విస్మృతి వృక్షం(కవిత ) -కె.గీత

విస్మృతి లోనూ
ఎటు ఒత్తిగిలినా
గుచ్చుకునే జీవితం
వర్తమానపు బాట మీద
ఎక్కడైనా ఆగినా
వెనక్కి ఒక్కసారి తొంగిచూసినా
నిలువెల్లా భగభగలాడే గతపు బడబానలం
బండబారిన గుండెని కూడా
దహించివేసి
బుగ్గి పాల్చేస్తుంది
అయినా దు:ఖపుటెరువు నించే
అనుక్షణం
ప్రాణం పోసుకునే
గొంతులోని బాధా విత్తనాలు
గడ్డ కట్టి
కాస్త ఖాళీ దొరికితే
మొలకెత్తడమే ధ్యేయంగా
కళ్ల వెంబడి కన్నీటి కాయల్ని మొలిపిస్తున్నాయి
ఎటు తిరిగి రోదించను?
ఎవరితో మొరపెట్టుకోను?
నా విషాద దుర్భర దు:ఖాతిరేకాన్ని
ఏ భుజమ్మీద ఆన్చను?
చావైనా కరుణించని
బాధా చక్ర భ్రమణ
బతుకు భారాన్ని
ఎక్కడ
కాస్సేపు చేతులు మార్చుకోను?
సిగ్గులేని నవ్వుని పులుముకున్న
ముసుగు జీవితాన్కి
ఎలా స్వస్తి చెప్పను?
రాత్రుళ్ళని మింగే
పగళ్లు-
పగళ్ళని తరిమే
రాత్రుళ్ళు-
ఛిద్రావయవాలీడ్చుకుంటూ
వర్తమానపు పరుగు
విస్మృతి లో
ఎటు ఒత్తిగిలినా
స్మృతి లో
ఎటు తలతిప్పినా
మొలకెత్తే కన్నీటి కాయల
కొమ్మలేసుకుని
సిగ్గులేని నవ్వుపూలు పూయిస్తూ
శిశిర జీవితాన్ని
వసంతంలా భ్రమించే
పిచ్చి చెట్టొకటి
నిద్ర రాని రాత్రికి వేళ్లాడుతూ
………………

                                                 -కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

2 Responses to విస్మృతి వృక్షం(కవిత ) -కె.గీత

 1. వెంకటేశ్వరరావు says:

  ‘దు:ఖపుటెరువుతో బాధా విత్తనాలకన్నీటికాయల కొమ్మలతో సిగ్గులేని నవ్వుపూలపిచ్చిచెట్టొకటి నిద్రరానిరాత్రికి వేలాడింది’ అంటున్నారు. అంతే కదండి.

 2. శ్రీమతి జి సంందిత బెంంగుళూరు says:

  హేమలత మేడమ్ గారికి నమస్తే.
  ఆధ్యాత్మిక వ్యాసాలకు కూడా స్థానంం
  కల్పింంచప్రార్థన
  జాతీయరాష్త్రవిశిష్టసాహితీపురస్కారగ్రహీత(గురజాడ ఫౌౌంండేషన్ U.S.A)
  సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సంందిత బెంంగుళూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)