ఆనాటి నెల్లూరోళ్ళు(పుస్తక సమీక్ష ) – అరసి

ఈత కోట సుబ్బారావు వృత్తి రీత్యా పత్రికా విలేఖరి , అంతమించి సాహిత్యాభిలాషి . రచయిత . హృదయ లిపి (కవిత్వం), అక్షరానికో నమస్కారం (దీర్ఘ కవిత ) , పెన్నా తీరం (చరిత్ర ) నెల్లూరు నాటకం (చరిత్ర ), దీపాల పిచ్చయ్య శాస్త్రి , నెల్లూరు గాలివాన (సంపాదకత్వం ), చీలిన మనిషి (కవిత్వం ), నీటి చుక్క (దీర్ఘ కవిత ) , కాశీ బుగ్గ (కథ సంపుటి ) వంటి రచనలు చేసారు .

ప్రస్తుత రచన ఆనాటి నెల్లూరోళ్ళు . తెలుగు నేలపై నెల్లూరు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది . చరిత్ర పుటల్లో కూడా నెల్లూరు వాసులు తమదైన ముద్రను సొంతం చేసుకున్నారు . అటువంటి వారి జీవిత విశేషాలను , వారి విజయాలను గురించి ముందు తరాలకి , ముఖ్యం భారతీయులకు తెలియజేసే ప్రయత్నమే మన ముందుకు వచ్చిన గ్రంధం ఆనాటి నెల్లూరోళ్ళు .

ప్రాచీన సాహిత్యంలో కవి సార్వభౌముడు శ్రీనాధుడు , కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయము వారితోపాటు వేదం వెంకట రామశాస్త్రి , గుంటూరు శేషేంద్ర శర్మ , ఆధునిక ఆంద్ర కవయిత్రులలో ప్రఖ్యాతి వహించిన వారు కాంచనపల్లి కనకాంబ . హిందూ సుందరి , సావిత్రి ,అనసూయ , దేశాభిమాని , ఆంధ్ర పత్రిక , గృహ లక్ష్మి లాంటి సాహిత్య పత్రికలలో నిరంతరం సాహితీ వ్యాసాలూ ప్రచురితం అయ్యాయి . అచ్చ తెనుగు కవి అయ్యన కోట ,తొలి గిరిజన కథకుడిగా పేరుపొందిన గూడూరు రాజేంద్ర రావు , గోడ పత్రిక ఇంద్ర కంటి సుబ్రహ్మణ్యం ,కవిరాణి చిలకపాటి సీతాంబ , కలం యోధుడు పఠాభి వంటి వారు నెల్లూరు వాసులే కావడం విశేషం .

తెలుగు నాటక రంగంలోనూ రంగస్థల నటులుగా వీరి ముద్ర కనిపిస్తుంది కనడానికి నిదర్శనం గూడూరు సావిత్రి ఐదేళ్ళ ప్రాయం నుంచి 60 సంవత్సరాలు వయస్సు వరకు నటనలో తనను తానుగా కరిగిపోయిన నటి ఆమె . ఇంకా విలక్షణ నటుడు స్త్రీ పాత్రధారి రేబాల రమణ , సాంఘిక నాటక రూపకర్త మజ్జిగ విశ్వనాథ్ రెడ్డి ,కళా రత్నం గంగారత్నం ,కళా భరణం ఆరంబాకం రాజసింహ , పులుగుండ్ల రామకృష్ణయ్య వంటి వారు ఎందరో ఉన్నారు.

ముస్లిం తెలుగు కవుల్లో ఆణిముత్యం దావూడు కవి . కడప జిల్లా చిట్వేలి గ్రామంలో తండ్రి సుల్తాన్ సాహెబు , తల్లి ఖాదర్ బీల 1-7-1916 లో జన్మించారు . శ్రీ షిర్డీ శతకం , దాసీపన్నా ఖండ కావ్యం , సూఫీ సూక్తులు , సంస్కార ప్రణయం , అశ్రువులు , చిత్త పరివర్తనము వంటి రచనలు చేసారు . ఆంగ్లంలో తొలి స్వీయ చరిత్ర కర్త వెన్నెల కంటి సుబ్బారావు విశేషాలను పొందుపరిచారు . ఇప్పటికి తొలి కథా రచయితగా భిన్న వాదాలు విన్పిస్తూనే ఉన్నాయి . గురజాడ , బండారు అచ్చమాంబ వాదం ఉన్న తొలి కథకుడిగా తాతాచారిని పేర్కొనటం కనిపిస్తుంది . ఈయన రాసిన రచన తాతాచారి కథలు 1855 లోనే పుస్తకంగా ముద్రించారని వివరించారు . అదే సంవత్సరం వీటిని ఆంగ్లంలోకి “ పాపులర్ తెలుగు  టేల్స్ పేరుతో అనువదించారు .
ముద్రణా రంగంలో ఆద్యుడైన వావిళ్ల రామాస్వామి వివరాలు ,  పెద్దబాల శిక్ష గ్రంధ కర్త వజల సీతారామ శాస్త్రి జీవిత విశేషాలు , దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి ఉర్దూ , పర్షియన్ భాషల్లో గజల్స్ సృష్టించిన జుకా నెల్లూరి వాసే కావడం విశేషం . తొలి గ్రామీణ జీవన కథకుడు కరుణ కుమార సాహిత్యం , ఆయన జీవిత విశేషాలను తెలియజేసారు . ఆంద్ర దేశానికే పూజ్యునీయులు పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు , ఆయన ఆమరణ నిరాహరణ దీక్ష వంటి సంఘటనలు పొందుపరిచారు . తెలుగులో భావ కవిగా , అభ్యుదయ కవిగా పేరొందిన దువ్వూరు రామిరెడ్డి రచనా శైలి , వ్యక్తిగత జీవితం , సాహిత్యం తెలియజేశారు .

తెలుగు సినిమా రంగంలో నవ్వుల రెడ్డి , చినవ్వుకి చిరునామాగా నిచిన రమణా రెడ్డి నెల్లూరు వ్యక్తే కావడం విశేషం . ప్రతి నాయకుడిగా ప్రతిభ చూపిన రాజనాల ,సింగీతం శ్రీనివాసరావు,భారతీయ సినిమాను అధ్యయనం చేయాలనే ఏ తరం వారైనా వై.వి.రావు, యరగుడిపాటి వరదారావుని ప్రస్తావించాల్సిందే .

తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే నాయకులలోనే ఒకరు . దేశంలోనే తెలుగు వారి వ్యక్తిత్వానికి పర్యపడంగా నిలిచిన పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు సమీపంలోని అలగాని పాడు వీరి జన్మభూమి . రాయకుండా దర్శకులని , రాసి సినీ ప్రేక్షకుడిని ఏడిపించే మనసు కవి ఆత్రేయ కూడా నెల్లూరి వాసే .

ఇంకా అంతర్జాతీయ కళాకారుడు డాక్టర్ చంద్ర శేఖరం , తొలి సమాజ శాస్త్రవేత్త మామిడి పూడి వెంకట రంగయ్య , బందరు కళాశాల నిర్మాత ముంగమూరు నరసింహం పంతులు , తమిళనాడు ప్రభుత్వ చిహ్న రూప శిల్పి ఆర్ . కృష్ణా రావు .
ఈ పుస్తకంలో అక్కడక్కడ ఛాయా చిత్రాలతో ఆనాటి వైభవాలను , గుర్తులను ఇవ్వడం జరిగింది . కృష్ణ పట్నంలో 1000 సంవత్సరంలో సిద్దేశ్వరాలయం , 150 ఏళ్ల నాటి ఉదయగిరి మెయిన్ బజారు , నెల్లూరు జిల్లా రూట్ మ్యాప్ ని తయారు చేసిన ఆంగ్లేయ అధికారి కొలిన్ మెకంజీ , 100 ఏళ్ల నాటి నెల్లూరు ట్రంకు రోడ్డు దృశ్యం , తిప్పరాజు వారి సత్రం ఆవరణం లో ఉన్న లాటీ చౌక్ వంటి చిత్రాలు పుస్తకంలో అక్కడక్కడ పొందుపరిచారు.

అమెరికన్ హాస్పటల్ ప్రారంభోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి అంబులెన్స్ ఛాయా చిత్రం ,110 ఏళ్ల ప్రతాపరుద్రీయం నాటక ప్రదర్శన ఛాయా చిత్రం , ఎర్రదాచా నాయుడు పంచ పాండ్య రాజులను జయించి తెచ్చిన బంగారు సింహాసనము మ 1922 లో ఆంగ్లేయ దొరలకు స్వాగతం పలుకుతున్న వెంకటగిరి రాజులు , బ్రిటీష్ హయాంలో నిర్మించిన నెల్లూరు వాటర్ పంపింగ్ హౌస్ , భైరవ కొన కళా సంపద , తొలినాళ్లలోని పెట్రోలు బంకు, మోటారు వాహనం , ఉదయగిరి దుర్గం ప్రధాన ద్వారం వంటి ఆ పాత దృశ్యాలను సజీవంగా ఈ పుస్తకంలో అందించారు రచయిత .

ఇంకా నెల్లూరు జిల్లాలో తొలి I.A.S, తొలి డిగ్రీ , తొలి ఏం .ఏ , తొలి M.B.B.S, చదివిన వారు ఎవరు అనే ప్రశ్నలు స్థానికంగా చాలా మందికి వస్తూనే ఉంటాయి . యిత్యాది ఆసక్తి కరమైన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ గ్రంధంలో దొరుకుతాయి . రచయిత తన  మాటలో ఇలా అంటారు “ చరిత్ర కారులకు అన్ని తెలిసిన విషయాలే కావచ్చు , కాని నెల్లూరోళ్ళ గురించి తెలియని వారి కోసమే ఈ ప్రయత్నం . ముఖ్యంగా నేటి , రేపటి తరం వాళ్ల కోసం “ ఈ విషయంలో రచయిత సఫలీకుతుడయ్యారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు .

-అరసి 

ప్రతులకు :
ఈతకోట సుబ్బారావు
24 / 1697 , 2 వ వీధి రవీంద్ర నగర్ ,
నెల్లూరు -524004, ఆంద్ర ప్రదేశ్.
సంచారవాణి : 9440529785

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)