పోయం(కవిత ) – రమేశ్ కార్తిక్ నాయక్

నీవు నడుస్తూ ఒదిలి వెళ్లిన
ఈ పాద ముద్రల ఙ్ఞాపకాల్ని
ఆకాశం భద్రపరిచినట్లుంది

నీ పాదాల్ని ముద్దాడిన
ఈ నేల మట్టి ఇప్పుడు
జాతీయగీతం పాడుతోంది

నీవు నాటిన జెండా
ఇప్పటికి నవ్వుతూనే ఉంది
దాని నీడలో
రోజుకో దేశభక్తి కధ అంకురిస్తూనే ఉంది

కధలు కధలుగా
వాళ్ళు నిన్ను పాడుకుంటున్నారు

నీ రక్తంలో
దశాబ్దాలుగా పేలుతున్న బాంబుల గురించి
నీ దేహం పై జరుగుతున్న కురుక్షేత్రం గురించి
సూర్యుని కిరణాల గురించి
నీ దేహాన్ని జల్లెడ గా మార్చుకున్న తీరు గురించి
వాళ్ళు పదే పదే పాడుకుంటున్నారు

నీ పాదాలు అమరత్వాన్ని పొందినట్లున్నయి
ఆ పిల్లలంతా నీ పాదగుర్తుల గుండా
గుడ్డిగా యుద్ద భుమి వైపుకు నడుస్తున్నరు

రమేశ్ కార్తిక్ నాయక్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)