సహ జీవనం – 23 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

సావిత్రి అది గమనించింది “ఎలాగైనా సరస్వతి తీరే వేరురా.”
ప్రసాదం తలవూపాడు “అవును, నిజమే. సరేగానీ, ఇప్పుడెలా రాగలిగారో చెప్పు?”
“కోడలి చెల్లెలి పెళ్ళి, అమలాపురంలో. వాళ్ళటు వెళ్ళారు. మేము ఈ నాలుగు రోజులు నిన్ను చూసి వస్తామని చెప్పి ఇటు వచ్చాము.”
“మంచి పని చేశారు, ఎన్నాళ్ళయ్యింది నువ్వు నాఇంటికి వచ్చి? ఉష పెళ్ళికి రావడమే కదా” అంటూ ప్రకాశం బావ భుజం మీద తట్టి, “కాసేపు పడుకుంటావా బావా? అక్కా, నువ్వు కూడా కాసేపు రెస్టు తీసుకోరాదూ. వంట అయిపోగానే, స్నానాలు చేసి భోజనం చెయ్య వచ్చు. సాయంత్రం బిర్లా టెంపుల్ కు వెడదాం. అన్నట్లు బావా, నీ షుగర్ కంట్రోల్లో ఉందా? అక్కా, నీ బి.పి. ఎలా వుంది? ఉప్పూ, కారం తగ్గించి తింటున్నావా? అన్నట్లు సరస్వతీ, కూరల్లో వాటిలో కొద్దిగా ఉప్పూ,కారం తగ్గించి వెయ్యి” లేవబోయాడు ప్రసాదం.
“ఎందుకంత హడావుడి? నువ్వు ముందు కూర్చో” అంటూ లేవబోయిన ప్రకాశాన్ని కూర్చోబెట్టాడు మోహనరావు.
సాయంత్రం అందరూ బిర్లా టెంపుల్ కు వెళ్ళారు. గుడిలోంచి బయటకు వచ్చి కాసేపు కూర్చున్నారు. సరస్వతి ఒక కొబ్బరి చిప్ప పగలకొట్టి అందరికి తలా ఒక కొబ్బరిముక్కాఇచ్చింది.
“అక్కా, నేనొక మాట చెబుతాను వింటావా?” కొబ్బరి ముక్క నములుతూ అడిగాడు  ప్రసాదం.
“చెప్పరా, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు?” అన్నది సావిత్రి.
“ అదే, నేను చెప్పబోయేది! నీ కొడుకుల దగ్గర నీకు మొహమాటం ఎందుకు? కొడుకును, కోడల్ని కూర్చోబెట్టి, మీ సమస్యను వివరించండి. అన్ని పనులు మీ మీద వదిలేసి వాళ్ళు అలా వెళ్ళిపోతే, మీకు నిభాయించుకు రావడం కష్టంగా ఉంటోందని మృదువుగా వివరించి చెప్పండి. ఏఏ పనులు మీరు చెయ్యలేరో, అవి వాళ్ళు చెయ్యగలరేమో చూడమనండి. లేదా, ఒక మనిషిని సహాయంగా ఏర్పాటు చెయ్యమనండి. అన్ని పనులు చేసేటందుకు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పండి. ఈ కోడలు ఇలా అన్నదనో, ఆవిడ అలా అన్నదనో పొరపాటున కూడా ప్రస్తావించవద్దు. నువ్వు అలా మాట్లాడటానికి అసలు అదే మూల కారణం అనుకునే ప్రమాదం వుంది. అందువల్ల మీ ఇబ్బంది మాత్రమే వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పండి. అప్పటికీ మిమ్మల్ని అర్ధం చేసుకోలేకపోతే, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. వాళ్ళు మిమ్మల్ని గౌరవించనప్పుడు మీరు అక్కడే ఉంటూ వాళ్ళకు సేవలు చేస్తూ పడి వుండడం ఎందుకు?ముసలితనంలో కొడుకుల దగ్గర ఉండకుండా ఎలాగా అనుకుని, ఇప్పటినుంచే జీవితం నరకంచేసుకోవడం తెలివితక్కువ. అనేక మంది ఒంటరిగా బతుకుతున్నారు. అసలు పిల్లలు లేని వాళ్ళ సంగతేమిటి? కన్న పిల్లలకు మనం మన కష్ట సుఖాలు చెప్పలేక పోతున్నాం. వాళ్ళ తప్పొప్పులు వాళ్లకు చెప్పలేక పోతున్నాం. దాని మూలంగా మనమే బాధలు పడుతున్నాం. ఇది మనం చేస్తున్న తప్పు కాదా? ఆలోచించు. వాళ్ళ మంచి చెడ్డలు చూడడమే కాదు, తప్పొప్పులు సరి చెయ్యాల్సిన బాధ్యతా మన మీదే వుంది.”
“నిజమే రా, కానీ, కొడుకులు చెప్పినా అర్ధం చేసుకునే పరిస్థితి లేదు. ఈ కాలం కోడళ్ళు మొగుళ్ళ మాట వినరు. వాళ్ళ మాటే వీళ్ళు వినాలి. మనకు మన కొడుకుల దగ్గర్నుంచే సపోర్టు లేదు. ఇక కోడళ్ళకు చెప్పగలమంటావా? చెప్పి చికాకులు కొని తెచ్చుకోవడమే కానీ, వాళ్ళేమీ మారరు. అమ్మ నీరజతో ఎంత చికాకు పడింది? తనే ఉద్యోగం చేస్తున్నానని ఎంత అహంకారంగా మాట్లాడేది?నువ్వు చెప్పేవాడివి అనుకో, కానీ ఏనాడన్నా విన్నదా?”
“ అవును. గట్టిగా చెప్పలేకపోవడమే నా బలహీనత. అందువల్ల, మన లాంటి వాళ్ళమంతా కష్ట పడుతున్నాం, నష్టపోతున్నాము కూడా. నా జీవితంలో చాలా ఆలస్యంగా నైనా నీరజ నుంచి నేర్చుకున్నపాఠం ఇదే! మనిషి కొన్ని సార్లు ఖచ్చితంగా వుండాలి. అది ఎంత దగ్గరి వాళ్ళైనా సరే. భార్యతో అయితే మొదటి రోజు నుంచే కచ్చితంగా వుండాలి. ప్రేమగా వుండడం వేరే, అలాని ఆ ప్రేమ అతి కాకూడదు. నాకు మనుషుల్ని ప్రేమించడం, సర్దుకు పోవడం మాత్రమే తెలుసు. కఠినంగా మాట్లాడడం ఆవిడ నైజం. తను అలా మాట్లాడి నప్పుడు కూడా అది తప్పని ఖండించే వాడిని కాదు. ఎందుకొచ్చిన గొడవని ఊరుకునే వాడిని. తప్పు అనిపించింది ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా ఖండించకపోతే, ఆ తర్వాత మనమే బాధ పడతాం. ”

-టి.వి.యస్.రామానుజ రావు

——————————————————————————————————-

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)