హే”విలంబ”రాగం -పెరుమాళ్ళ రవి కుమార్

వసంతాల ఆమనీ  కొత్త రాగం ఆలపించవే 

ఉగాదిన షడ్రుచుల భావాలు పలికించవే

ఉగాది పచ్చడిలోని జీవిత పరమార్థాన్ని

పాడవే కమ్మనైన నీ గొంతుతో

స్మార్ట్ ఫోన్ తో స్మార్ట్ గా కనిపించినా

ఎవరికి వారే యమునాతీరే

అందరూ కలిసిన చోటా

ఎవరి ప్రపంచం వారిది

ఫేస్ బుక్ వాట్స్ అప్

ట్విట్టర్ పోస్ట్ అంటూ

కామెంట్లoటు లైక్ లంటూ

సంబరపడే నెటిజన్లకి

బంధాల విలువను

తెలుపవే  కమ్మనైన నీ గొంతుతో

దేశ సేవ కై అసువులు బాసిన

వీర జవాన్లారా మీత్యాగం

మా బ్రతుక్కి రక్షణ

వీర సైనికుల వీరమరణాన్ని

నలుదిశలా చాటవే కమ్మనైన

నీ గొంతుతో ఈ ఉగాది వేళ

ఓ కోయిలా… ఓ కోయిలా …

కులాలంటూ మతాలంటూ

విధ్వంసక చర్యలనుండి

కులమతాలకతీతమైన

నవ సమాజ స్థాపనా గీతాన్ని

పాడవే కమ్మనైన నీగొంతుతో

ఈ  ఉగాది వేళ

నవమాసాలు మోసిన తల్లి భారం

బాధ్యతవహించిన తండ్రి భారం

వృద్దాశ్రమాలకు తరలిస్తున్న వైనం

అమ్మా అన్న పిలుపే “నీ యమ్మా “

అంటూ  ఛీత్కారాల పర్వం

నాన్న గుండెలపై ఆడిన వాడే

నాన్న గుండెలపై తన్తున్నతరుణాలు

వృద్దాప్యం మీదపడగా

కంటి చూపు కనపడక

కాలి నడక ముందుకు సాగక

వృద్దాశ్రమాల వృద్ద భారతానికి

ఉద్దరణ గీతాన్ని ఆలపించవే కోయిలా

కమ్మనైన నీ గొంతుతో ఈ  ఉగాది వేళ

కాన్వెంట్ సీతాకోక చిలుకలు

మోయలేని పుస్తకాల మోత

అయినా మారని తలరాత

హోంవర్క్ ప్రాజెక్ట్ వర్క్ షీట్

వర్క్ షాప్ అంటూ నెట్ సెంటర్ ల చుట్టూ

తిరుగుటకంటే తిరుగలి చుట్టూ తిరిగిన మేలని

పాడవే కోయిలా కమ్మనైన నీ గొంతుతో

ఈ  ఉగాది వేళ

రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు

కడుపునిండని కరుణాభరిత వ్యధ నిలయాలు

సూర్య తాపాన్ని సైతం లెక్కచేయని కఠోర శ్రమ

ఎవరు చూపించరు వారిపై క్షమ

స్వేద బిందువులే ముత్యపు బిందువులు

శ్వేత పత్రంపై లిఖించే జీవిత గాధలు

భారమైన బతుకులు

భోరున విలపించే జీవన గీతాన్ని పాడవే కోయిలా

ఎన్ని వత్సరాలు మారినా

మారని మాతలరాతలు

ఆరని మా ఆకలి మంటలు

ఆదరణ లేని అన్నదాతను

నిరాదరణలో నిoగికెగిసిన నిజాన్ని నేను

పాడవే నా కన్నీటి గాధను కమ్మనైన

నీ గొంతుతో ఈ ఉగాది వేళ……

మహిలోన మహిళ కేది మహోన్నత స్థానం

బ్రతుకంటూ మనకుంటే అది ఆమె త్యాగం

ఉర్వి పై తన ఊపిరి బిగబట్టి ఊపిరిలూదిన

మాతృ హృదయాన్ని పాడవే కమ్మనైన నీగొంతుతో

ఈ  ఉగాది వేళ

కవిత ప్రజల పక్షం

కవిత సామాజిక హితం అన్న

ఎండ్లూరి మాటల్ని కవితాలోకానికి చాటించవే కోయిలా

వూరూ వాడా పల్లే పట్నం పయనించు

నాడు విదేశీ వుద్యోగాల వేట

ప్రాణ భీతితో స్వదేశానికై  తిరుగు బాట

మాతృ భూమి పై స్వేచ్ఛగా జీవించరమ్మంటూ

పాడవే కమ్మనైన గొంతుతో ఈ ఉగాది వేళ

నేడు “అమ్మ”చేదు మాట

మమ్మీ చేరువైన మాట

అమ్మ భాష లోని సౌలభ్యాన్ని సౌఖ్యాన్ని

తెలుపవే కమ్మనైన నీ గొంతుతో ఈ ఉగాది వేళ

పేదల బతుకుల్లో కొత్త ఉగాదులు తీసుకురావే కోయిలా

దీనుల జీవితాల్లో కొత్త ఉషస్సులు తీసుకురావే కోయిలా

ఈ హేవళంబి లో విలంబ శృతిలో కొత్త రాగాన్ని ఆలపించవే

కమ్మనైన నీ గొంతుతో ఈ ఉగాది వేళ                              

                                                                   -పెరుమాళ్ళ రవికుమార్ 

 

 

 

 

UncategorizedPermalink

12 Responses to   హే”విలంబ”రాగం -పెరుమాళ్ళ రవి కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో