జ్ఞాపకం-16 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక కళ్లు పెద్దవి చేసి ‘‘నాన్న వల్లనా ?’’ అంది.
‘‘అవును ! నాన్న వల్లనే  !’’
‘‘నువ్వేం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా తోస్తోందా ? అన్నయ్య యాక్సిడెంట్‌ వార్త విని నీకు నిజంగానే మతిపోయింది. నువ్వింకేం మాట్లాడకు’’ అంటూ కసురుకుంది.
తిలక్‌ గట్టిగా తలకేసి కొట్టుకొని ‘‘నా కర్మ అనాలో, నా జాతకం అనాలో నేను నిజం చెప్పినా నమ్మరేంటే మీరు? ఇలాంటివి కూడా అబద్దం చెబుతానా ! సరేలే ! ఏం చేద్దాం ! జరిగిన దాన్ని ఆపగలమా !’’ అంటూ విచారంగా చూశాడు తిలక్‌. చూస్తుంటే నిజమే చెబుతున్నాడనిపిస్తోంది. కానీ అది తండ్రి వల్లనే  జరిగిందీ అంటే వినలేకపోతోంది. అడిగితే ఏం చెబుతాడో ! ఏం వినాల్సి వస్తుందో అని మౌనంగా వుంది.
…. అలా ఎక్కువసేపు మౌనంగా వుండలేక ఏం చెప్పినా వినటానికి సిద్ధమైన దానిలా ‘‘ఏం జరిగిందో చెప్పు అన్నయ్యా ! ‘‘అంది ఆమెకి ఏడుపు ఆగడం లేదు.
‘‘అన్నయ్యవాళ్ల స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థి చనిపోవడం వల్ల  ఈ రోజు స్కూల్‌ లేదని, అన్నయ్య సెల్‌ఫోన్‌కి మెసేజ్‌ వచ్చింది. అది చూడగానే అన్నయ్య ‘‘అమ్మా ! నాకు లంచ్‌ బాక్స్‌ పెట్టకు. ఇవాళ మాకు స్కూల్‌ లేదు.’’ అని అమ్మకి విన్పించేలా హాల్లోంచి ఓ కేకేసి చెప్పాడు. అక్కడే వున్న నాన్న అదివిని సంతోషపడి ‘‘నీకు స్కూల్‌ లేదు కదా రాజా ! నీకోపని చెబుతాను చేస్తావా ?’’ అని అడిగాడు. ‘‘చెప్పండి ! నాన్న గారు ! చేస్తాను.’’ అన్నాడు అన్నయ్య. ‘‘ఏం లేదురా! మీ తాతయ్య, నానమ్మ సమాధులు  మళ్లీ కట్టిద్దామనుకున్నాం కదా ! ఇసుక కావాలి. వర్షాలు  పడ్డాయంటే ఆ ఏరులోంచి ఇసుక తేవాలంటే కష్టం. పనివాళ్లు దొరకటం లేదు. మన ట్రాక్టర్‌ తీసికెళ్లి ఇసుక తేవాలి.’’ అన్నాడు. వెంటనే అన్నయ్య ‘తెస్తాను’ అన్నాడు. అది నేను విన్నాను. నాన్న చెప్పినట్లు విని అన్నయ్య ఇసుక కోసం వెళ్లడం వల్లనే  ఇలా జరిగింది. ఈ యాక్సిడెంట్‌ నాన్న వల్లనే  జరిగింది. అసలే మనకు వుండే ఆస్తి ఆ ట్రాక్టరొక్కటే. అది కూడా ఈ దెబ్బతో ‘ఉష్‌’ ’’ అన్నాడు తిలక్‌ చేతుల్లో  గాల్లోకి లేపి.
‘‘సరే ! అన్నయ్యా ! నాన్నకి మాత్రం ఇలా జరుగుతుందని ముందు తెలుసా ? తెలిస్తే పంపుతాడా ? ఇది నాన్న వల్లనే  జరిగింది అని ఇంకెప్పుడూ అనకు. అననని నాకు మాట ఇవ్వు…’’ అంది.
‘‘అసలే తిలక్‌ నోటి మనిషి, అని ఆమె భయం. మాట జారితే అది ఒక ప్రవాహమై ఎటు వెళ్తుందో చెప్పలేం ! అప్పుడు అందరు తండ్రిని నిందిస్తారు. అది విని తను తట్టుకోలేదు. అందుకే తిలక్‌ దగ్గర మాట తీసుకుంది. మాట తీసుకుందే కానీ ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు. తిలక్‌ అన్నయ్య చెప్పిందే నిజమైతే రాజారాం అన్నయ్య ఇసుక ట్రాక్టర్‌ క్రింద పడి నలిగి పోయివుంటారు. ఆ ఊహ ఆమె గుండెను పిండి చేస్తోంది.
అన్నయ్యకి ఎలా వుందో ఏమో అని ఆ ఇద్దరి గుండెల్లో వాహనాలు  పరిగెత్తుతున్నాయి.
‘‘ఎంతయినా రాజారాం అన్నయ్య నీలాగకాదు. ఇంత వయసు వచ్చినా నాన్న చెప్పినమాట ఎలా విన్నాడో చూడు ! ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాడు. కానీ అన్నయ్యకి ఇలా జరగాల్సింది కాదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో? ఇదంతా నా వల్లనే  జరిగింది అని నాన్న ఎంత కుమిలిపోతున్నాడో! అమ్మ అయితే ఇక చెప్పక్కర్లేదు. తల  బాదుకుంటూ వుంటుంది. వదిన అన్నయ్యకి ఏం జరిగినా తట్టుకోలేదు. ఇలా జరగడం ఘోరం…’’ అంటూ కన్నీళ్లను ఆపుకోలేక కళ్లను చున్నీతో తుడుచుకుంది సంలేఖ.
ఎంత ప్రయత్నించినా కన్నీటి ఊటను ఆపుకోలేకపోతున్న చెల్లివైపు చూసి… ‘‘నాక్కూడా నీలాగే ఏడవాలనిపిస్తోంది. మనిద్దర్నిలా చూస్తే ఈ జనాలంతాఏం జరిగిందని మన చుట్టూ చేరతారు. ముందు నువ్వా ఏడుపును కంట్రోల్‌ చేసుకో! అన్నయ్యకేం కాదు…’’ అంటూ ధైర్యం చెప్పాడు తిలక్‌.
‘‘నాకు నీలా ధైర్యంగా వుండడం చేతకావడం లేదు అన్నయ్యా ! తప్పకుండా మన అన్నయ్యకి గట్టి దెబ్బలే తగిలి వుంటాయి. ఇసుక ట్రాక్టర్‌ కింద పడిపోవడం అంటే మాటలా ! అసలు  వున్నాడో లేడో !’’ అంటూ ఆ దృశ్యాన్ని ఊహించుకుని ఏడుపు ఆపుకోలేక నోటినిండా చున్నీని కుక్కుకుంది.
చెల్లెల్ని అలా చూస్తుంటే బాధగా వుంది తిలక్‌కి. ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. తండ్రి మీద పిచ్చి కోపం వస్తోంది.
ఆ కోపంలో ‘‘అయినా నాన్నకి ఇదేంపిచ్చి కోరిక ? ఇదేం కల  ? ఎవరైనా కన్న పిల్లల కోసం ఖర్చు చేస్తారు. పిల్లలు అడిగినప్పుడు డబ్బులిచ్చి ఏమైనా కొనుక్కొని తినమని చెబుతారు. నేను మొన్నంతా ఆకలితో మాడిచచ్చాను. అయినా నాకో రూపాయి ఇవ్వడు. నన్ను పట్టించుకోడు. ఎప్పుడో చచ్చిపోయి, అందరు మరచిపోయినవాళ్ల అమ్మా, నాన్న సమాధులు  కట్టించాలట. దానికోసం ఖర్చుపెట్టాలట. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది ? పాత సమాధులేవో వున్నాయి కదా? వాటిని అలాగే వుంచితే సరిపోదా! అవి అక్కడక్కడ కొంచెం పగిలాయట. కుంగాయట… అక్కడేదో నిజంగానే వాళ్ల శరీరాలు వున్నట్లు… ఆ శరీరాలే కుంగినట్లు, పగిలినట్లు, విలవిల్లాడుతున్నాడు. అసలెక్కడున్నారే వాళ్లు ? తాతయ్య చనిపోయి 15 ఏండ్లు. నానమ్మ చనిపోయి 11 ఏండ్లు…. బ్రతికున్నవాళ్లనే పట్టించుకోవడం లేదు. చనిపోయిన వాళ్ల సమాధులకు రీ కన్‌స్ట్రక్షన్‌ ఎందుకు…? వయసు పెరిగే కొద్దీ మతిలేనివాడిలా తయారవుతున్నాడు నాన్న…!’’ అన్నాడు.

– అంగులూరి అంజనీదేవి

————————————————————————————————————————————

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)