ఉయ్యాల (కథ) – గీతాంజలి

”వాళ్ళకంటే నేను పనేం తక్వ చేసినబ్బా? నాకెందుకు తక్కువ కూలి?” అనసూయ అడుగుతున్నది. ”పోబ్బా పో పని సేస్తే సెయ్యి ల్యాక పోతే ల్యాదు” దస్తగిరి అరిచిండు. ”గీదేం అన్యాయమబ్బా” అన్నది అనసూయ. ”మీకు పనిచ్చుడే గొప్ప” అని గొణుగుత దస్తగిరి ఇచ్చిన దుడ్లు తీస్కుని అనసూయ ఇంటదారి ప్టింది. తను జోగినీ అంట, అందుకే జీతం తక్కువంట ఇదేం నీతి? జోగినీల కష్టం కష్టం గాదా? ఆల్ల రెక్కలు అల్సిపోవా? తమ కష్టంతోని ఆసామికి ఫాయిదా కాదా? మొగుళ్ళతోని సంసారాలు జేసే ఆడోల్లకు రోజు కూలి నూటయాభై రూపాయలు అయితే, తమ జోగినీలకు రోజు కూలీ 80 రూపాయలే. సంఘమోల్లు వీల్లకెంత సెప్పినగని వీళ్ళు మార్త ల్యారు.
”జెప జెప నడుస్త ఇంికి చేరింది అనసూయ. అప్పికే ఆమెకు దమ్మొస్తున్నది. తలుపు బీగం తెర్చి దబ్బ దబ్బ ఇన్ని నీల్లు తాగి, చాప మీద ఒరిగి పొయింది అనసూయ. తిననీకి కుండల యామీ ల్యాదు. సర్కారు జోగినీలకిచ్చే నెల పించను 200 రూపాలు యాం సరి వోతది? దినాం కూలి దొర్కది. ఎండ కాలంల దినంకు వెయ్యి బీడీలు సుడ్తె వంద రూపాలొస్తయ్‌. గని తనకు సాత కాదు. పానం పూర్తిగ ఖరాబైంది. గంటలు గంటలు కూచుండి సేస్తే, ఆరోగ్గెం మంచిగున్నోల్లకే నడుములు, మెడలు ఇగ్గుతయ్‌. ఇంక తనకు గీ పానాలు పోయె బీమారి తగులుకున్నది. ఎవడు అంించిండో, దు:ఖమొచ్చింది అనసూయకు. సంఘమోల్లు సర్కారు నించి ఈ ఇల్లు, నెల పింఛను ఇప్పియ్య బట్టి గింత నీడ దొర్కింది ల్యాకుంటే? అసలు తన అఁవ నాయనోల్లు తనను జోగినీనెందుకు సెయ్యల్ల? తన బతుకెందుకింత గబ్బు కావల్ల? తనకు పూరాగ ముఫ్పై ఐదు యాండ్లు ల్యావు, కని సావు ముంచుకొస్తున్నది. గీ ఎయిడ్స్‌ బీమారితోని జల్ది సస్తరంట. అఁవ నాయనలు ఎప్పుడొస్తరో అహ్మబాద్‌ దేశం కెల్లి. ఆల్లను సూడకుండనే సస్తనేమో? యామో, ఈ పాలి తను గుడక ఆల్లతోని దేశం పోవల్ల, బంబై కెల్లి తను పోలేపల్లి వచ్చి మూడు సంవత్సరాలైంది. ఊరొచ్చినంక సూస్తే ఇంటికీ బీగం ఉన్నది. ఎప్పుడొస్తరో తెల్వది.
”అనసూయకు శాన నీర్సంగున్నది. నిన్ననే సర్కారు దవాఖానకు పోయొచ్చింది. రక్త పరీక్ష చేసిండ్రు బీమారెక్కువుందన్నరు. మందులు లెక్క తప్పకుంట వేస్కోమన్నరు. మంచిగ తినమన్నరు. మంచిగ తింటె ఎక్కువ కాలం బతుకుతరంట. తనకంత మంచి తిండి యాడ దొర్కుతది? కూల్నాలి దొరకక వాయె. తన ఎన్క కుక్కల తీరు తిర్గిన మొగోల్లు తనకీ బీమారి వచ్చిందని తెల్సి గల్లీల అడుగు వెడ్త ల్యారు. ఒక్కో పాలి ఆకలికి పెయ్యి దిర్గి వడి వోతది. కుండల బువ్వ, సేతిల దుడ్లు ల్యాన్నాడు అగో గా ముసలై వోయిన జోగినీలు మల్లమ్మ, జంగమ్మల తీరు హోటేలు కాడ, బస్టాండులల్ల, సీన్మా హాల్ల ముంగట బిచ్చ మడుక్కొంటది. గీ బత్కుకంటే తను సస్తే వాయె. ఎవరి కోసం ఈ బత్కు? అఁవ, నాయనలకు తన మీద దయ ల్యా. తమ్ముని మీదనె ప్రేమ. వాల్లొచ్చినంక తనను అర్సుకుంటర? ఆల్లతోని ఉండనిస్తర? గింత బువ్వేస్తర? కన్నోల్లు గద గింతపెద్ద బీమారి వచ్చిందని ఎర్కై జూస్కుంటరేమో. అయిన గని… యామో ఎవలకు తెల్సు, సూస్కుంటరో ఆల్లు గుడక దూరం వెడ్తరో. అప్పుడేమో చిన్న పొల్ల అని గుడక సూడకుండ ఆల్ల కడుపు కోసానకు తనను జోగినిని సేస్తిరి. ఇప్పుడు తను బీమారైనంక సూస్తర? అంత కనికరం ఉంటే కన్న బిడ్డను జోగినీని జెయ్యక వోదురు. అయిన గని ఆల్లు తనను కన్నోల్లు. నాయన దేశంకెల్లి కాలిరిగి వచ్చిండు. ల్యాక వోతే తన బతుకు గిట్ల కాక పోను. అనసూయ సోంచాయించుకుంట అటు ఇటు కదిలింది.

” మెల్లగ లేశి గింత అంబలి చేస్కుని తాగింది. ఇంట్లకెల్లి బయటకు వచ్చింది. గల్లీ పొిం చైతన్య ఉర్కుత వస్తున్నది. మల్ల తల్లి విడ్డలిద్దరు లొల్లి వడ్తున్నరేమో. చైతన్య, గల్లి కొసాకు ఉన్న పరిమళ, కలువాల బాబు రెండో బిడ్డ. ఆల్ల ముగ్గురు పిలగాండ్లు, ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మొగ వోరడు. వాళ్ళు తమ తీరే హరిజన్స్‌. చైతన్య వాండ్ల నాయన తన సెల్కలనే పురుగుల మందు తాగి తన ఉసురు తీస్కుండు. అప్పట్కెల్లి ఆల్ల కుటుంబమంత ఆగమాగం అయ్యింది. చైతన్య ఉరుక్కుంట అనసూయ కాడికొచ్చి చెయ్యి వ్కొని ”చిన్నమ్మ నువ్వన్న సెప్పె అఁవకు, ఇంట ల్యాదు, నన్ను జోగిని జేస్తరంట, నా కిష్టం ల్యాదు నేను సద్వుకుంట” అని ఏడుపు షురు చేసింది. అనసూయకు చానా కోపం వచ్చింది. చైతన్యను దగ్గర్కి తీస్కుని తన గుండెల కెయ్యి హత్తుకున్నది. ”నేను కానియ్యనే చైతన్య… మీ అఁవకు నేను చెప్తబ్బ యాడ్వాకు” అనుకుంట. ఇంతట్ల చైతన్య వాళ్ళ అమ్మ పరిమళ వచ్చింది.
””నీకు సిగ్గు శరం ల్యాదాబ్బా పర్మల బిడ్డ జిందగీ బర్‌బాద్‌ యాల జేస్తవ్‌. నీ కెర్కేనాబ్బా జోగినీ జిందగీ ఎసుిందో? నన్ను జూస్త ల్యావా? సూస్త సూస్త బిడ్డను నక్కలు, తోడేళ్ళకు బలి జేస్తవా? ఇట్ల చేసుడు కానూనీ, జుర్మ్‌ కిందికి వస్తది. మొన్న మాహబూబ్‌నగర్‌ సంఘం ఆఫీసుల చెప్పిండరు. నిన్ను, నీ బందుగులను జైల్ల వేస్తరు. నేను గుడక మా సంఘపోల్లకు సెప్త.” కండ్లు నిప్పు కణికెల్లెక్క అయితుంటే అర్చింది అనసూయ. పరిమళ అక్కడ్నే కూల వడి ఏడుపు షూరు జేసింది. నెత్తిమీద సేతులతోని దబ్బ దబ్బ కొట్టుకుంది. కొద్దిసేపు ఏడ్సినంక కళ్ళు తుడ్చుకుంట ”నానేం సేయ్యల్లబ్బా అనసూయా గీ బాడ్కావ్‌ సర్కారు మందుల కంపెనీ కోసానకు ఉన్న రెండెకరాలు గుంజుకున్నంక బత్కు బజారైందబ్బా. మీ కాక పురుగుల మందు తాగి సెల్కలనే పానం తీస్కుండు. నీకెర్కె కదబ్బా ఊర్లె పని దొర్కుత ల్యా. దేశం పోవల్లంటే గీ చిన్న పోరల్ని, ముసలవ్వను య్యాడ ఇడ్సివెట్టెటట్టు ల్యా. నాతోని దేశం తోల్క వోయే తట్టు ల్యా. పెద్ద బిడ్డకు రాసిచ్చిన ఎకురం బూమి గుడక సర్కారే గుంజుకున్నది. కడుపుతోని ఉందని గుడక సూడకుంట గా బాడ్కవు అల్లుడు ప్టుింట్ల ఉయ్యాల బిడ్డను ఇడ్సవ్టెి దెంక వోయిండు. కట్నం కింద గా బూమి ఇస్తనే తొల్క వోతనన్నడు. గుంజుకున్న బూమి సర్కారోల్లు తిరిగి ఇస్తరాబ్బా మల్ల? ఇంగ రాము సదువాగివోయింది. ఐద్దాంక సద్విండు. పద్దాంకన్న సద్వల్లని ఆని ఆశ. ఆడదాన్ని నానెట్ల సాదాలబ్బా గింత సంసారం? సర్కారు గుంజుకున్న బూమి దుడ్లిచ్చుటల గుడక మోసం జేసింది. రెండెకురాలకు 18 వెయిలు ఇస్తె అండ్ల నాలుగు వెయిలు ఊరి సర్పంచుగాడే గుంజుకుండు. మిగిలిన దుడ్లు అప్పులకే అయి వోయినయ్‌. బూమీ వాయే దుడ్లూ వాయె. నానేం జేతు సెప్పబ్బ? చైతన్యనే ఆదుకోవల్ల గిప్పుడు మమ్ముల్ల. మ్యానమామనే పుస్తె గడ్తడు. ఇంి కాడనే ఉంటే ఎంతో కొంత అర్సుకుంటది కొడుకు తీరంగ అని జోగిని జేద్దామనుకుంన్నబ్బా. నా తమ్ముడు మంచిగనే సూస్కుంటడు దాన్ని”. పరిమళ గొనుగుతున్నట్లే అంటున్నది.
””య్యాం మంచిగ సూస్కుంటడు? ఇంట్ల బువ్వకు కష్టమైతున్నదని బిడ్డను జోగిని జేస్తవాబ్బా? బిడ్డను జోగిని జేసుడంటే, దాంతోని ఎభిచారం జేపిచ్చుడే! ఎబిచారం జేపిచ్చి ఆపైసతోని తింటవాబ్బా? మ్యానమామ ఉంచుకున్నని దినాలు ఉంచుకుంటడు. అటెన్క ఎల్లగొడ్తడు. ల్యాక వోతె దాన్ని ఊర్లె బయట మొగోల్లకు తారుస్తడు. పదిమంది మొగోల్ల సేతులల్ల నలిగి, ఆల్ల బీమార్లు అంటించుకుని, పీనుగు లెక్క అయ్యి, నరక బాధలు వడుకుంట, సేసోల్లు ల్యాక కుక్క సావు సచ్చుడే జోగిని బతుకంటే. ఎవలూ తోడుండరె. జోగినీ ఎవలకు పెండ్లం కాలేదు గని ఆమె మాత్రం అందరి సొత్తు. ఊల్లె ఉన్న మొగోల్లందరు మొగుళ్ళె. జోగిని జేసుడంటే బిడ్డను మందిళ్ళల్లకు అడుక్కొన పంపి బిచ్చగత్తెను సెయ్యనీకె, ఎభిచారం జెయ్యనీకె లైసెన్సె, దేశం వో, కష్టం జేస్కొని బత్కు, గంతేగని పసి పొల్లను నాశినం జేస్తనంటే నేనూకోనబ్బా” అనసూయ తన వేలు సూప్త బెదిరిస్త, అర్చినట్లే చెప్పింది. నెత్తి మీద సేతుల తోని దబ్బ దబ్బ కొట్టుకుంట ”య్యా నా గోస నీకు సమజు కాదు” అనుకుంట పరిమళ ఎల్లి పోయింది. చైతన్య ఆమెతోని పోనన్నది.
””రేపే, నిన్ను సంఘపోల్ల దగ్గర్కి తీస్క వోత. ఇద్దరం కలిసి ఆడ కంప్లౖిెంద్దం. నేను సాచ్చెముంట. ఆల్లు మీ ఇంికొచ్చి మీ అఁవకు, మామకు బుద్ధి జెప్తరు. నిన్ను ఆల్ల తానకు అసలు పంపరు. ఆల్లె చదివిపిస్తరు. ఊకో బిడ్డా యాడ్వాకు” అనసూయ చైతన్యను బుదరకిచ్చి, బజారుపోయి నూకలు తెచ్చింది. ఇంత ఎల్లిపాయ కారం నూరి, బువ్వ వండి ప్టిెంది. లోపల చద్దర్‌ మీన పండ వ్టెింది. తను ముంగిట్ల కూల వడ్డది. నిద్రొస్త ల్యాదు. చైతన్యను సూస్తంటే తనను తాను చూస్కున్నట్లే అన్పిస్తున్నది. గతమంత కండ్ల ముంగట క్టినట్లే కన్పడుతున్నది. తనకిప్పుడు ముఫ్పై ఐదు యాండ్లు. తనను పదకొండు యాండ్లకు కాదూ జోగినీని చేసింది. ఆరోజు తానెంత దు:ఖంతోని తాయిమాయి అయ్యింది? బయంతోని అఁవకు అంటుకు వొయ్యింది? అనసూయకు కాలిరిగిన నాయన కండ్ల ముంగట కదిలిండు. నాయనకు దేశం వొయ్యి, కాలిరగక వొతే తను జోగిని కాక వోయెడ్దా? సెల్లి బాయిల వడక వోతే తను జోగిని కాక వోయెడ్దా? యామో… అనసూయ పిచ్చిదాని తీరు పుండు పుండైన తన గతంలోకి కన్నీల్లతోని ఎల్లి పోయింది ఆ రేత్రి.
***                                                          ***                                                       ***
ఇంగో, ఈ పోలె పల్లె తన ఊరు… హరిజన్స్‌ వాడకట్టల తమ ఇల్లు. అమ్మ, నాయన, తను, చెల్లి తమ్ముడు, నానమ్మ ఉంటుింమి. బూమి ల్యాదు. ఊల్లె కైకిలు పనే దిక్కు. కైకిలి పని ల్యాక వోతే ఎండల కాలంల బీడీలు కట్టుడే. తను సర్కారు బడికి వోయెడ్ది. ఐద్దాంక సద్వింది. ఊల్లె పని దొర్కక నాయన పతి యాడాది దేశం వోయేోడు. యాడాదిల మూన్నెల్లె ఊల్లె ఇంి కాడ ఉండెడ్ది. బాంబై, అహ్మదాబాదు, ఢిల్లీ, ఆంధ్రా, ఐద్రాబాదు య్యాడాడికో వోయేది నాయన. మేస్త్రి ఎటుకొంట వోతే అటు ఆడోల్లు, మగోల్లు వందలమంది ఊల్లె కెల్లి మేస్త్రి తోని దేశం వోయెది. అమ్మ కైకిలు పని, నాట్లు, కోతలు అంట వోయెది. సెల్లి, తమ్ముడు ఇంట్లనే ఉండెోల్లు ల్యాక వోతే అఁవతోని సెలకల పొిం తిరిగోల్లు. తను సర్కారు బడికి వోయెడ్ది. అఁవ ఇంికొచ్చేాలకు ఇంత బువ్వొండి, మిరపకాయల తొక్కో, ఎల్లిపాయ కారమో, తమాట కూరనో, పచ్చిపులుసో, జొన్న రొట్టెనో, జేసి వెట్టేది. అల్సి వొయ్యి వచ్చిన అఁవకు పెరంట్ల పొయ్యంట వ్టెి, ఉడుకుడుకు నీల్లు కాపిచ్చేది. ఊల్లె తిరుగుతాన్న సెల్లె, తమ్ముల్లను గుంజుకొచ్చి తానం వోసి బువ్వ వెట్టెది.
””నాకు తల్లి తీరంగైనవు కదబ్బా అనసూయ” అనుకుంట అఁవ ముర్సెది. నానమ్మ, అఁవ దేశం వోయిన నాయనను తల్సుకొని తల్సుకొని యాడ్శేది. శానా తూర్లు నాయన తనకు దేశం పొబుద్దైత ల్యాదని ఊల్లె మీతోనే ఉండల్లని ఉందని, దేశంల పని ఎక్కువుంటదని, శాతకాకుండైందని ఆడ బువ్వ గుడక సరింగ వెట్టరని, జరమొచ్చి పనిలకు వోక వోతే మేస్త్రి కర్రతోని గొడ్తడని… ఇంత బత్కు బత్కి, గింత పెద్దగైనంక ఒకల్లతోని దెబ్బలు తినుడు సిగ్గన్పిస్తుందని శానా తూర్లు పారిపోబుద్దైందని సెప్పోడు. రేత్రి పూట ఇంి ముంగట తామందర్ని కూకుండ వ్టెి, నాయన గీ కతలన్ని కండ్ల పొిం కారే నీల్లను తుడ్సుకుంట జెప్పేది. తల్లి, నానమ్మ కుల్లి కుల్లి యాడ్శేది. తనకేమో నాయన దేశం వోకుంట ఉండల్లంటే ఊల్లె పని దొర్కల్ల కద అన్పించేది. అదె నాయనను అడిగింది ”ఊల్లె సెలకలకు నీల్లు ల్యావు బిడ్డా, సెరువులు ఎండి వొయినయ్‌. బూఁవి ఉంటె శాలదు బిడ్డా. నీల్లుండల్ల పంటలు పండెతందుకు. నీల్లు… నీల్లుంటే నాను దేశం ఎందుకు వోత?” అనెోడు. ఊల్లె నీల్లుంటె ఎంత బాగుండు అని తను మస్తాశ వడెది. మూన్నెల్లు కాంగనే నాయన, యాష్ట పడతానే అందర్ని ఇడ్సిప్టిె మల్ల దేశం వోయేది.
”దినాలు గిట్లనే గడిస్తే మంచిగనే ఉండు గని, తన బతుకు గిట్ల నాశనం గానికే రాసి ఉంది. ఆ దినం గిప్కుి కండ్ల ముందు జరిగినట్లే అన్పిస్తది. ఆ దినం పొద్దెక్కింది. అమ్మ కైకిలు పనికి వోయి వచ్చి కూసుంది. తమ్ముడు, సెల్లె ముంగిట్ల ఆడుకుంటున్నరు. తను బువ్వొండుతున్నది. ఇంతట్ల ఇంి ముంగ్కి ిప్పర్‌ వచ్చింది. అన్ల కెల్లి ముగ్గురు మొగోన్లు నాయనను దింపిన్రు. ఇంి ముంగట అరుగు మీద పండ వ్టెిండ్రు. ”పని సేయంగ సేయంగ, ఏడో అంతరంకెల్లి కింద వడ్డడు. కాలు ఇరిగింది. ఇంగో గీ మందులు వాడుండ్రి. గీ కట్టు మూన్నెల్ల దంక ఇప్పకుండ్రి, మద్దెల ఒకపారి మాబూబ్‌నగర్‌ల బొక్కల దవాఖానకు తోల్క వోయి సూపిచ్చుండ్రి” అని చెప్పుకుంట మేస్త్రి ిప్పరెక్కి ఎల్లిపోయిండు.
”అమ్మ, నాయనమ్మ, తను శోకాలు వ్టెిండ్రు. నాయన కాలు ఇరిగి మూలన వడ్డడు. ఇక అప్పట్కెలి ఇంట్ల దరిద్రం ఇంకెక్కువైంది. అమ్మకు దినాం కూలీ దొర్కది. నాయన దేశం వోయె ముంగట మేస్త్రీతాన తీస్కున్న అడ్మాన్సు కొన్ని కొన్ని జతనంగ వాడుకుంట వచ్చేడ్ది. ఇప్పుడదీ ల్యాకుంటైంది. అమ్మకిప్పుడు కూలీ దొరికిన్నాడే తిండి. పిల్లల మంత ఆకలికి యాడుస్తుంటె అమ్మ నాయన కండ్ల నీల్లు పెట్టుకునెోల్లు. ముందుగల్లె గింత బాధ ఉందనుకుంటే ఐదేండ్ల సెల్లి ఆడుకుంట, ఆడుకుంట బాయిల వడి సచ్చి వోయింది. సెల్లె పీనుగని గుండెల కదుముకుంట, అమ్మ నాయన శోకాలు వ్టెిండ్రు. తమ్ముని కేమన్న ఐతదని మరింత బయ వడ్డరు. అందరు మీ ఇంికి శని వ్టిందన్నరు. అందుకే ఇట్లయితున్నదన్నరు. నాయనను, సూసెతందుకు, సెల్లి సావుకి ఇంికొచ్చిన బందుగులు యాం సమాలోచన సేసిండ్రో తెల్వదు. అఁవ, నాయనల సెవులు కొరుక్కుంట సేరిండ్రు… నాయనకు, తమ్మునికి యాం సెడు కాకుంట ఆల్లు మంచిగుండల్లని జోగిని పండుగ సేయమన్నరు. తనను జోగిని సేస్తరంట. తన క్లాస్‌ల శాంతి ”నువ్వు జోగినివి ఐతున్నవంట గదబ్బ ఇంక బడికి రావాబ్బా” అనడిగింది. జోగినంటే యాందో తనకి తెలవది. తనకప్పుడు పదకొండు ఏళ్ళున్నయ్‌. పెద్ద మనిషి గుడక గాలె ఇంగా… తన మ్యానత్త వచ్చింది. ”ఇంికి కొడుకులెక్కుంటదబ్బా. మిమ్మల్నాదుకుంటది ఇంగా సోంచాయించకుండ్రి” అన్నది. తనను జోగిని సేస్తే తనెట్ల ఇంిని ఆదుకుంటది? అఁవ నాయనలకెట్ల ఆసరైతది? తనకర్ధం గాలె. కాని ఇంట్ల పండగ లెక్కనే గొడ్తున్నది. బందుగులందరు వచ్చిండ్రు. తనకు పసుపు ప్టిె స్నానం సేపిచిరు. కొత్త బట్టలు, కొత్త గాజులేసిరు. కొత్త రిబ్బన్లు నెత్తిల పూలు, బుగ్గన సుక్క ప్టిెరు. తనకు గుడక సంబరంగున్నది. కొత్త బట్టలల్ల తను మెర్శి వోతున్నది. అందరు తన దిక్కె కండ్లింతంత జేస్కొని సూస్తంటే గొప్పగ ముర్శి వోయింది. తనకు దేవునితో లగ్గం సేత్తరంట. తనకు అదంత యాందో తెల్వది. సంబురం తోని ఎగురుకుంట జేరింది.
”అఁవ, మేనత్త కల్సి రేణుక, ఎల్లమ్మకు బాసంగం (నైవేద్యం) చేసిరు. కుండల పసుపు బియ్యం, బక్ష్యాలు, వంకాయన్నం, కారం, ఉప్పు, నూనె, పప్పు అన్ని ఎల్లమ్మ తల్లికి నైవేద్యం అంట ఎక్కిచిరు. ఇంగ ఊరి షావుకారితోని నాయన యాదో మ్లాడిరడు. ఆయప్ప నాయనకు పెద్ద కట్ట దుడ్లు ఇచ్చి ”అన్ని మంచిగ జరిపించుండ్రి” అన్నడు. అంత గనం దుడ్లు జిందగీల సూడలె తను. ఎందుకిచ్చిండో తెల్వది.
”ఇంగ ఇంికాడి కెల్లి జులూస్‌ తీసి రేణుక ఎల్లమ్మ గుడికి కొంట వోయిండ్రు తనను. గుడిల దాసంగం వ్టెినంక అక్కడ పంతులు ఓమం జేసిండు. అదైనంక పంతులు తన మెడల పుస్తల తాడుక్టి తనింక జోగిని అయిందని సెప్పిండు. ఆ దినం కడుపునిండ తిండి దొర్కింది. ఆ దినమె కాదు ఐదు దినాలు దంక తిండి దొర్కింది. తనను అందరు జోగిని అంటండ్రు. అందరు తనను తాజూబు తోని సూస్తుండ్రు. తనకర్ధం కాలె అంత ముసలి పంతులు తన మెడల పుస్తె ఎందుకు క్టిండు? తనను లగ్గం జేస్కున్నడా అంటే కాదంట. తనను దేవునికిచ్చి మనువు సేసిరంట. తను ఇంక దేవుని బారియంట. దేవునికెట్ల బారియ అయితదో అర్ధంగాలె. అఁవ ”నీకు సమజు కాదు ఊకోబ్బా,” అన్నది.
***                                                          ***                                                       ***
”ఆ రేత్రి, అఁవ, నాయన తమ్ముడు అందరు ముంగిట్ల పన్నరు. తనను ఇంట్ల అర్రల పండమన్నరు. తనకు సమజు గాలె. తను గుడక ఆల్ల తానే పండుతానని జిద్దు జేసింది. అమ్మ తనను లోపట పండ వ్టెింది.
మద్దె రాత్రి తన మింద యాదో దబ్బున పడ్డట్టై తెల్వికొచ్చింది. ఎవలొ ఒగాయన తన మింద సేతుల్యాసి యామేమో జేస్తుండు. కిరసనాయల బుడ్ది ఎల్తుర్ల ఆయన తన నాయనకు దుడ్లిచ్చిన షావుకారని గుర్తు వ్టింది. ఆయన ఇప్పుడిక్కడ తనతోని ఎందుకున్నడు? తనను ఊపిరాడ నియ్యకుండ నలుపుతున్నడు. తన బట్టలు ఇప్పుతున్నడు. తను బెదుర్కొని ”ఓ అఁవా అఁవోవ్‌.. ఓ నాయనా” అని శానా యాడ్శింది, ఒర్లింది. ఆయెనను కొరికి ఇడిపించుకుని తలుపులు దబ్బదబ్బ బాదింది. అమ్మొచ్చి తలుపు తెర్శింది. ”మీ బిడ్డకు మంచిగ సమజు సెయ్యుండ్రి” అని కోపంగ ఎల్లి వోయిండు షావుకారి. ”అవా ఎందుకే నేను ఆయెన తాన పండల్ల? అంత గలీజు పన్లు జేస్తుండబ్బ. నా బట్టలిప్పుతుండె ఛీ ఛీ నేను వోను, నన్ను ఆయన తానకు పంపకుండ్రి” అని ఒర్లుకుంట యాడ్సింది.
”అఁవ యామనలె. అఁవ పక్కన్నె పండిరది ఆ రేత్రి. మర్శి దినం రేత్రి అఁవ నాయనలు తనను అర్రల యాసి గొల్లెం వ్టెిన్రు. షావుకారికి దొర్కకునిట మంచం కింద దాంకున్న తనను గుంజిండు ఆ రాచ్చసుడు. షావుకారి తన యాడ్పు జూసి ఇడ్సి వెట్టలె. తన బట్టలిప్పి మీద వడ్డడు. యాందేందో జేసిండు. తన కాల్ల మద్దెల కెల్లి కత్తి గుచ్చినట్లైంది. కాల్ల మద్దెన రక్తం దార క్టింది. తను బేహోష్‌ అయ్యి వోయింది. హోష్‌ వచ్చెాల్లకల్ల అఁవ ఒల్లె వుంది. ”అఁవా ఎందుకే ఇట్ల ఆ బాడ్కవ్‌ తానకు నన్ను తోలిస్తున్నరు… ఆడెందుకిట్ల సేస్తుండడు?” తను కన్నీల్లతోని ఎక్కెక్కి వడ్త అఁవ నడిగింది. ”ఇంగ నీ బత్కు గిదే బిడ్డ. నువ్వు జోగిని వైనవు యాడ్వాకు” అంది అఁవ కల్లు తుడ్సుకుంట. ”అన్ని తెల్సి నన్ను జోగినెందుకు జేసినవే అఁవా” అనుకుంట తను శానా యాడ్శింది. అఁవ యావేవో గోలీలు తిన్పించింది. నొప్పి తగ్గెతందుకు.
***                                                          ***                                                       ***
”దినాం, రేత్రి అయ్యెాలకు గుండెలు బయం తోని నిండి వోయ్వెి. ఆ షావుకారి వచ్చెోడు తన దేహం తోని ఇష్టమొచ్చినట్లు ఆడెోడు. నొప్పితోని గొంతు తెగిన మ్యాక తీరు కొట్టుకునెడ్ది. ఇడ్సివెట్టమని ఆయెన కాల్ల మింద వడి యాడ్చేది. ఆ రాచ్చెసునికి దయ వచ్చెడ్ది కాదు. బయట పన్న అఁవ నాయనలకే దయ ల్యాదు. వాడు ఒక రాత్రిలనే రెండు, మూడుసార్లు తన మింద వడేది. తను సచ్చిన శవం లెక్కే అయి పొయ్యింది. అఁవ నాయనల మింద చానా కోపం వచ్చెడ్ది. షావుకారిని, అఁవ, నాయనలను చాకు ప్కొని కచ్చ కచ్చ పొడ్చి అక్కడికెల్లి పారిపోవల్ల అన్పించెడ్ది. రేత్రి కాంగనే అత్తోలింకో, దోస్తులింకో పారి వోతె, దేవులాడి, దేవులాడి వ్కొని, ఇంికి కొంటవోయి ఆ షావుకారికి అప్పచెప్పోల్లు తన కన్నోల్లు కసాయోల్ల తీరు. ”నీకు షావుకారి కన్నెరికం జేసిండంట కద”, బడికి వచ్చి వోయె తన దోస్తులు అడుగుత నగేది.
”ఒక నెల దంక సతాంచిండు ఆ షావుకారి. తర్వాత బందు జేసిండు, ఇంికి వచ్చుడు. హమ్మయ్య అనుకున్నది. శానా సంతోషమైంది. గని ఆ సంతోషం ఎక్కువ దినాలు నిల్వలె. దినాం ఎవలొ ఒక మగోడు వచ్చుడు షురువయ్యింది. ఆల్లు రాంగ పోంగ నాయ్న సేతిల దుడ్లు వెడుతుండ్రు. తనెంత ఒద్దని యాడ్సిన గని అది ఆగలె. అది జోగిని బాద్దెతంట. ల్యాక వోతే ఇంోల్లకు, ఊరికి అరిష్టమంట. బక్కగ పిట్ట తీరున్న తన మింద బర్రెంత మొగోల్లు వడి యామేమో గలీజు పనులు జేసెది. బాధ, నొప్పి బరించ ల్యాక, యాడుస్త, బయం తోని మంచం కింద దాంకుంటే, బండ బూతులు తిడ్తా… మంచం కిందకెల్లి, జుట్టు గుంజి ప్కొని తమ కోరిక తీర్చుకునేది. గింత గలీజు పనికి ఒప్పుకున్న కనికరంల్యాని అఁవ, నాయనల మీన సానా కోపం, అసహ్యం అనిపించెడ్ది. అందరాడవిల్లల్ని గిట్లనే జోగినిలను జేసి ఈ మగ రాచ్చెసులకు అప్పగిస్తరా అందరు అఁవ నాయనలు? ఎంత యాడ్చిన గని యామి లాభం? అన్నం బందు వ్టెి. ఆ పని సేయనన్న ప్టించుకునే దిక్కే ల్యాదు.
”ఇంగ పంటల కాలంల తనొక బిచ్చగత్తె అయ్యేడ్ది. గడప గడపకు వొయ్యి దాన్యం అడుక్కుని రావల్ల. పతి శుక్రవారం, మంగళారం అఁవ తన మెడల జోగిని పలక గ్టి ఊరు మిందకు అడుక్కొన తోలేది. అందరు తనను సూడంగనే బిక్షమేసి, మొక్కేది. మల్లంగ బస్టాపుకి తోలేది అడుక్కు రమ్మని. తనకు ఆ పని సెయ్య సచ్చేంత అవమానం అన్పించెడిది. ఆడ, మగ పోరలు తనను జూసి సేతుల తోని సైగలు జేసేది రమ్మని దుడ్లు జూపిస్త. కన్ను గొట్టేది. యాడంటే ఆడ ముట్టేది తనకు సచ్చేంత బయమయ్యేది. తను ఐదు దంక సద్విన సర్కారు బడి ముంగ్కి వొయ్యి, గంటల కొడ్ది ఆడనే నిల వడేది. కమల ీచరు తనను జూసి కండ్లల్ల నీల్లు నింపుకుని తన తోని ఇంికచ్చి ”పిల్ల జీవితం నాశినం చేసిరు ఇంకైనా ఆపురి, ఈ గలీసు పని సేపియ్యకురి బిడ్డను బడికి తోలియున్రి” అని చెప్పింది. అయిన గని అఁవ నాయనలు ఇనలె. వచ్చిన దుడ్ల తోని నాయనకు పట్నంల మంచి ఇలాజు దొరికింది. ”నాయనకు కాలు మంచిగైంది కద, నేనింక ఈ గలీసు పని సెయ్యనె అఁవా నన్ను బడికి తోలున్రే, మీకు దుడ్లు కావల్లంటే బీడీలు సుడ్త, కైకిలు పనికి వోత, నాయన తోని దేశం వోత గని ఈ గలీసు పని మాత్రం జేపియ్యకున్రె నాతోని కాదని” ఎంత గోజారిన గని ఇనలె కన్నోల్లు. ”ఒక పారి జోగినైతే జిందగీ అంత జోగిని గనె బతకల్లంటబ్బా, అట్ల ల్యాకుంటె ఆల్లందర్కి అరిష్టమంట” అని సెప్పింది అఁవ. అన్ని జూట మాటలని ఎంతేడ్శింది తను? తనేనా? తన కులంల ఇంగొంత మంది ఆడ పిల్లలు జోగిని లైనరు.
”తన తర్వాత గదే వాడ కట్టుల కృష్ణమ్మకు గుడక మ్యానమామతోని పుస్తె క్టిచి జోగిని సేసిండ్రు. వాడ్టొి తిరుగుబోతు. కృష్ణమ్మ వానితోని గర్భవతైంది. కృష్ణమ్మకు వాని మ్యానమామ తోని పుట్టెడు రోగాలింనై. బిడ్డ బలహీనంగ ప్టుింది. బిడ్డ ఇలాజుకి ఆయెన డబ్బుల్లియ్యలె. ”ఈ బిడ్డ నాతోనే ప్టుిందని గారీం యాంది? జోగిని లంజెవు ఎవరితో తిర్గినవో గిది నా బిడ్డ కాదు” అన్నడు. ఆమె తానకు వచ్చుడే బందు జేసిండు. ఆ బిడ్డె నెలరోజులైనంక సచ్చే వొయ్యింది. కృష్ణమ్మకు అప్పుడు పదహారేండ్లే. కొన్ని రోజులకు కృష్ణమ్మ ఊల్లె కన వడలె. ఎవనితోనో ల్యాసి వొయ్యిందన్నరు. దేశం వొయ్యిందన్నరు. దేశంకాని దేశంల సచ్చె వొయ్యిందన్నరు. తన పరిస్థితి గుడక అంతేనా రేపు?
”గిట్లనే, తనకు పద్నాలుగు యాండ్లొచ్చినై. పెద్దమనిషై రెండేండ్లు అయ్యింది.
నాయనకు కాలు మంచిగైంది. మల్ల అఁవ నాయన దేశం వోదమని అనుకున్నరు. తమ్మున్ని బల్లె వేసిండ్రు. తనకు కొన్ని దుడ్లిచ్చి, నానమ్మను తమకు తోడుంచి, అఁవ నాయన అహ్మదాబాదు దేశం వోయిండ్రు. తమ్మున్ని బడికి పంపల్ల, బీడీలు సుట్టల్ల, కైకిలు పని దొర్కినప్పుడు పోవల్ల, సారా అమ్మల్ల, ఊల్లె మగోల్లు వస్తే ఆల్ల తోని పండల్ల, ఆల్లిచ్చే దుడ్లు తీస్కోవల్ల, దాచల్ల. ఇన్ని తీర్లు దుడ్లు సంపాచ్చి పెట్టల్ల. ఇదీ తన బతుకు. అఁవ నాయన ల్యారు గద. తన తానకు యా మగాడు రాడనుకున్నది. గని ఆగలే అది. ఊరోల్లకు తను జోగిని. తను ఊరుమ్మడి ఆస్తి. జోగిని తానకు యా మగోడన్న రావచ్చు. జోగిని కాదనొద్దు. ఆమె ఇష్టానికి, కష్టానికి లెక్క ల్యాదు. కాలు నొయ్యని, కడుపు నొయ్యని, మనసంత దు:ఖం, వ్యాష్ట నిండని, ఒద్దు, ఒద్దింక, అని మనసుకు ఎన్నితూర్లు అన్పించని, ఊరి మొగోల్లని కాదనొద్దు. తనసలు తననిట్ల జేసిన ఎల్లమ్మకు మొక్కుడే బందు జేసింది. ఎల్లమ్మకు ఇంత వికారమైన, విసిత్రమైన కోరిక యాంది? గీ కోరిక ఎల్లమ్మదా? ఊరి మనుషులదా? అర్ధం గాలె. యాం బత్కు ఇది? గింత గబ్బైంది? ఊల్లె ఎవలింట్లైన దావతు, లగ్గం ఉంటే తనను విలుస్తరు. పెండ్లి విల్ల, విలగాడి తోని తను గుడక నడవల్ల. ఆడ డ్యాన్సు సేయ్యల్ల. గుంపుల వడి మొగోల్లు యాడంటె ఆడ తాకుతరు.
”పదిమంది మగోల్లతోని పండె తను, పెండ్లిల్ల శుభమెట్లైతదో సమజు కాదు. గట్లనే సావులైతే గుడక తను పోవల్ల. యా సంవందం ల్యాని ఆ సచ్చిన పీనుగు ముంగట, ముండ మోపి లెక్క తనకు రాని దు:ఖం తోని కూసోవల్ల. లాజిగ యాడ్వల్ల. పీనుగు ల్యాసి, పీనుగుల దిబ్బ కాడికి వోయొచ్చే దంక రేత్రైనా తను బువ్వ తినొద్దు, ఆకలితో సచ్చి పోవల్ల. ఎవరైన సస్తే తను వోనంటే ఇంట్ల ఊకోరు. ”దినమంత ఉపాశముండల్లఁవ పోను” అంటే అట్లనొద్దు మంచిది కాదంటరు. తన కోసం కాదు గీ బత్కు మంది కోసం, ఊరి కోసం, అఁవ నాయనల కోసం, నాయనమ్మకు రోజు తాపాల్సిన సారాబుడ్ది కోసం, తమ్ముని సదువు కోసం. తనకోసం ఒక్కల్లు ల్యారు, యాడ్శెోల్లు. ”అవ్వా… నేను గుడక అందరి తీరు మనువు జేస్కొని ఒక్కని తోనే ఉంటనే” అన్నది శానా ఆశతోని నానమ్మ. ”అట్లుండది బిడ్డా, జోగినిని లగ్గం సేస్కునే మొగాడు సచ్చి వోతడబ్బా” అన్నది నానమ్మ. అన్ని జూట మాటలు, వీండ్లు సెప్పేవన్నీ అవద్దాలు అన్పించేది తనకు. ”మొన్న మనువైనగా రెడ్ల పోరి లక్ష్మి మొగడు పాము కరిచి సచ్చి వోయిండు కదనె, లక్ష్మి జోగిని కాదు కదబ్బ” అంటే ”ఇంగ ఊకో రాదబ్బ శాన కతలు వడ్తున్నవు” అని గదిమింది సారా మత్తుల నాయనమ్మ. తననిట్ల, తననేనా? తమ కులంల తనసుిం సిన్న సిన్న ఆడ విల్లలను జోగినులై వొయ్యి ఎభిచారం జేస్త బతకమన్న ఎల్లమ్మ, దేవతెట్లైంది? దెయ్యమైంది గని? మగాడె సస్తడు ఆడదైన తనకేం గాదా?
***                                                          ***                                                       ***
”పెయ్యంత పచ్చిపుండోలె ఉండెడ్ది. కాల్ల మద్దె మానంల ఒకటే దురద గుండేది. చీము పొక్కులతో ఒకటే మంటగుండెడ్ది. తెల్లవట్టయ్యేది. ఎవలకు సెప్పుకునే బాద కాదు. అఁవ ఉంటే సెప్పేదేమో? యాదైనా ఇలాజు జేయించేడ్ది. నానమ్మకు సిగ్గు విడిచి సెప్పింది. నానమ్మ సర్కారు దవాఖానకు కొంట వోయింది. డాక్టరమ్మ పరీక్ష జేసి కోపంగ ”ఇంత చిన్న వయసుల ఇసుిం రోగాల్లెొచ్చినయ్‌? మగడు తిరుగుబోతా” అనడిగింది అవ్వను. ”పిల్ల జోగినమ్మ. ఊల్లె మగోల్లనించే అంటుంటయ్‌” అంది నానమ్మ మర్శంగ తనే అసలైన డాక్టరు తీరు. ”బందు సేపియురి గీ గలీజుపని పిల్లతోని, ల్యాక వోతే పెద్ద రోగ మొచ్చి సచ్చి వోతది” అన్కుంట మందులు రాసిచ్చింది. వారం రోజుల కొకపారి సూది మందులు ఇచ్చింది. అట్లయిన మాన్పిస్తదేమోనని ఆశవడ్డది గని ”ఆల్లట్లే అంటరు బిడ్డ. మాన్పిస్తే అనాచారం ఎల్లమ్మ దేవతకు కోపం వస్తదబ్బ ఊకో” అన్నది నానమ్మ, సారా బుడ్డి ఎత్తి న్లోొ ఆరాంగ ఒంపుత.
***                                                          ***                                                       ***
”ఒక దినం ఊల్లెకి సురేషు వచ్చిండు. యాదో కమిషన్ల నౌఖరి జేత్తడంట. ”బంబైల మంచి కంపెనీల నౌఖరీ ఇప్పిస్త సేస్తవాబ్బా గీ గలీజు పని తప్పుతది” అన్నడు. మళ్ళ తనే నువ్వు రావల్ల అనుకుంటే ఆ రేత్రే బస్టాండుకు రమ్మన్నడు. తనకప్పుడు పద్దెనిమిదేండ్లు. ఎల్లి పోయింది. యాం సోంచాయించలె. అమ్మ నాయనల తోని బత్కుగింత గబ్బైంది. ఇంకేం గబ్బు గావల్ల? కంపెనీల నౌఖరీ జేస్కుంట ఇజ్జత్‌గ బత్కొచ్చు, దుడ్లు గుడక ఇంికి పంపొచ్చు. ఎల్లి పోయింది బంబైకి సురేషు తోని.
***                                                             ***                                                 ***
”బంబై కెల్లినంక గని తెలవ ల్యాదు, అక్కడ సానికొంపకు తనను లక్ష దుడ్లకు అమ్మి ఉడాయించిండు సురేషుగాడని. తెల్సినంక తప్పించుకోవల్లని జూసింది గని దొరికి వోయినంక వాండ్లు గొట్టే సావు దెబ్బలకు సచ్చిన పీనుగు లెక్కుండి వొయ్యింది. ఊల్లె జోగిని బతుకే నయ్యం రోజుకొకడో, రెండ్రోజులకొకడో వచ్చెోల్లు. ఇక్కడట్ల గాదు. రోజుకు పదిమంది నించి ఇరవైమంది మగాళ్ళ కింద నలగల్ల. ఒకల తర్వాత ఒకలు వస్తనే ఉంటరు. అమ్మ అనద్దు, నొచ్చిందనద్దు, నాకు సాతనైత ల్యాదని జ్యోతి దీది కాళ్ళమీద పడ్డగని ఆమె కనికరించెడ్ది కాదు. పారి వోకుంట గూండాలసుిం మగోల్లను కాపలా ఉంచుతరు. ఒద్దింక శాత కాదంటే పద్దినాలైన సరె బువ్వ వెట్టరు. నెలకో పారి డాక్టర్లు వచ్చి సెకప్పు జేసి మందులిచ్చి వోతరు. నిరోద్‌ ప్యాకెట్లు ఇస్తరు గని ఆ లంజొడ్కులు అవి తొడుక్కోరు.
ఊరికి రావల్లని అమ్మ నాయనలను, తమ్మున్ని, అవ్వను సూడల్లని ఉండేది గని వాల్లు పంపక వోయేది. ”ఇంగ నువ్వు పూరాగ నీ ఊరు మర్శి పోవల్ల ఇదే నీ ఊరు” అనేది జ్యోతి దీది. ఆ సాని కొంపని కోఠీలనేోల్లు. బంబైల గసొిం కోఠీలు వందలున్నయ్‌. రొండు తూర్లు తప్పించుకొన కోషిష్‌ జేస్తే రక్తం కారేతట్లు క్టొి, చీకి కొట్టంల ఏసిర్రు. పద్దినాలు బువ్వ వెట్టలె. ఆకలికి పిచ్చెక్కి బువ్వ వెట్టమని ఆల్లకాండ్ల మీద వడి అడుక్కున్నా వెట్టలె… ఆకలికి బేహోష్‌ అయి వోయింది.
”ఇక అప్పట్కెల్లి వోతా అనలె, తన కన్నోల్ల జికర్‌ తియ్యలె. తనకే మమకారం, ఆల్లకుందా అసలు? యాడ్శి గోజారినా ఆల్లు జ్యోతి దీది గూండాల తీరే ఊరి మొగాల్ల తాన పండమనేది అఁవ, నాయన, నాయనమ్మలు. య్యా ఫరక్‌ ల్యాదు. తనను జోగినీని సేసి బత్కు బర్‌బాద్‌ సేసిరు. ఇక్కడి కంటే ఊల్లె అమ్మ నాయనల ముంగట ఎభిచారం జేసుడు నీచంగ ఉండేది. బరించ ల్యానంత బాధగ, అవమానంగ ఉంటుండె. ఇక్కడ తనకు రక్త సంబంధం ల్యానోల్ల కోసం, మొగోల్ల తోని పండుకుంటున్నది. అక్కడ ఊల్లె తన అమ్మ నాయనలే తనతోని ఎభిచారం సేపిచ్చిన్రు.
ఇక్కడ్నే తాగుడు అలవాటయ్యింది. తాగక వోతే గా మొగోల్లను బరించుడు శానా కష్టం. సెప్పల్యానన్ని రోగాల తోని, తమ దేహాలతోని బరించల్యాని గలీజు పనులు జేసే ఆ మొగోల్లను సహించల్లంటె తాగుడు తప్పది. ఒక్కో మొగోడు ఒక్కో తీరుండేది. మెత్తగ ఉండెోల్లు సానా తక్కువ. గిచ్చెోల్లు, రక్కోల్లు, కుక్కలెక్క కొరికోల్లు ఎక్కువుండేది. ఆల్ల హింసని బరించ ల్యాక ఇంగింత తాగేది. తాగంది ఒక్క రోజుండక వోయేది. తాగుడు తోని జర్దా, గుట్క అలవాటైంది. బరించ తరంకాని దు:ఖం, బాద అవమానం మరవల్లంటే, ఇంకేందో కావల్ల. అది పండ్ల మద్దెన నలిగి, నాలుకకు మంటపెట్టె, నోరంత జివ్వు మన్పించే జర్దాల దొరికెడిది. ఈ పదేండ్లలల్ల ఐదారు తూర్లు గర్భమొచ్చి పొయ్యింది. కొన్ని వాికవే వోయెివి. కొన్ని జ్యోతి దీది మందులు తిన్పించి తీయించేడ్ది. ఊల్లె కెల్లి, బస్తీల కెల్లి పడ్సు పోరీలను, పిల్ల తల్లులను తెచ్చి అమ్మేోల్లు. ఆల్ల యాడ్పుల తోని ఆ ఖోీ మూల్గేడ్ది. యా తల్లికన్న బిడ్డలో, యా బిడ్డలకు తల్లులో దినాం కొత్తోల్లు వచ్చెోల్లు. ఒద్దని యాడ్చే ఆడపిల్లలకు పడె బెల్టు దెబ్బల తోని, ఆ దెబ్బలని బరించ ల్యాక అరిచే ఆల్ల అర్పుల తోని, ఆ చీకి గదులు బయం తోని ఒనిక్విె. ఆఖర్కు తను గుడక ఆల్లను లొంగి పొమ్మని ల్యాక వోతే సంపు తరని సెప్పేడిది. బయం తోని యాడ్చే ఆ పిల్లలను గుండెల కద్ముకుని బుదరకిచ్చేది. ఆ ఖోీల ఇద్దరు పదహారేండ్ల పడ్సు విల్లలు ఆ పనులు సెయ్య ల్యాక ఉరివోస్కుని ఊపిరి తీస్కున్నరు.
”అట్లట్లనే ఒగ పదేండ్లు ముంబైల ఆ ఖోీలల్ల గడ్సి వోయినయ్‌. తనకు యాడ ల్యానీ రోగాలు కమ్ముకున్నయ్‌. గిరాకీ గుడక తగ్గి వొయ్యింది. ముఫ్పై యాండ్లు నిండినయ్‌ అక్కడ్నే ఇంగో మూడేండ్లు గడ్సి వోయినయ్‌. ఒక తూరి డాక్టరు సెకప్పుల తనకు ఎయిడ్స్‌ బీమారి ఉందని సెప్పిరు. ఇంగ వాండ్లు తనను అక్కడ ఉంచు కోలె. తన సేతిల కొన్ని దుడ్లు వ్టెి ”ఎక్కడ్కి పోతవో పో” అన్నరు. ”తుమ్‌ ఆజాద్‌ పంచీ హో ఉడ్‌ జా” అని పాన్‌తోని ఎర్రంగైన నోితోని బొల్లున నగింది జ్యోతి దీది. తను ఎటు వోతది? తన ఊరికొచ్చి వడ్డది. ఊల్ల కొచ్చినంక ఉరుక్కుంటురుక్కుంట సీదా తన ఇంికి వచ్చింది గని అక్కడెవల్ల్యారు. అవ్వ సచ్చి వోయిందంట. తమ్ముని అఁవ నాయనలొచ్చి దేశం తొల్క వోయిన్రంట. నాలుగేండ్ల సంది ఆల్లకోసానకు ఎదురు సూస్తంది. ఆల్లొచ్చినంక తనను గుర్తు వడ్తర? దగ్గరకు తీస్తర? బొందిగల పానం కటకట లాడ్తంది. పానం తోని ఉంటదో ఉండదో, పీనుగోలె ఉన్న తనను ఎర్క జేస్తరో సెయ్యరో? దు:ఖం తోని తాయి మాయి అయ్యెడ్ది. ఆల్లు, తనను కన్నోల్లు తనను అర్సుకుంటే, ప్రేమజేస్తే, ”తల్లి ఎల్లమ్మ ఈ పారి పొలెపల్లి జాతరల ”ఊయ్యాల ఊగుత అందరి కోసానకు” అని ఎన్నడు మొక్కని ఎల్లమ్మకు, బక్తితోని మొక్కింది అనసూయ.
”నిద్రొస్త ల్యాదు. లోపల చైతన్య నిద్రల ఒర్లుతున్నది. రేపే వోయి చైతన్య గురించి సంఘపోల్లకు సెప్పల్ల. ఈ విల్లను రక్షించల్ల అన్కుంది. తనంటే సంఘం మేడమ్‌కు శానా ఇష్టం. ఆమెతోని తను గుడక ఊల్లె జోగినీలైన వాండ్ల ఇండ్లకు వొయ్యి కూసుంటది. మేడమ్‌ జెప్పే మాటలు వాల్లతోని తను గుడక ఇంటది. ఆల్లకు తను గుడక కొన్ని మంచి మాటలు సెప్తది. గబ్బైన తన బత్కు గురించి సెప్తది.
***                                                          ***                                                       ***
””నాయ్నా నా కోసం ఎత్క ల్యాదాబ్బా మీరు” అడిగింది. అనసూయ పెంటయ్యను. ”ఎందుకు ఎత్కలే దబ్బా, నువ్వు ఎవరో శోర వోరనితో బంబై బస్సెక్కి వోయినవని ఊల్లె సెప్ప వడ్తిరి. పోలీసు కంప్లైంటు ఇస్తిమి జడ్చెర్లల. నీ పో అడిగిరు ల్యాదని సెప్తె ఎట్ల సూడల్లన్నరు. అంత పెద్ద పట్నం బంబైల ఎట్ల ఎత్కల్ల బిడ్డా? ఇంగ ఇంతె రుణమనుకున్నం. తమ్మున్ని తీస్కుని అహ్మదాబాదు వోయినం. నువ్వు జేసిన దగుల్బాజ్‌ పనికి తమ్ముని సదువు ఖరాబైంది. ఆడు గుడక నా తీరంగ ల్యాబరయ్యిండు” అన్నడు పెంటయ్య బాదగ. తండ్రి దిక్కు పిస ల్యాశినట్లె సూసింది అనసూయ.
”ఈ ఊల్లె నా తోని దగుల్బాజి పనులు సేపియ్య ల్యాదాబ్బా మీరు? నా బత్కు మీకెల్లి ఖరాబు కాలె నాయనా” తండ్రి కండ్ల దిక్కు సూస్త దుఃఖం కుత్కల అడ్డం బడ్తుంటే అడిగింది అనసూయ. పెంటయ్య సూపులు తప్పించుకుంట ”నీకేమైందబ్బా” అన్నడు. తమ్ముడి సదువు పాడై ల్యాబరైండని అఁవ నాయనల బాద. తన బత్కు నిప్పుల కొలిమి అయ్యిందని కాదు. అనసూయకు గుండెల పిండినట్లైంది బాద తోని.
***                                                          ***                                                       ***
”సూడంగ, సూడంగ యాడాది అయినంక వచ్చిన్రు అనసూయ అఁవ నాయనలు. కైకిలి పనికి వోయిందప్పుడు అనసూయ. ”ఓ అన్సూయా దేశం కెల్లి మీ అఁవ నాయనలు వచ్చిండ్రబ్బా” బోయోల్ల మల్లమ్మ గట్టు కాన్నించి సేతులూపుతా ఒర్లింది. అనసూయ వాడ కట్టు దిక్కు, ఒక్క తీరంగ ఉర్కింది. ఎన్నేండ్లాయె అఁవ నాయనలను జూసి? ఆల్ల ముఖాలే గుర్తొస్త ల్యావు. తమ్ముడెట్లున్నడో? తనను జూసి గుండెలకు అల్ముకుంటరేమో… ఎన్నేల్లాయే పదిహేను యాండ్లు కాలె? ఉర్కుత, ఉర్కుత, ఆగకుంట ఒకే తీరు ఉర్కత, ”అఁవా” అన్కుంట వొయ్యి అఁవ వెంకటమ్మ మీన పడి వొయి… ”అఁవా, అఁవా” అని పలవరిస్త ఎక్కెక్కి ఏడ్చింది అనసూయ. వెంకటమ్మ గుడక ఏడ్చింది. పెంటయ్య కండ్లు తుడ్సుకుండు. తమ్ముడు దూరంకెల్లె ”అక్క.. మంచిగున్నవాబ్బా” అని ఊర్కుండు సానా సేపు ఏడ్సుకున్నంక నిమ్మలంగైరు తల్లి విడ్డలు.
”అనసూయ, తన ఇంట్ల కెల్లి కారటు కొంట వొయ్యి రేషను సామాను తీస్కుని అమ్మోలింట్ల వ్టెింది. పోన్లె తమ్ముని సదువు తన కెయ్యి పాడైందని బాధతోని నాయన అట్లన్నడని తనను తాను సమ్జాయించుకున్నది అనసూయ. మూన్నాలుగు దినాలు అమ్మోలింట్లనే ఉంది. బంబైల తను ఎన్నెన్ని తీర్లు కష్టాలు వడ్డదో తల్లికి సెప్పుకుంట జేరింది. ఇంగ తను అఁవ నాయనల తోని ఆ ఇంట్లనే ఉంట అన్కుంది. ఆల్లతోని తను గుడక దేశం వోతా అన్కుంది. యామైన గని ఇంగ వీండ్ల తోనే తన బతుకు అనుకున్నది. ఆ ఇల్లు, తన బతుకుని గబ్బు జేసిన ఇల్లు, ఆ మనుషులు తనను దినామొక కసాయోడికి అప్పచెప్పిన ఆ మనుషుల మద్దెన,ె ఒగ బయంకరమైన శాంతిగ అనిపించి బయమైంది అనసూయకు. నాలుగో దినం రాత్రి పండెతందుకు చద్దరేస్కుంటున్న అనసూయ సూస్త ”నీ ఇంట్లనే, పండరాదబ్బా, సర్కారు నీకు ఇల్లిచ్చింది గద? నీకు వెయిడ్స్‌ బీమారి ఉందట గద అది అంటుకుంటే సచ్చి వోతరంట గదబ్బా” అంది వెంకటమ్మ. దెబ్బ తిన్నట్లు తల్లి కెయ్యి చూసింది అనసూయ. ”అదే అఁవా? ఆ బీమారి రోజొక్క మొగొనితో పండ వ్టెి మీరు కాదె నా కింంచింది? అయ్యో బిడ్డా నీకు మాయదారి రోగమచ్చింద్యామే… ఎట్లబ్బా అని నన్ను అర్సుకుంటరనుకున్న కదనే అఁవా” అని బొల్లున ఏడ్సింది అనసూయ. ఏడుస్తనే గా చీకట్ల తన ఇంి కెయ్యి ఉర్కింది. ఎంాడే తోడేలుని తప్పించుకునే మ్యాక పిల్ల తీరు.
***                                                          ***                                                       ***
”అనసూయ ఎప్పి తీరు కూలీకి వోతున్నది. తన ఇంట్లనే ఉంటున్నది. అమ్మోల్లింకి వోత లేదు. ఆమె మనసు ఇరిగి పొయ్యింది. తల్లి ”నీ ఇంికి నువ్వు పోబ్బా” అనెాల్లకు ఆమెకు మాట వడి వోయినట్లైంది. ఆమె ఆశలన్ని కూలి వోయినట్లైనది. తనను మొది పారి జోగినీని జేసినప్పుడు తనను కన్నోల్లేన ఈ కిరాతకం జేసేడ్ది అని నమ్మల్యాని తనం తోని కలిగిన అవమానమే… ఇప్పుడు గుడక అన్పించింది. ఇంగ వాల్ల తోని తనకేం సంవంధం ల్యాదన్నట్లు సమజైన కొద్ది గుండెల్ల చాకు గుచ్చినట్లైతున్నది. తనకే బ్రమ ఆల్లంటే, తన మీద ఆల్లంకేం ల్యాదని తెల్సి వోయింది.
ఒగ దినం, వెంకటమ్మ వచ్చింది అనసూయ ఇంికి. ”యాం జేస్తున్నవబ్బా అన్సూయా…” అనుకుంట. తల్లెల బువ్వేస్కుంటున్నది అనసూయ. తన సేతి తిండి తల్లి తినదని ఎర్కె అందుకే బువ్వ తింటవ అని గుడక అడుగలె. తల్లెల బువ్వ మల్లంగ కుండల్యాసి తల్లి దిక్కు జూసింది అనసూయ యాందన్నట్లు.
”అన్సూయా, ఇన్నేండ్ల సంది బంబైల ఎంత సంపాచ్చినవబ్బా? యాడ దాసివ్టెినవే గంత గనం దుడ్లు, బ్యాంకిల యాసినవా యాంది? ఎవలకైన మిత్తికిచ్చినవ, నాయన అడగమన్నడబ్బా. తమ్ముని మనువు పెట్టుకుాంనం.. కొన్ని అప్పులున్నైయబ్బా” అంది మెల్లగ వెంకటమ్మ నంగి నంగి సూపులు సూస్త.
”అనసూయకు ఆమె యామంటున్నదో మొదలు సమఝు కాలె. అయినంక కోపం తోని ఒనికి వోయ్యింది. ”శానా సంపాచ్చిన్నే ఒంినిండ మొగోల్లు అంిచ్చిన రోగాలు… వెయిడ్స్‌ బీమారి” అని దిగ్గున ల్యాసి కోపం తోని ఊగుత ”సూడే సూడు నేను సంపాచ్చిన సొమ్ము” అంా బర్ర బర్ర చీరె రైక ఇప్పి వెంకటమ్మ ముంగట బరిబాతల కాల్లు ఎడం సేసి నిలవడ్డది. తలస్నానం చేసిన జుట్టంత విడివడింది.
వెంకటమ్మ నోట్ల మాట రాకుంట తను గుడక ల్యాసి నిలవడ్డది. అనసూయ ఒంి నిండ పుండ్ల మచ్చలు, కాళ్ళ మధ్య నల్లగ కమిలి వోయిన మచ్చలు, రొమ్ముల మీద లెక్క ల్యానన్ని పండ్ల తోని రక్కిన గాట్లు, గీతలు… సూడ ల్యాక వోయింది వెంకటమ్మ. ఉగ్రంగ… ఎర్రెని కండ్లతోని ఊగివోతున్నది అనసూయ. వెంకటమ్మ కండ్లకు అనసూయ పూనకమొచ్చిన ఎల్లమ్మ తీరె కనవడ్డది.
వెంకటమ్మ గావర గావరగ కింద వడ్డ బట్ట తీసి అనసూయ మీదేసి, జప జప ఉర్కుత తన ఇంటకెయ్యి ఆ చీకట్ల పారే వొయ్యింది.
***                                                          ***                                                       ***
”అనసూయకు తల్లి ఎల్లి వోయినంక బువ్వ తిన బుద్ధి కాలె. అట్లనే ఒరిగింది గని నిద్రొస్త ల్యాదు. ఎందుకు ఈ బత్కు? ఆల్ల తోని దేశం వోదమని ల్యాక వోతే ఆల్ల బిడ్డ తీరు ఆల్లతోని ఆల్లింట్లనే ఉందమని ఎంత కోరుకున్నది. గని ఆల్లు తననే ఒద్దనుకుంటున్నరు. తననెప్పుడు కావల్లనుకున్నరని ఆల్లు? పసిబిడ్డప్పికెల్లె తన మీన సంపాదించల్లనే జూసిరు. ఒక్కపారి తనకీ దునియల ఎవలు ల్యారన్నట్లన్పించి బయం కమ్మింది అనసూయకు. ఈ లోకం తనకింక పనికి రాదన్పించింది. వెయిడ్స్‌ బీమారి వచ్చి తనింక ఎక్కువ దినాలు బత్కదని తెల్సినప్పుడు గుడక గింత బయం వెయ్యలె. ఈ మనుషులను జూత్తెనే బయమైతున్నది. తను పానంగ పెంచి పెద్ద జేసిన తమ్ముడు తనెవరో ఎర్క ల్యాదన్నట్లే బర్‌తావ్‌ జేస్తుండు. అఁవ నాయనలింకా దుడ్లు త్యా, త్యా అంటున్రు. బంబైకి సంపాయిద్దమని వోయిందా? ఊల్లె జోగినీ బతుకు తప్పు తదని వోయి అక్కడ ఎబిచారం ఊబిల దిగ వడ్డది గని? సురేషు తనని లక్ష రూపాయలకు అమ్మిండు. జ్యోతి దీది ఒక్కనాడు తనకేమివ్వల్యా. అప్పుడప్పుడు కష్టమర్ల తాన తీస్కున్న దుడ్లే… ఊర్లె కొచ్చి ఇక్కడ ఉండనీకే కర్శు అయి వోయినయి. బంబైల బిడ్డ ఎబిచారం సేస్త నరకం అనుభవించిందని బాధ ల్యాదు. డబ్బు సంపాదించ ల్యాదన్న బాధ ఉంది. వీల్లు మనుషులా కసాయోల్లు గని అన్కుంట కండ్లు తుడ్సుకుంది అనసూయ… రెండు సారా ప్యాకెట్లు ప్టిస్తె గని ఆమెకి నిద్రవట్ట లేదు ఆ రేత్రి.
***                                                          ***                                                       ***
”పోలెపల్లిల మూడు దినాల జాతర షురువైంది.
”యాభై రూపాలు, ఒక కాటరు బాటల్‌ ఇస్తం. రాబ్బా అన్సూయా, ఈపారి ఉయ్యాల పండ్గకు నువ్వే దిక్కు. ఎవరొస్త మంటల్యారు. సంఘపోల్ల నిగరాని శానా ఉంది”. జాతర కమిీ మెంబరు శ్రీనివాస్‌ అంటుండు. అనసూయ విం జేరింది గని ఏమంట లేదు. ఆమె మనసంత పుండు పుండైంది. అఁవ నాయనల బర్‌తావ్‌, ఇంత బతుకు త్యాగం జేసినందుకు గింతంత ప్రేమ ఇస్తరనుకున్నది. ఆ ఇంట్ల గింత చోిస్తరనుకున్నది. ”రా బిడ్డా మాతోనే ఉందువు” అని కొంట వోతరునుకున్నది. ఊహు తన వెయిడ్స్‌ బీమారితోని బయ వడ్డరు. బయటకు గిెంన్రు.
తనొద్దు గని, తన దుడ్లు కావల్ల… వీండ్లు తనను ప్రేమ తోని దగ్గర తీస్తె, జాతరల ఊయల ఊగుత అని ఎల్లమ్మకు మొక్కింది. వీండ్లు తనను దగ్గరకు తియ్యక వోనీ… మొక్కు తీర్చల్ల. ఊగల్ల సచ్చెదంక ఊగల్ల. పూనక మొచ్చినట్లె అనుకుంది అనసూయ.
”రేపె గద జాతర.. వస్త పా తమ్మి” అన్నది అనసూయ. శ్రీనివాస్‌ ఎల్లి వోయిండు.
జాతరల జేసె ఊయ్యాల పండుగల, జోగిని బరిబాతల ఊగల్ల. ఊయ్యాల ఊగుడు సానా ప్రమాదం. వోయిన తూరి ఊల్లె జోగిని, గిట్లనే ఊగుత ఊగుతనే కింద వడ్డది. నడుములు ఇరిగినై.. గట్లనే యాడాది పాటు మంచంల వడి జేసోల్లు ల్యాక సచ్చె వొయ్యింది. సానా మందికి పక్క బొక్కలు ఇర్గుతయ్‌.. యామన్న గని.. ఊగల్ల కొత్తగ సచ్చేదేముంది? ఎప్పుడో సచ్చి వోయింది తను…!
***                                                          ***                                                       ***
”ఊయ్యాల గిర గిర ఊగుతున్నది. 60 అడుగుల ఎత్తున్న ఇనుప కంబకు, ఒక వైపు ఊయ్యాల క్టి, అన్ల అనసూయను క్టిన్రు. అనసూయ పెయ్యి మీద ఇంత బట్ట ముక్క లేదు. పూరాగ బరిబాతల ఉన్నది. ఆమె ఒంి మింద దెబ్బల గుర్తులు కన్పిస్తున్నయ్‌. ఒళ్ళంత పసుపు రాసిరు. నుది మీద రూపాయి బిల్లంత కుంకుమ బొట్టు ప్టిెరు. అనసూయ జోగిని దేవతైంది మల్ల. జుట్టు ఇరబోస్కుని ఉగ్రంగ ఉంది అనసూయ. కంబ చుట్టుతా, గిర్రుమని ఊయ్యాల ఊగుతున్నది అనసూయ. ఊగతనే, కింద ఉన్న బక్తుల మీద పసుపు, పూలు జల్లుతాంది. ఆ పూల కోసం జనం పోీ వడ్తున్నరు. బక్తిగ రేణుక ఎల్లమ్మ, అమ్మా, తల్లీ అన్కుంట సేతులెత్తి బయం తోని మొక్కుతున్రు. ఆ పూలు, పసుపు సల్లితే ఊరి జనం సల్లంగుంటరు. ఊరు సల్లంగుంటదని ఎల్లమ్మ తల్లి జోగిని రూపంల దీవెనలిచ్చినట్లు లెక్క.
ఊయ్యాల జోరుగ ఊగుతున్నది. అన్ల ఉన్న అనసూయ అటు, ఇటు ఊయల కంబలకు కొట్టుకుంటున్నది. అనసూయ బాగా తాగింది. బయం వెయ్యకుంట. ఊయ్యాల జోరందుకోంగనే అనసూయకు కండ్లు తిరుగుడు షురువైంది. ఆమె ఊగుతున్నది. ఆమె ముంగట ఊరు ఊగుతున్నది. ఊల్లె జనం ఊగుతాన్రు. ఆ ఊరు, జనం, అన్ల మొగోల్లు, ఆల్ల తానకు తనను జోగినీని జేసి తరిమిన అఁవ నాయనలు. అక్కడి కెల్లి బంబైల రెడ్‌ల్‌ై ఎరియ కమ్మిన సురేషు, చిన్నప్పికెల్లి తనను అనుభవించిన వెయిలమంది మొగోల్లు, ఊగుతాన్రు తన కండ్ల ముంగట. తన ఒంి నిండ రోగాలు, తనను సంపే ఎయిడ్స్‌ బీమారి, అంతా అక్కడ్నే అప్పుడే జరుగుతున్నట్లు అన్పిస్తున్నది, కన్పిస్తున్నది. యామన్నడు నాయన? తను సేసిన దగుల్బాజి పనికి తమ్ముని సదువు ఖరాబైందన్నడు. బంబైల మొగోల్ల తోని పండి ఎంత సంపాచ్చినవు తేబ్బా… తియ్యు అన్నడు. అఁవ.. నాయనా ఎందుగన్నరె నన్ను? అంత మైకంల గూడ అనసూయకు బరించ ల్యానంత దు:ఖమొచ్చింది. బేచైన్‌ అయి వోయింది. గుండెలు బగబగ మండినయ్‌… అగ్గో అఁవ నాయనలు, తమ్ముడు తన దీవెనల కోసం వచ్చిన్రు. జాతరకు… అనసూయకు దు:ఖం కట్టలు తెంచుకుంది. షురువైన యాడ్పు పెద్దగ… అరుపుల్లెక్క, బానం గుచ్చుకున్నంక, బరించ ల్యాని బాదతోని జంతువు పెట్టె అరుపు లెక్క, రౌద్రంగ పులి అరిచే హంకరింపు లెక్క, అనసూయ ఒర్లుతున్నది, ఏడుస్తున్నది. ”అగో ఎల్లమ్మకు పూనకమొచ్చిందని” బక్తులు ”అమ్మా ఎల్లమ్మ తల్లీ దయ సూడు తల్లీ” అని అరుస్త మొక్కుడు షురు వ్టెిన్రు. ఇగో గిట్లనే తనను బతుకంత బరిబాతలగ ఈ ఊరి మొగోల్ల ముంగట నిల వ్టెిన్రు ఎవలు? అఁవ నాయనలా? ఈ ఊరంతనా? తనకు కన్నెరికం జేసిన గా షావుకారా? ఎవలు? ఎవలు జేసిరు… ఊయ్యాల గిర గిర తిరుగుతున్నది. అనసూయ ఒనికి పోతున్నది. అనసూయకు పూర్తిగ మైకం కమ్మింది. ఆమె దు:ఖం, అరుపులు, ఆగినయ్‌. మైకంల అంతెత్తుకెల్లి అనసూయ కింద ఉన్న జనం మధ్యల దబ్బుమని పడి వొయ్యింది.
”ఎల్లమ్మ ముంగట కొబ్బరికాయ పగిలినట్లే, ఫ్‌మని అనసూయ తలకాయ పగిలి రక్తం దారకట్టింది. అనసూయ గిల గిల కోట్టుకోని కొట్టుకోని సచ్చి వొయ్యింది. ఎవలో బరిబాతల ఉన్న అనసూయ మీద గింత బట్టకప్పిన్రు.

  • – గీతాంజలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

One Response to ఉయ్యాల (కథ) – గీతాంజలి

  1. న్.సుభాషిణి says:

    Feb తరువాత ఇంతవరకూ ఎందుకని మేడమ్ పత్రిక..
    …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)