మసాలా దోశ- కవిత

పరాత్పరుని ఓజస్సుతో
ఓజోన్ పొరదాటి
పొరలిపుట్టిన
హెచ్ టు వో అణుమిశ్రితమై
తామరాకుపై నిలిచిన
కిల్బిషాతీతమైన
ఆనాటి
నీటిబొట్టును కాను నేను

నాన్ స్టిక్ పెనంపై
అతుక్కోకుండా లేచిన
మసాలా దోశలాంటి నేటి మహిళన్నేను!

వెలితిమతులున్న
బేహారీలచేతుల్లోంచి
జారిన కల్తీనూనెతో
బ్రతుకు వెతలతో
చిర్రెత్తినరైతులకష్టంతో
బిత్తరపోయిన విత్తుల్లోంచి
పొంచిబయటబడి
పోటీపడి పొట్లాల్లోకెక్కిన
ఉద్దులతోబియ్యాలతో
నెయ్యంచేసి…
పొయ్యిదాకావచ్చి
ఇల్లాళ్ళవిసుగుల్లోంచి
రజోగుణాన్నికలబోసుకొని
ఉడుకుక్రోధాల్లో
ఉడికి ఉడికి ఉబికిలేసిన
క్లిష్టతత్త్వాన్నందిన
మహిళాతత్త్వప్రతినిధిన్నేను
మసాలా దోశన్నేను!!

కృతకసాంకేతిక యంత్రసృష్ట్యాన్ని నేను!
భస్మాచ్ఛాదిత విచక్షణా సంయమిత పవిత్రాగ్నిన్నేను!!

                                                   – శ్రీమతి జి సందిత ,బెంగుళూరు

***********************************

 • గురుదేవులు ఆచార్య మసన చెన్నప్ప వారి
  పాదాలకి ఈ కవిత అంకితం.
 • ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కవితలుPermalink

3 Responses to మసాలా దోశ- కవిత

 1. దడాల వెంకటేశ్వరరావు says:

  మీ ఆధ్యాత్మిక తాత్విక పవిత్రాగ్నిని నాపై కురిపించి నన్ను శాంతింపజేసినందుకు కృతజ్ఞతాభివందనలతో మీ అభిమాని

  దడాల వెంకటేశ్వరరావు

 2. వెంకటేశ్వరరావు says:

  ” వెలితిమతులున్నబేహారీలచేతుల్లోంచి జారిన కల్తీనూనెతో” ఈ పదాల్ని శ్రీమతి జి సందిత గారు వెనుకకు తీసుకోవలసి ఉంటుంది.
  అదియునుగాక శ్రీమతి నందిత గారు దోసె గురించి మాత్రమే చెప్పారు. మసాలా గురించి ప్రస్తావించనేలేదు.
  నీటిబొట్టునుకాదన్న శ్రీమతి జి సందిత గారు నీటిబొట్టులేకుండా దోసె రాదనికూడా గమనించాలి.
  ఒకవేళ మహిళాతత్వప్రతినిధి మసాలాదోసె అయితే దాని స్తానం ప్రపంచంలోని 50 అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలలో 49 గా మాత్రమే ఎందుకు మిగిలుంటుంది.
  చివరిగా ఈ క్రింది వరుసలు మసాలాదోసకు ఎందుకు అనుసంధానించారో తెలియలేదు
  “కృతకసాంకేతిక యంత్రసృష్ట్యాన్ని నేను!
  భస్మాచ్ఛాదిత విచక్షణా సంయమిత పవిత్రాగ్నిన్నేను”
  బదులు చెప్పగలరు

  • శ్రీమతి జి సంందిత బెంంగుళూరు says:

   గౌ.న వెంకటేశ్వరరావు గారికి నమస్తే

   ” వెలితిమతులున్నబేహారీలచేతుల్లోంచి జారిన కల్తీనూనెతో”

   ఈ పదాల్ని కలిలోకపు మనోగుణకాలుష్యానికి ప్రతీకగా వాడాను. మీరు నూనె వ్యాపారులై వుంటే మీ మనోభావాలను దెబ్బదీసి యుంటే సారీ .
   మీరు కోరినట్లు మసాల గురించి మరో కవిత లో చెబుతాను.

   “ఆనాటి నీటిబొట్టు”నుకాదన్నాను.
   నీటిబొట్టులేకుండా దోసె మాత్రమే కాదు. సృష్టికూడా రాదని మీరుకూడా గమనించాలి.

   నా కవిత లోని నీటి బొట్టు ఆధ్యాత్మికమైనది.

   ఒకవేళ మహిళాతత్వప్రతినిధి మసాలాదోసె అయితే దాని స్తానం ప్రపంచంలోని 50 అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలలో 49 గా మాత్రమే ఎందుకు మిగిలుంటుంది?

   పై ప్రశ్న చే… మీరు దోశ పై మంచి విషయాన్వేషణ చేసినట్లు గ్రహించాను అభినందనలు.

   నా కవితలోని దోశలోని ..తాత్త్వికభావం వేరు మీరు పరిశోధించిన దోశ వేరు.

   చివరిగా ఈ క్రింది వరుసలు మసాలాదోసకు ఎందుకు అనుసంధానించారో ?
   “కృతకసాంకేతిక యంత్రసృష్ట్యాన్ని నేను!
   భస్మాచ్ఛాదిత విచక్షణా సంయమిత పవిత్రాగ్నిన్నేను”

   ఆధునికపు కృత్రిమత్వం ప్రశాంతతను ఉద్రిక్తం చేస్తోంది .
   మీరు నా కవితపై కలత చెంది నట్లుగా
   అదే….యంత్ర సృష్ట్యం!

   కాని పవిత్రమైన ప్రజ్ఞానకాంతి భ్రమలపొరలను తొలగించుకుంటూ అవసరమైనపుడు వెలువడుతుంది ప్రశాంతి మార్గం చూపిస్తూ
   ఇదే…………… నా తాత్త్వికపవిత్రాగ్ని!
   స్పందించినందుకు
   కృతజ్జతాంజలులతో.
       – శ్రీమతి జి సందిత ,బెంగుళూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)