేస్తున్నాడు? ” అడిగింది డాక్టర్ .

“మూడురోజులక్రితం మా అన్నయ్య ట్రక్కుకి యాక్సిడెంట్ అయింది మేడమ్ .పోలీస్ స్టేషన్ లో వున్నాడు” భయంభయంగా అంది

“యాక్సిడెంట్ అవటంకాదు. పార్క్ చేసిన నా బెంజి కారుని మీ అన్నయ్య గుద్దేశాడు”

” అయ్యో అది మీ కారా ?నాకు తెలీదు మేడమ్ క్షమించండి మేడమ్ “
అంటూ బొంగురుపోతున్న గొంతుతూ ఏడుస్తూ ముందుకొచ్చింది కాళ్ళపై పడబోతున్నట్లుగా
వనజ.

అంతే వేగంగా ముందుకు పరుగెత్తుకుంటూవచ్చి..
భుజాల్ని పట్టుకుని పైకిలేపి వనజ ని కుదిపేసింది డాక్టర్ .

“మేడమ్ “అంది మళ్ళీ వనజ వణికిపోతూ

“మేడమేంటే వనజా? నన్ను గుర్తు పట్టలేదా ?
నేనే !నీ నీతని !సునీత ని ! నీ చిన్ననాటి స్నేహితురాల్ని!
మత్తికరిలో జ్ఞానతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫస్ట్ స్టాండర్డు వరకు కలిసి చదువుకున్నాం.

మీరు మావెళ్ళిలో వుండేవారు కదూ!
నీ నుదిటి పైన ఈ గాయం మచ్చ మనం ఆడుకుంటున్నప్పుడు తగిలిందే కదా! మా డాడీయే కదా హాస్పిటల్లో కుట్లువేశారు.?

ఇదిగో నా బుగ్గమీది గాయం నీవుచేసిందే మరిచిపోయావా? “
అంటూ వనజముఖాన్ని తన రెండు అరచేతుల్లో అపురూపంగా ఆప్యాయంగా పొదివి పట్టుకుంది.

సునీత చూపిస్తున్న ఆప్యాయతను చూసి ఉబ్బితబ్బిబ్బయ్ పోతూ ఆశ్చర్యంతో కలో నిజమో తేల్చుకోలేక బొమ్మలా నిలబడిపోయింది వనజ.

అంతలోనే తేరుకొని….
“అయ్యో మేడమ్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు చూడండి.
క్షమించండి మేడమ్ ! వాళ్ళుచూస్తే బావుండదు ..”
అంటూ వణికిపోతూ ప్రక్కకువొదిగి నిలుచుంది వనజ.
“అయ్యో! అదేంటి? నేనే రమ్మన్నాను వాళ్ళని…”
అంది సునీత వనజను కుడిచేత్తో తనవైపుహత్తుకుంటూ.
అయోమయంగా చూసింది వనజ ఆమె వైపు.

“అందరికీ టీ పార్టీ ఏర్పాటు చేశాను నా రూంలో…”
అంది నవ్వుతూ అందరివైపు తిరిగి స్వాగతం చెబుతున్నట్లుగా చెయ్యూపుతూ..

“నేను స్పెషలిస్టుగా ఈ హాస్పిటల్ లో చేరినందుకు కాదు. మరెందుకోతెలుసా?
నా బాల్యస్నేహితురాలు వనజను కలుసుకున్నందుకు!

గెట్ టుగెదర్ పార్టీలు హైస్కూలు కాలేజీ విద్యార్థులే చేసుకుంటూంటారు.
కానీ…కాన్వెంటు స్థాయివాళ్ళలో కూడ చేసుకుంటే ఆ ఆనందమే వేరు.”
అంటూ ఇంటి నుండి సిద్ధంచేసుకొచ్చిన కాఫీ,టీ ఫ్రాస్కులను స్వీట్లను బాక్సులోంచి బయటికి తీసింది
డాక్టర్ సునీత నవ్వుతూ.
ఆయాలు బిలబిలా వచ్చి అందరికీ ఇవ్వడానికి సిద్ధంచేశారు.

“మీరు చాలా మంచి వారుమేడమ్ !”
అంటూ సిబ్బంది బృందంలోంచి పొగడ్తలు పొంగుకొచ్చాయ్ .

“మేడమ్ మిమ్మల్ని నేను నిన్ననే గుర్తు పట్టాను . కాని మీరే నా? అని అడిగేందుకు భయపడ్డాను మేడమ్ “
అంటూ ఆనందభాష్పాలతో వణుకుతున్నచేతులతో
సునీత చేతుల్ని ఆప్యాయంగా తడిమింది వనజ

“ఇంకా మేడమ్ ఏంటే? సునీతా అను చాలు!
నీ ముఖం చూశాక నేనూగుర్తుకుతెచ్చుకున్నా
ఆయాతో అడిగి నీవే అని నిర్ధారించుకున్నా..”
నంటూ కళ్ళల్లోకళ్ళుపెట్టిచూస్తూ నవ్వింది సునీత.

వనజ కూడా ఓ కప్పుకాఫీ తాగుదామని చేతిలోకి తీసుకుంది.
అంతే..
ఒక్క సారిగా లాగి పడేసి గబగబా చెయ్యి పట్టుకొని లాక్కొచ్చింది సునీత.
స్వయంగా కాఫీ పట్టుకొచ్చి తాను సాసర్ లో తాగుతూ కప్పులోకాఫీ వనజ కి అందించి..
“ఈ రోజుకి ఆనాటి పద్ధతి లో తాగుదాం ఓకేనా”
అంది బుగ్గగిల్లుతూ.

“నేనెంతో అదృష్టవంతురాల్ని శ్రీకృష్ణునిలాంటి స్నేహితురాలుదొరికిందినాకు”
అంటూ ..సునీత చేతుల్ని … కన్నీళ్ళతోనిండిన తన కళ్ళ కద్దుకుంది కృతజ్ఞతాపూర్వకంగా వనజ.

“శ్రీకృష్ణునిలా నేను ఈ ఆడకుచేలున్ని ధనవంతుణ్ణి చేయలేనే..
కానీ…ఆపదలో ఓ స్నేహితురాలిగా చేతనైన సాయం చేయగలను అంతే” అంది సునీత ఆత్మీయంగావీపునిమురుతూ.

“మేడమ్ అంతా మనల్నేచూస్తున్నారు” అంటూ దూరంగా జరిగింది వనజ.
“అబ్బ !మేడమ్ కాదు ఇది నీ స్నేహితురాలు నీత!

అన్నట్లు…చెప్పటం మరిచాను.
నా కారుకి యాక్సిడెంట్ చేసింది అన్నయ్యశ్యామ్ సుందర్ కదూ!
పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఉదయమే ఫోన్ చేసి చెప్పాను.
కేసుమాఫీ చేసి ఇంటికీ పంపించెయ్యమని !
ఈ పాటికి అన్నయ్య ఇల్లుచేరుకొనివుండవచ్చు.
త్వరగా ఇంటికివెళ్ళు మన హాస్పిటల్ ఏ వో గారి తో నేను మాట్లాడానులే అంది ” సునీత నవ్వుతూ.

స్నేహం ఆత్మీయమై తన్మయత్వంలో ముంచెత్తటంతో
తారతమ్యాన్నలా మరచిపోయి చిన్నపిల్లలా ఏడుస్తూ …వనజ సునీతని కౌగిలించుకుంది గట్టిగా “సునీతా నేను నీ మంచి తనాన్ని భరించలేకున్నానే” అంటూ.
అందరికీ ఆదర్శప్రాయంగా అనిపిస్తూ పరస్పర స్నేహానుభూతితో ఒకరి కౌగిట్లోఒకరు కరిగిపోతూ ఒదిగిపోయారిద్దరూ .

-శ్రీమతి జి సందిత(Sanditha)

బెంగుళూరు.

****                ****                      ***                      ***                  ***

కథలుPermalink

2 Responses to గెట్ టు గెదర్ (కథ)-శ్రీమతి జి. సందిత

  1. శ్రీమతి జి సంందిత బెంంగుళూరు says:

    వెంకటేశ్వరరావు గారికి నమస్కారములు .

    స్పందించే మీ వంటి పెద్దల ఆశీస్సులు సూచనలే రచనాభిలాషులకు ఊపిరులు వరాలు

  2. దడాల వెంకటేశ్వరరావు says:

    చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)