జ్ఞాపకం-17 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

[spacer height=”20px”]‘నాన్నని ఏమీ అనకు. నాన్నకు మనమెంతో వాళ్ల తల్లిదండ్రులు కూడా అంతే! మనకోసం ఆయన చేయగలిగిందంతా చేశాడు. చేస్తున్నాడు… తనని కన్నవాళ్ల గురించి ఆయన ఆ మాత్రం చేసుకుంటే తప్పులేదు.’’ అంది. ఆమె మాట్లాడుతున్నా కన్నీళ్ల‘ను తుడుచుకుంటూనే వుంది.ఇంకేం మాట్లాడినా చెల్లెలు  బాధపడుతుందని మౌనంగా వున్నాడు తిలక్‌. క్షణ క్షణం బస్‌ కోసం వాళ్లిద్దరి చూపు రోడ్డుపై దూరంగా వెళ్లి నిలుస్తున్నాయి.
[spacer height=”20px”]సంలేఖకి తన తాతయ్య బసవరాయుడు గుర్తొచ్చాడు. ఆయన గురించి తన తండ్రీ, తన వూరిలో వాళ్లు కథలు , కథలుగా చెప్పుకోవడం గుర్తొచ్చింది. నానమ్మ కూడా తాతయ్య ‘‘ఊ’’ అనగానే ఎలా బెదిరిపోయేదో పక్కింటి వాళ్లు, ఎదురింటి వాళ్లు చెప్పుకోవడం విన్నది. తాతయ్య కేవలo  తన కుటుంబం కోసమే బ్రతికిన మనిషి కాదట. జనం కోసం, జనం మనిషిలా బ్రతికాడట… భారత్‌లో ఎమర్జన్సీ నడుస్తున్న రోజుల్లో, ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల  హక్కుల్ని హరిస్తున్న రోజుల్లో, ఆమె కొడుకు సంజయ్‌ తల్లి వెనుక నిలబడి కల్లోలాలు  సృష్టిస్తున్న రోజుల్లో `ప్రజాస్వామ్య వాదులతో జైళ్లు నిండిపోతుంటే, పాలక పక్షం దౌర్జన్యాలకు జనం కడుపు మండి పోతుంటే ` ఆ జనం మధ్యలోకి వెళ్లి ‘ఏం చేయాలి?’ అని ఆలోచించేవాడట…
[spacer height=”20px”]సమాజంలో చాలా సమస్యలు  వున్నాయని, అన్నీ తీవ్రమైనవేనని, అవి ప్రజల  జీవితాలను అతలాకుతలo  చేస్తూ దేశాన్ని వెనక్కు నెట్టేస్తున్నాయని మదనపడేవాడట… పేద మధ్యతిరిగి, పేదల  మధ్య జీవించి, పేదలతో మాట్లాడి, పేద సమస్యను అర్థం చేసుకుని ` ఆ సమస్యను అందరితో చర్చించి చివరకి వాటిని ఒక ఐఎఎస్‌ అధికారి దాకా తీసికెళ్లాడట… ఆ రోజుల్లో అలా చెయ్యడం అనేది ఎంతో సమర్థతతో కూడుకున్నపని… ఐతే ఆయన సమర్థతతో, ఓపికతో, సాహసంతో తీసుకున్న నిర్ణయాలు  వూరికే పోలేదట… వాటి ప్రభావం వల్ల  ఎన్నో జీవితాలు  మారిపోయాయని, ఎన్నో కుటుంబాలు  ఒడ్డున పడ్డాయని, ఎన్నో గ్రామాలకు అవి పాఠాలుగా నిలిచాయని చెప్పుకుంటుంటారు.
[spacer height=”20px”]ముఖ్యంగా మనిషికి చదువు వుంటే ఆలోచనలు  మారతాయని, ఆలోచనలు  మారితే జీవితం మారుతుందని, జీవితం మారితే కుటుంబం మారుతుందని, కుటుంబం మారితే పల్లెమొత్తం మారుతుందని నమ్మేవాడట… ఆ నమ్మకంతోనే ఆయన అప్పట్లో చేసిన అక్షరాస్యత ఉద్యమం వల్ల  ఇప్పుడు ఆదిపురి నిండా అక్షరాస్యులే అయ్యారు. పొదుపు ఉద్యమం వల్ల  అందరిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. వూరంతా పరిశుభ్రంగా, పరిమళభరితంగా, పచ్చగా మారిపోయింది. ఒక్క తమ ఇంట్లో తప్ప పేదరికపు ఆనవాళ్లే కన్పించకుండా పోయాయి. ప్రస్తుతం ఆదిపురి ప్రజలు  చాలావరకు అవినీతిని ప్రోత్సహించకుండా, అవినీతి అధికారులను భరించకుండా, అవసరమైతే నిర్భయంగా నిలదీస్తున్నారంటే దానికి కారణం తాతయ్యనే అంటారు…
[spacer height=”20px”]కొద్దిరోజుల  క్రితం తాతయ్య స్నేహితుడెవరో కలిసి ‘‘ఏం రాఘవయ్యా! మీ అమ్మా, నాన్నలు  కట్టించిన ఇంట్లో నీ భార్యా, పిల్లలతో  సుఖంగా వుంటున్నావ్‌! వాళ్లు ఇచ్చిన పొలంలో పంట పండిoచుకుని తింటున్నావ్‌ ! అదే పొలంలో వున్న వాళ్ల సమాధులు  ఎండకి ఎండి, వానకి తడిసి ఓ పక్కన పగిలిపోయినెర్రలు  బారివుండడం చూస్తూ కూడా ఏం చెయ్యలేక పోతున్నావే! వాటి పనేదో కాస్త చూడరాదు’’ అన్నాడట… ఆ మాటలు  వినికూడా డబ్బు సమస్యతో వున్న తన తండ్రి మౌనంగా వుండడం తప్ప ఏమి చెయ్యలేకపోవడం తను చూస్తూనే వుంది.
[spacer height=”20px”]నానమ్మకు డబ్బులివ్వాల్సిన మొద్దుపోయ్య ఈ మధ్యన ఇంటి కొచ్చి ‘‘రాఘవయ్యా ! నువ్వెన్నిసార్లు అడిగినా మీ అమ్మగారి డబ్బు ఇవ్వకుండా నిన్నెంత ఇబ్బంది పెట్టానో నాకు తెలుసు… ఆ తర్వాత నా భార్య చనిపోయి నేను ఎన్ని బాధలు  పడ్డానో నీకు తెలియంది కాదు. ఇంత కాలానికి నా కొడుకు సౌదీ నుండి డబ్బు పంపి ‘నాన్నా ! ఈ డబ్బును వెంటనే రాఘవరాయుడు గారికి ఇచ్చెయ్యి. అప్పట్లో ఆ పెద్దామె నా గుండెకు చిల్లి పడిoదని డాక్టర్లు చెబితే విని జాలి పడి ఇచ్చిన డబ్బువి… వాటిని తిరిగి ఇవ్వటం బ్రతికి వున్న మనుషులుగా మన ధర్మం… ఆమె ఇప్పుడు లేదు కదా ! డబ్బు ఎందుకు తిరిగి ఇవ్వాలి అని నీ మనసులో వుండొచ్చు. కాని చనిపోయిన వాళ్ల సొమ్ముని తిరిగి ఇవ్వకపోతే బురదలో పురుగులమై పుడతామట… రాఘవరాయుడిగారికి ఇవ్వాల్సిన డబ్బు కాక ఇంకా కొంత డబ్బును నీకు విడిగా పంపుతున్నాను.
[spacer height=”20px”]ఆ డబ్బుతో అమ్మ సమాధిని పాలరాతితో కట్టించు… ఆ విధమైన సమాధి మన బలగాది పల్లెలోనే కాదు ఆ చుట్టు పక్క మండలాల్లో కూడా లేని విధంగా వుండాలి అది నాకు. ఆకలి  కోసమే ఇక్కడ రాత్రీ, పగలు  కష్టపడి ఆ డబ్బును సంపాదించాను!’ అన్నాడు. ఏ కళాలేని నాతో పోల్చుకుంటే  నాకొడుకు నిజంగానే గొప్పవాడు. నా కొడుకు చెప్పినట్లే నా భార్య సమాధి కట్టించడం మొదలు  పెట్టాను. నువ్వు కూడా ఈ డబ్బుల్ని ఎంత కష్టంలో వున్నా నీకోసం వాడుకోకు. కష్టాలు  వస్తుంటాయి. పోతుంటాయి. వాటిని మనం మన చిన్నప్పటినుండి చూస్తూనే వున్నాం. ఈ డబ్బుతో మీ అమ్మా, నాన్న సమాధుల్ని బాగు చేయించు. అవి రోడ్డుపక్క పొలంలో వున్నందువల్ల  దారినపోయేవాళ్లు చూసి ‘అయ్యో! బసవరాయుడు ఎంత బాగా బ్రతికినవాడు. ఎన్నెన్ని మంచి పనులు  చేసిపోయాడు. చివరికి ఆయన సమాధి శిథిలమై పోతున్నా పట్టించుకునేవాళ్లు లేరే! ’ అని అంటున్నారిప్పటికే…’’ అంటూ ఆ డబ్బుల్ని తండ్రి చేతిలో పెట్టడం తను చూసింది.
[spacer height=”20px”]అది చూసి తండ్రి తనతో ‘‘తిలక్‌కి ఈ డబ్బున్నాయని తెలిస్తే వీటిని తీసికెళ్లి బైక్‌ కొంటానని గొడవ చేస్తాడు సంలేఖా ! అందుకే వాడితోచెప్పట్లేదు. నువ్వుకూడా చెప్పకు. ఈ డబ్బుల్ని కొద్ది, కొద్దిగా తీసి సమాధులు కట్టటానికి వాడతాను.’’ అన్నాడు. అదే విషయం ఇప్పుడు తిలక్‌తో చెప్పాలనుకొంది. లేకుంటే ఇప్పుడు సమాధులు  కట్టించడానికి వాడబోయే డబ్బు తండ్రివే అని అపార్థం చేసుకొని తండ్రిని హింసపెడతాడు. తిలక్‌ అన్నయ్య సామాన్యుడు కాదు. ఏ మాత్రం అవకాశం దొరికినా తండ్రి మీద కత్తి దువ్వుతాడు. అందుకే చెప్పింది.
అది వినగానే నవ్వాడు తిలక్‌ ! ఇది నవ్వే సమయమా ! ఎందుకు నవ్వుతావు అన్నట్లు చూసింది సంలేఖ.

– అంగులూరి అంజనీదేవి

———————————————————————————————————————————–

Uncategorized, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో