నల్లకలువలు నక్షత్రాలు(పుస్తక సమీక్ష )-జాని.తక్కెడశిల 

ప్రముఖ కవి శ్రీ ఎస్.వి రామశాస్త్రి గారు రాసిన నల్లకలువలు నక్షత్రాలు కవితా సంపుటి లోని కవితలు కొన్ని నక్షత్రాల వలె మి రిమిట్లు గొల్పుతుంటే మరి కొన్ని పరిమళాలు ఎద పై వెదజల్లుతాయి. స్వతహాగా చిత్రకారుడు కావడంతో ఆయన కవిత్వ వస్తువులు వాటి భావాలు మన హృదయాలలో ఆవిష్కరణ అవుతాయి. ఆకాశం కవితలో పిల్లల అల్లరి వల్ల హృదయంలో ఆకాశం వెలసి ఇంద్రధనస్సు చిగురిస్తుంది అని చెప్తూ మరొక కవితలో చిన్నప్పుడు ప్రతి తల్లి తండ్రి వారి పిల్లలతో ఆడిన దోబూచులాటలు హృదయాన్ని హత్తుకుపోయేలా వివరించారు దీన్నిబట్టి చూస్తె ఈ కవి పసి హృదయం కలవాడని తెలుస్తుంది.

మనోధర్మం కవితలో ఎంచుకున్న మార్గం ఏదైనా కాని అందరిని ఆహ్వానించు, అందరి దగ్గర నుండి నేర్చుకో అని కవికే ఒక కవి హితబోధ  చేయడం చాలా  బాగా నచ్చింది.కొన్ని పూలు కవితలు అత్భుతమైన ఈ వాక్యాలు చాలు కవి ఎంత విలక్షణంగా ఆలోచిస్తారు అని చెప్పడానికి.

ఒక రాత్రి వేల చిన్ని తుమ్మెర సంపంగి పూల పరిమళం అందిచినట్టు, చిరుగాలికి చెట్టు పురి విప్పినట్టు

దర్శించిన కొన్ని దృశ్యాలు హృదయాన్ని తాకాలి,గుండె మీటి నిన్ను కవిని చేయాలి. స్త్రీ ని సముద్రంతో పోలుస్తూ రాసిన కవిత ఈ పుస్తకానికి ఒక మకుటం అని చెప్పవచ్చు.దోపిడీ గురించి నాలుగు వాఖ్యలలోనే అనంత రహస్యాన్ని బట్టబయలు చేసారు. మనసులు వేసుకున్న ముసుగులు గురించి చెప్తూ రాసిన కవిత “వెతుకుతూ” ఆలోచించేలా చేస్తుంది. “నివేదన” కవిత చదువుతున్నపుడు కన్నులలో నీటి ఊటలు ఉరాయి.

“స్వర్ణోత్సవం” కవితలో అతడు ఆమెను వివరించిన తీరు అమోఘం అనే చెప్పాలి,ప్రయాణం గురించి రాసిన కవిత పాటకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్తుంది. “నా చెప్పులో వాడి కాళ్ళు”  ఈ కవిత చదివితే ప్రతి తండ్రి మురిసిపోతారు. తప్పకుండ అందరికి జరిగే మరియు అనుభవించే సంఘటనలు కవితా వస్తువులుగా తీసుకోని సూటిగా సుత్తి లేకుండా చెప్పిన తీరు చాలా  ఆశ్చర్యానికి  గురి చేస్తుంది.

ఊటబావి,నెలబాలుడు,ఆకాశపు అరణ్యంలో,వినిలాకాశంలో,మైండ్ ఫ్రీక్,అగ్గిపూలు,చుక్కల లోకం నుంచి,అశోక సముద్రం,ఈ కవితలలో కవి పథకుడిని పతాక స్థాయికి తీసుకుపోతాయి. మొత్తం మీద ఈ పుస్తకం చదువుతున్నపుడు వచనం కాదు, వచన కవిత్వం చదివాను అని భావన చాలా  రోజుల తరువాత అనిపించింది.

-జాని.తక్కెడశిల

———————————————————————————————-

UncategorizedPermalink

Comments are closed.