అవును కరెక్టే ……కాని మీరు చేస్తున్నదే విప్లవమని ఎవరన్నారు ?

           మార్చ్ , ఏప్రిల్ , మే నెలలలో ఉండే ఋతువును వసంత ఋతువని పాశ్చాత్య దేశాలు పరిగణిస్తారు. ఆ తర్వాత వచ్చేది వేసవి కాలం. మన దేశం లో ఉండే ట్రోపికల్ క్లైమేట్ లో మాత్రం మార్చ్, ఏప్రిల్, మే నెలలు వేసవి కాలాన్నే ఎంచుకుంటాయి. మే నెలలో ఖచ్చితంగా ఎండాకాలం ఈ దేశం లో వసంతాన్ని ఇవ్వదు. మల మల మాడ్చే వేసవినే ఇస్తుంది. యూరోప్ నుండి వచ్చిన ఎవరన్నా ఈ దేశం లో మే ను వసంత ఋతువు అంటే పిచ్చోడే . ఎందుకంటే దేశం మారిందనే ఒక విషయాన్ని గమనించకుండా వాళ్ళ భౌగోళిక వాతావరణ వర్గీకరణను ఇక్కడ గుడ్డిగా వాడేస్తున్నాడు అని. ఎంత వాతావరణాన్ని అంచనా వేస్తూ చూసినా, ఎంత సారూప్యాన్ని చూసినా భారత దేశం లో మే నెలలో మాత్రం వేసవి ఉంటుంది అనాలే తప్ప వసంతముంటుందని అనరాదు.

             మండు వేసవిలో మే 25, 1967 న జరిగిన నగ్జల్బరి తిరుగుబాటు ను అత్యుత్సాహం తో పాశ్చాత్య దేశాల వాతవరణ అంచనాతో కాబోలు, వసంత మేఘం పలికిన గర్జన గా ఇండీయాలోని మార్క్సిస్ట్ – లెనినిస్ట్ లు పేర్కొన్నారు. నిజానికి ఏ సూరీడి ఉష్ణ తేజమనో , ఉగ్ర వేసవి గర్జన అనో వర్ణించి ఉంటే సరిగ్గా ఈ దేశ వాతావరణం తో మేచ్ అయ్యేలా ఉండేదేమో ?!

              సరే ఏదేమైనా, ఈ వర్ణన, ఉపమాన వలయం లో పడ్డం వదిలేసి సీరియస్ విశ్లేషణకొద్దాం. రక్త తర్పణ చేయడం విప్లవం అవ్వచ్చు కాని. Vice versa కరెక్ట్ కాదు. రక్త తర్పణ చేయడమే విప్లవమైతే , స్వాంతంత్ర్యమొచ్చి సంవత్సరం సరిగా నిడకపోయినా , తాము తలిచిన దేశం ‘ బాగు ‘ కోసం మొదటిగా మనిషి ప్రాణాన్ని తర్పణ చేసిన ఆర్ ఎస్ ఎస్ గొప్ప విప్లవ సంస్థ అవ్వాలి ఇప్పటికి. కాసేపు ఏ విమర్శనైనా ఇలా ప్రతిదానికి నెత్తుటితో తడపకుండ, కొంచం అబ్జెక్టివ్ గా చూద్దాం.

           నగ్జల్బరీ తిరుగుబాటు ఏభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మావోయిస్ట్ పార్టీ అధ్యక్షుడు గణపతి గారు ఒక మూడు నాలుగు పేజీల ప్రకటన విడుదల చేసారు. (http://avaninews.com/article.php?page=1096 ) ఇది ప్రధానంగా వాళ్ళ కేడర్ కు, సానుభూతిపరులకు ఉద్దేశించబడ్డదే. ఉపరితలం, పునాది, రివిజనిజం, సాంస్కృతిక విప్లవం, సాయుధ రైతాంగం, నూతన రాజ్యము, పెట్టీ బూర్జువా, సోషలిజం, వర్గ రహిత సమాజం, సామ్రాజ్య వాదం, బోల్షివిక్ విప్లవం, ఉత్పత్తి శక్తులు, నూతన ప్రజాస్వామిక విప్లవం, కామ్రేడ్స్ లాంటి టిపికల్ కమ్యూనిస్ట్ పదజాలం వెల్లువెత్తింది ఈ ప్రకటన మొత్తం. ఇక ఇన్ని పదాలు విస్తృతంగా చిలకరించాక సోషలిట్ రష్యా, చైనా, వియత్నాంల ప్రస్తావన లేకుండా రక్త తర్పణ మాటెత్తకుండా ఉండ జాలరాదు కాబట్టి అవి కూడా కవర్ అయిపోయాయి. అదలా ఉంచితే విస్తృత జార్గన్ ను విపరీతంగా వెదజల్లుతూ ఫుల్ ఫ్లో లో నడిచిన ఈ ప్రకటన మొత్తంలో దళిత అనే పదం ఒక సారి, బ్రాహ్మణ అనే పదం ఒక సారి చోటు చేసుకున్నాయి. అవసరం లేకుండా బలవంతంగా కృత్రిమంగా ఏదో పద ప్రయోగం చేయాలనే ఎక్స్పెక్టేషన్ లేదు గాని, ఒక రేండం పదాల ఎన్నికలో ఉండే ఒక ఫీల్ ను తెలియ జేసే చిన్న ప్రిలిమినరీ స్టేటిస్టికల్ ఎనాలిసిస్ ఇది.

             అసలు ఈ మొత్తం స్టేట్మెంట్ టోన్ చూస్తే , రియక్షనరీ గా ఉండడం లేదా , ఒక ఊకదంపుడు మోటివేషన్ స్టేట్మెంట్ లా ఉంది తప్ప ఎక్కడా కాంక్రీట్ గా ఒక ఆలోచన రేకేత్తించేదిగా, ఒక సరిద్దిదుబ్బాటు క్రమాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా గాని లేదు. ఉరకండి , ఉరకండి అన్నట్టు తరిమే ప్రకటనే ఇది. దీన్ని వాళ్ళు ఉన్న నిర్బంధ పరిస్థితిని చూస్తే పూర్తిగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది కాని, ఇకా జీవితంతం కేడర్ కు ఈ ఉరకమనే టొనేనా , ఇంకా వేరే టొన్ తో ప్రకటన ఏవన్నా ఇచ్చేదుందా ? అనే ప్రశ్నకు సమర్థించుకోదగ్గ సమాధానమే దొరకదు. పైన చెప్పినట్లుగా ఇంత ఆర్భాట పదజాలం లో ఒక ‘దళిత ‘ పదం, ఒక ” బ్రాహ్మణ ‘ పదం చోటు చేసుకోవడం చూస్తే , ఎటువేపు ఉరకమని ఈ టోన్ తెలియజేస్తుందొ ఆలోచించాల్సిన అవసరం ఉంది.

              చాలా తమాషాగా గణపతి గారు ఆసాంతం ఉత్కంటతతో నడిచిన సినిమా లాంటి ఫ్లో ఉన్న ఈ పదాల వరదలో, ఈ ప్రకటనమధ్యలో ఆకస్మికంగా ఒక ‘ ఎక్స్ ప్లనేటరీ మోడ్’ కు వెళ్ళి , సోషలిజం పడిపోదు నిలబడుతుంది అని వివరణ ఇస్తూ, ఫ్యూడలిజం నశించి , పెట్టుబాడీ దారీ సమాజం ఏర్పడేటప్పుడు కూడా పెట్టుబడీ దారీ సమాజం ఇలా పడిపోతూ లేస్తూ వెల్తుంది అని ఉటంకిస్తారు. నిజానికి ఇది తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తూ రాసాడు ఆయన. భూస్వామ్య వ్యవస్థ మరుగున పడ్డాక, కేపిటలిస్ట్ సమాజం ఉద్భవిస్తున్నప్పుడూ, తిరిగి భూస్వామ్య సమాజమే బాగుంది , అదే సమాజం లోకి వెల్దాం అని ఉద్యమాలు ప్రజలు జరిపి వెళ్ళిన సందర్భం తఠస్థపడదు. పెట్టుబడీ దారీ సమాజం మొదలౌతున్న క్రమంలొ ఉన్న కరెక్షన్స్ ను , భూస్వామ్య సమాజం వేపు తిరోగమిద్దామనేట్టు ఇంటర్ప్రిటె చేయడం సరి కాదు. మాస్ ప్రాడక్షన్ తో కూడిన డీపర్సనలైజేషన్ అవసరమైన సందర్భం లో కేపిటలిస్ట్ సమాజం ఏర్పడింది అని మరవరాదు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలు వెనక్కు వెళ్ళే సందర్భం ఏది ? రష్యాలో , చైనాలో సోషలిజం తిరోగమనం చెందడం ప్రజల ఆకాంక్ష ఉంది. దీన్ని అక్కడి సోషలిస్ట్ నాయకత్వం పొరపాటు అనొచ్చు అది వేరే విషయం. ఏ ఏ విధంగా కేపిటలిస్ట్ సమాజం నుండి భూస్వామ్య సమాజానికి వెళ్ళిన సందర్భాలేంటో గణపతి గారు గాని ఆయన సానుభూతిపరులు గాని వివరిస్తే మా లాంటి వాళ్ళు తెలుసుకుంటారు. ఇంగ్లాండ్ రెవల్యూషన్ చూసినా, ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసినా ప్రజలు తిరిగి రాచరిక వ్యవస్థలోకి వెల్దామని కోరుకున్న ఛాయలు లేవు. రాచరిక వ్యవస్థ మనుగడ కోసం ప్రయత్నాలు చేయడం, ప్రజలు తిరిగి అదే వ్యవస్థ కావాలని కోరుకోవడం రెండు ఒకటి కాదు.

                    రోహిత్ మరణానికి సామ్రాజ్య వాదం కారణం గొప్ప అని విరసం సంస్థ నాయకులు వేదిక మీద మాట్లాడిన సందర్భాలున్నాయి. ఈ ధోరణులు ఎక్కడి నుండో పుట్టుకు రావు. ఈ టోన్ నుండే పుట్టుకొస్తాయి. విస్తృత ప్రాపంచిక నినాదం పేరుతో , క్షేత్ర స్థాయిలో ఉండే ప్రాక్టికల్ కండిషన్స్ ను దారుణంగా నెగ్లెక్ట్ చేసే పద్దతి ఇది. ఎంతా అబ్స్ట్రాక్ట్ గా , ఎంత పాయింటేడ్ గా ఉండకుండా మాట్లాడాలో ఈ పద్దతి నేర్పిస్తుంది. ఇక చాలు ..ఇన్నాళ్ళు అబ్స్ట్రాక్ట్ గా కంటికి కనిపించని సామ్రాజ్య వాదం గురించి ( అంటే సామ్రాజ్య వాదం సమస్య కాదు అని అన్నట్టు అర్థం కాదు ) కంటికి అగుపించని గతి తర్కం గురించి మాట్లాడింది. పిన్ పాయింటేడ్ గా మాట్లాడ్డం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

                 మరి ఈ టోన్ ఎలా ఉండవలసింది ? ఇది పార్టీ కేడర్ నే టార్గెట్ చేస్తూ ఇస్తున్న ప్రకటన కాబట్టి , బయటి వ్యక్తులుగా మనం ఇదమిద్దంగా ఇలాగే ఉండాలి అని క్రిస్టలైజ్ చేయలేము ఎలా ఉందో విశ్లేషించి చూడ్డం తప్ప. ఎటు వేపుగా వాళ్ళ ఉద్యమ నిర్మాణం జరుగుతుందో సెన్స్ చేయడం తప్ప. ఏదేమైనప్పటికీ ఈ ప్రకటనలో , పట్టణ ప్రాంతాల్లో గాయబ్ అయిన ఉద్యమ నిర్మాణం యొక్క సాంస్కృతిక సైద్ధాంతిక వెనుకబాటు తనం గురించి సరిద్దిఉకునే క్రమాన్ని అలర్ట్ చేస్తూనో, మధ్య తరగతి , మేధావి వర్గం ఎండగట్టిన బ్రాహ్మణీయ ధోరణులే కాక ఇంకా తప్పు దోవలు పట్టిన ఉద్యమాన్ని సరి చేసుకోమనే ఒక పాజిటివ్ మోటివేషన్ తో కూడిన భాగం ఉండాల్సింది. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు, టాటా తన గ్రూప్ కంపనీ ఉద్యోగస్తులకు, ఉరకండి , తరమండి అంటూ స్టేట్మెంట్ మెయిల్ పంపలేదు. ఎటువంటి చాలెంజింగ్ మార్కెట్ పరిస్థితుల్లో , ఎలా ముందుకు పోవాలనే ఒక డైరెక్షన్ సూచిస్తూ ఇచ్చాడు. ఇది కరెక్షన్ సూచిస్తూనే పాజిటివ్ డైరెక్షన్ లో ముందుకు నడిపే ఒక కమ్యూనికేషన్ టొన్. కేపిటలిస్టులు పిడివాదం తో పని చేయరు. పూర్తి స్థాయి అవగాహనతోనే పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు విమర్శ , ఆత్మ విమర్శ లగ్జరీ లేదు గనుక.

                సరే వాళ్ళ పార్టీ కేడర్ ను ఎలా అయిన మోటివేట్ చేసుకోనీ. కానీ మనం గమనించాల్సిన విషయలు మాత్రం (1) ‘ విప్లవమే ప్రత్య్మ్నాయం ‘ అని టైటిల్ పెట్తడం తోటి, ఎవరో బలంగా కాదు అని రుద్దినట్టున్నారు , అందుకు రియాక్షనరీగా గా మాత్రం ఈ స్టేట్మెంట్ రూపొందించునట్టు ఉండడం, ఇదో సైద్ధాంతిక సంక్షోభాన్ని సూచించే చిహ్నం (2) ఒక మోనాటనస్ టొన్ లో ఆర్భాట పదాల చిలకరింపు లో క్షేత్ర స్థాయి సమాజం లో ఉండే నిర్దుష్ట పరిస్థితులను అందుకోడానికి వీళ్ళు 50 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ముందు అడుగు వేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని (3) అబ్స్ట్రాక్ట్ గా మాట్లాడే విధానం వదులుకోలేక పోవడం , వీళ్ళలో ఉండే ఒక గందరగోళ పరిస్థితికి లేదా ‘ క్లారిటీ’ లేని పరిస్థితికి నిదర్శనం.

               ఈ రోజు వీరికుండే మధ్య తరగతి సానుభూతి పరులు విరసం లాంటి సంస్థల్లో చూస్తే , ఈ ప్రకటనలను మార్గ దర్శంగా, ఈ ప్రకటన స్పూర్తిని గైడింగ్ గా తీసుకుని ముందుకెల్తున్నారు. అందుకే ఈ వర్గం ముందుండి నడపాల్సిన సైద్ధాంతిక అవగాహన పురోగతిని , వెనక్కు లాక్కెల్తున్నారు. ఈ అబ్స్ట్రాక్ట్ ప్రకటన , వీళ్ళకు ‘ ఇడియాలజికల్ మేనిప్యులేషన్ ‘ ను సూచిస్తుంది. ఈ పెట్టీ బూర్జువా వర్గం , ఈ విధంగా తమ ఇష్టులకు అనుకూలంగా మాట్లాడే విధానాన్ని మాత్రమే నొక్కి వక్కణిస్తూ, నిజమైన మార్పు కోరుకునే ఒక సైద్ధ్ధాంతిక అవగాహనను తప్పు దారి పట్టిస్తున్నారు. ఇదే ‘ కాజ్’ , ఇదే ‘ ఎఫెక్ట్ ‘ !

                     ఒక సారి గమనించండి – ఒక ఇంఫార్మర్ ఇద్దరు విప్లవ కారులను ( నేను తిరుగు బాటు దారులు అనడానికే ప్రిఫర్ చేస్తాను ) భౌతికంగా , ప్రత్యక్షంగా చంపగలడు. అంటే ఉద్యమాలకు దూరం చేయగలడు. కానీ ఈ ‘ స్ట్రక్చరల్ అసంబద్దత నీతి ‘ , ఎన్నో వందల మందిని ఉద్యమాలకు దూరం చేస్తుంది. ఇంకా కారం చేడు దగ్గుబాటి చెంచురామయ్య , ఆదివాసీలను స్థాన భ్రంశం చేసే జిందాల్ కన్నా దుర్మార్గుడు అనుకుంటే, మిమ్మల్నెవరూ బాగు చేయలేరు. అందుకే వీళ్ళ చర్చలకు ద్రోహం చేసి , వందలాది మందిని మట్టుపెట్టిన చంపిన రాజకీయ నాయకుడి కర స్పర్శను గొప్పగా తలిచిన మేధావి , ఇంకా విరసం వేదికలను అలంకరిస్తున్నాడంటే అంతకన్నా సిగ్గు చేటు వ్యవహారం ఇంకొకటి లేదు. అది ఏ ఒక్క రోజో మొదలైన విషయం కాదు. ఇలాంటి ఎన్నో ప్రకటనల్లో ఈ ఉద్యమ కారులు తెలియజేసిన వాళ్ళకున్న బలహీనత దాన్ని ఆధారంగా ప్రబలుతున్న పిడివాద బ్రాహ్మణీయత.

                    ఒకసారన్నా పబ్లిక్ గా కాంక్రీట్ గా మాట్లాడ్డం సాధ్యమౌతుందా ? అది సాధ్యమైతే , మా సిధ్ధాంతం మహ గొప్పది అనే భీరువు మొహం లేకుండా ప్రత్యక్ష ఆత్మ విమర్శకు సిద్ధమౌతారా ? ఈ విప్లవమనే తిరుగుబాటు సోషియాలజీ, ఆంత్రోపాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ వంటి సబ్జెక్ట్స్ ను ఆకళింపు చేసుకుని ఒక మార్గం ఎన్నుకుంది. అదో పరిశొధన ఫలితంగా వచ్చిన ఒక సిద్ధాంతం . అది గొప్పనో, పాడైపోయినదో తర్వాత విషయం. ఇంత గొప్ప ఙాన పరిధులను ఏర్పరుచుకున్న ఈ తిరుగుబాటు దారులు, ‘ పబ్లిక్ అడ్మిన్సిట్రేషన్ ‘ అనే ఒక చిన్న సబ్జెక్ట్ ను ఆకళింపు చేసుకోలేక పోయారంటే హాస్యాస్పదం. ఈ సబ్జెక్ట్ ‘ రీకన్స్ట్రక్ట్ ‘ చేయడానికి ఉపయోగపడే విషయం. ఇది సంస్థ నిర్మాణాలను, దాని పద్దతులను నిర్దేశించడం లో ఉపయోగపడుతుంది. “డీకన్స్ ట్రక్షన్ లో బిజిగా ఉన్నామిప్పుడు తర్వాత చూద్దాం దాని సంగతి “ అని వీళ్ళు అనుకుంటారు. అక్కడే తప్పులో కాలు పడుతుంది. ‘ డీకన్స్ట్రక్ట్ ‘ చేయాల్సిన వాళ్ళు , వాళ్ళ అప్రోచ్ లో ‘ రీకన్స్ట్రక్షన్ ‘ కు విత్తనాలు వేయాల్సింది ఇప్పుడే.వాళ్ళ సానుభూతి మేధావి వర్గం మొత్తం బ్రాహ్మణులతో నింపి రేపు దళితులకు ప్రాధాన్యం ఇస్తాం అంటే ఎవడు నమ్మాలి ? సంస్థ నిర్ణయాత్మక పాత్రల్లో ఉన్నవాళ్ళు బ్లటంట్ గా ‘ ఐడియలాజికల్ మేనిప్యులేషన్ ‘ కు పాల్పడుతుంటే , ఏ దళితుల్లో వీళ్ల క్రెడిబిలిటీని నింపగలరు ? అక్షరాస్యత లేకుండా, తక్షణ సమస్యలతో తల్లడిల్లే, బ్రాహ్మణీయ రాజ్య వ్యవస్థతో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డ ఆది వాసీలు ఇంకా కొంత మేరకు , ఈ ప్రకటనల వెనుక మొబిలైజ్ అవకాశాలున్నాయేమో గాని, విమర్శనాత్మకంగా, నిర్దుష్టంగా , నిర్మొహమాటంగా, స్వాంతంత్ర్య ఆలోచనతో వీళ్ళతో పాటు నడవగలిగే వాళ్ళు ఎవరూ ఉండరు. అందుకే గణపతి గారు తన ప్రకటనలో అందర్నీ బలవంతంగా మొండికేసి గీ పెట్టినట్లుగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా” విప్లవం తప్ప ప్రత్యమ్నాయం లేదు ..అంతే…. నేనొప్పుకోను లేపోతే ” అన్నట్టు ప్రకటన విడుదల చేసాడు.

             మేము కూడా విప్లవం తప్ప ప్రత్యమ్నాయం లేదు అనే ఒప్పుకుంటాం. ఆర్ ఎస్ ఎస్ కూడా విప్లవమే మార్గమంటుంది. బహుజన సమాజ్ పార్టీ కూడా విప్లవమే మార్గమంటుంది. టీ ఆర్ ఎస్ కూడా అదే అనుకుంటుంది. కానీ మీరనుకున్నదే విప్లవమని ఎవరు నమ్మాలి ? ఎందుకు నమ్మాలి ?

– పి. విక్టర్ విజయ్ కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

One Response to అవును కరెక్టే ……కాని మీరు చేస్తున్నదే విప్లవమని ఎవరన్నారు ?

  1. దడాల వెంకటేశ్వరరావు says:

    “మేము కూడా విప్లవం తప్ప ప్రత్యమ్నాయం లేదు అనే ఒప్పుకుంటాం” అంటున్నారు
    . ఇక్కడ “మేము ” అంటే ఎవరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)