జ్ఞాపకం-22 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

అలా చెబితే వదిన చెప్పే అబద్దపు ఆరోపణలు  అన్నయ్యకి తెలిసి పోతాయి. తెలిశాక అసహ్యించుకుంటాడు. అసలే ఉడుకుమోత్తనం, అహంకారం ఎక్కువగా వుండే వదిన మరింత రెచ్చి పోతుంది. కోపంతో రచ్చ రచ్చ చేసి కొండాపురం వెళ్లిపోతుంది. ఆపదలో వున్న అన్నయ్య వదిన లేకుండా వుండలేడు. ఆ భయంతోనే మౌనంగా వుంది సంలేఖ.
అకస్మాత్తుగా సంలేఖ దృష్టి పక్క బెడ్డులో వున్న సిద్ధప్పమీద పడిoది. పాపం ! ఈ సిద్ధప్పను చూడటానికి ఒక్కరు కూడా హాస్పిటల్‌కి రాలేదు. పోయాక కూడా వస్తారో రారో ! చివరకి మున్సిపాలిటీ వాళ్లే గతయ్యేలా వుంది. తనకి తెలిసి ఈ సిద్ధప్ప ఎవరికి ఏ బాధ కలిగినా వెళ్లి ఓదార్చేవాడు.
తినటానికి డబ్బులు  వున్నాయా, లేవా అన్నది పట్టించుకోకుండా చేతిలో వున్న డబ్బుతో ఎంతెంత దూరమో వెళ్లి పరామర్శించి వచ్చేవాడు… ‘ఏంది సిద్ధప్ప ఈ పని?’ అని అడిగితే ! ‘నేను ఒంటరివాడ్ని నాకేదైనా అయితే అందరూ రావాలిగా!’ అనే వాడు. ఇప్పుడు చూడు ఒక్కరన్నా వచ్చారా! వున్నా ఒకడే ! పోయినా ఒక్కడే అని నిర్లక్ష్యంగా వున్నారు. ఇలాంటి ఒంటరి వాళ్లకు ఎవరొస్తారు? అతని తల్లి చచ్చిపోయినప్పుడు కూడా ఒక్కడే ఏడ్చుకుని ఒక్కడే పారేసుకున్నాడు. ఇన్నాళ్లూ ఎదుటి వాళ్లు నవ్వగానే ఆ నవ్వులో మాయలేదనుకున్నాడు సిద్దప్ప. హుషారుగా తిరుగుతున్నప్పుడు వున్నట్లే తిరగలేనప్పుడు కూడా వుంటుందనుకున్నాడు. చావుకీ పుట్టుకకి మధ్యన వుండే ఈ నిర్జీవ చర్యలు  ఇలాంటి పిచ్చి సిద్ధప్పకేం తోస్తాయి…? అని మనసులో అనుకుందే కాని ఆమెలో వుండే రచయిత్రి సిద్దప్పను తను రాయబోయే కథలో ఒక పాత్రను చేసుకుంది. ఆమెలోని రచనా శక్తికి అప్పుడప్పుడు ఇలాంటి సజీవ పాత్రలే ప్రాణంగా మారుతున్నాయి. ఇదంతా ఆమెకు తెలియకుండానే ఆమెలో జరుగుతున్న అంతర్‌ చర్య. సిద్ధప్ప పాత్రనే ఆలోచిస్తూ బయటికెళ్లింది సంలేఖ. ఆమె అలా వెళ్లగానే రాజారాంని పరామర్శించడానికి వచ్చినావిడతో తన బాధనంతా వెళ్లకక్కింది వినీల. ‘‘చూస్తున్నావుగా పిన్నీ ! ఆపద వచ్చినప్పుడు ఇంట్ల్లో వాళ్లే సరిగా పట్టించుకోవడం లేదు మమ్మల్ని’’అంది.
ఆ మాటలు  ‘చట్‌’ మని తగిలాయి తిలక్‌కి. అలా తగలానే అంది వినీల.
వినీల  మాటల్లోని భావాన్ని వెంటనే పట్టేసిన దానిలా ఆవిడ ఒక్క క్షణం రాజారాం వైపు చూసి ‘‘ఈ రాజారాం తిండి ఎందుకు తినడం లేదో, ఎందుకు లేచి కూర్చోలేకపోతున్నాడో అర్థంకాక మన కొండాపురం వాళ్లు హస్పిటల్‌ ముందు నిలబడి చర్చించుకుంటున్నారు. బసవరాయుడు బ్రతికి వుంటే ఈ పాటికి హస్పిటల్‌ సిబ్బందినంతా ఓ చోటకి చేర్చి అసలు  సమస్యను తేల్చేదాకా వదిలేవాడు కాదు. ఇప్పుడు అడిగే వాళ్లు లేరు. తేల్చేవాళ్లు లేరు. డాక్టర్లు కూడా ఏదీ సరిగా చెప్పరు. అసలు  ఎక్కడో తప్ప ఈ గవర్నమెంట్‌ హస్పిటల్స్‌లన్నీ ఇలాగే వుంటున్నాయి. ఈ యాక్సిడెంట్ల కేసుతో ఎంతటి వాళ్లకైనా ఇక్కడికి రాక తప్పట్లేదు ! ’’ అంది.
బసవరాయుడు పేరు వినగానే చిర్రెత్తు కొచ్చింది వినీలకి… అసలు  ఆయన సమాధి పని వల్లనే  జరిగింది. ఉదయం మామగారు సమాధల  కోసం ఇసుక తెమ్మని తన భర్తతో చెబుతుంటే తను అది విని భర్తను పక్కకి లాగింది. రహస్యంగా ‘నువ్వు ఇసుక తేవటానికి వెళ్లొద్దు. వెళ్లావంటే నువ్వు తిరిగి వచ్చే లోపలే నేను చచ్చిపోతాను. అదేమైనా పుణ్య కార్యమనుకుంటున్నావా మళ్లీ పునరుద్ధరించటానికి…? కాదు. అది కీడు కార్యం మనిషన్నాక కొద్దిగానైనా భయముండాలి. మా వూర్లో మాకు అత్యంత సన్నిహితుల  వాళ్ల అమ్మాయి మెచ్యూర్‌ అయిన కార్యక్రమాన్ని అతి ఘనంగా చేస్తూ షామియానాలు  కావాలని ట్రాక్టర్‌ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్తే ట్రాక్టర్‌కి కిరాయి కూడా వస్తుంది. ఇక్కడికెళ్తే ఏమొస్తుంది? ఇసుకేగా!’ అంటూ భర్తను కొండాపురం పంపింది. భర్త తన మాట విని ఇసుక కోసం వెళ్ళకుండా షామియానాకోసం వెళ్ళటం ఈ యాక్సిడెంట్‌ జరిగింది. తన మాట వినకుండా వాళ్ల తండ్రి మాట విని ఇసుక తేవడానికి వెళ్లుంటే ఇలా జరిగేది కాదేమో! తన సలహా వల్లనే  పడి తన భర్త హాస్పిటల్ల్లో బెడ్‌ మీదకి చేరాడు. చేరినవాడు చేరినట్లే వున్నాడు. తినటం లేదు. లేచి కూర్చోవడం లేదు… మాట్లాడుతున్నాడంతే ! అదంతా కళ్లముందే కన్పిస్తూ మళ్లీ ముక్కు చీదింది వినీల.
వినీల  బాధపడేది బసవరాయుడి కోసమేమోనన్న అపోహతో ‘‘నువ్వెంత బాధపడ్డా ఆ బసవరాయుడు తిరిగిరాడు. బాధపడకు’’ అందావిడ.
‘‘నా బాధ అది కాదు పిన్నీ ! మొద్దు పోయ్య తన భార్యకేదో సౌదీలో వున్న కొడుకు పంపిన డబ్బుతో సమాధి కట్టిస్తున్నాడని మా మామ గారు కూడా డబ్బులన్నీ తీసికెళ్లి వాళ్ల అమ్మా, నాన్న సమాధుల్లో పొయ్యాలనుకుంటున్నాడు. డబ్బులేమైనా ఎక్కువున్నాయా? అసలు  ఎక్కువ వున్నా ఇలాంటి పనులకి వాడతారా? ఏం కీడు కొట్టుకుందో ఏమో అ పని మొదలు  పెట్టాకనే ఈయనకి ఇలా జరిగింది. నాకైతే వాటిని మా పొలంలోంచి తీయించేయాలని వుంది. వాటివల్ల  అరసెంటు పొలం  దండగ. అందులో వచ్చే పంట నష్టం…’’ అంది.
ఆవిడ కొద్ది సేపు షాక్‌లోకి వెళ్లి మళ్లీ తేరుకొని ‘‘నీ బాధేంటో, నీ ఆలోచనలేంటో నాకు తెలియదు కాని వాటిని మాత్రం పొలం లోంచి తియ్యాలని మాత్రం చూడకు. పెద్ద వాళ్ల ఆత్మలు  బాధ పడతాయి…’’ అంది.

(ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)