దేశి సాహిత్యంలో స్త్రీ జీవిత చిత్రణ- లీలా పద్మజ

     

ISSN 2278-478

తెలుగు సాహిత్యమున మార్గ దేశి పదములను ప్రస్తావించిన మొదటి కవి కవిరాజు శిఖామణి నన్నెచోడుడు . ఇతడు 12వ శతాబ్దికి చెందిన వాడుగా చారిత్రుకులు నిర్ణయము . తెలుగులో అతని కాలము నాటికి మార్గ , దేశి ప్రభేదాలతో కవిత్వం వర్ధిల్లుతుందని మనం ఊహించవచ్చు . అతని దృష్టిలో దేశి కవిత అనగా దేశీయ భాషలో చెప్పబడినది .

“మును మార్గ కవితలోకం
బున వెలయగ దేశి కవిత బుట్టించి తెనుం……………….. “అని భావించాడు .

మార్గ అనగా సంస్కృత పరభావం కల్గిన రచనా రీతియని , దేశి అనగా సంస్కృత ప్రభావమేమియు లేక దేశము నందె పుట్టి , దేశము నాడే పెరిగి, నిరాడంబరముగా నుండి జనులకు ఆహ్లాదమును కూర్చునది అని డా .టి సుశీల గారు భావము చేసినారు . ఛందో విషయమున . కవిత్వ విషయమున పూర్తిగా దేశీయతను పాటించుటతో బాటు నిరాడంబరత్వమనునది దేశి కవితకు ఊపిరి వంటిది .

భావోద్రేకంలో అప్రయత్నంగా వెలువడే కవిత్వం దేశీ కవిత్వం . ఈ విధంగా ఆవిర్భవించిన దేశి కవిత్వం స్థాయీ భేదాలను బట్టి , ఇతివృత్త తారతమ్యములను బట్టి పలు విధాలలో బహు ముఖీనమై నింగి కెగసింది. తత్ఫలితంగా జనించిన జానపద గేయాలు , గాధలు , పద కవిత్వము , శతక సాహిత్యము , యక్షగానాలు మొదలైనవి శాఖలన్నింటిలోనూ దేశీయత మూర్తీభవించినది. ముఖ్యంగా జానపద సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలతో దేశి సాహిత్యం తన ఉనికిని నిలుపుకుంది . ఉదాహరణకి కథా గేయాలు , గద్య కథనాలతో బాటు స్త్రీల పాటలుగా ప్రసిద్ధి చెందిన మoగళ హారతులు , వినోద పాటలు ,యివియే గాక కవి భావ ప్రాధాన్యతను సంతరించుకోవడమే కాక ఒక్కొక్క పాట ఒక్కొక్క స్వతంత్ర కావ్యంగా ఫరిడవిల్లుతూ ముక్తకాలుగా ప్రసిద్ధి చెందినది . ఇవన్నీ సంఘ జీవితంలో స్త్రీ అంతర్మధనానికి , ఆమె మనస్తత్వానికి అద్దం పట్టేవిగా ఉన్నవి .
గ్రామీణ స్త్రీలు నిత్యవ్యవహారంలో గృహ జీవనానికి అవసరమైన కార్యకలాపాలను కొనసాగించుకొంటూ ఆయా శ్రమను తొలగించుకోవడానికి మానసికోల్లాసానికి ఆశువుగా పాటలు పాడుకునే వారు . దీనిని ప్రతిబింబించేదే పనీ -పాట అనేది ఒక సామెత . విద్యా గంధం లేనప్పటికీ ఆనాటి స్త్రీలు తమ నిత్య దైనందిన జీవితంలో ఎదుర్కొనే సుఖ దు:ఖానుభూతులను భావావేశంతో పాటలుగా పాడుకునే వారు . ఎందుకంటే సంఘ జీవి అయిన మనషి అనుభూతి కెప్పుడూ బానిసయే కదా . పూర్వకాలంలో ధాన్యం మొదలైన ఆహార దినుసులను రోకటిలో వేసి దంచేటప్పుడు స్త్రీలు అలుపెరగక పాడుకునే పాటలు దంపుడు పాటలుగా దేశీ సాహిత్యంలో స్థానం సముపార్జించాయి . ఈ పాటలలో ప్రత్యేకత ఉన్నది . ఒకటి విషయ పరంగాను , రెండవది పాడే బాణీ పరంగాను ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో నేటికి సుమారు అరవై , డబ్బై సంవత్సరాలకు పూర్వం దంచే అలవాటున్న ప్రతీ స్త్రీకి ఈ పాటలు అలవోకగా ఆనాడు కొందఱు స్త్రీలు పాట పాడకుండా రోకటి పోటు వేయలేకపోయి నారంటే ఇప్పుడు మనకు ఆశ్చర్యంగా అన్పిస్తుంది . ఇక్కడ ఒక ధర్మసూక్ష్మాన్ని కూడా ఆనాటి స్త్రీలు పాటించారు . అదేమిటంటే బియ్యము మొదలైన దినుసులు దంచేటప్పుడు పాటలను పాడ వచ్చును. కాని పసుపు దంచేటప్పుడు మాత్రము పాటలు పాడకూడదు . అయితే పాడకుండా పోటు వేయలేని కొంత మంది స్త్రీలు దానిలో కొన్ని బియ్యంపు గింజలు వేసి దంచటం పరిపాటి .

ఈ పాటలను దంపుల్లు పాటలని , కొన్ని ప్రాంతాలలో రోకటి పాటలని అంటారు . గోదావరి ప్రాంతంలో మాత్రం దంపుల్లు పాటలనే అంటారు . ఇవి సాధారణంగా నాలుగు పాదాలలో ఉంటాయి . నాలుగు పాదాలు లేని కొన్ని పాటలలో రెండవ పాదాన్నే హెచ్చు స్వరంలో రెట్టించి మాడవ పాదంగా పాడడం సంప్రదాయం . ఇవి సాధారణంగా స్త్రీ మనోగతానికి దర్పణంగా భాసిల్లుతుంది . వీటికి మౌఖిక ప్రచారమే తప్ప మరొకటి లేదు . అయినప్పటికీ ఇవి సాధారణంగా ఒకే బాణీలో ఉంటూ ఉంటాయి . ఈ గేయాలు విషయ వైవిధ్యాన్ని బట్టి నాలుగు విధాలుగా విభజించ వచ్చును . అవి

1. ప్రార్ధనా గీతాలు , 2. నిత్య జీవన సంబంధమైన గీతాలు
3.సరస ప్రధానమైన గేయాలు 4. హాస్య సంబంధిత గేయాలు .

1 . ప్రార్ధనా గేయములు :
దంచటం ప్రారంభించేటప్పుడు విఘ్నాధిపతియైన వినాయకుని సన్నుతి చేయటం సంప్రదాయం . ఆ పాట ఈ విధంగా ఉంది .
“ ఇగ్గినే శుడా ఉండ్రాళ్ళభోగ్గి
నినుదలిస్తే ఏగ్గిరాణి అవ్వానీ సామీ
ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు మా స్వామి గణపతికి
నేతితో ఉండ్రాళ్ళు మానేడు గణపతికి “ పై పద్యంలో కార్యశీఘ్రతకు గణపతి స్మరింపబడినాడు . అతని కిష్టమయిన పిండి వంట ఉండ్రాళ్ళు , గ్రామీణ స్త్రీల స్మృతి పథంలో తొంగి చూస్తుంటాయి .

“కట్ట పడలేము రామయ్య తండ్రి
కష్టాలు ఈడేర్చినీకలిమి మాకియ్య
బాధ పడలేము బాబయ్యను తండ్రి
బాధల్లూ ఈడేర్చినీ బాగ్గాలుఇయ్యి “
ఈ పధంలో సుఖ జీవనానికి అవసరమైన భోగభాగ్యాలను ప్రసాదించమని భగవంతుడిని వేడుకోవడం ఇందులో కన్పిస్తుంది . ఆ దేవుడు కూడా రాముడే కావడం తెలుగుదనాన్ని పట్టి ఇస్తుంది .

తన రోకటి పోటులో ఉన్న శక్తిని ఆమె ఈ విధంగా చెబుతున్నది .
సువ్వన్న నేనొక్క పోటేసి తేని
చుక్కలు వక్కటిల్లు సూరన్నకదు
ఆకాశం తల్లడిల్లు ఆరాము కథలు .

2. జీవన సంబంధిత గేయాలు :

స్త్రీల దైనందిన వ్యవహారంలో కుటుంబ కథలు సభ్యులతోనే కాక ఇతర వస్తువుల పట్ల కూడా ఆమెకు అవినాభావ సంబంధము ఉంది అనడానికి ఈ పాట ఒక ఉదాహరణ .
“రోలు చుట్టమ్ము రోకలి బంధువు
రోటిలో ఉన్న గింజలు , తల్లి బలగమ్ము “

అమ్మాయికి వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు అబ్బాయి పూర్వాపరాలు విచారించడం మన సంప్రదాయం . ఇలాంటి సాంఘిక జీవనాన్ని చిత్రిస్తూ చెప్పిన ఈ క్రింది గేయంలో ….
“పచ్చి మిరప చెట్లు వృక్ష యవ్వంగా
కనకన శ్రీ అయితం పూడి పట్నమవ్వంగా
పట్నాన్నిఅన్నట్లుగాను , రాజు లవ్వంగా
రాజు లంటన్నకేని రంభ లొచ్చేరం
………………………………….
అత్త మంచిదైతే అనుకూలమైతే
మావ మంచోడయితేమాట కారయితే
వరుడూ మంచోడైతే వనితనిద్దాము
కాముడు మంచోడైతే కాంతనిద్దాము “
ఎవరితోననా మనకు పని జరగాల్సి నప్పుడు వాళ్లను మనం ఇంద్రుడు ,చంద్రుడు అని పొగడటం లో తమ బిడ్డని వాళ్లు ప్రేమగా చోడాలి కనుక వాలను ప్రసన్నం చేసుకోవడానికి వీరు వ్యక్తపరిచిన లౌక్యం యింది విదితమవుతుంది .

మానవుడు సంఘ జీవి ఒంటరిగా బ్రతకలేడు. పొరుగు పచ్చగా ఉంటె పోలేదు బియ్యం అప్పైనా పుడుతుంది అనే సామెత ఉండనే ఉంది . అదే భావాన్ని కంటికి రెప్పకు ఉన్న అవినాభావ సంబంధంతో సరిపోలుస్తూ ఇనృగు పొరుగు లపై వున్నా ఆదరణను ఈ క్రింది గేయం ఇలా వివరిస్తుంది . ఏకాకిగా అనుభవించే ఆనందంలో నిండుతనం లేదు యిరుగు పొరుగు వారితో సత్సంబంధము లుంటే సహాయ సహకారాలుంటాయి . కన్ను , రెప్ప సహకరించుకోకపోతే కలిగే నష్టమే అది అని సరిపోల్చటం ఔచిత్యంగా ఉంది .
“పోటుకు పోటాశా పొరుగు వొకాశ
కంటికి రెప్పాశా శ్రీ వేంకటేశ “
సాంఘిక పరిస్థితుల కద్దం పట్టినవి . సంఘంలో ప్రవర్తించవలసిన తీరు , మాట తద్వారా వచ్చే మన్నన మొదలైనవి చోటు చేసికొన్న గేయాలు ఈ క్రింది విధంగా ఉన్నవి .

“కానరేగు పళ్ళు కాకుల్ల పాలు
కాముడు వాళ్ళని కాంత కన్నవారి పాలు
పుల్ల రేగు పళ్ళు భూముల్ల పాలు
పురుషుడు వల్ల నీ కాంత పుట్టిల్ల పాలు “
అడవి రేగు పళ్ళు మనవ వినోయోగార్ధం అందనట్లుగా ఎలుకొని , రక్షించవలసిన పురుషుడే కాదంటే పుట్టింటికి చేరిన స్త్రీ కాకుల్లాంటి మనుషుల మాటల మధ్య నలిగి పోవడం అనే సామాజిక స్థితిని తెలియజేస్తుంది . క్షితిజము అంటే భూమి నుండి పుట్టినది చెట్టు అని వ్యుత్పత్తి అర్ధం . అయితే భూమి నుండి పుట్టిన ఆరేగు చెట్టు నుండి వచ్చిన పళ్ళు పనికి వస్తే ఇతరులు వినియోగించు కొంటారు . లేకుంటే “పుల్ల రేగు పళ్ళు భూముల్ల పాలు “ అలాగే పుట్టినింటి నుండి అత్తింటికి చేరిన స్త్రీ వాళ్లు ఒల్లకపోతే పుట్టినింటికే చేరుతుంది అనడంలో వారి నిగూడ భావం తొంగి చూస్తుంది .

స్త్రీ తన జీవితంలో ఎన్ని వసంతాలు గడిచినా , ఎంత దూరాన వున్నా పుట్టింటి పై మక్కువకు దూరం కాదు . అలాగే తల్లి వైపు బందుత్వాన్ని అంతగానే ఆమె అభిమానిస్తుంది . తల్లి తోడ బుట్టిన వాడు , తనకు మేనమామ గనుక అతడి ఇంటికి వెళ్లడానికి ఆమె మనస్సు పరుగులు తీస్తుంది పై విషయాలను ఈ క్రింది గేయం ప్రతి బింబిస్తుంది .
పిండి కొట్టు దాము , బండెక్కుదాము
రామగిరి పట్నము , రావు చెల్లేలా
రామగిరి పతనాన , ఎవరున్నారు
అమ్మకీ తమ్ముళ్ళు , మేన మామల్లు
అలానే తన అన్నల , మేనమామలను ఈ క్రింది విధంగా పరోక్షంగా తెలియచేస్తుంది .

“ నా చేతి రోకళ్ళూ , నల్ల రోకళ్ళు
చేయించూ అన్నయ్యానూ , శేవ రోకళ్ళూ
వేయించూ మావయ్యానూ ,వెండి పన్నుల్లూ
ఈ రకంగా ఆమె కోరడంలో తాన పుట్టింటి వారి సంపదా , సామర్ధ్యం విశదమగుచున్నది .

ఉదా: ఉత్తరేణి చెట్టు ఊరికందమ్ము
ఉత్తముడు అన్నయ్య వదిన కందమ్ము
ఉదాహరణకు : కోరి మావిడి చిలక కార్లేటి హంస
కోరిమా అన్నలతోను కోలాల మేసు
రాజ మంద్రం చిలకా రాజోలు అంసా
రాత్రి మాయన్నలతోను సయ్యాటలాడు.

పుట్టింటితో సంబంధం మరింత పెంచుకోవాలనే ఆడపిల్ల ఆశ పడుతుంది . అందుకు మేనరికం ద్వారా ఆబంధం గట్టి పడేలా చేయాలని తపిస్తుంది . అందుకు ఉదాహరణ …
“”తమ్ముడు ఎంతయినా తన వాడే కాని
తగువాడి పుచ్చుకొంది తమ్ముడి కూతురిని “

సంతానం దినదినాభివృద్ధి చెందాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది . అదే భావాన్ని ఒక జానపద స్త్రీ ఇలా వ్యక్తం వేసింది .
“ఉయ్యాల జంపాల ఊరుపేరేమి
రచ్చ బల్లలు మీద రాజు పేరేమి
ఉయ్యాల జంపాల ఊరు రాజమంద్రం
రచ్చ బల్లలు మీద రాజు నాకొడుకు “ అనడంలో తన కొడుకు రాజులా ఉండాలనే కోరిక వ్యక్తం అవుతుంది .

పుట్టిన తన బిడ్డకు తన అన్నలు ఆబిడ్డకు మామలు అయిన వారల గొప్పతనాన్ని ఆమె బిడ్డకు ఇలా చెబుతుంది .
“అబ్బాయి మామల్లు ఎటువంటీ వారు ?
అంచు పంచెలవారు అంగీలవారు
పట్టు పంచెలవారు , పాగాల వారు అని
అబ్బాయి తండ్రులూ ఎటువంటి వారు
ఊరకుక్కల నెక్కి ఊరేగు వారు
గుడ్డి కుక్కలనెక్కి గోడక్కువారు “ అని అత్తింటి వారిని గేలి చేస్తూ ఈ గేయం సాగింది .

3.సరస ప్రధానమైన గేయాలు :

“అయిన వారితోనూ కావించు చెలిమి
ఆకు మడచి మడత పెట్టినట్లుండు
కాని వారితోనూ కావించు చెలిమి
కట్టె విరచి పొయ్యిని పెట్టినట్లుండు “
చెలిమి తారత్యమును చెబుతూ వీళ్ళూ వాడికి ఉపమానం .అయినా వారితో చేసే స్నేహం ఆకులా సౌకుమార్యంగాను , పచ్చగాను వుంటుందని పైగా ఆకుమడవద్దు అనే పద ప్రయోగంలో ఆకు మడచినపుడు సవ్వడి కాదు కనుక అట్లే అయిన వారితో చెలిమిలో ఏ పొరపొచ్చు ఉండవనీ , అలాగే కాని వారితో చెలిమి పుల్ల విరుపు మాటలతోనూ ఉంటాయని , పొయ్యని పెట్టడం అనగా మంట తీవ్రతకు నిదర్శనం , కట్టెను పొయ్యలో పెట్టాక మిగిలేది బూడిదే కనుక కాని వాళ్ళతో చెలిమి మనకేమీ మిగల్చదనే లోతైన భావం ఇందులో ఇమిడి ఉంది .

“తమ్ముడు ఎంతైనా తన వాడే కాని
పైన జలకము జల్ల పాత్రుడు కాడు
బావ కొడుకెంతైయినా పగవాడే కాని
పైన జలకము జల్లితే పాపములు పోను “
స్త్రీ పెళ్లి కానంత వరకే గాని పెళ్ళయిన తరువాత ఆడ పిల్లయినా ఆమెకు పుట్టింటిపై ఎంత మమకారమున్నా అది ఎంత వరకంటే అత్తింటి వారిని ఆమె కాదనుకునా తనకు పున్నామ నరకం తప్పించేది వారేనని దీని భావం .

“లక్ష్మి వచ్చింది నన్నును పొందిందీ
నారాచ సిరి కళ్లకు నిద్రలేపింది
ఎవర్ని పొందు దునానీ వివరామడిగింది
అన్నేళ్ళా ఉంగరాలు హంసలా పరుపు
భోంచేసి పడుకున్న నారాజుని పొండు “ స్త్రీ కోరుకునేది సిరీ , సౌభాగ్యం , తన జీవిత భాగస్వామి అయిన భర్త సంపద , పౌఖ్యమూ తనవిగానే భావించే ఆమె లక్ష్మిని అవి భర్తకు చేకూర్చాలని అర్ధిస్తుంది . ఇది తెలుగింటి స్త్రీ అంతరంగానికి అద్దం పట్టింది .

పుణ్యం కొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు అన్నదానిపై అధిక విశ్వాసం వుండిన గద్దమనది . స్త్రీకి సహజంగా మాతృత్వంపై ఆశ మొండు . అంతేకాక సంఘంలో కూడా మాతృమూర్తికి ఉన్న గౌరవం చాలా ఎక్కువ .అయితే మాతృమూర్తి కాబోయే స్త్రీ చూలింతగా ఉన్నప్పుడు ప్రసూతి వైరాగ్యం కనబరుస్తూ ఈ చూలింత స్థితిలో సుఖము లేదంటుంది . కాని ప్రసవం అయిన తరవాత ఆ బిడ్డను చూసి మురిసిపోతూ పడిన కష్టాన్ని మరచిపోతుంది . ఈ భావాన్నే ఇలాగే ఈ గేయం వ్యక్తపరుస్తుంది .

“ చూలింత బాలింత నీళ్లకెళ్ళేరు
చూలింత తా చెప్పను సుఖము లేదని
బాలింత తా జెప్పనూ బాలుడాటల్లు “ ఇదే ఛాయలో నడుస్తున్న మరోపాట ….

“చుట్టూ చక్కనిదమ్మ చిక్కిలపు చుట్టూ
చూలింత చక్కనిదీ ఓ రాచదేవీ
పండు చక్కనిదమ్మ పనసియ్యపండు
బొంత చక్కనిదీ ఓ రాచదేవీ “
ఉమ్మడి కుటుంబంలో ఉన్న స్త్రీ తన బిడ్డలతో పాటుగా తన అత్తయింట మిగిలిన వారి బిడ్డలను ఎట్లా ఆదరించేది అనడానికి ఈ క్రింది గేయమొక ఉదాహరణ .

“చిట్టడుగు పోట్టడుగు కావాలాని మనకు
శివుడిచ్చు అక్క మనకు చిన్ని బాలలను
వారికి అన్నమ్ము వల సొచ్చుననీ
వసుదేవు డం పాడు వడ్ల గొనెలను
అన్న కొడుకు రారా వెన్నె బెట్టేదను
బావ కొదుకు రమ్మీ పాలు బోసెదను”
అందరినీ వదులుకొని అత్తింట అడుగు పెట్టిన స్త్రీ సుఖంగా బ్రతకాలంటే అత్తా , మామ మరియు భర్త మంచి వారయితేనే అది సాధ్యమవుతుంది . లేకుంటే కిరసనాయిల్ చావులు తప్పవనే విషయం ఏ తరానికి చెందిన తల్లి దండ్రులకయినా విదితమే మోననిపిస్తుంది . చిన్నప్పటి నుండి తమచే పెంచబడిన బిడ్డ ఇక ముందు తమ స్థానంలో అత్త , మామలు అల్లుడి సంరక్షణలో ఉండాలి . కనుక ఆ వియ్యపురాలు , వియ్యంకుడు , తమ అల్లుడు , ఆ తల్లిదండ్రులకు గొప్ప వారుగా కనబడటం సహజం . ఆ భావాన్ని ఇలా అలంకారయుతంగా ఈ క్రింది గేయంలో వ్యక్త పరచారు .

“నాయమ్మ తల్లీ నువ్వుట్టును బట్టి
మదన శ్రీ గోపాలుడు మాకల్లుడాయె
ఇంద్రుడు చంద్రుళ్ళు ఇయ్యెంకు లాయె…’ గోపాలుడంతటి వాడు అల్లుడయ్యాడనే సంతోషం వ్యక్త మగుచున్నది . తపించే అర్హత వారికే ఉన్నదనే నమ్మకంతో జానపదులలో ఎంత వుందో ఈ గేయంలో తెలియపరుస్తుంది .

హాస్య సంబంధిత గేయాలు :

ఈ విధమైన గేయాలలో వియ్యపు రాళ్లు సరాలు , బావా మరదళ్ల పంచికాలు ఎక్కువగా చోటు చేసుకొంటాయి .

“ఈ పరాలొచ్చిందీ వృక్షమ్ములాగ
కూర్చోనూ ఈ పారాల కుంపటే మీద
పండూకో ఈ పరాల పందిరీ మీద “ ఇక్కడ సహజంగా వచ్చిన హాస్యంతో కూడిన ఈ గేయంలో జానపదులకున్న ఛందో విజ్ఞానం కూడా బహిర్గతమవుతున్నది .

“పండుగ వచ్చిందీ పర్వతం లాగ
యశోద మాతల్లి ఎరగదు గామాలు
చుప్పనాతి వదినెలు చెప్పరుగామాలు
సవితి మీద సవితినిచ్చేటి కన్నా
సముద్రం ఎంతలో తోనిగి చూడరన్నా
మారు బిడ్డల మీద మనువిచ్చే కన్నా
మండలము ఎంత లోతో దిగి చూడరన్నా
సవితి నా దమ్ము నాగుల చవితి
ఏ రాలే రాలను నీ అనుకొంటినమ్మా
యేరాలు కాదమ్మా తోరాల నోము

తమ జీవితాలకు పని పాటలకు , అవినాభావ సంబంధాలలో జానపద స్త్రీలు తమకు గల అనుభవాన్ని పురస్కరించుకొని ఆయా విషయాలపై అల్లిన కవితా ఖండికలు పై రోకటి పాటలు . ఈ రోకటి పాటల్లో తెలుగు జనాపద స్త్రీల జీవిత చిత్రణం సాక్షాత్కరిస్తుంది .

ఈ విధమైన సాహిత్యంలో స్త్రీ సంబంధితము కనుక తరచుగా వారి అచ్చట్లు , ముచ్చట్లు ప్రసక్త మవుతూ ఉంటాయి . సాధారణంగా అత్తా కోడళ్లు , వదినా మరదళ్ళు మేళమును కనిపిస్తూంటాయి .

-లీలా పద్మజ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)