జ్ఞాపకం-20 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

రాజారాంకి ఎక్స్‌రే తియ్యాలన్నారు. హడావుడిగా స్ట్రెచర్‌ తెచ్చారు. బెడ్‌ మీద పడుకొని వున్న రాజారాం ఏ మాత్రం కదల్లేక పోతున్నాడు. స్ట్రెచర్‌ పట్టుకొచ్చిన వాళ్లు చూస్తుండగానే తిలక్‌ అతి వేగంగా కదిలి అన్నయ్యనడుం దగ్గర జాగ్రత్తగా పట్టుకొని లేపుతుంటే పక్కనే వున్న దిలీప్‌ రాజారాం భుజాలు , తల  పట్టుకున్నాడు. జయంత్‌ వెంటనే కాళ్ల దగ్గర పట్టుకున్నాడు. క్షణంలో స్ట్రెచర్‌ మీదకి చేరిపోయాడు రాజారాం. హాస్పిటల్‌ సిబ్బంది రాజారాం వున్న స్ట్రేచర్‌ని పట్టుకెళుతుంటే దానితో పాటు దిలీప్‌, జయంత్‌, తిలక్‌ కదిలి లాబ్‌వైపు వెళ్లారు. రాఘవరాయుడు మాత్రం ఆడవాళ్లు భయపడుతుంటే ధైర్యం చెబుతూ అక్కడే వుండిపోయాడు.
సంలేఖ అంత బాధలో కూడా జయంత్‌ ఇక్కడికి ఎందుకొచ్చాడన్నదే ఆలోచిస్తోంది. అతనేంటి ఇలాంటి చోటుకి రావడం ఏంటి ? అన్నయ్యను కాళ్ల దగ్గర పట్టుకోవడం ఏమిటి ? అదీ ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రేమగా స్ట్రెచర్‌ పై చేర్చడం ఏమిటి ? కళ్లతో చూసింది కాబట్టి నమ్ముతోంది కాని చెబితే నమ్మేదా? ఎంత నమ్మినా లోలోన ఆశ్చర్యంగానే వుంది. చిత్రంగా అన్పిస్తోంది. అయినా జయంత్‌ ఎలాంటి వాడో తనకి తెలియంది ఏముంది… ? దిలీప్‌ రావడం చూసి అతను కూడా ఇలా వచ్చి వుంటాడు. రావడం మంచిదే ! యశోద, నిమ్స్‌ లాంటి పెద్ద, పెద్ద హాస్పిటల్సే కాక ఇలాంటి హాస్పిటల్స్‌ని కూడా చూసినట్లవుతుంది. ప్రపంచంలో అతను చూసిన అతి తక్కువ కోణాల్లో ఇది కూడా ఓ కోణం. ‘జయంత్‌ ! నువ్వు చాలా చూస్తున్నావు కదా ! ఒక్క చదువులో ర్యాంక్‌లే కాదు. ఇంకా వుంది చూసేది’ అని అతని ఆత్మసాక్షి హెచ్చరిస్తుంది. అది అవసరం మనిషికి. అందుకే అతను ఇలాంటివే చూడాలి. అని మనసులో అనుకుంది. నిజానికి జయంత్‌ వచ్చింది తనకోసమే అని ఒక్క శాతం తెలిసినా ఆమె ఆలోచనలు  వేరే విధంగా వుండేవి. మనుషులు  కొన్నింటిని వూహించలేరు.
లాబ్‌లోకి వెళ్లాక రాజారాంని స్ట్రెచర్‌మీద నుండి లేపి నిబెట్టాలని చూశారు. అతను నిలబడలేక పోయాడు. ముగ్గురు కలిసి పట్టుకొని నిలబెట్టినా కిందికి జారిపోతున్నాడు. బలవంతంగా ఎక్స్‌రే కోసం నిలబెట్టారు. ఎక్స్‌రే తీశాక తిరిగి ఎప్పటిలాగే హాల్లోకి తీసుకొచ్చి బెడ్‌మీద పడుకోబెట్టారు. అప్పుడు కూడా సంలేఖ దృష్టి జయంత్‌ మీద వుంది. అతని ప్రతి కదలికను ఆమె గమనిస్తోంది. అతనెందుకో దిలీప్‌ స్నేహితుడిలా తటస్తంగా వుండటం లేదు. దిలీప్‌కన్నా ఎక్కువగా, తిలక్‌తో సమానంగా అన్పిస్తున్నాయి అతని కదలికలు . చూస్తుంటే ఆశ్చర్యంగావుంది. తను చూస్తున్నది నిజమా లేక తను భ్రమ పడుతున్నదా ? ఇది భ్రమ అయితేనే బావుండు.
ఒకటి, రెండు సార్లు కళ్లు తెరిచి చూసిన రాజారాం వాళ్లను గుర్తించి ‘బాగున్నారా?’ అని అడిగి మళ్లీ కళ్లు మూసుకున్నాడు. ఈ లోప బయటకెళ్లిన రాఘవరాయుడు లోపకొచ్చాడు. ఆయన ముఖం చూస్తుంటే ఎలాంటి వారికైనా బాధ కలిగేలా వుంది. ‘అయ్యో ! పాపం ! ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది ?’ అని అనకుండా వుండలేరు. కొడుక్కి ఎలా వుంటుందో ఏమోనన్న విచారం ఆయన్ని బాగా కుంగదీస్తోంది.కొద్ది నిమిషాలు  గడిచాక, సంలేఖ తన ఆలోచనలో తనుండగానే తిలక్‌తో చేయి కలిపి, రాఘవరాయుడికి ధైర్యం చెప్పి ` హాస్పిటల్‌ నుండి బయట కొచ్చారు జయంత్‌, దిలీప్‌.
నేరుగా ఇంటికెళ్లారు ` ఆ రాత్రి హస్విత పెట్టిన భోజనం తిని గతంలో జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి మాట్లాడుకుంటూ మిత్రులిద్దరు చాలాసేపు బాల్కానీలొ కూర్చున్నారు. భర్త గదిలోకి వచ్చేంత వరకు వాళ్ల మాటలు  వింటూ నిద్రపోకుండా మెళకువతోనే వుంది హస్విత. జయంత్‌ మాటల్లో ఏదో మార్పు కన్పిస్తోందామెకు. దిలీప్‌ దగ్గర సెలవు తీసుకొని హోటల్‌కి వెళ్లాడు జయంత్‌. వెళ్లేముందు రేపు హైదరాబాద్‌ వెళ్లిపోతానని చెప్పాడు.
“`
రాత్రి పది దాటింది. హాస్పటల్‌లో వున్న రాజారాం బాగా మాట్లాడుతుండడంతో ఇక పర్వాలేదులే అనుకొని రాఘవరాయుడు, సులోచనమ్మ ఆఖరు బస్‌కి వెళ్లి ఆదిపురి చేరుకున్నారు.రాజారాం దగ్గర వినీల , తిలక్‌ వున్నారు. వినీల  అక్కడేవున్న చిన్న బల్లపై  పడుకుని నిద్రపోయింది. రాత్రంతా అన్నయ్య అవసరాలను చూస్తూ నిద్రపోకుండా మేల్కొని వున్నాడు తిలక్‌. అతనికెందుకో వదిన చెయ్యాల్సిన పనులు  తను చేస్తున్నట్లనిపించింది. తనెందుకు చెయ్యాలి ? ఓ నీచపు పురుగు ప్రవేశించింది అతని బుర్రలోకి.
“` ఎప్పటిలాగే సూర్యోదయానికి ముందే నిద్రలేచిన రాఘవరాయుడు ఇంటి వెనుక వున్న వేపచెట్టు దగ్గరకి వెళ్లాడు. చటుక్కున వేపపుల్లను  విరుచుకుని ఆకు తీసేసి పుల్లను  నములుతూ పొలం  వెళ్లాడు.
ఆయనకు వుండేది రెండెకరాల  పొలం అయినా నిద్ర లేవగానే పొలం వెళ్లి నీళ్లు కట్టటం, నీళ్లు వెళ్ల బెట్టటం లాంటి చిన్న చిన్న పనులుంటే చూసుకొని వస్తుంటాడు… ఇంటికొచ్చి స్నానం చేసి, అన్నం తిని మళ్లీ పొలం  వెళ్తాడు. ‘రాఘవరాయుడు ఎక్కడ ?’ అని ఎవరైనా అడిగితే పొలంలో వుంటాడన్న సమాధానమే వస్తుంది.రాత్రి సిటీలో ఏదో పనివుండి వెళ్లిన ఆదిపురి వాళ్లు హాస్పిటల్లో వున్న రాజారాం దగ్గరకి వెళ్లి చూసి ఉదయాన్నే ఫస్ట్‌బస్‌కి ఊరిలోకి వస్తూ రాఘవరాయుడు వున్నాడేమోనని బస్‌లోంచి పొలం  వైపు తొంగిచూశారు. ఎప్పుడైనా ఆ పొలం  ముందు బస్‌ ఆగదు. కాని ఆ పొలం  వుండేది రోడ్డు పక్కనే కాబట్టి బస్‌లో వున్న వాళ్లు కేకేసినట్లు మాట్లాడితే ఆ పొలంలో వుండే వాళ్లకి విన్పిస్తాయి.
రాఘవరాయుడు వంచిన తల  ఎత్తకుండా తన తల్లిదండ్రుల  సమాధుల  చుట్టూ నాలుగు పిల్లర్లు  లేపాలని మొన్న పనివాళ్లు చేసిన చువ్వకటింగ్‌ తాలూకు ఇనప ముక్కల్ని ఏరుతున్నాడు. ఆ పత్తిచేనులో ఆ ముక్కలు  ఎక్కడ పడితే అక్కడ పడి వున్నాయి.
‘‘రాఘవన్నా ! నీ కొడుకు దగ్గరకి వెళ్లి చూసొస్తున్నాం ! బాగా మాట్లాడుతున్నాడు. నువ్వేం కంగారు పడకుండా పనిచేసుకో !’’ అంటూ వాళ్లు బస్‌లోంచి బిగ్గరగా అనగానే, ఆయన సంతోషంగా తలపైకెత్తి చూసి, బదులు గా చెయ్యి వూపాడు. బస్‌ వెళ్లిపోయింది.వాళ్లలా అంటుంటే కొత్త శక్తి వచ్చినట్లైంది రాఘవరాయుడికి. గబగబా చువ్వలన్నీ ఏరి సిమెంట్‌ సంచిలో వేసి నీటికాలువ గట్టుమీద పెట్టాడు. చెల్లా చెదురుగా వున్న ఇటుకలన్నీ ఓ చోటుకి చేర్చాడు. రేపు పనిలోకి వచ్చే బేల్దార్లకి ఏమేమి అవసరం అవుతాయో పక్కనే వున్న కొండాపురం నుండి తెప్పించుకోవాలని ఆటో అతన్ని పిలిపించి చెప్పాడు. ఇక ఇసుక ఒక్కటే లేదు. నిన్న కోడలు  అడ్డు చెప్పకుండా వుండి వుంటే ఇసుక కూడా పొలంలోకి వచ్చేది. రాజారాంకి ఈప్రమాదం జరిగి వుండేది కాదు. అంతా విధికృతం. మళ్లీ బాధతో కూడిన ఆలోచనలు  ఆయన్ని ఆవరించాయి.

– అంగులూరి అంజనీదేవి

( ఇంకా ఉంది )

———————————————————————————————————————————–

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)