పుట్టిన రోజు-అఖిలాశ

ఆకాశంలో ఉరుములు మెరుపులు
పురుడు పోసుకుంటున్నాయి..!!

సోముడు వెండి వెన్నెల వర్షం
ధరణి పై కురిపిస్తున్నాడు..!!

నా తల్లి బాధ చూడలేక
కాలం కేకలు వేస్తున్నది..!!

పంచభూతాలే తోడుగా
నాలుగు దిక్కులే దిక్కుగా
నిలిచి పురుటి బాధను
పంచుకుంటున్నాయి..!!

ఆ క్షణమే నేను మాతృ గర్భాన్ని
పెకలించి పుడమి ఒడిలో ఒదిగాను..!!

రక్తపు ముద్దకు ఆకారాన్ని ఇచ్చి
మీ ముందు శిల్పం వలే
నన్ను నిలబెట్టి దీపం వలె
నా తల్లి కరిగిపోయిన రోజు..!!

నా పుట్టుకకై మరణపు
అంచులను చూసిన నా తల్లి
పునర్జన్మ పొందిన రోజు..!!
ఈ రోజే..అదే నా పుట్టిన రోజు..!!

-అఖిలాశ,
072595 11956,
బెంగుళూరు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

Comments are closed.