జ్ఞాపకం-15 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

          ఏదైనా స్నేహితునితోనే కదా చెప్పుకోవాలి అన్నట్లు తన మనసులో మాటను జయంత్‌తో చెప్పుకుంటున్నాడు దిలీప్‌.ఆలోచిస్తున్నాడు జయంత్‌.మళ్లీ మాట్లాడటం మొదలు   పెట్టి ‘‘చిన్న చిన్న ఘర్షణలు  సహజమే అయినా విపరీతంగా గుచ్చుకుంటాయి జయంత్‌ ! అలాంటి సందర్భాలు లేనప్పుడు ఎంత ఆనందంగా వుంటుందో మాటలతో చెప్పలేం ! ఎప్పటికీ ఆ ఆనందమే కావాలనుకోవటం కూడా సబబు కాదేమో ! ఎందుకంటే జీవితం కూడా ముఖ్యం కదా ! జీవితం అన్ని వేళలా ఆనందాన్ని ఇస్తుందని ఎందుకు అనుకోవాలి ? దాని పద్ధతులు  దానికి వుంటాయి కదా !’’ అన్నాడు దిలీప్‌.
[spacer height=”20px”]పెళ్లయ్యాక ఇంత మార్పు వస్తుందా అబ్బాయిల్లో ? అశ్చర్యపోయాడు జయంత్‌.
‘‘ఒకరి పని పట్ల ఒకరికి గౌరవం, ఇష్టం లేకుంటే ఏ భార్యా, భర్తకైనా కలిసి ఉండాలoటే కష్టంగానే వుంటుంది. అందుకే కొంతమంది విడాకులు  తీసుకొని విడిపోతుంటారు. అది నాకు ఇష్టం వుండదు. ఎందుకంటే వేదమంత్రాలు  కూడా కలిసి వుండమన్నాయి కాని, కావలిసినపుడు విడిపొమ్మనలేదు. పెళ్లి అనేది ఎవరికైనా ఓ ముప్పు . ఆ ముప్పును తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. నిర్లక్ష్యంగా తీసుకుంటే తిప్పలు  తప్పవు. కానీ హస్విత మరీ అంత వ్యతిరేకంగా ఏమి లేదనుకో’’ అన్నాడు. దిలీప్‌ తనే బాధ పడుతున్నాడు. తనను తనే ఓదార్చుకుంటున్నాడు.
ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా తన అనుభవం సరిపోదేమోనన్నట్లు చూస్తున్నాడు జయంత్‌. దిలీప్‌ ఆలోచనగా చూస్తూ ‘‘జయంత్‌ ! నాకు ఇప్పుడు అన్ని స్వచ్ఛంద సంస్థతో జీవనస్థాయి సంబంధాలున్నాయి. పాఠకులు  తమ స్పందన రూపంలో ఇచ్చే సర్టిఫికెట్లు వున్నాయి. కానీ ఇప్పటి ధరను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రముఖ పత్రికలో పూర్తి సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. నేనిప్పుడు ఇక్కడ బ్యూరో ఇన్‌ చార్జీని. త్వరలోనే హైదరాబాద్‌ రాబోతున్నాను. అక్కడైతే నా ప్రతిభ ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశాలు  వున్నాయి.’’ అన్నాడు.
[spacer height=”20px”]‘‘వెల్‌కం దిలీప్‌ ! నువ్వు హైదరాబాదు రావాలనుకోవడం నాక్కూడా సంతోషంగా వుంది. ఇద్దరం ఒకే చోట వుండొచ్చు’’ అన్నాడు జయంత్‌.
హస్విత వాళ్ల మాటల్ని లోపలనుండి శ్రద్ధగా వింటోంది.
దిలీప్‌ ఇంకేం మాట్లాడలేదు. కొద్ది క్షణాలు  నిశ్శబ్దంగా గడిచాయి.
జయంత్‌కి సంలేఖ గుర్తొస్తోంది. ఆమెతో పాటు ఆ ఇంటి వాతావరణం, ఆ ఇంట్లో వున్న మనుషుల  సంభాషణ కూడా గుర్తొస్తోంది.
[spacer height=”20px”]సంలేఖను ఇంటర్‌ చదువుతున్నప్పుడు చూసిందే, ఆ తర్వాత మళ్లీ చూడలేదు. వాళ్ల వూరు కాని, ఇంటి వాతావరణం కాని చూడటం ఇదే మొదటిసారి… చూస్తుంటే కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించినా ఒకింత బాధగా వుంది. ఆ బాధ మామూలుగా లేదు. లోలోన కుళ్ల బొడుస్తోంది. ఎందుకో! ఏమో!
[spacer height=”20px”]‘‘దిలీప్‌ ! నా కెందుకో ఆదిపురికి వెళ్లికూడా సంలేఖతో మాట్లాడకుండా రావడం బాధగా వుంది. ఇప్పుడు మనం సంలేఖ చదువుతున్న కాలేజీకి వెళ్తే కన్పిస్తుంది కదా! ఆమెతో మాట్లాడాలి. నా తో రాగలవా? ఎలాగైనా తనని అభినందించాలి! కథ చాలా బాగా రాసింది.’’ అన్నాడు.
[spacer height=”20px”]లోపల  వున్న హస్వితకు ఆ మాటలు  వినిపించి బిత్తరపోయింది.
దిలీప్‌ ఒక్క క్షణం ఆలోచించి ‘‘ఒక గంట నువ్వు విశ్రాంతి తీసుకో ! ఈ లోపల  నేను అర్జంటుగా ఒక చోటుకి వెళ్లొస్తాను. చాలా ముఖ్యమైన న్యూస్‌ అది. ఆ తర్వాత వెళ్లి సంలేఖను కలుద్దాo . ’’ అన్నాడు.
‘‘ఓ.కే.’’ అంటూ జయంత్‌ అక్కడే వున్న టి.వి. రిమోట్‌ని చేతుల్లోకి తీసుకున్నాడు. చానల్స్‌ మారుస్తూ అక్కడే కూర్చున్నాడు.
[spacer height=”20px”]దిలీప్‌ గంటని చెప్పి బయటకి వెళ్లినవాడు రెండు గంట వరకు రాలేదు. అప్పటికే యుగాలైనట్లు ఎదురు చూశాడు జయంత్‌. అదే టైంలో రాజారాంకి యాక్సిడెంట్‌ అయిందని తెలిసి కాలేజీలో క్లాస్‌రూమ్‌లో వున్న సంలేఖ, తిలక్‌, లెక్చరర్‌ దగ్గర పర్మిషన్‌ తీసుకొని వేగంగా బస్‌స్టాండ్‌ కెళ్లారు.
ఆదిపురికి వెళ్లే బస్‌ రావాంటే అర్థగంట పడుతుందన్నారు. విపరీతమైన భయాందోళనతో ఒకరి ముఖాలు  ఒకరు చూసుకున్నారు. ఇంకో అవకాశం లేక ఒళ్లంతా కళ్లు చేసుకుని బస్‌ కోసం ఎదురు చూస్తూ నిబడ్డారు.
సంలేఖకి కన్నీళ్లు ఆగడం లేదు. మాటిమాటికి తిలక్‌ వైపు చూస్తోంది.
‘‘నాకు తెలిసి ఇదంతా నాన్న వల్లనే  జరిగింది. లేకుంటే అన్నయ్యకి యాక్సిడెంట్‌ జరిగివుండేది కాదు.’’ అన్నాడు తిలక్‌.

– అంగులూరి అంజనీదేవి

……………………………………………………………………………………………………………..

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Comments are closed.