ఎస్ .ఆర్ .పృథ్వి రచనలు – పరిశీలన(సాహిత్య వ్యాసం)-తాడిమళ్ళ ఆశీర్వాదం

  

ఎస్ .ఆర్ .పృథ్వి అసలు పేరు సుబ్రహ్మణేశ్వరరావు . ఈయన 1951 మేడే రోజున జన్మించారు . వీరు సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ రచనలు చేశారు . భావోద్వేగంతో , నిజాయితిగా నిబద్దతతో రచనలు సాగించి రాష్ట్రంలోని అనేక మంది కవులు , ప్రముఖుల ప్రశంసలు పొందారు . ఈయన తాను అనుభవించిన , చూసిన , వినిన సామాజిక అంశాలను వస్తువుగా స్వీకరించి రచనలు సాగిస్తున్నారు . ఏది రాసినా హృదయానికి దగ్గరగా ఆలోచింపజేసేట్లుగా రాయడం వీరి ప్రత్యేకత . వీరు మొత్తం ఇరవై రెండు రచనలు చేసారు . అవి  పృథ్వి తరంగాలు , కోర్కెలే గుర్రాలైతే , అన్వేషణ , అద్దేపల్లి జీవన రేఖలు , చెరగని ఆనవాళ్ళు , గుండె గాయాలు , నానా జ్ఞాపకాలు , గుండె ఊటలు , మౌన ఘోష, వ్యాస దీపిక ,అన్నీ మన మధ్యనే , భావ పరిమళం , ఈ మట్టి మనదే , రెండు రెమ్మలు , ఆధునిక తెలుగు కవిత్వంలో తండ్ర్తి – ఒక పరిశీలన , స్వాతంత్ర్యోద్యమంలో వాడపల్లి , కీలకం , అక్షర దీప్తి , శ్రీశ్రీ నానీలు , జ్ఞాపకాలే ఊపిరిగా వెలుగు జాడను వెంబడిస్తూ , నడక సడలిన వేళ , కందుకూరి సరస్వతీ నారద విలాసము సమాలోచన మొదలైన సృజనాత్మక రచనలు చేసారు .

2001 లో” చెరగని ఆనవాళ్ళు” అనే దీర్ఘ కవితను వెలువరించారు . దీనిలో సమకాలీన సమాజ వక్రతల్నీ,దుర్మార్గాల్ని ఖండించడమే ముఖ్యాంశంగా రాసారు . ఈ దీర్త్ఘ కవిత దగ్గర నుండి పృథ్వి  కవితాత్మకమైన గాడత  దృష్టి బాగా ఏర్పడింది . అందుకే ప్రతి వాక్యంలోనూ ఉపమానమో , రూపకమో , భావ చిత్రమో , ఏదో ఒక వైచిత్రి ఉండేలా ప్రయత్నం చేసారు .

ఉదాహరణకి …..
“ వేయి పడగల ధన స్వామ్యం ఉచ్చులో
ఆకాశ ధరల శరాలు గుచ్చుకున్న బ్రతుకులు
వ్యవస్థ బంద మీద శవాలై రాలుతాయి
రూపాయిని కళ్లల్లో మెరుపు చేసుకుంటున్న
అధికారం చెప్పు కింద చెమట పట్టిన గుడ్డలు
అవినీతి ముద్రను గుండె పై మోసుకొని
చట్టం రధ చక్రాల కింద నెత్తురు కక్కుకుంటాయి …”

అంటూ కవిత్వీకరిస్తాడు .

2006 లో “గుండె ఊటలు “నానీల సంపుటిని వెలువరించారు . దీనిలోని నాలుగు పాదాల్ని రెండు పాదాలుగా లేక మూడు పాదాలుగా రాసినా ఏమీ తేడా కనిపించదు . కాని , పదానికున్న ప్రాధాన్యాన్ని బట్టి భావంలో ఉన్న లయని బట్టి విరవడం అరుదుగానే కనిపిస్తుంది . సాధ్యమైనంతవరకు పృథ్వి విరుపుల విషయంలో శ్రద్ధ చూపించారు . ఉదాహరణకి ….
“ఐటి.రంగం
విస్తరించింది
ప్రైవేటు రంగం
పచ్చని చెట్టయింది “

అంటూ ప్రపంచీకరణ దుష్పలితాన్ని చేస్తుంది . ఐటి రంగం సాంకేతికంగా అత్యంత ప్రధానమైనదే అనేక మందికి పని కల్పించి జీవితాలు బాగు చేసేదే కానీ ముఖ్యంగా ప్రైవేటు రంగానికే కల్ప వృక్షమైంది . ఐటి కూలీల సంఖ్య పెరిగింది / ఏమీ దూషణ లేకుండా విషయాన్నీ ధ్వనింపజేసింది .

2001 లో “గుండె గాయాలు “ వచన కవితా సంపుటి ప్రకటించారు . దీనిలో వస్తువు విషయంలో , శిల్పం విషయంలో ఇంత కాలం తాను చేసిన కృషికి ఒక ఉన్నత్య స్థాయి ప్రతి బింబిస్తుంది . ఈ కవిత సంపుటిలోని శైలి గాని , భావ చిత్రాలు గాని , సమకాలీన కవిత్వంలో మర్మాన్ని గ్రహించిన పోకడలు కనిపిస్తాయి . కోనసీమ బ్లో ఔట్ అత్యంత బీభత్య దృశ్యం .

1992 లో “పృథ్వి తరంగాలు “ అనే మినీ కవిత సంపుటి వెలువరించారు . దీనిలో సామాజిక చైతన్యం ప్రతి బింబిస్తుంది . పృథ్వి తాను దర్శ్గించిన సామాజిక వైరుధ్యాల్ని , వ్యక్తి ప్రవర్తనలోని వక్రతల్నీ తాను అభిమానించే తత్వాన్నీ ఈ పృథ్వి తరంగాలలో ముక్తకాల రూపంలో వ్యక్తీకరించారు . ఉదాహరణకు ….

“ కష్ట పడిన వాడికి
ప్రతి ఫలం తూచి
స్వామీజీల పాదపూజకి
వేలు లక్షలు దాచి దాచి “

అంటూ శ్రమ జీవితాన్ని గౌరవించలేని సమాజాన్ని విమర్శించడం కన్పిస్తుంది .

1993 లో “కోర్కెలే గుర్రాలైతే “ అనే దీర్ఘ కవిత రాశారు . ఇది కథాత్మక దీర్ఘ కవిత . ఈ దీర్ఘ కవితలో అక్రమ లైంగిక సంబంధం ఒక నేరంగా నిరూపిస్తుంది . వివాహ వ్యవస్థ సామాజిక శాంతిలో అతి ప్రధానమైన శక్తిగా రుజువు చేస్తుంది . ఈ దీర్ఘ కవిత ముగింపు మాటలు , కథా సారంగా చెప్తారు .

“ జాతి మెరుగులు మాణిక్యమైన వివాహ వ్యవస్థ
స్త్రీ పురుషుల చేతిలో
అందంగా మలచబడ్డ దేవతా విగ్రహం
ఆరాధిస్తే స్వర్వ సౌఖ్యాలు సొంతమవుతాయి
గాజు బొమ్మ చేసి నది రోడ్డు పై పగలకొడితే
అన్ని ఆనందాలు అంతమవుతాయి “

అంటూ గాజు బొమ్మ చేయడం అక్రమ సంబంధంలోని ఆకర్షణనీ , బోలుతనాన్ని ఒకేసారి వ్యక్తం చేస్తోంది . నది రోడ్డు మీద పగలు గొట్టడం సిగ్గులేని తనానికి సూచకం . సామాజిక ప్రగతి వైయుక్తిక నీతి నియమాలు తప్పక దోహదం చేయగలవని పృథ్వి విశ్వాసం . అతని రాకాహ్నాల్లో అనేక చోట్ల ఈ విషయం గమనించగలం .

1994 లో “ అన్వేషణ”  కవిత సంపుటి ప్రచురించారు . దీనిలో 45 రుబాయీలు కూడా చేర్చారు . ఈ రుబాయిలలో వస్తు పరిమితిని పెట్టుకో లేదు కాని ఎక్కువ జీవన సత్యాలకీ , వర్గ వైరుధ్యాలకీ ప్రాధాన్య మిచ్చారు . స్వార్ధ భావనని ఖండిస్తూఒక రుబాయిని చూడండి .

“ నిస్వార్ధంగా ప్రకాశిస్తాడు దినకరుడు
ప్రాణాన్ని లెక్క చేయక పోరాడుతాడు శూరుడు
ఎదుటి వాడి భాగ్యం ఏమయినా సరే
తన బ్రతుకు వెలగాలనుకుంటాడు చోరుడు”

అని నిస్వార్ధం -స్వార్ధ భావాలను ప్రకటిస్తాడు .
చూడగానే అందరూ భయంతో తమలో తాము మునిగి పోవలిసిందే . ఆ అగ్ని జ్వాలకు పృథ్వి భావా చిత్రం . దాని చూసిన వాళ్లు ఎంత వాస్తవికానుభూతిని అందించగాలిగాడో గ్రహించగలరు .

“సామ్రాజ్య వాద కాల  ధూమాల నీడల కింద
శిరస్సు తెగి , మెండెం లోంచి ఉబికిన
నెత్తుటి ధార ముద్దై
నింగి కెగురుతున్న అగ్ని శైలంలాగ
రాత్రి సూర్యుడై ప్రజ్వలిస్తోంది గ్యాస్ బావి …
ఊరంతా ఒక్కుమ్మడిగా ఉరి పోసుకున్నట్లు
తలలు వాల్చిన కొబ్బరి చెట్లు …”అంటూ ఆ దృశ్యం తాలూకు అనుభవమూ కళ్లకు కట్టినట్లు పృథ్వి చిత్రించారు .

పృథ్వి రచనలు శ్రీ శ్రీ , సి.నా.రె , దాశరధి , తిరుమల శ్రీనివాసాచార్య , ఆవుల సాంబశివరావు , ఆవత్స సోమసుందర్ , అద్దేపల్లి రామమోహనరావు , ఎన్ . గోపి వంటి ప్రముఖుల ప్రశంసలతో పాటు వారి ప్రోత్సాహం కూడా అందుకున్నారు . వచన కవిత , దీర్ఘ కవిత , మినీ కవిత , కవిత్వలో కథ ,సాహిత్య వ్యాసాలూ , సామాజిక వ్యాసాలూ , ముత్యాల సరాలు , పద్యం , పాట , గేయం , రుబాయి , నానీ , నానో , రెక్కలు వంటి ఇరవై ఐదు ప్రక్రియల్లో సృజనాత్మక రచనలు చేసి “ స్టేట్ రికార్డ్స్ “లో పేరు నమోదు అయ్యింది . అంతటి గొప్ప పేరును పృథ్వి సొంతం చేసుకున్నారు .

-తాడిమళ్ళ ఆశీర్వాదం
పరిశోధక విద్యార్ధి
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం , బొమ్మూరు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

One Response to ఎస్ .ఆర్ .పృథ్వి రచనలు – పరిశీలన(సాహిత్య వ్యాసం)-తాడిమళ్ళ ఆశీర్వాదం

  1. Desu Chandra Naga Srinivasa Rao says:

    పృథ్వి గారి రచనలు పరిచయం చేసినందుకు ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)