జ్ఞాపకం-19 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

[spacer height=”20px”]రెండు గంటలు  గడిచాక ఆదిపురికి బైక్‌ మీద వెళ్లిన జయంత్‌, దిలీప్‌ ఆ ఊరిలోకి వెళ్లగానే ` రాజారాం యాక్సిడెంట్‌ వార్త విన్నారు. వినగానే షాకయ్యారు. వెంటనే తేరుకొని అక్కడో క్షణం కూడా వుండకుండా తిరిగి సిటీకి వచ్చారు. రాజారాం వున్న హాస్పిటల్‌కి వెళ్లారు. హాస్పటల్‌కి వెళ్లగానే వాళ్లిద్దరు ఆత్రంగా రాజారాం కోసం వెతుకుతున్నారు. దిలీప్‌కి తెలిసిన వాళ్లు కన్పించారు. వాళ్లతో మాట్లాడుతుండగా రాజారాం బెడ్‌ దగ్గరనుండి పాన్‌ పట్టుకునిబయటకొస్తున్న తిక్‌ దిలీప్‌ని, జయంత్‌ని చూసాడు. వాళ్లు వస్తున్నది అన్నయ్య కోసమే అని అతనకి అర్థమైంది. ఎందుకంటే దిలీప్‌ది తన వదిన వినీ గారి ఊరైన కొండాపురం. ఇల్లు  కూడా వాళ్ల పక్క ఇల్లే. అంతే కాదు. తనూ, దిలీప్‌, జయంత్‌ ఇంటర్‌ చదివింది ఒకే కాలేజీలో…
[spacer height=”20px”]అందుకే వెంటనే ‘‘దిలీప్‌ !’’ అంటూ పిలిచాడు తిలక్.దిలీప్‌ తిరిగి చూడగానే ‘‘అదిగో ఆ హాల్లో చివరి బెడ్‌మీదనే అన్నయ్య వుండేది!’’ అంటూ అడ్రస్‌ చెప్పాడు. తిరిగి తన పని మీద తను వెళ్లాడు.వాళ్లు నేరుగా వెళ్లి రాజారాంని చూశారు. పకరించకుండా అలాగే బెడ్‌ ప్రక్కన నిలబడ్డారు. వాళ్లేకాదు రాజారాంని ఎవరూ పలక రించటం లేదు. బాధగా చూస్తున్నారు. నిశ్శబ్ధంగా చూస్తున్నారు. సానుభూతిగా చూస్తున్నారు.
[spacer height=”20px”]రాజారాం బెడ్‌ పక్కన ఓ పేషెంట్‌ బెడ్‌ ఖాళీగా వుండటంతో దానిమీద వినీల , సులోచనమ్మ, సంలేఖ కూర్చుని ఆందోళనగా రాజారాం వైపే చూస్తున్నారు. రాఘవరాయుడు అప్పటి వరకు అక్కడే వుండి ఇప్పుడే బయటకెళ్లినట్లు లోపలికి వస్తూ తిలక్‌ చెప్పాడు. ఎప్పుడూ హుషారుగా, నిర్లక్ష్యంగా వుండే తిలక్  ఇప్పుడు భయపడుతున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది… ‘భయపడకు’ అన్నట్లు తిలక్‌ భుజంపై చేయివేశాడు దిలీప్‌. జయంత్‌ కూడా ధైర్యం చెబుతున్నట్లు తిలక్‌ చేయి అందుకున్నాడు. ఆ స్పర్శ చాలా ఆత్మీయంగా అన్పించింది తిలక్‌కి.
[spacer height=”20px”]అక్కడ కొద్ది క్షణాలు  నిశ్శబ్దం ఆవరించింది. అందరి ముఖాల్లో ఆకాశంలో మేఘాల్లా దిగులు , ఆందోళన, భయం.చుట్టూ పేషెంట్ల వాసన, మందు వాసన, మాసిపోయిన గోడలు . అది ఒక మంచి పేరున్న గవర్నమెంట్‌ హాస్పిటల్‌ అని అర్థమైపోతోంది. చుట్టూ చూస్తూ వున్న జయంత్‌ చూపు అనుకోకుండా సంలేఖపై నిలిచాయి. ఆ చూపుల్లో ఏదో ప్రత్యేకత. నేను నీ కోసమే వచ్చానన్న సందేశం. కానీ నిన్నీ స్థితిలో చూస్తానని అనుకోలేదు అనే బాధ.ఇదంతా క్షణంలో పసిగట్టింది వినీల ఎంతయినా వినీలది విహంగవీక్షణం.
[spacer height=”20px”]చిన్నప్పటినుండి ఎవరినైెనా ఏడ్పించడం తప్ప ఏడవడం తెలియని వినీల  భర్తకి జరిగిన యాక్సిడెంట్‌ వార్త విని షాక్‌లోకి వెళ్లింది. అ తర్వాత తేరుకుని, ఏడ్చి, ఏడ్చి అలసిపోయింది. ఇప్పుడు కూడా వస్తున్న ఏడుపునుఆపుకుంటున్నట్లు ఆమె ముఖం బాగా ఉబ్బివుంది. దిలీప్‌ని చూడగానే ఏడవటానికి సిద్ధంగా వున్నదానిలా ముక్కు తుడుచుకుంది. దిలీప్‌ అది గమనించి వినీల  కూర్చున్న వైపుకి వెళ్లాడు.
[spacer height=”20px”]‘‘బాధపడకు అక్కా ! అదృష్టం బాగుండి బావకు దెబ్బలేం తగలేదు. మందు ప్రభావం వల్లనో  ఏమో మత్తుగా వుండి మనతో మాట్లాడలేక పోతున్నాడు అంతే! డాక్టర్‌ గారు ఈ రోజే ఇంటికి తీసుకెళ్లమని చెబుతాడు. ఏంకాదు.’’ అంటూ ధైర్యం చెప్పాడు. అలాగే సులోచనమ్మను, సంలేఖను కూడా తన పలకరిoపుతో  ఓదార్చాడు. కాని రాజారాం సమస్య వేరే ఏదో వుందన్నది దిలీప్‌కే కాదు అక్కడ ఎవరికీ తెలియదు. డాక్టర్లు కూడా చెప్పడం లేదు.
ఒక వైపు ముక్కు తుడుచుకుంటూనే మెల్లగా  తలెత్తి దిలీప్‌ వైపు చూసి ‘‘ఈ అబ్బాయి ఎవరు?’’ అని అడిగింది వినీల ఆమె గొంతు దిలీప్‌కి మాత్రమే విన్పించినా ఆ గొంతులో బోలెడంత ఆసక్తి వుంది.
‘‘నా స్నేహితుడు జయంత్‌!’’ అంటూ జయంత్‌ని ఆమెకు పరిచయం చేసాడు. ఆ సమయంలో సులోచనమ్మ కూడా జయంత్‌ వైపు చూసింది. సంలేఖ కావాలనే చూడలేదు.
[spacer height=”20px”]వినీలకి జయంత్‌ గురించి ఇంకా తెలుసుకోవాలని వున్నా ఆ వాతావరణం అందుకు సహకరించక మౌనంగా వుండిపోయింది.పక్కనే వున్న తిలక్‌ వాళ్ల అన్నయ్యకి ప్రమాదం ఎలా జరిగిందో తనకి తెలిసిన సమాచారం చెప్పాడు. రాజారాం వున్న ట్రాక్టర్‌ని ఎదురుగా వస్తున్న బండి గుద్దుకోవడం వల్ల  ట్రాక్టర్‌లో వున్న షామియానాలు , కుర్చీలు  రాజారాం శరీరం మీదపడి మొత్తం ఒత్తుకుపోయింది. దెబ్బలు  పైకేం కన్పించడంలేదు. చూసేవాళ్లకి అతను బాగానే వున్నట్లు అన్పిస్తున్నాడు. అందుకే ఎవరు కూడా పెద్ద కంగారు పడడం లేదు.అంతవరకు తండ్రి ఇసుక కోసం పంపాడన్న కోపంతో వున్న తిలక్‌ దు:ఖ భారంతో వున్న తండ్రిని చూసి ‘‘అన్నయ్యకి ఏంకాదులే నాన్నా ! నువ్వేం బాధపడకు !’’ అంటూ ఓదార్చాడు. అది చూసి కాస్త ధైర్యంగా, కాస్త దు:ఖంగా, ఇంకాస్త నిస్సహాయంగా అటూ ఇటూ తిరుగుతూ  వచ్చిన వాళ్ల ముందు తల  బాదుకుంటూ వుండిపోయాడాయన.

                                                                                 – అంగులూరి అంజనీదేవి  

                                                                                                                                            (ఇంకా ఉంది )

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)