శుభలగ్నం (కవిత)-దాసరాజు రామారావు

ఒప్పిదమో తప్పిదమో

అంగీకారపత్రం మీద పెద్దల సంతకాలు పిచ్చిగీతలే
ముట్టిచ్చిన పసుపుకుంకుమలు
తడారిపోయి రాలిపోవుడే

ప్రియమో అప్రియమో

కొనుగోళ్లలో పోగులుపడ్డ బంగారం,బట్టల ధగధగలు
ఆకర్షణ కోల్పోయి-
పెట్టుపోతల భారీ కానుకలు
మూతి విరుపుల మురికంటి-

మంచిదో చెడుదో

పెళ్లిపందిరికి కట్టిన మామిడి తోరణాల గలగలల్లోంచి
కాపుకొచ్చిన కలలు నేలపాలై-
ఇంటికతికించిన రంగుకాగితాలు
గాలి పుకార్లకు కొట్టుకుపోయి-

సుఖమో కష్టమో

మంగళ సొన్నాయిల ఉప్పొంగిన రాగాలేవి
పడకటింటిల సిగ్గుల మొగ్గలు పూయించలే
పురోహిత మంత్ర ధ్వనులతో
పీడ కలలేవి చెదరిపోలే

పుణ్యమో పాపమో

మాంగల్యధారణ గర్భ ధారణకే అర్హత నిచ్చే
బంధుమిత్రులు చల్లిన అక్షింతల
బరువుకు మౌనమై తలొంచే-

స్వర్గమో నరకమో

కలిసి నడిసిన నడకలతో ఏ తీరాలకు చేరడమో…

బంధానికో,సంసారానికో
కాలాలను ఎరవేస్తూ …..

– దాసరాజు రామారావు
96182 24503.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

2 Responses to శుభలగ్నం (కవిత)-దాసరాజు రామారావు

 1. dasaraju ramarao says:

  మీ వివరణకు ధన్యవాదాలు దడాల వెంకటేశ్వరరావు గారు.

 2. దడాల వెంకటేశ్వరరావు says:

  తెలిసో తెలియకో
  శుభలగ్నాన్నికి ముడివేసిన ముఖచిత్రం
  కాబూల్ వీధుల్లో తిరుగుతున్న బిచ్చగత్తెది
  ఆఫ్ఘనిస్తాన్ చిత్ర దర్శకుడు సిద్దీక్ బార్మాక్
  తన చిత్రం ఒసామాలో నటిగా ఎంచుకున్నది

  1989 లో పుట్టిన ‘మెరీనా గోల్బాహరి’ 2003 చలన చిత్రం ఒసామాలో నటించి అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. ఈ చిత్రంలో ఆమె తాలిబాన్ సంవత్సరాల సమయంలో తన కుటుంబ సభ్యులకు మద్దతు ఇచ్చే బాలుడిగా దుస్తులు ధరించాల్సి వచ్చింది. ఈ చలన చిత్రం ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు సంపాదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)