బ్రతుకు…. (కవిత ) అఖిలాశ

నేను జీవన సముద్రంలో నడుస్తున్న
తెడ్డు లేని ఒంటరి నావను..!!

నన్ను చూసి నీలాకాశం
వెకిలి నవ్వులను పురుడు పోసుకుంటున్నది..!!

శూన్యంలోని తారలు తలకిందులుగా
వేలాడుతున్నాయి..
రేపటి నా జీవిత చిహ్నాలా వలె..!!

కక్కసములకు నా నేత్రాల నీరు
నన్ను వదలి రాలి పోతున్నాయి..!!

దిక్కులైన నా నీడై.. ఉన్నాయనుకున్న
దిక్కులు దగ్ధమై దుఖసాగారంలోకి నెట్టాయి..!!

కాలాన్ని కౌగిలించుకోవాలనుకున్న
కాంతి వేగంతో నన్ను వీడి వెళ్ళినది..!!

నేను ఇంకా మౌన మనోవేదనతో
నడుస్తూనే ఉన్న చీకటి గర్భాన్ని చీల్చుకొని
వెలుగుల బ్రతుకు తెడ్డు కొరకు..!!

                                                 -.అఖిలాశ, ,బెంగుళూరు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
సూర్యదేవర venugopal
సూర్యదేవర venugopal
3 years ago

చాలా బాగుంది జానీ గారు….. పదాల అల్లిక బాగుంది…..

వెంకటేశ్వరరావు
వెంకటేశ్వరరావు
3 years ago

అందరిని మెప్పించాలనే ‘అఖిలాశ’ తో మీరిలా